26, ఏప్రిల్ 2023, బుధవారం

సమస్య - 4405

27-4-2023 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“విషముఁ జిమ్ముఁ దేనియలూరు విరినిఁ ద్రెంచ”
(లేదా...)
“తేనియలూరు పుష్పమునుఁ ద్రెంచ విషం బెగఁజిమ్ముచుం డహో”
(బులుసు అపర్ణ గారి ఒంగోలు శతావధాన సమస్య)

14 కామెంట్‌లు:

  1. తేటగీతి
    పూజకు పనికి రాదన మొగలిపూవు
    విష్ణుశాపమందురు, కాని విషయమెరుగ
    రక్త పింజర్లు నా పొదలఁ దిరుగునన
    విషముఁ జిమ్ముఁ, దేనియలూరు విరినిఁ ద్రెంచ

    ఉత్పలమాల
    మానిరి పూజకున్ మొగలి, మాధవుఁడిచ్చిన శాపమంచనన్
    గాని నిజమ్ము గాంచిన సకారణమొక్కటి ప్రస్ఫుటమ్మునౌ
    హానికరమ్ముగన్ బొదల నంటుకు నుండగ రక్తపింజరుల్
    దేనియలూరు పుష్పమునుఁ ద్రెంచ, విషం బెగఁజిమ్ముచుం డహో!

    రిప్లయితొలగించండి
  2. జానెడు పొట్టకోసమని శక్తికి మించి శ్రమించు శ్రామికుల్
    పానము గోరుచున్ బ్రతుకు బంచమొనర్చుచు నుందురే యిలన్
    గానగ చొక్కనీరదియె కల్మిని పెంచుచు పాలకుండ్రకౌ
    తేనియలూరు పుష్పమునుఁ ద్రెంచ విషం బెగఁజిమ్ముచుం డహో.

    రిప్లయితొలగించండి
  3. స్వర్థమెఱుగనకశ్రమియించుసౌమ్యుగదిసి
    మసినిబూయగతలపెట్టుమనిషిజూచి
    బుస లుగొట్టుచుభయపెట్టుపుష్పమైన
    విషముజిమ్ముతేనియలూరువిరినిద్రెంచ

    రిప్లయితొలగించండి


  4. ఆర్థిక పరి పుష్టిని పెంచెడాసవమది
    ప్రభుతకది తేనెలూరు పుష్పమ్ము నిజము
    మానవలె మానవ మధువు, మహిని జూడ
    విషముఁ జిమ్ముఁ దేనియలూరు విరినిఁ ద్రెంచ.

    రిప్లయితొలగించండి
  5. మొక్కలను నాటగనె బని పూర్తి కాదు
    వాటి పోషణ నేర్చుట ప్రముఖ మగును
    సరియ గు యెరువు లేకున్న సడలును విధి
    విషముఁ జిమ్ముఁ దేనియలూరు విరినిఁ ద్రెంచ

    విషము = జలము

    రిప్లయితొలగించండి
  6. గుబురు గా నున్న పొదరింటి కుసుమ తతులు
    పరి మ ళ మ్ము లు వెదజల్లి పరిఢ విల్లు
    గుబురు నందున జేరిన కొండ చిలువ
    విషము జిమ్ము :: దేనియ లూరు విరిని ద్రె o చ

    రిప్లయితొలగించండి
  7. కండలను కరగించుచు కష్టపడుచు
    విత్తమార్జించి వెచ్చించ వెసనములకు
    యిల్లునొళ్ళును గుల్లౌ నదేమి ఫలము
    విషముఁ జిమ్ముఁ దేనియలూరు విరినిఁ ద్రెంచ?

    రిప్లయితొలగించండి
  8. హానికరంబటం చెరిగి హాలహలమ్మును గ్రోలుటేలనో
    మానవ మానుమింక చనుమానముగా నినుఁ గోరుచుంటి స
    మ్మానము పూజ్యమౌనుగ సమాజమునందున త్రాగుబోతుకున్
    తేనియలూరు పుష్పమునుఁ ద్రెంచ విషం బెగఁజిమ్ముచుం డహో

    రిప్లయితొలగించండి
  9. అందరికీ నమస్సులు 🙏

    సూనము వంటి పాళెమది సొంపగు శీర్షము భారతాంబకున్;
    గానగ పొర్గుదేశమిక కాశ్మిరు "మాదియె" యంచు రెచ్చుచున్
    మానని యుగ్రవాదమున మానవులoబరిమార్చుచుండగా
    *“దేనియలూరు పుష్పమునుఁ ద్రెంచ విషం బెగఁజిమ్ముచుండహో”*

    *వాణిశ్రీ నైనాల*

    రిప్లయితొలగించండి
  10. మానవతులకు రక్షణ లేనిచోటు
    జాగరూకత వహియించి సాగిపొమ్ము
    పొదలమాటున దాగిన భుజగముండు
    విషముఁ జిమ్ముఁ దేనియలూరు విరినిఁ ద్రెంచ

    మానసమందునన్ వికృతి మంచిని వీడుచు సంచరించుచున్
    మానముకొల్లగొట్టి యవమానముఁ గూర్చెడి దుష్టబుద్ధులున్
    ప్రాణముతీయుతుంటరులు పాపులు సిద్ధము మర్వబోకుమా
    తేనియలూరు పుష్పమునుఁ ద్రెంచ విషం బెగఁజిమ్ముచుం డహో

    రిప్లయితొలగించండి
  11. తే॥ మొగలి పొదలోన విషనాగు మెలఁగు చుండుఁ
    గనఁగఁ జక్కని పాత్రలో గరళముండు
    గోముఖ పులులు నిండిన భూమి యందు
    విషముఁ జిమ్ముఁ దేనియలూరు విరిని ద్రెంచ

    ఉ॥ మానస వీణ మ్రోగఁగను మైకము గ్రమ్మఁగఁ బ్రేమ హెచ్చుచున్
    మానిని చేయిఁ గోరఁగను మన్నన సేయఁగఁ బెండ్లి యాడఁగన్
    బూనిన వాంఛలన్ బడతి పోరఁగ నిత్యము ఖిన్నుఁడయ్యెనే
    తేనియలూరు పుష్పమును ద్రెంచ విషంబెగఁ జిమ్ముచుండహో

    1979 కన్నడ చిత్రం "ఏనే బరలి ప్రీతి యిరలి" సారాంశమండి

    రిప్లయితొలగించండి
  12. ప్రభుత‌ సంపద‌ పెంచేటి‌ పానశాల‌
    వ్యసన‌ పరులందరికిగొప్ప‌ యాగశాల‌
    సమిధలయ్యెను తాగిన జనులు చూడ
    ప్రభుతకది‌ తేనెలూరు‌ పుష్పమది కనగ
    విషముఁ జిమ్ముఁ దేనియలూరు విరినిఁ ద్రెంచ”

    రిప్లయితొలగించండి
  13. పాలు గారు పాపల బట్టి పాశవికము
    గానుబంధించి చెరచుచు కాటు వేయ
    స్వామి వారిని శిక్షించి సర్ప మట్లు
    విషము జిమ్ము తేనియలూరు విరిని ద్రెంచ

    రిప్లయితొలగించండి