21, ఆగస్టు 2021, శనివారం

న్యస్తాక్షరి - 70

22-8-2021 (ఆదివారం)
కవిమిత్రులారా,
రక్షాబంధన పర్వదిన శుభాకాంక్షలు!
నాలుగు పాదాలలో యతిస్థానంలో వరుసగా
'స - హో - ద - రి'
అనెడి అక్షరాలను న్యస్తం చేస్తూ
మీకు నచ్చిన ఛందంలో
రక్షాబంధన మహోత్సవంపై
పద్యం వ్రాయండి. 

42 కామెంట్‌లు:


  1. సంతసమ్మది యుప్పొంగ సకియలెల్ల
    యుర్విలో జరుపుకొనెడు మహోత్సవంబు
    తరలి వచ్చి పుట్టింట సోదరుల జేరి
    ప్రేమతో రక్ష గట్టిమురిసెదరైరి.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "సకియలెల్ల నుర్విలో... మురిసెదరౌర" అనండి.

      తొలగించండి
  2. సదమలమనోభిలాషిగసాగబతుక
    హోయనగనుభావమునందయోగిగాగ
    దరినిరానీకమరియోకదాహమిలను
    రిపులుశాంతింపమనసుకురీతియిదియ

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పద్యం బాగుంది. కాని న్యస్తాక్షరాలు యతిస్థానంలో ఉండాలి. పాద ప్రథమాక్షరాలు కాదు.

      తొలగించండి
    2. చూడలేదుక్షమించండి
      సదమలమనోభిలాషిగసరిగఁజూడు
      హాయికలిగించుభావమహోయనంగ
      దాహతప్తముగానీనిదరికిరాని
      రీతివర్తనమిటులనురిపులవంచు

      తొలగించండి
  3. సౌమ్య వర్తన గల్గిన సహన శీలి
    హొయలు జూపని దైన సహోదరి గను
    తమిగ రక్షను గట్టె సుదతి గ దాను
    రేఖలను మార్చు ప్రేమ వరించు చుండ

    రిప్లయితొలగించండి
  4. ఆటవెలది
    సాగి వచ్చి దరికి సహృదయ, రాఖీని
    మోదమలరఁ దా సహోదరియన
    రక్ష నొసఁగ గట్టు దక్షిణ హస్తాన
    ప్రేమ సోదరుఁడు విరివిగ గాంచ

    రిప్లయితొలగించండి
  5. సాగర పుత్రికా (స)రస గతిని యీవు
    దాసిగా మారి‌‌ ముదమ్ముతోడ

    నూడిగ మునుచేసి (హో)దాను
    తలపోయ
    క వసించితివి గదా ఘనత బడసి,


    తలచగా మనము‌ మ(ద)న‌ పడుచుండెగా
    రక్ష బంధనము కరమున కట్టి

    లిబ్బుల‌ జవరాల! (రి)పుని, సోదరుని
    గా మదిని తలచి కంబు పాణి

    బంధనములను విడిపించి పతిని వెంట

    తీసు కొనిపోవగ తలచితివిగ, చెల్లె

    లా విడచు చుంటి నీదు వల్లభు డననుచు

    పలికె బలిచక్రవర్తి యభయము‌ నిడుచు


    బలి‌ చక్రవర్తికి‌‌ లక్ష్మి రక్షా‌‌‌ బంధనము కట్టి భర్తను‌ విడిపించ మని కోరగా
    బలిచక్ర వర్తి పలుకు సందర్భంలో

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "..గతిని నీవు.." అనండి. సీసం నాల్గవ పాదం పూర్వార్ధంలో గణభంగం. సవరించండి.

      తొలగించండి
  6. సత్యమిద్దియె నినుగాతు సతతమమ్మ
    ఉర్వి జనులంత మెచ్చనోహోయనుచును
    తల్లిదండ్రుల పిమ్మట దక్షుడనగ
    లిప్తపాటున దీర్తు కోరికలనన్ని

    రిప్లయితొలగించండి
  7. సకల సౌఖ్యంబులనిశము *స*మకొనంగ
    నుత్సహించుచు జరుపు మ*హో*త్సవంబు
    తనకు నండగా నిల్చు సో*ద*రుని పైన
    ప్రేమ రక్షబంధనమయి *రి*పుల గెల్చు

    రిప్లయితొలగించండి
  8. ఆ.వె.

    సంబరమ్ము నేడు సంతసమ్మనిపించు
    హుంకరించు అక్క హోరు లేక
    తావు దెలుపుడనుచు దరి జేర పండుగై
    రీతి రక్ష ననుస రించు పథము

    *2 వ పాదం లో సంధి చేయడం వల్ల అక్క కు బదులు నక్క అని రాయాల్సి వస్తుందని సంధి చేయలేదు*

    వై. చంద్రశేఖర్

    రిప్లయితొలగించండి
  9. న్యస్తాక్షరి :

    స - హో - ద - రి అనే అక్షరాలు వరుసగా యతిస్థానాలలో నిలిపి రక్షాబంధనోత్సవ వర్ణన

    ( సభలో తన నగరంలో రక్షాబంధనోత్సవాన్ని
    వైభవంగా జరుపమని ప్రజలకు ఆజ్ఞాపిస్తున్న పాంచాలరాజ్యాధిపతి పురుషోత్తముడు )

    తేటగీతి
    ..............

