9, ఏప్రిల్ 2023, ఆదివారం

సమస్య - 4391

10-4-2023 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“బడి యది చెఱసాల బాటఁ జూపు”
(లేదా...)
“బడి చెఱసాల కేగుటకు బాటనుఁ జూపు జనాళి  కీ ధరన్”
(మాచవోలు శ్రీధర రావు గారికి ధన్యవాదాలతో...)

37 కామెంట్‌లు:

  1. ##

    "పుష్ప" వలె ధనమును పొంకింప నౌర, రా
    బడి యది చెరసాల బాటజూపు
    వలదు దొడ్డిదారి బతుకు నిలవదౌర
    లక్ష్మి నాల్గు నాళ్లు లక్షణముగ


    జిలేబి


    రిప్లయితొలగించండి
  2. పదవిలోకివచ్చి పలుకోట్ల నార్జించి
    విర్రవీగుచున్న వెర్రినేత
    చెడ్డ మార్గమందు నడ్డగోలైనరా
    బడి యది చెఱసాల బాటఁ జూపు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అడకువలేనిదుష్టునకు హాయిని గూర్చెడు గద్దెనీయగా
      సడలని పట్టుతోడ మన సంఘపు సంపద కొల్లగొట్టి రా
      బడికని దుష్టకార్యముల పాల్పడు నేర్పరి యైననేత వెం
      బడి చెఱసాల కేగుటకు బాటనుఁ జూపు జనాళి కీ ధరన్

      తొలగించండి
    2. మీ రెండు పూరణలు బాగున్నవి అభినందనలు

      తొలగించండి
  3. ఆటవెలది
    ధరణి మునుజునకన ధర్మార్థ కామమో
    క్షములు, వెలసెను పురుషార్థములుగ
    ధర్మము విడి బడయ ధనమిల నట్టి రా
    బడి యది చెఱసాల బాటఁ జూపు

    చంపకమాల
    గుడులవి పాఠశాలలుగ గొప్పగఁ జెప్పిరి శాస్త్రసమ్మతిన్
    ముడివడి సాగ మేలగునుపో పురుషార్థములెల్ల మానవుల్
    బడయఁగ నెంచ సంపదలు వంచన ధర్మము మీరి యట్టి రా
    బడి చెఱసాల కేగుటకు బాటనుఁ జూపు జనాళి కీ ధరన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ప్రహ్లాద బాలుని తో గురువులు చండామార్కులవారు:

      ఆటవెలది
      వైరి హరిని భక్తి భజియింప ప్రహ్లాద
      జనకుఁడొప్పఁ బోడు వినుము శిష్య!
      తండ్రిమాట మీరి దామోదరుని గొల్వ
      బడి యది చెరసాల బాటఁ జూపు

      తొలగించండి
    2. మీ మూడు పూరణలు బాగున్నవి అభినందనలు

      తొలగించండి
  4. కన్నుదెఱువలేనికన్నబిడ్డనుగూడ
    శిక్షనేర్వగానుచేర్చబడిని
    భక్షణంబునయ్యెబాల్యంపుపరుగులు
    బడియదిచెఱసాలబాటజూపు

    రిప్లయితొలగించండి
  5. విడివడిగర్భవాసమునువేదనతీరినబాలుడయ్యెడన్
    అడుగులమాటలందమునహాయనిపించుగలోకమందునన్
    కుడువనునేర్వలేనిపసికూనకువిద్యలనేర్పురీతిలో
    బడియదిచెఱసాలకేగుటకుబాటనుజూపుజనాళికీధరన్

    రిప్లయితొలగించండి
  6. వడివడి సంపదల్ బెనుప వక్రపు దారిని
    నడ్చు మానవుల్
    దడబడకుండ మోసములు దప్పక చేతురు
    పెంచ ద్రవ్యమున్
    పుడమిని న్యాయ వర్తనము బూడ్చియు
    పెంచిన వారి రా
    బడి చెరసాల కేగుటకు బాటను జూపు
    జనాల కీధరన్

    రిప్లయితొలగించండి
  7. నెలవు యేర్పరచిన నీమము నిలుపక
    కొంటె వారి తోడ కూడు కొనుచు
    కాని పనుల జేసి గడించి నట్టి రా
    బడి యది చెఱసాల బాటఁ జూపు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది అభినందనలు
      నెలవు+ఏర్పరచిన... అన్నపుడు యడాగమం రాదు

      తొలగించండి
    2. 🙏🏽 నెలవు నందునగల నీమము నిలుపక

      తొలగించండి
  8. సుడిబడి ధర్మమార్గమునసొమ్మునుబెంచగ సాధికారమౌ
    బడి నిహలోకమందుననుపావన జీవన శైలిగాగఁదా
    నడుగిడి వక్రమార్గమున నర్ధము జేర్చగ విత్తమౌచురా
    బడి చెఱసాల కేగుటకు బాటనుఁ జూపు జనాళి కీ ధరన్
    కొరుప్రోలు రాధాకృష్ణరావు

    రిప్లయితొలగించండి
  9. ధనము పొంద గోరి ధర్మమార్గము వీడి
    సాటి ప్రజల ముంచు స్వార్థ చిత్తు
    లైన ప్రత్య వరుల యక్రమమైన రా
    బడి యది చెఱసాల బాటఁ జూపు.


    విడుచుచు ధర్మమార్గమును విత్తము వాసిగ పొందగోరుచున్
    పడితర మజ్జగించుచు నుపార్జన కోసము సాటివారినే
    జిడుగొనరించు వారలగు చేటకులక్రమ మైన యట్టి రా
    బడి చెఱసాల కేగుటకు బాటనుఁ జూపు జనాళి కీ ధరన్.

