12-4-2023 (బుధవారం)
అంశం : 'విద్యార్థులు - పరీక్షలు'
ఛందం - చంపకమాల (1వ పాదం 1వ అక్షరం 'ప'; 2వ పాదం 11వ అక్షరం 'రీ'; 3వ పాదం 15వ అక్షరం 'క్ష'; 4వ పాదం 2వ అక్షరం 'లు')
లేదా...
'ప - రీ - క్ష - లు' ఈ అక్షరాలను వరుసగా పాదాదిలో న్యస్తం చేస్తూ తేటగీతి పద్యం వ్రాయండి.
తేటగీతి
రిప్లయితొలగించండిపందగాకనుఢీకొట్టవందజూతు
రీఘనతనాదిచూడుడీఱేడునేను
క్షమనుగనుడీపెద్దలుక్షణమువేచి
లుప్తమునుగాదుయత్నములోకమందు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిపలువిధ మైన యొత్తిడులు బాలల జేరెడు కాలమైన యే
ప్రిలదియె పాఠశాలలు పరీక్షలు జోరుగ నిర్వహింపగా
కలవలపాటు హెచ్చనపగండులు శిక్షగ నెంతురంచు పె
ద్దలు కడు జాగరూకులయి ధైర్యము జెప్పుచు ప్రోత్సహింతురే.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిపట్టు బట్టియు చదివిన బాల లిల ని
రిప్లయితొలగించండిరీ క్ష జేసి యు వ్రాయ ప రీ క్ష లిపుడు
క్షమను గలిగియు వారలు ఘన ము గను జె
లువ పు విజయ మాశింత్రు పలు విధములు గ
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిపటిమ జూపించు కాలమ్ము వచ్చె నని ప
రిప్లయితొలగించండిరీక్షలకు సిద్ధ మగుటయే శిక్ష యయ్యె
క్షణిద మైనను విడువక చదువు వార
లుగద యీనాటి బాలకులు నిజమదియె.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిపలువురి బలము తెలియగ వచ్చుగద ప
రిప్లయితొలగించండిరీక్షలపుడు చదువుచుంద్రు దీక్షబూని
క్షణము విలువ పెరుగు పరీక్షలనిదెల్ప
లులితముద్భవించునట పలువురికెపుడు
[లులితము - చలనము]
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిపలురకముల్ గదా జనులు బాధలనెంచక కమ్మనైన గా
రిప్లయితొలగించండిరెలుతిని హాయిగా తమ పరీక్షల కోసము సర్వసిద్ధులై
గెలుపునకుద్యమించి తగు కృంతన శిక్షణనొందువారు రా
త్రులు పగలున్ శ్రమించి కడుదుఃఖము నొందెడువారు గాంచినన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండితే॥గీ॥
రిప్లయితొలగించండిపలురకముల ప్రశ్నలకు జవాబుల దగు
రీతి నిడ జయమొందె పరీక్ష లందు ,
క్షణము జాగు సలుపక శిక్షకుని కడకు
లుకలుక పరుగులిడె గడు రూప్యములిడ
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిపదవె భయపడ వలదు ప్రబలము గాన
రీతి గా బుర్ర పదునుకు రెప్ప లార్చి
క్షరము కాని జవాబులు కలము తోడ
లుకుము మంచి శ్రేణిన్ మార్కులు గొనదగును.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిప*లకముపై పరుండినను పట్టదునిద్దురటందు వేల చా
రిప్లయితొలగించండిలిల నెవరైన నిట్టులఁ బ*రీ*క్షలలో నిదురింపఁ జూతురే
పలుమరుగుర్తుఁ దెచ్చుకొని వ్రాయుము దీ*క్ష*గ నీ జవాబులన్
క*లు*గు జయమ్ము నిశ్చయము గాసటబీసట వీడు పుత్రకా
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి*ప*ట్టుదల బూని చదువుమో బాల నీప
రిప్లయితొలగించండి*రీ*క్షల తరుణమిది లెమ్ము దీక్షగొనుము
*క్ష*ణము వృధచేయకున్న నీ సమయమును గ
*లు*గును విజయము నీకింక బుగులు వలదు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి"ప"లుకులమ్మదయనుపొంది వ్రాయుమికప
రిప్లయితొలగించండి"రీ'క్షలపడయవచ్చును శ్రేణి నపుడు
*క్ష"ణము విడువక చదివిన. శ్రద్ధ తో క
*లు"గగచేయును విజయము లువిధిసతియు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండితేటగీతి
రిప్లయితొలగించండిపదము మోపెడు నిచ్చెన పట్టెలనఁగ
రీతి తరగతిన్ దాటించు యూతములన
క్షమను బోధించు విద్యార్థి గరిమ మెరయ
లుప్తముల మించెడుఁ బరీక్షలాప్తులవలె
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిచంపకమాల
తొలగించండిపలుమరుగన్ పఠించియును బాఠములన్ గడు పంతమొప్ప న
ర్మిలిగొని వ్రాసినంతట పరీక్షల మిన్నగఁ, బ్ర శ్నపత్రముల్
వెలువడె ముందనన్ బిడుగు వేటుగ శిక్షయె కమ్ముకొన్న నా
చలుపుకు తాళగాఁ గలరె స్వాంతము వేదన నిండ బాలలున్
పలుమరుపాఠ్యసంగతులభావనయందుననిల్పుచున్కునా
రిప్లయితొలగించండిరిలుచునుబాలుడంతటనురేలునుదివ్వెలవేడిబొందుచున్
కలువలకన్నుజంటలవికందగరూక్షదృగంచలంబులన్
విలువలదారిజూచుగదవెఱ్ఱిగజీవితనావతరింపనాశతో
1-ప
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిచం.
