28-4-2023 (శుక్రవారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“రామసేతువు నిర్మించె రావణుండు”(లేదా...)“రావణుఁ డా రఘూద్వహుని రాకకుఁ గట్టెను రామసేతువున్”(బులుసు అపర్ణ గారి ఒంగోలు శతావధాన సమస్య)
ముక్తిమార్గంబువెదకుచుమౌనియగుచురక్కసుండునుభక్తుడైరాజసమునవైరియగుచునురాముకైవచ్చుదారిరామసేతువునిర్మించెరావణుండు
తేటగీతిమైథిలిని రామునకొసఁగ మంచిదనినసేమమెంచక మోహాన చెలఁగి మిగులరామదండును పూనంగ రగడఁజేసిరామసేతువు నిర్మించె రావణుండుఉత్పలమాలకావరమెక్కువై తనదు కామము మీరఁగ సీతఁదెచ్చి తానేవురు జెప్పినన్ వినక యేర్పడ జేయుచు వైరమన్నదేచావగ నెంచెనో కపుల సైన్యము వూనఁగఁ జేసి మూర్ఖుఁడైరావణుఁ డా రఘూద్వహుని రాకకుఁ గట్టెను రామసేతువున్
🙏ధన్యోస్మి గురుదేవా!🙏
ఆ వనజాక్షి సీతనెవడంకిలి పెట్టె? నెవండకోసమైదావనమందు వేచెను మతంగమహాముని శిష్యురాలు? సాలావృక బృందమా కడలి లంగకొనంగను చేసెనేమనన్ రావణుఁ , డా రఘూద్వహుని రాకకుఁ , గట్టెను రామసేతువున్.
మీ క్రమాలంకార పూరణ బాగున్నది. అభినందనలు.
లంకకేగగ దలచిన రామదండుసింధువుందాట నచ్చోట సేసెనేమి?కలికి జానకింగోరిన కమనుడెవడు?రామసేతువు నిర్మించె, రావణుండు.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
ఆగ్రహించియు జానకి నపహ రించివృక్ష ఛాయను నునిచి యు వెతను గూర్చెనట్టి క్రూరు o డు దుష్టుo డ దె ట్టు లతడురామ సేతువు నిర్మించె రావణుo డు?
మీ పూరణ బాగున్నది. అభినందనలు.'వృక్ష + ఛాయ = వృక్షచ్ఛాయ' అవుతుంది.
పాదపము క్రింద నునిచి యు బాధ పెట్టి అని సవరణ చేయడమైనది
భామ సీతను వంచించి పట్టి తెచ్చిలంక లోపల దొరయించె లంక నృపతివినక తమ్ముని మాటలు తనదు సతికిరామ! సేతువు నిర్మించె రావణుండు
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
చావుకు చేరువౌటకొక చక్కని మార్గము తోచినంతనేపావనిసీతకై వలను పన్ని హరించెను మాయలేడితోజీవితమున్ ద్యజించ తన చేతము చేయు తలంపులందునన్రావణుఁ డా రఘూద్వహుని రాకకుఁ గట్టెను రామసేతువున్
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
పావని జానకీ చెరను బంతముతోవిడపించ లంకకున్చేవగలట్టి సైన్యతతి చేరగ ధైర్యము గోలుపోయె నా రావణు డారఘూద్వవుని రాకకు,గట్టెను రామసేతువున్రావణు సంహరించగను రాముడువానర సేనగూడియున్.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.'జానకీ చెర' దుష్టసమాసం.
