22, ఏప్రిల్ 2023, శనివారం

సమస్య - 4402

23-4-2023 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“సత్యముం బల్కరాదనె సజ్జనాళి”
(లేదా...)
“సత్యముఁ బల్కరాదనిరి సజ్జను లెల్లరు సత్యసంధులై”
(బులుసు అపర్ణ గారి ఒంగోలు శతావధాన సమస్య)

30 కామెంట్‌లు:


  1. భృత్యుని చేష్టలన్ గనిన పెద్దయె చెప్పెను ధర్మసూత్రముల్
    సత్యవ్రతమ్ము గొప్పదని సద్గుణ సాంద్రులు తప్పబోరదే
    జాత్యమటంచు కీర్తినిడు స్వార్థము తోననృతమ్ము, వీడుచున్
    సత్యము, పల్కరాదనిరి సజ్జనులెల్లరు సత్యసంధులై.

    రిప్లయితొలగించండి
  2. సత్యమార్గంబునందునస్వామియుండు
    కల్లలాడంగనెప్పుడుకానరాఁడు
    జీవిపరమార్థమెంచంగసేమమనన
    సత్యముంబల్కరాదనెసజ్జనాళి

    రిప్లయితొలగించండి
  3. తేటగీతి
    ఇంతులందు వారి వివాహతంతులందు
    వసుధఁ బ్రాణార్థమానంపు భంగమందు
    విహిత గోకులాగ్రకులులకహితమైన
    సత్యముం బల్కరాదనె సజ్జనాళి

    ఉత్పలమాల
    కృత్యములందు నింతులకు కీడన, వేడ్కవివాహమం, దఘా
    యిత్యములందు, ప్రాణ, ధనమియ్యవి భంగము సెందు వేళలన్
    మృత్యు భయంపు గోవులను, మేటిగ విప్రులఁ గావ, నష్టమౌ
    సత్యముఁ బల్కరాదనిరి సజ్జను లెల్లరు సత్యసంధులై

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శుక్రనీతితో మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
    2. సవరణతో..

      తేటగీతి
      ఇంతులందు వివాహపుతంతులందు
      వసుధ ప్రాణార్థమానంపుభంగమందు
      విహిత గోకులాగ్రకులులకహితమైన
      సత్యమున్ బల్కరాదనె సజ్జనాళి

      తొలగించండి
  4. చక్క నైనట్టి జీవన సరళి కొఱకు
    సకల సౌభాగ్య సౌఖ్యాల సంత సములు
    జగతి నెల కొల్పి సాగింప సకల జనుల
    సత్యము ల బల్క రాదనె సజ్జ నాళి

    రిప్లయితొలగించండి
  5. నిత్యము జీవయానమును నిర్మల
    భావముతోడ మానవుల్
    సత్యము బల్కుచున్ సతము సక్కగ
    సాగగ చూడగావలెన్
    సత్యమె మానవాళి నిల సజ్జన
    బ్రోచును నమ్ము రిత్తదౌ
    సత్యము పల్కరాదనిరి సజ్జను
    లెల్లరు సత్యసంధులై

    రిప్లయితొలగించండి

  6. కల్లలాడెడి జనులనీ కల్పమందు
    విశ్వసింపరటంచును విమల మతియె
    చెంత నున్నట్టి వటువుతో చెప్పె , వీడి
    సత్యముం, బల్కరాదనె సజ్జనాళి.

    రిప్లయితొలగించండి
  7. ముదుసలి తనువున దెగులు ముదిరిపోవ
    వెజ్జు లాశ వదలినట్టి వివిధ రకపు
    లోపములగూర్చి యెన్నడు రోగి ముందు
    సత్యముం బల్కరాదనె సజ్జనాళి

    రిప్లయితొలగించండి
  8. సత్యమెప్పుడు బల్కుట సద్గుణమ్ము
    వాక్కులందున నేర్పనివార్యమౌను
    కాని భరియింప శక్యము కాని దైన
    సత్యముం బల్కరాదనె సజ్జనాళి

    సత్యము పల్కుటే ధరను సజ్జన లక్షణమంచు తల్చినన్
    సత్యము నేర్పుతోఁ దెలుప సాధ్యము గావలెఁ బల్కులందునన్
    సత్యము సత్యమంచునిట సత్వర ఘర్షణ కారకంబునౌ
    సత్యము పల్కరాదనిరి సజ్జనులెల్లరు సత్య సంధులై

    రిప్లయితొలగించండి
  9. సత్యముఁ బల్కగానెలమి సచ్ఛరితుల్ భువియందు నిష్టతో
    నిత్యముసత్య భాషణము నీమముగాఁ గొని కీర్తినొందిరా
    కృత్యము సౌమనస్వులకు కీడొనగూర్చెడు నట్టిదైనచో
    సత్యముఁ బల్కరాదనిరి సజ్జను లెల్లరు సత్యసంధులై

