14, ఆగస్టు 2021, శనివారం

సమస్య - 3812

15-8-2021 (ఆదివారం)
కవిమిత్రులారా,
స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు!
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“స్వాతంత్ర్యము దొరికె విడువవా దాస్యంబున్”
(లేదా...)
“స్వాతంత్ర్యమ్ము లభించినన్ విడదు దాస్యంబేల యీ జాతికిన్”

51 కామెంట్‌లు:


  1. నీతల వ్రాతను మార్చక
    నేతరి చేత నలిగెనని యేడ్చుట సబబే
    నీతిరహితులగు వారికె
    స్వాతంత్ర్యము దొరికె, వడువవా దాస్యంబున్.

    రిప్లయితొలగించండి
  2. నేతల వర్తన నందున
    నీతియు నీమములు దఱిఁగి నేర్పు నశింపఁన్
    యాతన తో నొక డిట్లనె
    "స్వాతంత్ర్య ము దొరికె విడువవా దాస్యంబున్ "

    రిప్లయితొలగించండి
  3. కందం
    జాతిపితగ పోరాడితె
    భీతిపడుచు తెల్లవారు వెడలిరి యోధా!
    నేతగ నేలఁగ నొప్పవె?
    స్వాతంత్య్రము దొరికె విడువవా దాస్యంబున్?

    శార్దూలవిక్రీడితము
    చైతన్యమ్ము నహింస సత్యములవే సాధింప నస్త్రమ్ములై
    భీతింజెందఁగ తెల్లవారి బనుపన్ వెచ్చించితే శక్తులన్
    నేతన్ జేతుము నేలమన్న వినరే? నిష్ణాతులై నొప్పరే?
    స్వాతంత్ర్యమ్ము లభించినన్ విడదు దాస్యంబేల యీ జాతికిన్!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
    2. గురుదేవులకు ధన్యవాదములు. సవరించిన పూరణలు :

      స్వాతంత్య్రము లభించిన తరువాత ఎటువంటి పదవి తనకు వద్దన్న జాతిపిత గాంధీమహాత్మునితో సహచరులు :

      కందం
      జాతిపితగ పోరాడఁగ
      భీతిపడుచు తెల్లవారు వెడలిరి యోధా!
      నేతగ నేలఁగ నొప్పవె?
      స్వాతంత్య్రము దొరికె విడువవా దాస్యంబున్?

      శార్దూలవిక్రీడితము
      చైతన్యమ్ము నహింస సత్యములవే సాధింప నస్త్రమ్ములై
      భీతింజెందఁగ తెల్లవారి బనుపన్ వెచ్చించితే శక్తులన్
      నేతన్ జేసెద మేలమన్న వినరే నిష్ణాతులై యొప్పరే
      స్వాతంత్ర్యమ్ము లభించినన్ విడదు దాస్యంబేల యీ జాతికిన్!

      తొలగించండి
  4. క్రొవ్విడి వెంకట రాజారావు:

    నేతలు నాడు శ్రమించగ
    స్వాతంత్ర్యము దొరికె; విడువవా దాస్యంబున్
    భీతిని గూర్చెడి నిప్పటి
    నీతిని వీడిన తుటారి నేతల చెంతన్?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "...గూర్చెడి యిప్పటి..." అనండి.

      తొలగించండి
  5. 75వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.💐💐

    మీ తాతల కాలము జనె
    నీ తర మరుదెంచె వినుము నిలుకడ తోడన్
    భీతిల్లెడి యో నరుడా
    స్వాతంత్ర్యము దొరికె విడువవా దాస్యంబున్.

    రిప్లయితొలగించండి
  6. పాతాళంబున కంటె స్వ
    జాతి విలువలు ప్రియమయె విజాతి విలువలే
    చేతనమాయె విదేశీ
    స్వాతంత్య్రము దొరికె విడువవా దాస్యంబున్

    రిప్లయితొలగించండి
  7. నేతయుమారడుతానై
    వాతలబెట్టుచువిలువలుపాతరవేయున్
    చేతలఁజెప్పుముబుద్ధిని
    స్వాతంత్య్రముదోరికెవిడువవాదాస్యంబున్

    రిప్లయితొలగించండి

  8. స్వాతంత్ర్యమ్మది వచ్చినన్ ఘన ప్రజాస్వామ్యమ్ము లో నేతలన్
    నీతిన్ దప్పుచు నోటుకోసమనుచున్ నీ యోటునే యమ్ముచున్
    నీతీ, న్యాయము లేని దుష్టులె కదా నీ నేతలైనప్పుడీ
    స్వాతంత్ర్యమ్ము లభించినన్ విడదు దాస్యం, బేల యీ జాతికిన్
    బ్రీతిన్ గూర్చెడు వారువత్తురికరా! బేహారులే గెల్వగన్.

    రిప్లయితొలగించండి
  9. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      వాట్సప్ సమూహంలో నా వ్యాఖ్యను గమనించండి.

