25, ఏప్రిల్ 2023, మంగళవారం

దత్తపది - 194

26-4-2023 (బుధవారం)
కవిమిత్రులారా,
'గంగ - గంగ - గంగ - గంగ'
నాలుగు పాదాలలో 'గంగ'ను అన్యార్థంలో ప్రయోగిస్తూ
స్వేచ్ఛాఛందంలో
భారతార్థంలో పద్యం వ్రాయండి.

25 కామెంట్‌లు:

  1. కందం
    వలువలుడుగంగ సతికిన్
    గలికియె సాయమడుగంగఁ గమలాక్షుఁ దగన్
    గలుగంగ నక్షయముగన్
    దలలెత్తిరి మగలు బావ దరి వెలుగంగన్

    రిప్లయితొలగించండి
  2. మునుగంగానేలవినుమ
    కను, మాగంగనుతలపులగాంచుమునిజమున్
    పనిగంగాయుమువంశము
    అణగంగాజేయుపగనునన్నలుమీరే
    దుర్యోెధనునికిహితోపదేశము

    రిప్లయితొలగించండి
  3. కదిలె సేనలు వే గంగ కదన మునకు
    పోరు సాగంగ పార్థుడు వీరు డగు చు
    గూల్చె జేజేలు మ్రో గంగ కోవి దుడు గ మాన్యు డై తాను వెల్గంగ మహియు పొగడె

    రిప్లయితొలగించండి

  4. (ఉత్తర గోగ్రహణ వార్తవిని ఉత్తరుడంతఃపురమున చేసిన హడావిడి ని ఊహిస్తూ)


    ఆగంగను లేనిచ్చట
    నేగంగనువలయు సూతు డెచ్చట కలడో
    వేగంగను పిలుపించుడి
    సాగంగ వలయునిక నభిసంపాతముకై.

    రిప్లయితొలగించండి
  5. ఆవుల శరణమడుగంగ నది వినగనె
    విరటు సభనుండి వేగంగ వెడలి నంత
    నచట యుద్ధము జరుగంగ నందు లోన
    పార్థునకు గెల్పు కలుగంగ వాసినొందె

    రిప్లయితొలగించండి
  6. రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "శరములు విడి... పాండవుల్ మేలు గనిరి" అనండి.

      తొలగించండి
    2. సూచించిన సవరణతో...

      వ్యూహ మెఱుగంగ పార్థుని పుత్రు డేగి
      శత్రు సైన్యమ్ము తొలగంగ శరములువిడి
      జోరు పెఱుగంగ చెలరేగి పోరు సల్పి
      నేలకొఱుగంగ పాండవుల్ మేలుగనిరి

      తొలగించండి
  7. న్యాయ మడుగంగ‌ కౌరవుల్‌ నవ్వినారె‌
    చలము‌ కుట్రను‌ వేగంగ‌ శకుని చేసె‌
    వెర్రి పెరగంగ‌ ధర్మజుడు‌ వెతలు‌ పడెను‌
    తమము‌ మునగంగ‌ పాండవుల్‌ తరలిరడవి‌.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మూడవ పాదంలో గణభంగం. సవరించండి.

      తొలగించండి
    2. క్షమించండి...


      న్యాయ మడుగంగ‌ కౌరవుల్‌ నవ్వినారె‌
      చలము‌ కుట్రను‌ వేగంగ‌ శకుని చేసె‌
      వెర్రి పెరగంగ‌ ధర్మజు వెతలు‌ పడెను‌
      తమము‌ మునగంగ‌ పాండవుల్‌ తరలిరడవి‌.

      తొలగించండి
  8. అడవిఁ బాండవుల్ సాగంగ నడకదారు
    లందు వేగంగఁ బ్రవహించు నాపగలను
    కనుచు కృష్ణ కాలాగంగఁ గదలలేక
    బాధకలుగం గనుచు మోసె వాతసుతుడు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అడవిఁ బాండవుల్ సాగంగ నడకదారు
      లందు వేగంగదులుచున్న నాపగలను
      కనుచు కృష్ణ కాలాగంగఁ గదలలేక
      బాధకలుగం గనుచు మోసె వాతసుతుడు

      తొలగించండి
  9. తే॥ కౌరవ సభయందునఁ దొలుగంగ క్షయము
    శాంతి వెలుగంగ వర్తించ సౌఖ్య మనఁగ
    కృష్ణుడటులను మెలగంగఁ గీడుఁ గనుచు
    వినక సాగంగ దుష్టులు మనఁగ నౌన!

    రిప్లయితొలగించండి
  10. మరొక పూరణ అండి రాయబారమందు శ్రీకృష్ణుడు ధృతరాష్ట్రునికి చేసిన నీతి బోధ

    కం॥ వెలుఁగంగ శాంతి సుఖములు
    మెలగంగ ముదమగుఁ గాద మెలుకువ తోడన్
    దొలగంగ క్షయము సుతులకు
    కలహము సాగంగ రాదు కనుఁగొను మధిపా

    రిప్లయితొలగించండి
  11. సీసం:
    తమ్మి మొగ్గరమందు స్థామము పెరుగంగ
    నభిమన్యుడేతెంచె నార్భటముగ

    వాని బాణహతికి ప్రాణముల్ మలుగంగ
    కౌరవ సేనకకావికలయి

    తిరుగంగ వెనుకకు తివిరి యోచనఁజేసి
    దుర్యోధనాదులు దుష్టులౌర!

    మూకుమ్మడిగ చుట్టుముట్టిరి దయమాలి
    రూపడగంగ బాలుని రణమున

    ఆ.వె.||
    ఎంత పోరు సలుప నెక్కటి యోధుడై
    ఫలము లేకపోయె బలము వీగె
    యుద్ధమందునేల కొరిగెను వీరుడు
    కన్నవారలొంద కడుపుకోత

    రిప్లయితొలగించండి
  12. బాధ లుడుగంగ చేయుమా వాసుదేవ
    కావ వేగంగ రావయ్య కమలనాభ
    మానముతొలగంగనికపైమనగలేను
    ప్రాణమాగంగబోదికపంకజాక్ష

    రిప్లయితొలగించండి