28, ఏప్రిల్ 2023, శుక్రవారం

సమస్య - 4407

29-4-2023 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“నాస్తికుల గుంపు సేసెను నాగపూజ”
(లేదా...)
“నాస్తికులందఱున్ గలసి నాగుల దేవత పూజఁ జేసిరే”
(బులుసు అపర్ణ గారి ఒంగోలు శతావధాన సమస్య)

27 కామెంట్‌లు:


  1. శాస్తయు తల్లిదండ్రులును శాస్త్రమెఱంగిన వారలెల్లరున్
    వాస్తవమంచు చెప్పిరని వాసిగ దేవుని నమ్ము వారలా
    యాస్తికులైన వారలట నడ్డుకొనంగను రాగ ద్రోయుచున్
    నాస్తికు , లందఱున్ గలసి నాగుల దేవత పూజఁ జేసిరే.

    రిప్లయితొలగించండి
  2. నీతిమార్గంబులేదనునిక్కమరసి
    నాస్తికులగుంపుజేసెనునాగపూజ
    విషముజిమ్మెనువాసుకివిచ్చెపడగ
    నాశమొందెనులోకంబునయముదప్పి

    రిప్లయితొలగించండి

  3. శాస్త్ర శోధకులట జేరి చక్కగాను
    బోధ సేయగా నాలించి మూఢులైన
    వారలే మారి యాస్తికులైరి యట్టి
    నాస్తికుల గుంపు సేసెను నాగపూజ.

    రిప్లయితొలగించండి
  4. ఆస్తికు లందరున్ సతత మాదర
    భావము తోడ వేల్పులన్
    వాస్తవము గొల్చుచుంద్రు గద భారత
    దేశములోన దప్పకన్
    నేస్తమ నాగపంచమికి నిర్మల
    భక్తి వహించియున్ వినా
    నాస్తికులందరున్ గలసి నాగుల
    దేవత పూజ జేసిరే.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'వాస్తవము' అన్నచోట గణభంగం. సవరించండి.

      తొలగించండి
  5. తేటగీతి
    అన్నిట పరమాత్మునిఁ గాంచి యున్నతిఁగొన
    మదినిఁ దల్చిన భక్త సమాఖ్య, పూని
    సత్యమెఱిగింప రానొప్ప సఖ్యులౌచు
    నాస్తికుల గుంపు, సేసెను నాగపూజ

    ఉత్పలమాల
    ఆస్తిక తత్వమై సకలమందున దేవుని గాంచు భక్తులున్,
    విస్తృత భావనన్ మిగుల విజ్ఞత సర్వమయుండొకండె తా
    నిస్తులమైనవాడనెడు నిష్టురసత్యమెరింగి మారగన్
    నాస్తికులందఱున్, గలసి నాగుల దేవత పూజఁ జేసిరే!

    రిప్లయితొలగించండి
  6. పణమునిడ పూజకేర్పాటు బరచిరచట
    నాస్తికుల గుంపు ; సేసెను నాగపూజ
    నొకడు దనను గాయు ననుచు నొప్పిదముగ
    నాగుల చవితి నాడున నగరమందు

    రిప్లయితొలగించండి
  7. గురు వరే ణ్యు ల మహిమంపు గొప్ప బోధ
    మార్చు నెవ్వారి నైననుమంచి మార్గ
    వర్తు లుగ నను రీతిగ భక్తు లైన
    నాస్తికులగుంపు సేసెను నాగ పూజ

    రిప్లయితొలగించండి
  8. స్వస్తత కోసమై జనులు వల్మికముల్ కడ పాపఱేడులన్
    నిస్తుల భక్తిఁ గొల్చెదరు నీమముఁ దప్పక, దేశమందునన్
    విస్తృత రీతి కోవిడనుబెట్టిదమౌ రుజ విస్తరించగా
    నాస్తికులందఱున్ గలసి నాగుల దేవత పూజఁ జేసిరే