భూజను కలయ లంకను పొలయ నెంచికడలి తీరమునకు జేరి కట్టిరచటరామసేతువు ; నిర్మించె రావణుండువ్యూహ మొకటి సై న్యము తోడ పురము జుట్టు
తా వనమందు నొంటరిగ ధాత్రిజ యుండగ పర్ణశాలలోచీవరి రూపుదాల్చి గొని సీతను జేర్చెను స్వర్ణలంకలోచావునుకోరి వానరుల సాయముతో రఘురాము చేతిలోరావణుఁ డా రఘూద్వహుని రాకకుఁ గట్టెను రామసేతువున్
సాధ్వి సీతనుగొనితెచ్చి స్వర్ణలంకరామచంద్రుని చేతిలో దీమసముగచావుగోరి వానరమూక సాయమందిరామసేతువు నిర్మించె రావణుండు
పావని యైన జానకిని వంచన తోడుత తెచ్చి లంకలోనీవన మందు నుంచితివి నీచపు బుద్ధిని, రాము చేతిలోచావును వ్రాసె నబ్జజుడు, సంతస మొందుచుఁ గోతి మూకయేరావణుఁడా! రఘూద్వహుని రాకకుఁ గట్టెను రామసేతువున్
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
గురువర్యులకు నమస్సులు. ధన్యవాదములు
తే॥ లంక నాంజనేయుఁడు కాల్చి రయమున చనరావణునికి కీడు నరసి రాత్రి పూటఁగాంచె త్రిజట నీ పగిదిని గలల యందురామ సేతువు నిర్మించె రావణుడుఉ॥ భావన శోకమై తనదు బాధల నెంచచు సీత యుండగన్రావణుఁ గూల్చ వచ్చునని రాముడు, తెల్పఁగ నాంజనేయుఁడున్గావఁగ వచ్చుటన్ ద్రిజట కాంచెను స్వప్నము నందు నిట్టులన్రావణు డా రఘూద్వహుని రాకకుఁ గట్టెను రామసేతువున్
పావని జానకీ సతిని పాపపు బుద్ధిని ముచ్చిలించి నీచావును నీవె కోరుకుని సధ్రిని సిద్ధము చేసుకొంటివోరావణుఁడా! రఘూద్వహునిరాకకుఁ గట్టెను రామసేతువున్,తావక లంకనుండి నిను ధర్మునిఁ జేర్చఁగ, కోతిమూకయే
పిన్నక నాగేశ్వరరావు.కడలి దాటి లంకకు జేర కపుల సేనరామసేతువు నిర్మించె; రావణుండు తన పరిజనముతో చేసి రణము తుదకురామచంద్రుని శరముతో రాలిపోయె.
కపి వరుల గూడి రాముడు కడలి పైనరామసేతువు నిర్మించె, రావణుండు”*ధరణిజనుతెచ్చితాచేసి తప్పిదమునురామచంద్రునిచేచచ్చెరణమునందు
ముక్తిమార్గంబువెదకుచుమౌనియగుచు
రిప్లయితొలగించండిరక్కసుండునుభక్తుడైరాజసమున
వైరియగుచునురాముకైవచ్చుదారి
రామసేతువునిర్మించెరావణుండు
తేటగీతి
రిప్లయితొలగించండిమైథిలిని రామునకొసఁగ మంచిదనిన
సేమమెంచక మోహాన చెలఁగి మిగుల
రామదండును పూనంగ రగడఁజేసి
రామసేతువు నిర్మించె రావణుండు
ఉత్పలమాల
కావరమెక్కువై తనదు కామము మీరఁగ సీతఁదెచ్చి తా
నేవురు జెప్పినన్ వినక యేర్పడ జేయుచు వైరమన్నదే
చావగ నెంచెనో కపుల సైన్యము వూనఁగఁ జేసి మూర్ఖుఁడై
రావణుఁ డా రఘూద్వహుని రాకకుఁ గట్టెను రామసేతువున్
🙏ధన్యోస్మి గురుదేవా!🙏
తొలగించండిఆ వనజాక్షి సీతనెవడంకిలి పెట్టె? నెవండకోసమై
రిప్లయితొలగించండిదావనమందు వేచెను మతంగమహాముని శిష్యురాలు? సా
లావృక బృందమా కడలి లంగకొనంగను చేసెనేమనన్
రావణుఁ , డా రఘూద్వహుని రాకకుఁ , గట్టెను రామసేతువున్.
మీ క్రమాలంకార పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిలంకకేగగ దలచిన రామదండు
సింధువుందాట నచ్చోట సేసెనేమి?
కలికి జానకింగోరిన కమనుడెవడు?
రామసేతువు నిర్మించె, రావణుండు.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఆగ్రహించియు జానకి నపహ రించి
రిప్లయితొలగించండివృక్ష ఛాయను నునిచి యు వెతను గూర్చె
నట్టి క్రూరు o డు దుష్టుo డ దె ట్టు లతడు
రామ సేతువు నిర్మించె రావణుo డు?
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'వృక్ష + ఛాయ = వృక్షచ్ఛాయ' అవుతుంది.
