1, మార్చి 2023, బుధవారం

సమస్య - 4353

2-3-2023 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“ఆముదాల మురళి నవధాని యనరాదు”
(లేదా...)
“లెక్కకు నాముదాల మురళిన్ గొనవచ్చునె సద్వధానిగన్”
(ఆముదాల మురళి గారి శతావధానంలో నా సమస్య)

27 కామెంట్‌లు:

 1. రిప్లయిలు
  1. ఆటవెలది
   పాటవము గలుఁగు నుపన్యాసకుండని
   కీర్తిఁగొన జగమునఁ, గేవలమ్ము
   నాముదాలమురళి యవధాని యనరాదు
   సత్కవీశ్వరుండు సర్వులొప్ప!

   ఉత్పలమాల
   చక్కని యొజ్జగన్ మిగుల ఛాత్రులు భక్తిని గౌరవింపగన్
   నిక్కక కోవిదుల్ వొగడ నేర్చ కవిత్వము కేవలమ్ముగన్
   లెక్కకు నాముదాల మురళిన్ గొనవచ్చునె సద్వధానిగన్?
   దక్కిన సత్కవీశుడన ధారుణి మెచ్చగవచ్చు దిట్టగన్!

   తొలగించండి
  2. మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

   తొలగించండి
 2. రిప్లయిలు
  1. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

   తొలగించండి
  2. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
   ఆటవెలది చివరి పాదంలో గణభంగం.
   ఉత్పలమాల మూడవ పాదంలో గణభంగం. సవరించండి.

   తొలగించండి
  3. సవరణతో....

   ఆముదాలవలస యాతనిగ్రామము
   మురళి గాన మనిన మోజు పడును
   ఆముదాల మురళి నవధాని యనరాదు
   వారు వేరు వీరి పేరు వేరు

   పెక్కవధానముల్ సలిపి పెక్కువమీరగ కీర్తిచేకొనెన్
   లెక్కలువేయనేల నవ లీలగ నెల్లరి మెప్పు పొందునే
   చక్కనిధారతోడ నతిచక్కని పాటవ మెంచుచున్నచో
   లెక్కకు నాముదాల మురళిన్ గొనవచ్చునె సద్వధానిగన్


   తొలగించండి

 3. పండితుండటంచు పాటవమ్ము నెఱగి
  వ్రేకదనము జేయు వేళయందు
  ఆముదాల మురళి, నవధాని యనరాదు
  వలదటంచు నట్టి బవిసి దాను.


  చక్కని సుస్వరమ్ము సరసస్ఫురణాన్విత ధార గల్గి తా
  మిక్కిలి పాటవమ్మున సుమేధసు లెల్లరు మెచ్చు రీతిగన్
  గ్రక్కున పద్యమల్లగల కణ్వుడితండని చెప్పుచుంటి నా
  లెక్కకు నాముదాల మురళిన్, గొనవచ్చునె సద్వధానిగన్.

  రిప్లయితొలగించండి
 4. ఆముదములనమ్ము నాతని పేరుగ
  నాముదాల మురళి యనగ నొప్పు
  నాముదాల మురళి నవధాని యనరాదు
  యుక్తమగుజవాబులొసగ కుండ

  రిప్లయితొలగించండి
 5. చక్కటి రీతిగా మనల సంతస పర్చెదనన్న యీతడే
  యిక్కడ కూర్చొనుండి యిక నిమ్మగురీతి జవాబు జెప్పకన్
  గ్రుక్కలు మింగుచుండియును గొప్పలు జెప్పెడు నీతనిన్ గనన్
  లెక్కకు నాముదాల మురళిన్ గొనవచ్చునె సద్వధానిగన్

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
   'సంతస మిచ్చెద నన్న నీతడే యిక్కడ కూరుచుండి... జవాబు చెప్పకే...' అనండి.

