15, ఏప్రిల్ 2023, శనివారం

సమస్య - 4396

16-4-2023 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“ఊర్వశి పెండ్లాడె రాము నుత్సవమూర్తిన్”
(లేదా...)
“ఊర్వశి పెండ్లియాడెనఁట యుత్సవమూర్తిని రామచంద్రునిన్”
(బులుసు అపర్ణ గారి ఒంగోలు శతావధాన సమస్య)

28 కామెంట్‌లు:

  1. నిర్వాకంబిదియేగా
    సర్వముతానైదెలిసెనుసణుగుచు శిష్యుం
    డుర్వినిఘనుడిట్లనెనుగ
    ఊర్వశిపెండ్లాడెరామునుత్సవమూర్తిన్

    రిప్లయితొలగించండి
  2. పర్వమునయ్యెశ్రీనవమిభావనయందునబొమ్మపెండ్లిలో
    సర్వముశోభనంబదియశాంతినిగోరిరిగ్రామపెద్దలున్
    ఉర్వినికన్యకామణులునూహనుజేసిరిరామునాథుగా
    ఊర్వశిపెండ్లియాడెనటనుత్సవమూర్తినిరామచంద్రునిన్

    రిప్లయితొలగించండి
  3. కందం
    పర్వమని రామనవమికి
    నిర్వహణమొనర్ప దివిని నియతిఁ బ్రతిమయై
    యుర్విజ, సభ నటియింపగ
    నూర్వశి, పెండ్లాడె రాము నుత్సవమూర్తిన్

    ఉత్పలమాల
    పర్వమటంచు నాకమున భక్తిని తన్నవమీ తిధిన్ దగన్
    నిర్వహణంబొనర్ప దివి నీమము తోడను నెంచ బొమ్మయై
    యుర్విజ పెళ్లి కూతుగ సమున్నత వేదిని, నాట్యమాడఁగన్
    నూర్వశి, పెండ్లియాడెనఁట యుత్సవమూర్తిని రామచంద్రునిన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. గురుదేవులకు వందనములు.

      ఉత్పలమాల మూడవ పాదం చివర 'నాట్యమాడగా' అని సవరణ. (వాట్సప్ సూచన ననుసరించి)

      తొలగించండి
    2. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.

      తొలగించండి
  4. గర్వము గలిగియు విద్యలు
    నేర్వని మూర్ఖుడు గ నొకడు నీచపు రీతిన్
    దుర్వా రపు మత్తున ననె
    "నూ ర్వ శి పెండ్లాడె రాము ను త్స వ మూర్తిన్ "

    రిప్లయితొలగించండి

  5. శర్వుని విల్లును విరిచి ని
    గర్వి సుగుణ సాంద్రుడు ఘనుడు కరుణామయునిన్
    శర్వరి జానకి, వినుమా
    ఊర్వశి , పెండ్లాడె రాము నుత్సవమూర్తిన్,

    రిప్లయితొలగించండి
  6. సర్వము సిద్ధమ్మాయెను
    పర్వము శ్రీరామనవమి పందిరి నీడన్
    యుర్విజ జానకిఁ గనుమా
    ఊర్వశి! పెండ్లాడె రాము నుత్సవమూర్తిన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'నీదన్ + ఉర్విజ' అన్నపుడు యడాగమం రాదు.

      తొలగించండి
  7. శర్వుని చాపమున్ విరువ చక్కని వాడర వింద నేత్రుడా
    గర్వము లేనివాడగు సుగాత్రుని శ్రామల వర్ణ దేహునిన్
    శర్వరి యయ్యయోనిజయె సంతస మందుచు నాలకించుమో
    యూర్వశి ! పెండ్లియాడెనఁట యుత్సవమూర్తిని రామచంద్రునిన్.