పాదపము క్రింద నునిచి యు బాధ పెట్టి అని సవరణ చేయడమైనది
తొలగించండిభామ సీతను వంచించి పట్టి తెచ్చి
రిప్లయితొలగించండిలంక లోపల దొరయించె లంక నృపతి
వినక తమ్ముని మాటలు తనదు సతికి
రామ! సేతువు నిర్మించె రావణుండు
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండిచావుకు చేరువౌటకొక చక్కని మార్గము తోచినంతనే
తొలగించండిపావనిసీతకై వలను పన్ని హరించెను మాయలేడితో
జీవితమున్ ద్యజించ తన చేతము చేయు తలంపులందునన్
రావణుఁ డా రఘూద్వహుని రాకకుఁ గట్టెను రామసేతువున్
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండిపావని జానకీ చెరను బంతముతో
రిప్లయితొలగించండివిడపించ లంకకున్
చేవగలట్టి సైన్యతతి చేరగ ధైర్యము
గోలుపోయె నా
రావణు డారఘూద్వవుని రాకకు,
గట్టెను రామసేతువున్
రావణు సంహరించగను రాముడు
వానర సేనగూడియున్.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'జానకీ చెర' దుష్టసమాసం.
భూజను కలయ లంకను పొలయ నెంచి
రిప్లయితొలగించండికడలి తీరమునకు జేరి కట్టిరచట
రామసేతువు ; నిర్మించె రావణుండు
వ్యూహ మొకటి సై న్యము తోడ పురము జుట్టు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండితా వనమందు నొంటరిగ ధాత్రిజ యుండగ పర్ణశాలలో
రిప్లయితొలగించండిచీవరి రూపుదాల్చి గొని సీతను జేర్చెను స్వర్ణలంకలో
చావునుకోరి వానరుల సాయముతో రఘురాము చేతిలో
రావణుఁ డా రఘూద్వహుని రాకకుఁ గట్టెను రామసేతువున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిసాధ్వి సీతనుగొనితెచ్చి స్వర్ణలంక
రిప్లయితొలగించండిరామచంద్రుని చేతిలో దీమసముగ
చావుగోరి వానరమూక సాయమంది
రామసేతువు నిర్మించె రావణుండు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిపావని యైన జానకిని వంచన తోడుత తెచ్చి లంకలో
రిప్లయితొలగించండినీవన మందు నుంచితివి నీచపు బుద్ధిని, రాము చేతిలో
చావును వ్రాసె నబ్జజుడు, సంతస మొందుచుఁ గోతి మూకయే
రావణుఁడా! రఘూద్వహుని రాకకుఁ గట్టెను రామసేతువున్
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిగురువర్యులకు నమస్సులు. ధన్యవాదములు
తొలగించండితే॥ లంక నాంజనేయుఁడు కాల్చి రయమున చన
రిప్లయితొలగించండిరావణునికి కీడు నరసి రాత్రి పూటఁ
గాంచె త్రిజట నీ పగిదిని గలల యందు
రామ సేతువు నిర్మించె రావణుడు
ఉ॥ భావన శోకమై తనదు బాధల నెంచచు సీత యుండగన్
రావణుఁ గూల్చ వచ్చునని రాముడు, తెల్పఁగ నాంజనేయుఁడున్
గావఁగ వచ్చుటన్ ద్రిజట కాంచెను స్వప్నము నందు నిట్టులన్
రావణు డా రఘూద్వహుని రాకకుఁ గట్టెను రామసేతువున్
పావని జానకీ సతిని పాపపు బుద్ధిని ముచ్చిలించి నీ
రిప్లయితొలగించండిచావును నీవె కోరుకుని సధ్రిని సిద్ధము చేసుకొంటివో
రావణుఁడా! రఘూద్వహునిరాకకుఁ గట్టెను రామసేతువున్,
తావక లంకనుండి నిను ధర్మునిఁ జేర్చఁగ, కోతిమూకయే
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
కడలి దాటి లంకకు జేర కపుల సేన
రామసేతువు నిర్మించె; రావణుండు
తన పరిజనముతో చేసి రణము తుదకు
రామచంద్రుని శరముతో రాలిపోయె.
కపి వరుల గూడి రాముడు కడలి పైన
రిప్లయితొలగించండిరామసేతువు నిర్మించె, రావణుండు”*
ధరణిజనుతెచ్చితాచేసి తప్పిదమును
రామచంద్రునిచేచచ్చెరణమునందు