   తొలగించండి
 6. అందెవేసినచెయి యవధానమందున
  పద్యవిద్యయందు ప్రజ్ఞ జూపు
  ఆముదాల మురళి నవధాని యనరాదు
  సత్కవీంద్రుడతడు శాస్త్రవిదుడు

  రిప్లయితొలగించండి
 7. లెక్కకు నాముదాల మురళిన్ గొనవచ్చునె సద్వధానిగన్?
  చక్కటి పద్యపూరణము సద్యశమందగజేయు ధారణన్
  మిక్కిలి ప్రజ్ఞ జూపగల మేటి వధాని యతండు రూఢిగా
  తక్కినవారికన్న యవధానములందున తానె మిన్నయౌ

  రిప్లయితొలగించండి
 8. గొప్ప. కీర్తి నంది కోవిద మణి యయ్యె
  నతని గూర్చి యిట్టు లనుట తగునె?
  యాముదాల మురళి యవధాని యనరాదు
  శతకము లను జేసి చతురు డయ్యె!

  రిప్లయితొలగించండి
 9. ఆ.వె:ఆముదాల మురళి నవధాని యనరాదు
  క్లుప్త మైన రీతి, గొప్పగానె
  యను శతావధాని యని యింక బిరుదమ్ము
  లన్ని కలిపి చెప్పు మాదరమున
  (ఆయనని సింపుల్ గా అవధాని అనట మేమిటి?అవధానం చాలా మంది చేస్తారు.శతావధాని అనాలి.ఆయన కున్న బిరుదులని కూడా చెప్పాలి.)

  రిప్లయితొలగించండి
 10. ప్రశ్నోత్తరి
  ఉ:చక్కగ నీ వధానముల సాధన జేసెడు రీతి దెల్పరే!
  పెక్కుగ సద్వధానముల వీనుల విందుగ జుర్రుచుండుమా!
  లెక్కకు నాముదాల మురళిన్ గొన వచ్చునె సద్వధానిగన్?
  మిక్కిలి గొప్ప వా డతడు మేలగు నాతని రీతి గాంచినన్!

  రిప్లయితొలగించండి
 11. వాద్య తతుల మేటి సద్యో ముద మొసంగు
  వినఁగఁ బండువ యగు వీనుల కది
  నా ముదాల మురళి నవధాని యన రాదు
  వేణు వనఁగ నొప్పు విశ్వ మందు

  నిక్కము నెంచ సత్కవులు నింగిని మేరగ నుంచి తారలం
  దక్కువ సేసెడిన్ గిరల ధాత్రిని వెల్గఁగ నిల్ప నేర్వరే
  చక్కఁగ నెంచి వాఙ్మణిని సత్వర మక్షర లక్ష లిచ్చినన్
  లెక్కకు నాముదాల మురళిన్ గొన వచ్చునె సద్వధానిగన్

  రిప్లయితొలగించండి

 12. పిన్నక నాగేశ్వరరావు.

  క్లిష్టమైనను నవలీలగా పూరించు
  పటిమ గలిగినట్టి పండితుడగు
  నాముదాల మురళి నవధాని యనరాద
  టంచు పలుక మూర్ఖమగును గాదె!

  రిప్లయితొలగించండి
 13. ఆముదాలమురళి నవధాని యనరాద
  నంగ నంతరార్థ మదియు కాదు
  శతము కన్న నధిక సంఖ్యలో నవధాన
  ములనుచేసినట్టిపూజ్యుడితడు

  మరొక పూరణ


  చక్కగ చేయుచుండెగను సంయమునమ్మున నన్నితావులన్
  నక్కజమౌగ చూడగనునద్భుతమౌయవధానరీతులన్
  లెక్కకు నాముదాల మురళిన్ కొనవచ్చునె సద్వధానిగాన్
  నిక్కముగాదు నీపలుకునీతడునంతకుమించునన్నిటన్.

  రిప్లయితొలగించండి