21, ఏప్రిల్ 2023, శుక్రవారం

సమస్య - 4401

22-4-2023 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కలువల ఱేనిఁ గని విచ్చెఁ గమలము లెల్లన్”
(లేదా...)
“కలువల ఱేని యాగమముఁ గన్గొని విచ్చెఁ గదా సరోజముల్”
(బులుసు అపర్ణ గారి ఒంగోలు శతావధాన సమస్య)

40 కామెంట్‌లు:



  1. వలపుల రేడు దూరమవ వానిమనోహర మైన రూపమున్
    దలపులలోన నిల్పుకొని తామరకంటి సళించు వేళ నా
    లలనను జేరవచ్చెననురాగము జూపుచు మందహాసమున్
    గలువల ఱేని యాగమముఁ గన్గొని విచ్చెఁ గదా సరోజముల్.

    రిప్లయితొలగించండి
  2. కందం
    కిలకిల పక్షుల రవముల
    తొలిదిక్కున తలుపు దీసి ద్యుమణి పరుగునన్
    వెలుగులు వంచఁగఁ బంపగఁ
    గలువల ఱేనిఁ గని విచ్చెఁ గమలము లెల్లన్

    చంపకమాల
    కిలకిల పక్షి రావముల కేళికి మేల్కొని వెల్గు పుల్మియున్
    తొలిదిశ ద్వారముల్ దెరచి తోయజబంధువు సాగనింగిఁ, దా
    నలుపున పశ్చిమాద్రి దెస నార్తిని శ్రాంతికి సాగ బంపగన్
    గలువల ఱేని, యాగమముఁ గన్గొని విచ్చెఁ గదా సరోజముల్

    రిప్లయితొలగించండి

  3. చెలి తామరకంటి కనులు
    వలపుల రేణిని తలచుచు బాధము తోడన్
    వెలవెల బోయె దయితుడగు
    కలువల ఱేనిఁ గని విచ్చెఁ గమలము లెల్లన్,

    రిప్లయితొలగించండి
  4. అలకనుమూసినకన్నులు
    కలువలఱేనిగనివిచ్చె, గమలములెల్లన్
    వెలుగులసూర్యునిధాటికి
    వలపులరాగిణులగుచునువన్నెలబొందెన్

    రిప్లయితొలగించండి

  5. తొలగగ రజోరసమ్మది
    పులుగులు గొంతెత్తి పిలువ పూషుండదిగో
    తొలిదిక్కు వెలయ బాఱగ
    కలువల ఱేనిఁ , గని విచ్చెఁ గమలము లెల్లన్.

    రిప్లయితొలగించండి
  6. కులుకులగోపికారమణికోమలహస్తముసాచియార్తితో
    పలుకులకృష్ణుబిల్చుచునుపాఱుచుకేళిసరోవరంబులో
    విలవిలనాడునయ్యెడనువెన్నునివెల్గులువచ్చిచేరగా
    కలువలఱేనియాగమముగన్గొనివిచ్చెగదాసరోజముల్

    రిప్లయితొలగించండి
  7. మిల మిల లాడుచు సూర్యుడు
    వెలుతురు జిమ్ము చును నింగి వికసింపంగా
    నిలువగ నేరక మరుగగు
    కలువల రేని గని వి చ్చె కమలము లెల్లన్

    రిప్లయితొలగించండి
  8. రిప్లయిలు
    1. మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
      'ఘటనలు + ఎన్నో' అన్నపుడు యడాగమం రాదు. "ఘటన లవెన్నో" అనండి.

      తొలగించండి
    2. ధన్యవాదాలు గురూజీ 🙏
      సూచించిన సవరణతో.....

      ఇలలోసాధ్యము కానివి
      కలలో సాకారమైన ఘటనలవెన్నో
      కలలో చూచిన దృశ్యము
      కలువల ఱేనిఁ గని విచ్చెఁ గమలము లెల్లన్

      కలువలు విచ్చె ముచ్చటగఁ గాంచితి రాతిరి స్వప్నమందునన్
      కలువల ఱేని యాగమముఁ గన్గొని విచ్చెఁ గదా సరోజముల్
      తెలతెలవారినంతటనె దృశ్యము గోచర మయ్యె హాయిగన్
      విలసితమైన పూలు కనువిందులు చేసె సరోవరమ్ములో

      తొలగించండి
  9. కలువలు వికసించునెపుడు
    కలువల ఱేనిఁ గని ; విచ్చెఁ గమలము లెల్లన్
    వెలుగుల దొర యుదయించగ,
    పొలుపును మార్చుకొనవు గద పూవులు రెండున్

    రిప్లయితొలగించండి
  10. కలువలు వికచమునొందెను
    కలువల ఱేనిఁ గని, విచ్చెఁ గమలము లెల్లన్
    గలువలదాయను గన్గొని
    కలువలు కమలములు జేర గలవా ప్రియులన్ ?

