9-4-2023 (ఆదివారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“జీతము లేనట్టి కొలువె చేయుట హితమౌ”(లేదా...)“జీతము లేనిదౌ కొలువుఁ జేసినవానికి మేలు సేకురున్”
ఉద్యోగ విరమణాంతమున.... కందంవేతనమందితి గతమునఁజేతనమది వీడకుండ సేవల గుడిలోభూతపతికెంతు, ముక్తికిజీతము లేనట్టి కొలువె చేయుట హితమౌఉత్పలమాలవేతనమందితిన్ గొలువు వేడ్కగఁ జేసిగతాన శ్రాంతిలోజేతన వీడకుండగను సేవలు సేయుదు నాలయంబునన్భూత గణాధిపుండు మది భూరిగ శాంతినొసంగ ముక్తికైజీతము లేనిదౌ కొలువుఁ జేసినవానికి మేలు సేకురున్
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
ఆతంకము చే వృద్ధులు మాతా పితరులు కృశించు మానము నందున్ బ్రీతి విడక చేసెడి యాజీతము లేనట్టి కొలువె చేయుట హితమౌ.
ప్రీతిగ దేవుని సేవకుచేత నయి న పగిది భక్తి చిత్తము తోడన్వే తర లితి కోవెల కున్జీతము లేనట్టి కొలువు చేయుట హితమౌ
ఈతనువుండునంత వరకెల్లరక ర్థమవస్యకంబగున్వేతన మందినన్ సరిగ బీదలు గడ్పులునింపుకొందు రీజాతికి డబ్బుకావలెను సత్యము నిత్యమువారికిన్ వినాజీతములేనిదౌ కొలువు జేసిన వారికిమేలు సేకురున్.
ఉ.సూత సమాన మూర్తి ఘన శోధిత పీఠము నెక్కి యొజ్జయైప్రేత పిశాచ దేవతలఁ బ్రీతిఁ బురాణముఁ జెప్పు శాస్త్రియున్భూత దయాపరుండగుచు భోజన దానముఁ జేయు నాఢ్యుడున్ *జీతము లేనిదౌ కొలువుఁ జేసినవానికి మేలు సేకురున్.*
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
సీతను వీడి రాఘవుడు చింతిలు పాళము వార్థి దాటుచున్ వాతసుతుండు లంక జని పావని గాంచి యభిక్రమమ్ము కైహేతువె యైన వానికట యిచ్చిన వేతన మెంత చెప్పుమా? జీతము లేనిదౌ కొలువుఁ జేసినవానికి మేలు సేకురున్.
చేతను దుబ్బు లేనితరి శ్రీమతి యైనను లెక్క చేయదే ప్రీతిగ మాటలాడదట పిల్లలు సైతము గౌరవింపకన్ మూతులు త్రిప్పు కాలమిది మూర్ఖుని వోలె వచింతు వేమిరా జీతము లేనిదౌ కొలువుఁ జేసినవానికి మేలు సేకురున్?
సతతము చింతల మయమౌజీతములేనట్టికొలువు ,చేయుట మేలౌహితమగుపనిచేనింపుచుసతిసుతులకడుపులనెల్లసమయములందున్
మాత నివాసము విడిచిననాతికి మామూలుగ దన నాథుని యింటన్నాతని బిడ్డల సాకెడిజీతము లేనట్టి కొలువె చేయుట హితమౌ
చేతనమందున నెలకొనుసీతాపతి సేవకుతన జీవితమనుచున్బ్రాతిపడెనుగద మారుతిజీతము లేనట్టి కొలువె చేయుట హితమౌఆతతకీర్తిమంతుడఁగు నారఘు రాముడునెల్లవేళలన్జేతమునందునిల్చి కడచేరుచు వాడని విశ్వసించుచున్సాతముగూర్చనెంచి పరిచర్యలు సల్పెను వాయుపుత్రుడేజీతము లేనిదౌ కొలువుఁ జేసినవానికి మేలు సేకురున్
సీతను చేరఁగ వార్ధినిసేతువు నిర్మాణమునకు జీతము కొరకైకోతులు పనిచేసినవాజీతము లేనట్టి కొలువె చేయుట హితమౌ
భ్రాతియు భక్తపాలనము రామునిఁ గొల్వున జీతబత్తెముల్సేతువుఁగట్టి వారధిని సీతనుఁ జేరఁగ స్వర్ణలంకలోక్రోతుల సేవలందుకొని రూకలనేమిడె రాఘవుండహోజీతము లేనిదౌ కొలువుఁ జేసినవానికి మేలు సేకురున్
--తాతలు రిటైర్డు బామ్మలుకైతలు గట్టుచు జిలేబి కందమ్ములతోచేతన పొందుచు నిత్యముజీతము లేనట్టి కొలువె చేయుట హితమౌ!చీర్సు సహితజిలేబి
అమ్మా! ఏమయ్యారు ఇంతకాలం? మీ బ్లాగులు కూడా ఇంతకాలం నిష్క్రియగా ఉన్నాయి. బ్లాగులోకం నిస్తేజమైపోయింది. మీ పునర్దర్శనం సంతోషాన్ని కలిగించింది. మీకు ఆయురారోగ్యాలను ప్రసాదించాలని భగవంతుని వేడుకుంటున్నాను. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
--తాతలు బామ్మ లెల్లరవధానులు పండితు లార! తృప్తితోచేతన జేర్చు పద్యముల చిత్రవిచిత్రపు మేళ వింపులందాతుర జూపి చాతురి సదా హరివిల్లుగ దీర్చి గూర్చెడా జీతము లేనిదౌ కొలువుఁ జేసినవానికి మేలు సేకురున్!జిలేబి
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు. 'కూర్చెడి + ఆ' అన్నపుడు సంధి లేదు. "...గూర్చు నా జీతము..." అనండి.
