17-4-2023 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“పంచ వకారములు గలుగు వారి కవమతుల్”
(లేదా...)
“పంచ వకారముల్ గలుగు వారలకే యవమానముల్ గదా”
(బులుసు అపర్ణ గారి ఒంగోలు శతావధాన సమస్య)
పంచ వకారములు -
వస్త్రేణ వపుషా వాచా విద్యయా వినయేన చ ।
వకారైః పంచభిర్హీనః వాసవోపి న పూజ్యతే ॥
(మంచి వస్త్రం, రూపం, మాట, విద్య, వినయం అనేవి పంచ వకారాలు. ఇవి లేకుంటే ఇంద్రుడైనా గౌరవాన్ని పొందడు)
వంచనజేసిరిజనముల
రిప్లయితొలగించండిపెంచినయాశనుధనములపేర్చుటవలనన్
కంచికిపోయెనుమానము
పంచవకారములుగలుగువారికవమతుల్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిసంచితపాపకర్మమునసద్గతినందరుభక్తులెవ్విధిన్
రిప్లయితొలగించండిమించినబాహ్యమందమునుమేలిమిమాటలవిద్యతోడుతన్
పెంచిననమ్రభావమునుపెద్దగజేయవధర్మచారులన్
పంచవకారముల్గలుగువారికేయవమానముల్గదా
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిపేరుగొన్న నటుడు చివరి దశలో తన సేవలకై మరొక్కరిని పెళ్లి చేసుకొని కన్నవారలతో అవమానముల నెదుర్కొన్న నేపథ్యంగా....
రిప్లయితొలగించండికందం
అంచిత సేవల నందఁగ
నెంచగ వృద్ధాప్యమందు నింతిని సతిగన్
బెంచుకొన సుతులసహ్యము
పంచ వకారములు గలుగు వారి కవమతుల్
ఉత్పలమాల
అంచిత సేవలన్ గొనఁగ నాఖరి వేళల నాదరింపగా
నెంచగ భార్యగన్ దగిన నింతిని వృద్ధులు నార్తిఁదీరఁగన్
బెంచుకొనంగ సంతు తమ పిత్రుని పైన నసహ్యమెంతయో
పంచ వకారముల్ గలుగు వారలకే యవమానముల్ గదా!
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండిగురుదేవులకు ధన్యవాదములు. వాట్సప్ సూచనలనుసరించి సవరించిన పూరణ:
తొలగించండిపేరుగొన్న నటుడు చివరి దశలో తన సేవలకై మరొక్కరిని పెళ్లి చేసుకొని కన్నవారలతో అవమానముల నెదుర్కొన్న నేపథ్యంగా....
కందం
అంచిత సేవల నందఁగ
నెంచగ వృద్ధాప్యమందు నింతిని సతిగన్
బెంచుకొన సుతులసహ్యము
పంచ వకారములు గలుగు వారి కవమతుల్
ఉత్పలమాల
అంచిత సేవలన్ గొనఁగ నాఖరి వేళల నాదరింపగా
నెంచగ భార్యగన్ దగిన యింతిని వృద్ధుడు నార్తిఁదీరఁగన్
బెంచుకొనంగ వైరమది ప్రేమగఁ గన్న సుతాళి తండ్రిపై
పంచ వకారముల్ గలుగు వారలకే యవమానముల్ గదా!
వంచన జేయుచున్ బెరుగు
రిప్లయితొలగించండివందల కోట్ల ధనాఢ్యవర్యులన్
ముంచుచు దేశ సంపద , నమో
ఘపు దుర్నయ ధూర్త చిత్తులన్
సంచిత పాప కర్మములు సత్యము
వారల నంటియుండు యీ
పంచ వకారముల్ గలుగు వారలకే
యవ మానముల్ గదా
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి"వారల నంటియుండు నీ పంచ..."
కొంచెమయిన శంకించకు
రిప్లయితొలగించండిపంచ వకారములు గలుగు వారి కవమతుల్
నెంచెడి వారి బతుకులకు
పంచ మహా పాతకములు బట్టుట తథ్యం
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'అవమతుల్ + ఎంచెడి' అన్నపుడు నుగాగమం రాదు. 'బ్రతుకులకు' అనడం సాధువు. 'తథ్యం' అనడం వ్యావహారికం. 'నిజమౌ' అనవచ్చు.