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

      తొలగించండి
    2. మొదటి పాదంలో 'స్వస్తత కోసమై' బదులు 'వ్యస్తముఁ దేర్చఁగా' అని చదువ గోర్తాను

      తొలగించండి
  9. పుస్తకావిష్కరణ సభ పూఁచిపట్ట
    వాస్తవ విషయ జ్ఞానము ప్రాప్తమాయె
    విస్తుబోయిన జనులెల్ల విషయమెఱుగ
    నాస్తికుల గుంపు సేసెను నాగపూజ

    హస్తినలో వివేకులు మహా సభ నొక్కటి నిర్వహించగా
    పుస్తకపాణియైన నొక బోధకు డచ్చట విప్పి చెప్పగా
    వాస్తవ మేగదాయనుచు పావన జీవన ముక్తి మార్గమున్
    నాస్తికులందఱున్ గలసి నాగుల దేవత పూజఁ జేసిరే

    రిప్లయితొలగించండి
  10. పుట్టలోనున్న నాగన్న పూజసేయఁ
    నిల్లు సుఖసంతసముల వర్థిల్లునన్న
    నమ్మికను భక్తబృందము, నమ్మకున్న
    నాస్తికుల గుంపు, సేసెను నాగపూజ

    రిప్లయితొలగించండి
  11. స్వస్తిని గూర్చు సర్పములు, చంపుచు మూషిక జాతి నంచు నా
    వాస్తవమున్ బ్రజాళులకు పన్నుగఁ దెల్పు విధమ్ము నెంచుచున్
    నిస్తులమైన లక్ష్యమున నిండుమనమ్మున, కర్షకాళితో
    నాస్తికులందఱున్, గలసి నాగుల దేవత పూజఁ జేసిరే

    రిప్లయితొలగించండి
  12. తే॥ గ్రామ జాతర యందు నాగ్రామ ప్రజలు
    గ్రామ రక్ష కాచారముఁ గాఁగ కలసి
    చివరి నాఁడు నియమముగఁ జేర నచట
    నాస్తికుల గుంపు సేసెను నాగ పూజ

    రిప్లయితొలగించండి
  13. సమస్య:“నాస్తికులందఱున్ గలసి నాగుల దేవత పూజఁ జేసిరే”
    పూరణ:
    ఆస్తుల కేమె వారసుల మంచును నన్నలు తమ్ములొక్కటన్
    వస్తము వస్త్రముల్ ధనము వాహము లాదిగ సర్వ సంపదల్
    స్వస్తిముఖంబునన్ దెలిసి ఛాందస మంచును నాస్తి కోసమై
    నాస్తికులందఱున్ గలసి నాగుల దేవత పూజఁ జేసిరే”
    కడయింటి కృష్ణమూర్తి...గోవా (నెల్లూరు)--29-4-23

    రిప్లయితొలగించండి
  14. ఉ॥ నాస్తికులందఱున్ వినఁగ నచ్చిన బోధలు మార్పునొందఁగన్
    నాస్తికులందఱున్ గలసి నాగుల దేవత పూజఁ జేసిరే
    నాస్తిక యాస్తికత్వములు నమ్మక రీతులు మారుచుండవా
    వాస్తవ మెన్నఁగన్ జనుల భావన మార్చు పరిస్థితులిట్టులన్

    రిప్లయితొలగించండి
  15. గణభంగమైనందున చివరి పాదము ఇలా మార్చడమైనదండి
    "వాస్తవ మెన్నఁగన్ జనుల భావన మార్చు పరిస్థితుల్ భువిన్"

    రిప్లయితొలగించండి
  16. పాముపుట్ట క్రిందగలదుపసిడియనగ
    దైవమేలేదనుచు సతతమ్ముపలుకు
    *నాస్తికుల గుంపు సేసెను నాగ పూజ*
    పసిడిపైనియాశచెరచెపథమునెల్ల

    రిప్లయితొలగించండి