23, జూన్ 2022, గురువారం

సమస్య - 4116

24-6-2022 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“శ్రీయే నా చెల్లెలనుచు శ్రీహరి పలికెన్”
(లేదా...)
“శ్రీయే సోదరి నాకటంచుఁ బలికెన్ శ్రీనాథుఁ డుత్సాహియై”

22 కామెంట్‌లు:


  1. మాయమనెడు సినిమాలో
    నాయకు రాలిగ నటించు నల్లని దౌ యా
    తోయలి ప్రసిద్ధ మాలా
    శ్రీయే నా చెల్లెలనుచు శ్రీహరి పలికెన్.

    రిప్లయితొలగించండి
  2. కందం
    సాయమొనరింప జగతికిఁ
    బాయక గరళము గొనంగ పరమేశ్వరుఁ దా
    ' నూ' యన్న గౌరి నెవరన
    శ్రీయే, నా చెల్లెలనుచు శ్రీహరి పలికెన్!

    శార్దూలవిక్రీడితము
    శ్రేయమ్మౌనని లోకరక్షణమునన్ క్ష్వేళమ్ము నిర్భీతిఁ దా
    బాయన్జూడక కంఠమందు నిలుపన్ బ్రాణేశుఁడందంగఁ గా
    నీయండంచును సమ్మతిన్ దెలిపెనే నీలాక్షి యేరంచనన్
    శ్రీయే, సోదరి నాకటంచుఁ బలికెన్ శ్రీనాథుఁ డుత్సాహియై!

    రిప్లయితొలగించండి
  3. మాయగమూలప్రకృతిగన
    భూయంబాయెనుజగతియుపూచినసిరియై
    జేయుండాయెనువిష్ణుడు
    శ్రీయేనాచెల్లెలనుచుశ్రీహిపలికెన్

    రిప్లయితొలగించండి
  4. స్వీయానంతమహత్వసత్వవిలసద్విస్తారశౌర్యంబుతో
    మాయారూపులు దుష్టభావులగు దుర్మార్గోగ్రదైత్యాళులన్
    ధ్యేయం బుల్లసిలంగ గూల్చి జగతిన్ దీపిల్లు నాశైలజా
    శ్రీయే సోదరి నాకటంచుఁ బలికెన్ శ్రీనాథుఁ డుత్సాహియై

    రిప్లయితొలగించండి
  5. శ్రేయము గూర్చగ నిరతము
    శ్రీయుతు లౌ చదు వువలన శీఘ్రము గదగన్
    శ్రీయే వాగ్దే వి యగుట
    శ్రీయే నా చెల్లెలనుచు శ్రీహరి పలికెన్

    రిప్లయితొలగించండి
  6. శ్రేయం బీయుత యెల్ల వేళల నుదా శీఘ్రంపు టాలోచనన్
    శ్రీయే సోదరి నాకటంచుఁ బలికెన్ శ్రీనాథుఁ డుత్సాహియై
    శ్రేయం బిచ్చును నా సరస్వతి సుమా క్ష్వేళంబు తుల్యంబుగా
    మాయల్ సేయక నుండు వారలకు సూ క్షేమంబు లిచ్చున్ సదా

    రిప్లయితొలగించండి
  7. కందము
    మాయింటి లక్ష్మి,పార్థున
    కేయిల్లాలైన మగువ,యిందునిభాస్యా,
    తోయలి,సుభద్ర,సుగుణ
    *శ్రీయే నా చెల్లలనుచు శ్రీహరి పలికెన్.*

    శార్దూలము
    మాయింటంబ్రభవించినట్టి సిరియే,మాయామునింబార్థుగాఁ
    దాయోచించని బేల,కోమలి,సుభద్రాదేవి,శాతోదరీ,
    ప్రోయాల్,ముద్దులగుమ్మ,భామ,వనితా,పూబోడి,భాస్వద్గుణ
    *శ్రీయే సోదరి నాకటంచు బల్కెన్ శ్రీనాథుడుత్సాహియై.*
    -----------దువ్వూరి రామమూర్తి.

    రిప్లయితొలగించండి
  8. ఆయమ నగనందిని , కా
    త్యాయని , పతిలోసగమయి తనరారెడి శూ
    లాయుధుని హృదయమందలి
    శ్రీయే నా చెల్లెలనుచు శ్రీహరి పలికెన్

    రిప్లయితొలగించండి

  9. నీ యారాటమెఱంగితిన్ విజయుడా నేనుంటి నీకోసమై
    సాయంబెప్పుడు చేయువాడనుకదా సంకోచ మింకేటికో
    ప్రేయాంసుండవు నీవటంచు దలచెన్ పెండ్లాడు సౌందర్య సు
    శ్రీయే సోదరి నాకటంచుఁ బల్కెన్ శ్రీనాథుఁ డుత్సాహియై

    రిప్లయితొలగించండి
  10. తోయజనేత్రా! చెల్లికి
    సాయంబునిడగ తరలుము సత్వరలీలన్
    హాయినొసగుమని కోరెన్
    శ్రీ; 'యేనా చెల్లెలనుచు' శ్రీహరి పలికెన్