నమోనమః బహుకాలదర్శనం
వేతన జీవియై యొకడు విశ్రమ ణంబు ను బొందిసంప్రీతిగసేవ జేయుట కు వీలగు నంచని యెంచు చున్నీతియు నీమమున్ గలిగి నిర్మలు డై ప్రజ కెల్ల వేళ లన్జీతము లేనిదౌ కొలువు జేసిన వానికి మేలు సేకు రున్
కం॥ వేతన జీవిగ బ్రదుకున యాతన లెన్నిటినొ పడుచు నన్నియుఁ బొందన్జేతనుఁడై యిక చాలనిజీతము లేనట్టి కొలువె చేయుట హితమౌఉ॥ వేతన జీవియై మనుచు వేగఁగఁ బిల్లలఁ బాపలఁ బెద్ద సేయఁగన్జేతన మొంది సర్వులును జేరఁగ గమ్యము బుద్ధిమంతులైఆతుర లేని జీవితము నన్యముఁ గోరక సంఘసేవకైజీతము లేనిదౌ కొలువుఁ జేసిన వానికి మేలు సేకూరున్
నీతిని నమ్మి జీవనము నిర్మలచిత్తముతో మెలంగుచున్దాతగ మారి పేదలకు తద్దయు ప్రీతిని సేవ చేయుచున్భూతలమందు నిత్యమును పుష్కరనాభుని యాలయమ్ములోజీతము లేనిదౌ కొలువుఁ జేసినవానికి మేలు సేకురున్
ఉద్యోగ విరమణాంతమున....
రిప్లయితొలగించండికందం
వేతనమందితి గతమునఁ
జేతనమది వీడకుండ సేవల గుడిలో
భూతపతికెంతు, ముక్తికి
జీతము లేనట్టి కొలువె చేయుట హితమౌ
ఉత్పలమాల
వేతనమందితిన్ గొలువు వేడ్కగఁ జేసిగతాన శ్రాంతిలో
జేతన వీడకుండగను సేవలు సేయుదు నాలయంబునన్
భూత గణాధిపుండు మది భూరిగ శాంతినొసంగ ముక్తికై
జీతము లేనిదౌ కొలువుఁ జేసినవానికి మేలు సేకురున్
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండి
రిప్లయితొలగించండిఆతంకము చే వృద్ధులు
మాతా పితరులు కృశించు మానము నందున్
బ్రీతి విడక చేసెడి యా
జీతము లేనట్టి కొలువె చేయుట హితమౌ.
ప్రీతిగ దేవుని సేవకు
రిప్లయితొలగించండిచేత నయి న పగిది భక్తి చిత్తము తోడన్
వే తర లితి కోవెల కున్
జీతము లేనట్టి కొలువు చేయుట హితమౌ
ఈతనువుండునంత వరకెల్లరక ర్థమ
రిప్లయితొలగించండివస్యకంబగున్
వేతన మందినన్ సరిగ బీదలు గడ్పులు
నింపుకొందు రీ
జాతికి డబ్బుకావలెను సత్యము నిత్యము
వారికిన్ వినా
జీతములేనిదౌ కొలువు జేసిన వారికి
మేలు సేకురున్.
ఉ.
రిప్లయితొలగించండిసూత సమాన మూర్తి ఘన శోధిత పీఠము నెక్కి యొజ్జయై
ప్రేత పిశాచ దేవతలఁ బ్రీతిఁ బురాణముఁ జెప్పు శాస్త్రియున్
భూత దయాపరుండగుచు భోజన దానముఁ జేయు నాఢ్యుడున్
*జీతము లేనిదౌ కొలువుఁ జేసినవానికి మేలు సేకురున్.*
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండి
రిప్లయితొలగించండిసీతను వీడి రాఘవుడు చింతిలు పాళము వార్థి దాటుచున్
వాతసుతుండు లంక జని పావని గాంచి యభిక్రమమ్ము కై
హేతువె యైన వానికట యిచ్చిన వేతన మెంత చెప్పుమా?
జీతము లేనిదౌ కొలువుఁ జేసినవానికి మేలు సేకురున్.
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిచేతను దుబ్బు లేనితరి శ్రీమతి యైనను లెక్క చేయదే
ప్రీతిగ మాటలాడదట పిల్లలు సైతము గౌరవింపకన్
మూతులు త్రిప్పు కాలమిది మూర్ఖుని వోలె వచింతు వేమిరా
జీతము లేనిదౌ కొలువుఁ జేసినవానికి మేలు సేకురున్?