🙏🏽
తొలగించండి
రిప్లయితొలగించండిఅంచిత గౌరవ మందదె
పంచ వకారములు గలుగు వారి, కవమతుల్
కుంచు కుచేలము గట్టిన
నంచరవుతుకైననేమి యవనిన గనగన్.
లంచము గోరువారలు స్వలాభము గోరుచు నమ్మువారినే
వంచన జేయనేమి గన వాసిగ మన్నన లందు గాదుటే
పంచ వకారముల్ గలుగు వారలకే, యవమానముల్ గదా
కుంచు కుచేల ధారులిల కోవిదులైనను పొందరే ధరన్.
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండిఉ.
రిప్లయితొలగించండివంచన, వృద్ధనింద మరి వక్రధనార్జనబుద్ధి మేలుగన్
వాంఛయు ,వేదదూషణయు, పంచవకారము లెంచిచూడగా
సంచితపాపకర్మఫలసారమనంగను సంక్రమించునీ
పంచ వకారముల్ గలుగు వారలకే యవమానముల్ గదా
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిసంచిత భాగ్యము నంతయు
రిప్లయితొలగించండిపంచి పదవినొందగోరు వంచకు లిలలో
ముంచుటచే, పూజ్యంబై
పంచ వకారములు, గలుగు వారి కవమతుల్
లంచము బొక్కితృప్తిపడు రాక్షసనేతలకున్ సమూలమున్
సంచిత భాగ్యరాశులకు సాక్ష్యము మాయము చేయువారికిన్
వంచన జీవితంబయిన వర్తన మిచ్చయుఁ, లేకపోయినన్
పంచ వకారముల్, గలుగు వారలకే యవమానముల్ గదా
ధన్యవాదాలు గురూజీ 🙏
తొలగించండిసంచిత కర్మఫలమ్ముల
రిప్లయితొలగించండినెంచగ నాస్వాదయోగ్యమెన్నటికైనన్
మంచితనము కొరగామియె
పంచ వకారములు గలుగు వారి కవమతుల్
మంచితనమ్ముతో జనుల మన్నననొందగ నెంతజూచినన్
రిప్లయితొలగించండివంచకుడంచు నెంచెదరు వానిగుణమ్ముల మెచ్చరెవ్వరున్
పంచ వకారముల్ గలుగు వారలకే యవమానముల్ గదా
సంచిత పాపకర్మముల సంచిని మోయక తప్పదేరికిన్
అంచిత సేవా భావము
రిప్లయితొలగించండివంచన జేయుట నెరుగని వారై మనినన్
మంచికి విలువల నీయరు
పంచ వకార ములు గలుగు వారి కవ మతు ల్
వంచన తోడుతన్ బడచి ప్రక్రియ, నిత్యము నక్రమార్జనన్
రిప్లయితొలగించండికాంచుచు నున్నవారలిలఁ గైకొను చుందురు మెప్పు నెల్లెడన్
మంచి తనమ్మునన్ బెరిగి మాన్యతతో చరియించి మించినన్
బంచ వకారముల్ గలుగు వారలకే యవమానముల్ గదా
ప్రక్రియ: అధికారము
కం॥ పంచ వకారము లేలను
రిప్లయితొలగించండివంచన నేర్చిన మనుజులు ప్రాభవ మొందన్
మంచికి విలువలు తరుగఁగఁ
బంచ వకారములు గలుగు వారి కవమతుల్
ఉ॥ మించిన స్వార్థ చింతనల మేదిని బుద్ధులు హీనమై చనన్
మంచికి శూన్యమై విలువ మన్నన విజ్ఞత పొందకున్నచో
వంచన నేర్చి కుత్సితులు ప్రాభవ మొందుచు రాజ్యమేలగాఁ
బంచ వకారముల్ గలుగు వారలకే యవమానముల్ గదా
సంచిత పాపకార్యములు చల్లగ చేసెడి కుంచితా త్ములున్
రిప్లయితొలగించండిమంచితనంపుఛాయలను మైమర పించుచు నమ్మకంబుగన్
ముంచిన వారికే తిరిగి ముప్పులు కల్గును మబ్బువీడగా
పంచ వకారముల్ గలుగు వారలకే యవమానముల్ గదా.