    రిప్లయితొలగించండి
  11. న్యాయస్థానమదియు సిని
    మా యందలి పాత్రకు తుది మాటలు వ్రాయన్
    న్యాయమలరి శంక తొలగ
    శ్రీయే నా చెల్లెలనుచు శ్రీహరి పలికెన్

    రిప్లయితొలగించండి
  12. శ్రేయము సేయంగ శివుడు
    సాయము గా హాల హలము చప్పున మ్రింగ
    న్నా యాప్తుని సతి సుగుణ
    శ్రీ యే నా చెల్లె లనుచు శ్రీహరి పల్కెన్

    రిప్లయితొలగించండి
  13. మాయావేషము దాల్చి సాధువువలెన్ మాయింటికేతెంచితే
    నీయాసక్తిని నే నెరుంగుదును చూ! నీకోసమెల్లప్పుడున్
    సాయమ్మున్ పొనరించెదన్ విజయ! యా సౌందర్య సీమంతినీ
    శ్రీయే సోదరి నాకటంచుఁ బలికెన్ శ్రీనాథుఁ డుత్సాహియై

    రిప్లయితొలగించండి
  14. కందం
    మాయావి దనుజుల దునిమి,
    శ్రేయంగూర్చిన కపాలి సింహరధను జే
    జేయని కీర్తించి జయ
    శ్రీయే నాచెల్లెలనుచు శ్రీ హరి పలికెన్.

    ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
    ఉండవల్లి సెంటరు.

    రిప్లయితొలగించండి
  15. శ్రేయములొసగగపుట్టెను
    శ్రీయే,నాచెల్లెలనుచు శ్రీహరి పలికెను
    శ్రీయనినెరిగియగొనుమను
    శ్రీయుమ యేయనుచుకడలిచెంతముదముతోన్

    రిప్లయితొలగించండి
  16. శా:"ఏ యూరో తమ ?దిచ్చ టెవ్వరికి తా మే రీతి చుట్టా ?" లనన్
    మా యూరా?అది రాణ్మహేంద్రి,కవియౌ
    మా బావ పోతన్న యే
    శ్రేయం బాయన కిచ్చు భార్య ,సుగుణశ్రీ యంచు మీ రన్న యా
    శ్రీ యే సోదరి నా కటంచు బలికెన్ శ్రీనాథు డుత్సాహి యై.
    (శ్రీనాథ కవి పోతన గారి ఊ రొచ్చారు.మీ
    దేఊరు ,చుట్టా లెవరు ? అని ఊరి వాళ్లు అడిగారు.నేను శ్రీనాథమహాకవిని అనక "పోతన మహాకవి గారు మా బావ.మీ రింత వరకూ ఏ ఇల్లాలిని మెచ్చుకొని మాట్లాడుతున్నారో ఆమె మా అక్క గారు.అన్నాడు.)

    రిప్లయితొలగించండి
  17. కం:ఏ యక్కలు,చెల్లెండ్రున్
    నా యెదలో నిట్టి స్థాన మంద రిదేమో!
    ఈ యనిన ద్రుపదవంశ
    శ్రీ యే నా చెల్లె లనుచు శ్రీహరి పల్కెన్
    (నా కెందరు అక్క చెల్లెళ్లున్నా ఈ యుద్ధం వరకూ ద్రౌపదే నా చెల్లెలు అన్నాడు శ్రీకృష్ణుడు.)

    రిప్లయితొలగించండి
  18. revised poem 2
    కం:ఏ యక్కలు,చెల్లెండ్రున్
    నా యెదలొ గురుతు రారు ,నా హృదయములో
    నీ యనిన ద్రుపదవంశ
    శ్రీ యే నా చెల్లె లనుచు శ్రీహరి పల్కెన్
    (నా కెందరు అక్క చెల్లెళ్లున్నా ఈ యుద్ధం వరకూ ద్రౌపదే నా చెల్లెలు అన్నాడు శ్రీకృష్ణుడు.)

    రిప్లయితొలగించండి
  19. స్వీయ సతి యడిగినం గమ
    నీయమ్ముగ శంకరుండు నిజ సద్భక్త
    శ్రేయస్కరుం డుమా పతి
    *శ్రీ యే నా చెల్లె లనుచు శ్రీహరి*! *పలికెన్*

    ఈ యా మాటలు వల్క నేల నిరతం బీ నేర్తు నిక్కమ్ముగా
    శ్రేయమ్ముల్ మది విశ్వసించి నను బూజింపంగ నే దుస్స హా
    పాయశ్రేణిఁ దొలంగఁ జూతు ధరలోఁ బాంచాలి తత్పాండవ
    *శ్రీయే సోదరి నాకటంచుఁ బలికెన్ శ్రీనాథుఁ డుత్సాహియై*

    రిప్లయితొలగించండి
  20. శ్రీ యే శివునర్చించగ
    శ్రేయంబుగ చంద్రకాంతి చిమ్మెను జగమున్
    ధీయుతు డైగని గిరిజ
    శ్రీ యే నా చెల్లెలనుచు శ్రీహరి పలికెన్

    రిప్లయితొలగించండి
  21. శ్రేయము జగతికిఁగూర్చఁగ
    నా యుమ పతిగరళముఁగొన నానందముగా
    ' సై' యని తెలిపిన సుగుణ
    శ్రీయే నా చెల్లెలనుచు శ్రీహరి పలికెన్

    రిప్లయితొలగించండి