    రిప్లయితొలగించండి
  8. సర్వాంగశోభితంబగు
    నుర్వితనూజ హృదయంబు నుల్లసనముతో
    గర్వోన్నతితో, నాడగ
    నూర్వశి, పెండ్లాడె రాము నుత్సవమూర్తిన్

    సర్వము సిద్ధమాయెనట శర్వరి జానకి సంతసమ్ముతో
    గర్వపు టంతరంగమున కంతుని బోలెడు సుందరాంగునిన్
    పర్వదినంబునాడు తన భర్తగ చేకొని, యాడిపాడగా
    నూర్వశి, పెండ్లియాడెనఁట యుత్సవమూర్తిని రామచంద్రునిన్

    రిప్లయితొలగించండి

  9. శర్వుని చాపమున్ విరువ సద్గుణ సాంద్రుడు సత్యశీలుడా
    గర్వము లేనివాడగు సుగాత్రుని శ్రామల వర్ణ దేహునిన్
    శర్వరి యయ్యయోనిజయె చక్కదనమ్మున నెంచి చూడగా
    నూర్వశి ! పెండ్లియాడెనఁట యుత్సవమూర్తిని రామచంద్రునిన్.

    రిప్లయితొలగించండి

  10. -

    శర్వాణి!తెలుపుమెవరిని
    ఊర్వశి పెండ్లాడె? రాము నుత్సవ మూర్తిన్
    పర్వపు దినమందెటుల స
    గర్వము గా ద్రిప్పిరి ప్రజ గ్రామపు వీధిన్?


    జిలేబి

    రిప్లయితొలగించండి
  11. గర్వపడె సొబగు దానిగ
    నూర్వశి ; పెండ్లాడె రాము నుత్సవమూర్తిన్
    నూర్వశిని మించు సుందరి
    యుర్విజనిత జానకి కడు యుత్సా హమునన్

    రిప్లయితొలగించండి
  12. శార్వరులెల్ల వైదొలగె శర్వుని చాపము రాఘవుండుతా
    నుర్విజనుల్ గనుంగొనగ నొక్కటఁ గూల్చగ, చెంగలించగా
    నుర్విజ యంతరంగముననోజము, గాంచితె యుద్దవమ్ముగా
    ఊర్వశి! పెండ్లియాడెనఁట యుత్సవమూర్తిని రామచంద్రునిన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
      శార్వరులు... వైదొలగె.. వచన దోషం. "వైదొలగ" అంటే సరి.

      తొలగించండి
  13. సర్వజగత్తునున్ నిలుపు స్వామి జనించెను భూతధాత్రిపై
    గర్వమునడ్డి రాక్షసులఁ గాలుని చెంతకుఁ బంప నెంచుచున్
    శర్వుని విల్లునున్ దునుమ, జానకి ప్రీతినిఁ, గాంచ నీర్ష్యతో
    నూర్వసి, పెండ్లియాడెనఁట యుత్సవమూర్తిని రామచంద్రునిన్

    రిప్లయితొలగించండి
  14. రిప్లయిలు
    1. కం॥ ఉర్విజ యూర్వశి యొకరని
      గర్వముతో శుంఠ యొకఁడు ఘనమూర్ఖుండై
      సర్వుల కిటులఁ దెలిపెనట
      “ఊర్వశి పెండ్లాడె రాము నుత్సవ మూర్తిన్”

      ఉ॥ పర్వదినమ్మటంచు తగు పందిరి వేసిరి పెండ్లికోసమై,
      యుర్విజ మూర్తి, చూడజనులోర్పుతొ మోదము మీర నచ్చటన్
      సర్వులుఁ దన్మయత్వమునఁ జక్కని నాట్యము సేయఁగన్ నటీ
      యూర్వశి, పెండ్లి యాడెనఁట యుత్సవ మూర్తిని రామచంద్రునిన్

      తొలగించండి
    2. మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
      'ఓర్పుతొ' అని తో ప్రత్యయాన్ని హ్రస్వంగా ప్రయోగించరాదు.

      తొలగించండి