    శ్రావణపు పౌర్ణమి యిదియె సభ్యులార !
    హొయలు గులికెను లక్ష్మిసహోదరుండు ;
    ధన్యు లౌదురు వాత్సల్యదర్శనమున ;
    రెచ్చి మెరయుడు నింగిలో రిక్కలట్లు .

    ( లక్ష్మిసహోదరుండు - చంద్రుడు ; రిక్కలు - చుక్కలు )

    రిప్లయితొలగించండి
  10. శాంతి సౌభాగ్యములుగల్గు సతము నీకు
    యోగ్యు డగుభర్త దక్కె సహోదరి మది
    దలప నీదు జీవితము నందనము రక్ష
    రేక నువుగట్ట నయనాలు రిక్క లాయె

    రిప్లయితొలగించండి
  11. శయమునకు రక్ష కట్టగ ‘స’హజ వచ్చు
    యొక్క పండుగ నేడు ;
    స’హో’దరుండు
    తన భగినికి దగు యభినం’ద’నలు దెలుపు
    రీతి జీర నొ సంగె ము’రి’పెము జూపి

    రిప్లయితొలగించండి
  12. ...ఫోను సంభాషణలు..
    అక్క..
    చక్కనిఅక్కఫోనుమరి
    సమ్మతికోరెనురాఖికట్ట నీ
    ఒక్కనివైనరాయిటు
    సహోధరమొన్ననెజౌడమాయరా
    తక్కినలేనిపోనివి ని
    దర్శనమిచ్చుచునీదుభార్య నే
    రిక్కెనుమాటబోయెను
    సరిగ్గయవేవియుపట్టుకోకురా
    తమ్ముడు...
    సరెనె దాన్నితోలుకవస్త సమజుజేసి
    ఒనరుగకలిసిపోదమోహోయనగను
    ధనముశాశ్వితమౌనునాదయగనుమరి
    హరికినాబిడ్డ నిచ్చెద సరిగజూడు
    ...తోకల...

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ రెండు పూరణలు సహజ సుందరంగా ఉన్నాయి. కాకుంటే కొన్ని వ్యావహారికాలను ప్రయోగించారు.

      తొలగించండి
  13. సదమల చిత్తముం గలిగి (స)ర్వవిధంబులఁ బ్రేమఁ జూపి తా
    నుదిత నయానురాగపు మ(హో)న్నతమూర్తిగ నిల్చు చెల్లి మో
    దద యగుచుండు నెప్డు కను (ద)మ్ముల నిల్పుచు రక్షఁ గట్టుఁ జే
    రెద నిపుడేను చెల్లిఁ గన (రి)వ్వున నేఁగెద వేగఁ బక్షినై

    రిప్లయితొలగించండి
  14. సహజ ముగతల్లికి పనిని *స*హకరించు,
    నుదయ మునలేచి చూడ మ*హో*దయ మగు
    తండ్రి కి తనయమోము, ము*ద*ము, ధనము, వ
    రించ రక్షనుగట్టు నా*రి* భగిని కద.

    రిప్లయితొలగించండి
  15. శ్రావణపు పూర్ణిమ దినమ్ము *స* హజ, కరము
    సాదరముఁ గట్టి రాఖీ స *హో* దరునకు
    దయనుఁ బొందగ, మంచి హృ *ద* యమునన్న
    ప్రీతి, నభయమొసంగ తి *రి* గి వెడలును

    రిప్లయితొలగించండి
  16. సంతసంబున రాఖీని సాదరముగ
    నుర్వినిజరుపు కొనగమ హోత్సవముగ
    దనదు పుట్టింట యుండెడు తమ్ముదరికి
    ప్రియము తోడను వచ్చిము రిసెనుసహజ

    రిప్లయితొలగించండి
  17. రిప్లయిలు
    1. స కృపఁ గందు సహోదరి స తత మిల స
      హోదరి యగును లక్ష్మి సహోదరిఁ గనఁ
      దన కిడ సిరి రమా సహోదరి తొలఁగు ము
      రియుచు శశి సహోదరి యలరి సిరు లొసఁగు

      తొలగించండి
  18. సదమలమనోభిలాషిగసరిగఁజూడు
    హాయిగలిగించుభావమహోయనంగ
    దాహతప్తముగానీనిదరికిరాని
    రీతివర్తనమిటులనురిపులవంచు

    రిప్లయితొలగించండి
  19. చాల ముదమ్ము నన్నఁగని సమ్మతి తోడుత గట్ట బంధనన్
    హేలగ వాని చేతికి మహోన్నత దీవెన లందనెంచుచున్
    దాలిచి కంకణమ్మును పదమ్ముల నంటిన చెల్లి గాంచి తా
    రేల సుమమ్ములిచ్చి తనరించె సహొదరు డప్పు డిచ్ఛతో
    అసనారె

    రిప్లయితొలగించండి
  20. సతతము సహజన్ములకిల సకల శుభ మ
    హోన్నతి మదినాశింతురహో భగినులు
    దలపగ ప్రతిరూపంబుగ దల్లికి నమ
    రిక నొసగెను విధాత గూరిమి వరంబు

    రిప్లయితొలగించండి