      తొలగించండి
  10. ఏ తంత్రంబును జేయుచుండిరొ
    గదా యిప్పాల కుల్ నేటికిన్
    స్వాతంత్ర్యంబు లభించినన్
    విడదు దాస్యంబేల యీజాతికిన్
    చింతన్ జెందుచునుండి రెల్ల జ
    నులున్ ఝేదించి గుప్తమ్మిలన్
    సంతాపంబును, దాస్యమే బు
    ధజనుల్ సంహార ముంజేతురో!

    రిప్లయితొలగించండి
  11. శా:

    జాతీయోద్యమ భాగమై ప్రజలటన్ జండాలు మోయంగనై
    పాతాళానికి ద్రొక్కె తెల్ల దొరలన్ పట్టింపు లేకుండగన్
    బేతాళమ్ములు నేటి నాయకులు తా ప్రేరేచ దుస్సంస్కృతిన్
    స్వాతంత్య్రమ్ము లభించినన్ విడదు ; దాస్యంబేల నీజాతికిన్

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  12. స్వాతంత్ర్యాగమనంతో
    జాతికి సంకెల తెగెనని సంబరపడుచున్
    నేతల బానిసవైతివి
    స్వాతంత్ర్యము దొరికె విడువవా దాస్యంబున్

    రిప్లయితొలగించండి
  13. జాతీయైక్యత సద్విధిన్ మరచి సంస్కారంబు పోనాడుచున్
    నీతిన్ వీడి చరించు నాయకులనే నిత్యంబు సేవించుచున్
    ప్రీతిన్ జూపి విదేశ సంస్కృతియె సంవేద్యంబుగానెంతురే
    స్వాతంత్ర్యమ్ము లభించినన్ విడదు దాస్యంబేల యీ జాతికిన్

    రిప్లయితొలగించండి
  14. జాతిపిత పోరు సలుపగ
    స్వాతంత్ర్యము దొరికె ; విడువవా దాస్యంబున్
    నీతావునందు గూడను ,
    నాతురపడుమింక దాని
    యభ్యున్నతికై

    ఆతురపడు = వేగిరపడు

    రిప్లయితొలగించండి
  15. సమస్య :

    స్వాతంత్ర్యమ్ము లభించినన్ విడదు దా
    స్యంబేల యీ జాతికిన్

    ( పరదాస్యం పోయినా పీడనాదాస్యం , కులదాస్యం , మతదాస్యం మనకెందుకు ? )

    ఆతంకంబుల రాష్ట్రజీవనులలో
    నాందోళనల్ రేపుటల్ !
    చేతంబందలి యీర్ష్యతో గులములన్
    జిచ్చుల్ రగుల్కొల్పుటల్ !
    వాతం బెక్కిన రోగివోలె మతముల్
    భారంబుగా జేయుటల్ !
    స్వాతంత్ర్యమ్ము లభించినన్ విడదు దా
    స్యంబేల యీ జాతికిన్ ?

    రిప్లయితొలగించండి
  16. తాతలు నేతులు త్రాగిరి
    మూతుల వాసనలు జూడుమో యనక కృషిన్
    జాతి గతికి ప్రగతి నిలుపు
    స్వాతంత్ర్యము దొరికె విడువవా దాస్యంబున్

    రిప్లయితొలగించండి
  17. లౌకికరాజ్యంబంటు అ
    లౌకికశక్తులకసాయులక్ష్యపుకుట్రే
    పాకెను ఓహైందవుడా
    స్వాతంత్ర్యిముదొరికెవిడువవా దాస్యంబున్
    ...తోకల...

    రిప్లయితొలగించండి
  18. నేతల త్యాగ ఫలముగా
    స్వాతంత్ర్యము దొరికె, విడువవా దాస్యంబున్
    చేతలలో కనిపించదు
    చేతన, కనబడదు నవ్య చింతన మదిలో

    రిప్లయితొలగించండి
  19. మా తంత్రమ్ము ఫలించె నంచు ప్రభుతన్ మంత్రాంగమున్ నడ్పుచున్
    మూతుల్మూయుచు పౌరులందరిని సంపూర్ణమ్ముగా దోచు వాఁ
    రేతుల్ జెల్లవు జెల్ల వంచెఱుగుమా యేపారు నీరాజ్యమే!
    స్వాతంత్ర్యమ్ములభించినన్ విడదు దాస్యంబేల నీజాతికిన్.