    రిప్లయితొలగించండి
  11. కలువలు విచ్చె ఖాత్రమున కన్గొని సూమమునందుఁ బేరిమిన్
    కలువల ఱేని యాగమముఁ, గన్గొని విచ్చెఁ గదా సరోజముల్
    కలువలదాయ రాకడను కాంతులు చిందుచు నంబరమ్మునన్
    కలువలు నంబుజన్మములు కాంతుని భానునిఁ జేరగల్గునే?

    రిప్లయితొలగించండి
  12. వలసినవాని తోడుత వివాహము కూర సరోజనేత్రి తాన్
    కలలను గాంచుచుండగను కాంతుని రాక నపేక్ష చేయుచున్
    చెలిమది నెంచి యామినిని చేరగ చెల్వుడు, సిగ్గులొల్క చె
    క్కలువల, ఱేని యాగమముఁ గన్గొని విచ్చెఁ గదా సరోజముల్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "వలచిన... వివాహము కోర.." టైపాటు.

      తొలగించండి
    2. వలచినవాని తోడుత వివాహము కూర సరోజనేత్రి తాన్
      కలలను గాంచుచుండగను కాంతుని రాక నపేక్ష చేయుచున్
      చెలిమది నెంచి యామినిని చేరగ చెల్వుడు, సిగ్గులొల్క చె
      క్కలువల, ఱేని యాగమముఁ గన్గొని విచ్చెఁ గదా సరోజముల్

      తొలగించండి
    3. కూర అంటే ఘటిల్ల / కలుగ అనీ అర్థంతో వాడాను

      తొలగించండి
  13. కం॥ వెలుఁగఁగఁ బ్రజ్ఞా సంపద
    పలుకుల ప్రాభవమొసఁగఁగఁ బద్మ బహుమతిన్
    కలువఁగ పురస్కృతులచట
    కలువల ఱేనిఁ గని విచ్చెఁ గమలము లెల్లన్

    చం॥ వెలుఁగఁగ జ్ఞాన సంపదలుఁ బేరిమి మీర జనుల్ నుతించఁగన్
    విలసిత ఖ్యాతి యొప్పఁగను విజ్ఞత సన్నుతిఁ బొందఁ బద్మశ్రీ
    యలరఁగ గౌరవమ్మెగయ నన్య గ్రహీతలుఁ జేర నచ్చటన్
    కలువల ఱేని యాగమముఁ గన్గొని విచ్చె గదా సరోజముల్

    రిప్లయితొలగించండి
  14. కలువలదాయి క్రుంకగనె క్రమ్మర
    తోషముతోడ గల్వలున్
    గలువ రేని యాగమము గన్గొని
    విచ్చెగదా, సరోజముల్
    వెలవెల బోయి రేయి తమ పేరిమి
    మిత్రుని గాంచి ప్రొద్దునన్
    బొలుపున విచ్చుకొన్నవి యపూర్వపు
    టందముతోడనన్నియున్.

    రిప్లయితొలగించండి
  15. కొలనున కలువలు విరిసెను
    కలువల రేని గని;; విచ్చె గమలము లెల్లన్
    కలకలలాడుచు వడిగా
    తొలిప్రొద్దునరవినిగాంచితోషముతోడన్


    వలచి నవాని కై సతి యువాసి గచూచెడిరీతిగానటన్
    కలువలు వేచి యుండగ నుకౌతు క మూనుచు కూర్చె మోదమున్
    కలువలరేనియాగమము,గన్గొనివిచ్చెగదాసరోజముల్
    కొలనుననొక్కసారిగనుకూరిమితోడనుచూచుచారవిన్

    రిప్లయితొలగించండి
  16. కలువలు విచ్చెను జూడుడు
    కలువల ఱేనిఁ గని ,విచ్చెఁ గమలము లెల్లన్
    వలపుల బారిని దొలగుచు
    మెలమెల్లగఁ బైకి వచ్చు మిహిరుని జూడన్

    రిప్లయితొలగించండి