    రిప్లయితొలగించండి
  10. కష్టనష్టము లెన్నైనఁ గల్గుగాక
    సత్యపథమును వీడరు సాధుజనులు
    సౌమనస్వి కన్యాయమౌ సమయమందు
    సత్యముం బల్కరాదనె సజ్జనాళి

    రిప్లయితొలగించండి
  11. నిత్యము సేవలన్ దనుపు నిర్మల చిత్తను కావనెంచుచున్
    ముత్యముఁ బోలునట్టి సఖి పొందును గోరుచు పెండ్లియాడగన్
    హత్యలు చేయు రాక్షసుల నంతము చేయఁ దలంచు వేళలో
    సత్యముఁ బల్కరాదనిరి సజ్జను లెల్లరు సత్యసంధులై


    రిప్లయితొలగించండి
  12. ఈనాడు రాహుల్ స్టేట్ మెంట్

    సత్యముంబల్క రాదనె సజ్జనాళి
    వినక పల్కితి నరె పదవీచ్యుతుడని
    దుగొ! గృహమ్మును వీడితి దువ్వెదనిక
    కాలు వచ్చెడెన్నికలకు గనుడు రేసు


    జిలేబి

    రిప్లయితొలగించండి
  13. సత్యము పల్కు నంతట విచక్షణనున్ వివరింప జేయగా
    నిత్యము భూమిపై ప్రజకు నెమ్మిని జీవన మంద కోరుచున్
    హత్యల మానభంగముల నడ్డు మహోన్నత కార్యమేలగా
    సత్యము పల్క రాదనిరి సజ్జను లెల్లరు సత్య సంధులై!
    -మాచవోలు శ్రీధరరావు

    రిప్లయితొలగించండి
  14. పెళ్ళివిషయాన వెలదులవిషయమందు
    గోవులకు మరివిప్రుల కునిలలోన
    ఆయువాగెడివేళల యందునెపుడు
    *సత్యముం బల్క రాదనె సజ్జనాళి*

    మరొక పూరణ


    సత్యము పల్కు వారలకు చక్కగ నుండును భావి యంచునీ
    ముత్యము వంటిసూక్తులను భూరిగ దెల్పెను వేదశా స్త్రముల్
    నిత్యముసత్యమాడిననునీడనుకోరుచువచ్చు వారికై
    *సత్యముపల్కరాదనిరిసజ్జనులెల్లరుసత్యసంధులై*

    రిప్లయితొలగించండి
  15. నిత్యము శారదాపదవినిర్మలపంకజసేవఁ బండిత
    స్తుత్యములైన నీతిఫణితుల్ రచియించుచు నందు నొక్కెడన్ -
    "ముత్యమువోలె సూనృతము మోదమిడున్; మరి యప్రియంబునౌ
    సత్యము పల్క రాదనిరి" సజ్జను లెల్లరు సత్య సంధులై!

    రిప్లయితొలగించండి
  16. నిత్యము వారిజాక్షులకు నెయ్యముఁ జూప, వివాహమందునన్
    హత్యల నడ్డి మానమును నర్థముఁ గాచెడి వైనమందు, దు
    ష్కృత్యము లందు గోద్విజుల కీడును బాపగ నెంచు వేళలో
    సత్యముఁ బల్కరాదనిరి సజ్జను లెల్లరు సత్యసంధులై

    రిప్లయితొలగించండి
  17. తే॥ సత్యముఁ బలుక హర్షమే సర్వులకును
    మాన ప్రాణవిత్తాదులు మనఁగ సేయ
    ముప్పున నసత్య మాడఁగ నొప్పు ననుచు
    సత్యముం బల్కరాదనె సజ్జనాళి

    ఉ॥ ముత్యము లాంటి సత్యమును మోదము మీరఁగఁ బల్కఁగా వలెన్
    నిత్యము సత్యమే నరులు నేమముతోఁ బలుకంగ సాధ్యమే
    పైత్యమటుల్ పల్కఁగను బ్రాణము మానముఁ గాయునన్నచో
    సత్యముఁ బల్కరాదనిరి సజ్జను లెల్లరు సత్యసంధులై

    రిప్లయితొలగించండి


  18. కంది వారు

    రేపటి సమస్యా పాదము :)

    నీవే దిక్కిక ప్రియాంక ! నీరజనేత్రీ !


    రిప్లయితొలగించండి
  19. 2) జీపీయెస్ వారు పూరణలు వ్రాయడం
    ఆపేసారా ? ఎందుకు ?


    జిలేబి

    రిప్లయితొలగించండి