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిసతతము చింతల మయమౌ
రిప్లయితొలగించండిజీతములేనట్టికొలువు ,చేయుట మేలౌ
హితమగుపనిచేనింపుచు
సతిసుతులకడుపులనెల్లసమయములందున్
మాత నివాసము విడిచిన
రిప్లయితొలగించండినాతికి మామూలుగ దన నాథుని యింటన్
నాతని బిడ్డల సాకెడి
జీతము లేనట్టి కొలువె చేయుట హితమౌ
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిచేతనమందున నెలకొను
రిప్లయితొలగించండిసీతాపతి సేవకుతన జీవితమనుచున్
బ్రాతిపడెనుగద మారుతి
జీతము లేనట్టి కొలువె చేయుట హితమౌ
ఆతతకీర్తిమంతుడఁగు నారఘు రాముడునెల్లవేళలన్
జేతమునందునిల్చి కడచేరుచు వాడని విశ్వసించుచున్
సాతముగూర్చనెంచి పరిచర్యలు సల్పెను వాయుపుత్రుడే
జీతము లేనిదౌ కొలువుఁ జేసినవానికి మేలు సేకురున్
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండిసీతను చేరఁగ వార్ధిని
రిప్లయితొలగించండిసేతువు నిర్మాణమునకు జీతము కొరకై
కోతులు పనిచేసినవా
జీతము లేనట్టి కొలువె చేయుట హితమౌ
భ్రాతియు భక్తపాలనము రామునిఁ గొల్వున జీతబత్తెముల్
రిప్లయితొలగించండిసేతువుఁగట్టి వారధిని సీతనుఁ జేరఁగ స్వర్ణలంకలో
క్రోతుల సేవలందుకొని రూకలనేమిడె రాఘవుండహో
జీతము లేనిదౌ కొలువుఁ జేసినవానికి మేలు సేకురున్
--
రిప్లయితొలగించండితాతలు రిటైర్డు బామ్మలు
కైతలు గట్టుచు జిలేబి కందమ్ములతో
చేతన పొందుచు నిత్యము
జీతము లేనట్టి కొలువె చేయుట హితమౌ!
చీర్సు సహిత
జిలేబి
అమ్మా! ఏమయ్యారు ఇంతకాలం? మీ బ్లాగులు కూడా ఇంతకాలం నిష్క్రియగా ఉన్నాయి. బ్లాగులోకం నిస్తేజమైపోయింది. మీ పునర్దర్శనం సంతోషాన్ని కలిగించింది. మీకు ఆయురారోగ్యాలను ప్రసాదించాలని భగవంతుని వేడుకుంటున్నాను.
తొలగించండిమీ పూరణ బాగున్నది. అభినందనలు.
రిప్లయితొలగించండి--
తాతలు బామ్మ లెల్లరవధానులు పండితు లార! తృప్తితో
చేతన జేర్చు పద్యముల చిత్రవిచిత్రపు మేళ వింపులం
దాతుర జూపి చాతురి సదా హరివిల్లుగ దీర్చి గూర్చెడా
జీతము లేనిదౌ కొలువుఁ జేసినవానికి మేలు సేకురున్!
జిలేబి
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండి'కూర్చెడి + ఆ' అన్నపుడు సంధి లేదు. "...గూర్చు నా జీతము..." అనండి.
నమోనమః బహుకాలదర్శనం
రిప్లయితొలగించండివేతన జీవియై యొకడు విశ్రమ ణంబు ను బొందిసం
రిప్లయితొలగించండిప్రీతిగసేవ జేయుట కు వీలగు నంచని యెంచు చున్
నీతియు నీమమున్ గలిగి నిర్మలు డై ప్రజ కెల్ల వేళ లన్
జీతము లేనిదౌ కొలువు జేసిన వానికి మేలు సేకు రున్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికం॥ వేతన జీవిగ బ్రదుకున
రిప్లయితొలగించండియాతన లెన్నిటినొ పడుచు నన్నియుఁ బొందన్
జేతనుఁడై యిక చాలని
జీతము లేనట్టి కొలువె చేయుట హితమౌ
ఉ॥ వేతన జీవియై మనుచు వేగఁగఁ బిల్లలఁ బాపలఁ బెద్ద సేయఁగన్
జేతన మొంది సర్వులును జేరఁగ గమ్యము బుద్ధిమంతులై
ఆతుర లేని జీవితము నన్యముఁ గోరక సంఘసేవకై
జీతము లేనిదౌ కొలువుఁ జేసిన వానికి మేలు సేకూరున్
నీతిని నమ్మి జీవనము నిర్మలచిత్తముతో మెలంగుచున్
రిప్లయితొలగించండిదాతగ మారి పేదలకు తద్దయు ప్రీతిని సేవ చేయుచున్
భూతలమందు నిత్యమును పుష్కరనాభుని యాలయమ్ములో
జీతము లేనిదౌ కొలువుఁ జేసినవానికి మేలు సేకురున్