    రిప్లయితొలగించండి
  20. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి


  21. స్వాతంత్ర్యము దొరికె విడువవా దాశ్యంబున్

    ఇచ్చిన పాదము కందము

    నేను‌ సీసములోకి మార్చి పూరించాను

    శ్రీ హరి తో లక్ష్మి దేవి పలుకు సందర్భంలో

    వామన రూపాన బలిచక్ర
    వర్తిని
    పాతాళమున ద్రోసి వాకిలి దరి

    చేరి‌‌‌ భక్తవరుడు కోరె ననుచు రక్ష
    నిడు చుంటివిగ నతనికి ఘనముగ,

    నిను వెదుకుచు రాగ ,నెమ్మితో
    దాశ్యము చేయుట ధర్మమనుచు

    పలికి నన్ను‌ నచట బలివద్ద బంధన
    మొనరించితివిగదా, మోహనాంగ,

    లౌక్యముగ బలికి రక్ష‌ బం ధనము నే
    నతనికి సల్పి ఘనముగ దాశ్య

    సంకెలలన్ని తెంచ మనుచు వేడ వి
    ముక్తి నిడెనుగ సుముఖుత బడసి,

    ముదముగ ‌ స్వాతంత్ర్యము‌ దొరికె విడువవా ?
    దాశ్యంబు నిపుడైన,దయను‌ జూపి


    రమ్ము మాధవా రయముగ నెమ్మి నిడుము

    వల్లభా నీదు పత్నికి,నెల్ల జగతి

    వేచి యుండె నీరాకకు విశ్వ రక్ష

    కా యనుచు వేడెను హరిని‌ కమల నయన

    రిప్లయితొలగించండి
  22. జాతంబయ్యెనుచేతనన్తనదుభూజాతల్గనన్స్వేచ్ఛనే
    త్రాతల్గాగనువీరులైకదలిరాతాతన్గనన్దారినే
    జేతల్వారలుజీవనంబునికచాచెన్హస్తముల్యోధులే
    స్వాతంత్ర్యమ్ములభించినన్విడదుదాస్యంబేలయీజాతికిన్

    రిప్లయితొలగించండి
  23. ఆతత సేవా నిరతిన్
    సీతారామ చరణములు సేవింపంగన్
    నీ తను వుండ బుధుండవు
    స్వాతంత్ర్యము దొరికె విడువ వా దాస్యంబున్

    [విడువవు +ఆ దాస్యంబున్ ]


    త్రాతల్ భూమిని లేరె దేశమును సంరక్షింపఁ బాలింపఁ ద
    న్నేతృవ్రాతము శాస నాలయములన్ నిత్యమ్ము పౌరాళికిన్
    వ్రాతల్ మారవు తాత తండ్రులది పారంపర్య మేపారఁగా
    స్వాతంత్ర్యమ్ము లభించినన్ విడదు దాస్యంబేల యీ జాతికిన్

    రిప్లయితొలగించండి
  24. తాతల కాలను పోయెను
    నూతనమౌ తరము వచ్చె నొవ్వగలేలా?
    మాతా!యీపని యేమిటి
    స్వాతంత్ర్రముదొరికె విడువవా దాస్యంబున్

    రిప్లయితొలగించండి
  25. స్వాతంత్ర్యమ్ము లభించినన్ విడదు దాస్యంబేల యీజాతికిన్
    మాతా!చక్కటిప్రశ్న వేసియుమమున్ మాట్లాడకుండంగ మా
    చేతన్ సత్యమువినం నోపుదువె?దాసీవోలె జీవించయీ
    జాతింనేర్చెను నేమొ దాస్యమువిడం సంస్కారమడ్డొచ్చెనే

    రిప్లయితొలగించండి
  26. ఈరోజు శ్రీ కంది శంకరయ్య గారి సమస్యకు నా పూరణ: 15-08-2021

    సమస్య: స్వాతంత్ర్యమ్ము లభించినన్ విడదు దాస్యంబేల యీ జాతికిన్.

    పూరణ:
    శా. 'నా తల్లిన్ పరదేశవాసులిట నన్యాయమ్ముగా దాసిగా
    నాతంకంబు ఘటింతురే?' యనుచు వీరానీకముప్పొంగఁగా
    త్రాతంబైనను నేడు మద్యమునకున్ దాస్యంబులన్ జేయఁగా
    స్వాతంత్ర్యమ్ము లభించినన్ విడదు దాస్యంబేల యీ జాతికిన్.

    భావము: 'నా తల్లిని (భారతమాతను) పరదేశ వాసులు అన్యాయంగా దాసిగా మార్చి ఆమెకు ఆతంకము (=బాధను) కలిగిస్తారా?' అంటూ వీరసేన ఉప్పొంగగా, వారి వల్ల తల్లి రక్షింపబడినప్పటికీ ( త్రాతము = కావబడినది ), నేడు మద్యపానానికి జనము దాస్యమును చేస్తూ ఉండగా, స్వాతంత్రం లభించినప్పటికీ ఈ దాస్యము వీడలేదు అని భావం.

    - భరత్ శర్మ. యు

    రిప్లయితొలగించండి
  27. జాతీయంబగు సంపదంతయును లజ్జన్ వీడి దుష్టాత్ములై
    నీతేలేని అకార్యశీలులిచటన్ నిర్ణేతలై దోచగా
    భీతిన్ జెందక సజ్జనుల్ నిలుచుచున్ వీరత్వమున్ జూపరే
    స్వాతంత్ర్యమ్ము లభించినన్ విడదు దాస్యంబేల యీ జాతికిన్ ?

    రిప్లయితొలగించండి