రిప్లయితొలగించండిపలక నిగూఢమయ్యె, పసిపాపలచే చరవాణి, యడ్డసా
రెలు, నటనమ్ము నాట్యముల రీతిని తోడ్పడు తల్లిదండ్రులున్
విలువలు లేక పాఠకులు వేశ్మపు శిక్షను దిగ్గనాడగా
కలువలు తామరల్ మడగె కాంతిని నొందక శిక్షణార్తిచే.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిచంపకమాల
రిప్లయితొలగించండిపలుమరుగన్ పఠించియును బాఠములన్ గడు పంతమొప్ప న
ర్మిలిగొని వ్రాసినంతట పరీక్షల మిన్నగఁ, బ్ర శ్నపత్రముల్
వెలువడె ముందనన్ బిడుగు వేటుగ శిక్షయె కమ్ముకొన్న నా
చలుపుకు తాళగాఁ గలరె స్వాంతము వేదన నిండ బాలలున్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండి
రిప్లయితొలగించండిపద్దతిగచేయు సాధన భవితమంచి
రీతి రూపొంద తలచిన రేయిపగలు
క్షణములకునువిలువకట్టి కష్టపడుము
లుప్తముండరాదు చురుకు లొసుగువీడు
తే॥ పలికిన భవ హరమగును భాగవతము
రిప్లయితొలగించండిరీతిని విడువక మిగుల ప్రియము గాను
క్షయముఁ గలుగదు దైవము కరుణఁ గనఁగ
లుప్తమగు బాధలన్నియు లోకమందు
చం॥ పలుకుల తల్లి దీవెనకు ప్రార్థనఁ జేయుచుఁ గోరి విద్యలన్
రెలుపుకు నభ్యసించఁ దగు రీతిగ నామె కృపా కటాక్షముల్
బలిమిని గూర్చు మానసము బాగుగ రక్ష గనంగ ధాత్రిలో
వెలుగును జ్ఞాన సంపదలు పేరిమి తోడను మెచ్చ నెల్లరున్
రెలుపు అంటే పెరుగుదల అనే అర్థము కూడ ఉన్నదండి
క్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండిపలువిధమ్ముల శ్రమజేసి పసగలిగిన
రీతి విద్యార్థులెల్లరు రెచ్చియుండి
క్షణమునైనను వీడక ఘనముగా పొ
లుపగు నెఱి పరీక్షలు వ్రాసి సఫలులైరి
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
పలు విషయముల యందున వ్రాయుటకు ప
రీక్షలను హాజరగు వారలెంత శ్రద్ధ,
క్షమ మరియు పట్టుదలతోడ చదివినారొ
లుక్కు లేకను విజయమ్ము దక్కు గాక!
(లుక్కు=లోపము)
తే: *ప* రుగు లెత్తుచును బడికి త్వరగ చని ప
రిప్లయితొలగించండి*రీ* క్షపత్రము గైకొని ప్రీతి తోడ
*క్ష* ణము నాలస్యమును లేక సరిజవాబు
*లు* లిఖియించి పరీక్షలో గెలుచు చుంద్రు
రిప్లయితొలగించండి*ప*లుకులతల్లిదీవెనలబాగలభించినచాలునీకుగో
రిలవిజయమ్మగున్తగిన*రీ*తిన వ్రాయగవీలుకల్గుగా
సలుపకకాలమున్ వృథగ చక్కగ శి*క్ష"ణ నంది వ్రాసినన్
సు*లు*వుగపాసుకాగలవుజోరుగమెత్తురునిన్నునెల్లరున్
మరొక పూరణ
"ప"లుకులమ్మదయనుపొంది వ్రాయుమికప
"రీ'క్షలపడయవచ్చును శ్రేణి నపుడు
*క్ష"ణము విడువక చదివిన. శ్రద్ధ తో క
*లు"గగచేయును విజయము లువిధిసతియు
అక్షరం 'క్ష'; 4వ పాదం 2వ అక్షరం 'లు') – పరీక్షల గురించి.
రిప్లయితొలగించండిపలుకుల తల్లి నిష్ఠగను ప్రార్థన చేసి పఠించి పాఠ్య మ
ర్మిలిని చిత్తశుద్ధిని పరీక్షలు వ్రాసిన నిర్భయమ్ముగా
కలుగు జయమ్ము యొజ్జకడ కాంచిన శిక్షణ తోడ నెంచగా
విలువ ఘటిల్లు సంఘమున వేవురు మెచ్చగ నిశ్చయమ్ముగా