    రిప్లయితొలగించండి
  10. చం.

    పడతులు నెందరో నరక పట్టణ మందున బంధితుల్ తమిన్
    గడువుల నంతమై దశను గట్టిగ దెప్పుచు బూర్వకర్మ, లో
    *బడి చెఱసాల కేగుటకు బాటనుఁ జూపు జనాళి కీ ధరన్*
    కడుపున తిండి బెట్టి కడగండ్లను తీర్చును కృష్ణ లీలలే.

    రిప్లయితొలగించండి
  11. వక్ర మార్గ మందు వచ్చిన ధనమది
    చేటు గలుగ జేసి చింత గూర్చు
    పతన మగుచు మనుజు బాధలన్ ముంచి రా
    బడి యది చెఱ సాల. బాట జూపు

    రిప్లయితొలగించండి
  12. దొడ్డిదారియొకటె దొడ్డదారిగనెంచి
    దుడ్డుకొరకుఁ దొక్కఁ నడ్డదారి
    నడ్డి విరుగగొట్టి నట్టేట ముంచు రా
    బడి యది చెఱసాల బాటఁ జూపు

    రిప్లయితొలగించండి
  13. జడియక వక్ర మార్గమున. సంపద నార్జన జేసెడి వాడునై
    విడువక దోపిడీ పనులు విచ్ఛ లు డై యొనరించు వాడునై
    నడవడి యందు నీచ మగు నైజము గల్గిన వాని కున్న రా
    బడి చెఱ సాల కేగు టకు బాటను జూపు జనా ళి కీ ధర న్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది అభినందనలు
      మొదటి పాదంలో గణభంగం. *జేయు వాడునై* అనండి

      తొలగించండి
  14. చిరుమార్పులతో కందం (సరదాగా)

    జడియక లంచమ్మునుఁ గొని
    వడివడి ధనవంతులవలె వరలఁగ మూర్ఖుల్
    చెడుబుద్ధి జూపఁగా రా
    బడి యది చెఱసాల బాటఁ బరగఁగ జూపున్

    రిప్లయితొలగించండి
  15. వడివడిగా ధనాఢ్యునిగ వర్థిలు కోరిక పెచ్చరిల్లి తా
    జడియక నడ్డదారిఁ బడి చక్కఁగ లంచము లారగించుచున్
    తడబడి తప్పిదమ్మునకు తప్పక మూల్యమునిచ్చుఁ, నట్టిరా
    బడి చెఱసాల కేగుటకు బాటనుఁ జూపు జనాళి కీ ధరన్

    రిప్లయితొలగించండి
  16. ఆ॥ కూటి కొఱకు నేఁడు కోటి విద్యలిలను
    మంచి తెరవు మరచి వంచనఁ గని
    మోసగించు పగిది బోధించు దొంగల
    బడి యది చెరసాల బాటఁ జూపు

    చం॥ బడులకు పంపి పిల్లలను బాధ్యత లేకను సంచరించగన్
    ముడివడి దుష్ట మిత్రులును మోసము నేర్వఁగఁ జేటు నొందరా
    సుడివడి తల్లిదండ్రులును జూపనిచో తగు శ్రద్ధ నిట్లగున్
    బడి చెఱసాల కేఁగుటకు బాటను జూపు జనాళి కీ ధరన్

    రిప్లయితొలగించండి
  17. “బడి యది చెఱసాల బాటఁ జూపు(సమస్య)


    ధర్మపథము వీడి‌ ధనముసర్వమనుచు‌
    మంచిచెడ్డ‌ లేక మాయచేసి‌
    కురిసి‌ మెరుయు‌ నట్టి‌ కోటానుకోట్లరా‌
    బడి యది‌ చెఱశాల‌ బాట‌ఁ జూపు

    రిప్లయితొలగించండి
  18. చం.మా.
    గడబిడ చేసి దేశమున కళ్ళకు గంతలు కట్టురీతిగన్
    దడబడకుండ సుంతయిన ధర్మము తప్పుచు రాజ్యమేలుచున్
    బడుగుల మోసగించుచును బాధ్యత వీడగ వచ్చునట్టి రా
    బడి చెరసాల కేగుటకు బాటను జూపు జనాళికీధరన్

    రిప్లయితొలగించండి
  19. బడుల న కోవె లల్లెను‌ శుభంబు‌ జయంబు‌ సభక్తి‌ స్థానముల్‌
    ముడిప డియుండు‌ పిల్లల‌ సమున్నతజీవన‌మార్గ‌ మంతయున్‌
    బడిని ధనంబు పెంచెడి వివాద‌ మధర్మ‌ పథాన‌ వచ్చురా‌
    బడి‌ చెఱసాల‌‌ కేగుటకు బాటను జూపు జనాళి‌ కీ ధరన్

    రిప్లయితొలగించండి

  20. పిన్నక నాగేశ్వరరావు.

    సక్రమమగు రీతి సంపాద నది యున్న
    బ్రతుకు సాగు ధర్మపథము నందు
    నక్రమమగు మార్గమందు లభించు రా
    బడి యది చెఱసాల బాటఁ జూపు.

    రిప్లయితొలగించండి
  21. పుడమిని విత్తమార్జనయె ముఖ్యమటంచు తలంచి నిత్యమున్
    చెడు పనులందునన్ మునిగి చెన్నగు జీవిత మెంచకుండగన్
    వడివడి వక్రమార్గము నపార ధనమ్మును పొంద నట్టి రా
    బడి చెఱసాల కేగుటకు బాటనుఁ జూపు జనాళి కీ ధరన్

    రిప్లయితొలగించండి