1, ఏప్రిల్ 2023, శనివారం

సమస్య - 4384

2-4-2023 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“దండుగ పనియే యగు నవధానముఁ గనఁగన్”
(లేదా...)
“దండుగ యందు రెల్ల రవధానముఁ గాంచుట తెల్గునేలపై”

23 కామెంట్‌లు:

  1. కందం
    పండుగవాతావరణము
    పిండగ నైపుణి వధానిఁ బృచ్ఛకులెల్లన్
    నిండుగ నాస్వాదింపక
    దండుగ పనియే యగు నవధానముఁ గనఁగన్

    ఉత్పలమాల
    పండుగ రీతిగన్ మురిసి పండితులెల్లరు పృచ్ఛకాళిగన్
    నిండు దనంబు గూర్చెదరు నేర్పరి యౌనవధాని నైపుణిన్
    మెండుగనన్ జమక్కులు సమిష్టిగఁ బంచగ నాస్వదింపకే
    దండుగ యందు రెల్ల రవధానముఁ గాంచుట తెల్గునేలపై

    రిప్లయితొలగించండి
  2. వండుటరాకనుసోమరి
    మెండుగమాంద్యపుతలపులమెచ్చుటరాకన్
    కొండెముజూపుచుననెగద
    దండుగపనియేయగునవథానముగనన్

    రిప్లయితొలగించండి
  3. పండితు లెల్లరు మెచ్చుచు
    దండిగ నువ్వాయి తోడ తరలెడు సభలే
    మొండరికి నేడ మూకకు
    దండుగ పనియే యగు నవధానముఁ గనఁగన్.


    పండుగగా దలంచి శ్రుతవంతులు తోషణమిమ్మడింపగా
    దండుగ వత్తురే సభకు ద్రావకుడే యవధాని యైనచో
    మొండరు లైనవారలకు బుద్ధివిహీనకు నేడమూకకున్
    దండుగ యందు రెల్ల రవధానముఁ గాంచుట తెల్గునేలపై.

    రిప్లయితొలగించండి
  4. పండుగ దినమందైనను
    వండుకొని జవిగొనగ సరిపడెడి విధముగన్
    తండులము నీయకుండిన
    దండుగ పనియే యగు నవధానముఁ గనఁగన్

    రిప్లయితొలగించండి
  5. కం.
    నిండిన పృచ్ఛకతతితో
    దండిగ పద్యాల వర్ష ధారలు గురియన్
    మెండుగ "పల్కుల జననికి
    దండుగ" పనియే యగు నవధానముఁ గనఁగన్

    దండు = సైన్యం

    రిప్లయితొలగించండి
  6. పండుగలని తిరుగాడిన
    దండుగ పనియే యగు; నవధానముఁ గనఁగన్
    మెండుగ నుత్సాహముతో
    గుండియలలరారుచుండు గువ్వలచెన్నా

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పండుగ గుర్తుచేయు సమవాయము పండుగ సోయగంబులున్
      పండిత వర్యులున్ మరియు బాధ్యత గల్గిన సంవిధానమున్
      మెండగు పృచ్ఛకా కరముఁ మించు వధానియు లేకపోయినన్
      దండుగ యందు రెల్ల రవధానముఁ గాంచుట తెల్గునేలపై

      తొలగించండి
    2. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  7. మెండుగ పద్యము లల్లక
    నిండు దనంబు ల నొసంగ. నేరని దగు చున్
    పండితమండలి మెచ్చక
    దండుగ పనియే యగు నవ ధా నము గన గన్

    రిప్లయితొలగించండి
  8. పండిత జనరంజకముగ
    నుండని యవధానముఁ గన యుక్తంబగునా
    నిండగు పేరోలగమున?

    రిప్లయితొలగించండి
  9. మండిత పాండితీగరిమ మాన్యజనావళి రంజనమ్మునున్
    మెండగు ధారణన్ గలుగ మెప్పుగ గాంచెదరా వధానమున్
    దండలపైన దృష్టియునుధారణలో తడబాటులున్నచో
    దండుగ యందు రెల్ల రవధానముఁ గాంచుట తెల్గునేలపై

    రిప్లయితొలగించండి
  10. ఉ.

    లెండి ! వినండి ! బాలమురళిన్ గొనియాడిరి పొర్గు రాష్ట్రముల్
    పండుగ జేయగా దగిన పట్టము లొంది కళావిదుల్, సభన్
    జెండుచు గైతలన్ శఠులు శ్రేయము నివ్వక గ్రామ్యబుద్ధులై
    *దండుగ యందు రెల్ల రవధానముఁ గాంచుట తెల్గునేలపై.*

    రిప్లయితొలగించండి
  11. కం॥ మెండుగ నేడీ పగిదిని
    బండితపామరులు నాట పాటలఁ దనియన్
    దండిగ కాలహరణమౌ
    దండుగ పనియే యగు నవధానముఁ గనఁగన్

    (2వ పాదములో పండిత పామరులును+ఆట పాటలు = పండితుపామరులు నాట పాటలు అండి)

    ఉ॥ మెండుగ నాటపాటలను మెచ్చిరి యెల్లరు సంతసంబునన్
    నిండును బ్రాంగణమ్ములును నిత్యముఁ జూడఁగ నట్టి వాటికిన్
    మెండుగ పద్యధారలను మెచ్చకఁ బోయిరి యెందరో జనుల్
    దండుగ యందురెల్ల రవధానముఁ గాంచుట తెల్గు నేలపై

    రిప్లయితొలగించండి

  12. పిన్నక నాగేశ్వరరావు.

    నిండుగ సభ లేకున్నను
    దండుగ పనియే యగు; నవధానముఁ గనగన్
    పండుగ వాతావరణమె
    మెండుగ సంతసమునొంది మెత్తురుకవులున్.

    రిప్లయితొలగించండి
  13. మెండగు నాశు కైతలును మేటి కవీ o ద్రులు మెచ్చు పూరణ ల్
    నిండు దనంబు గూర్చ గల నేర్పగు భాషణ చాతురీ సుధల్
    పండితు లెల్ల మెచ్చ దగు పద్య ము లన్ వినలేని దైన చో
    దండుగ యందు రెల్లరవ ధా నము గాంచగ తెల్గు నేల పై

    రిప్లయితొలగించండి
  14. మెండుగ సినిమాలు గనుట
    దండుగ పనియేయగు,వవధానముగనగన్
    నిండును హర్షముతోమది
    పండుగసంబరమువచ్చుప్రాశ్నికులకిటన్

    రిప్లయితొలగించండి