10, ఏప్రిల్ 2023, సోమవారం

సమస్య - 4392

11-4-2023 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“సూక్ష్మరూపుఁడై ద్యుతి వీడె సూర్యుఁ డయ్యొ”
(లేదా...)
“కనఁగన్ సూర్యుఁడు సూక్ష్మరూపుఁ డగుచున్ గాంతిన్ ద్యజించెన్ గటా”

45 కామెంట్‌లు:

  1. సైంథవాథముకొఱకునైసంగరమున
    చక్ర ధరుడునుగప్పెగాసవితనపుడు
    మబ్బుగ్రమ్మినబింబమైమాటునుండి
    సూక్ష్మరూపుడైద్యుతివీడెసూర్యుడయ్యో

    రిప్లయితొలగించండి

  2. సీత జాడ నెఱుగ లంక జేరిన తరి
    పశ్చిమమునస్తమించెడు భానుని గని
    మారుతి దలచె నప్పుడు మనసు నందు
    సూక్ష్మరూపుఁడై , ద్యుతి వీడె సూర్యుఁ డయ్యొ.

    రిప్లయితొలగించండి
  3. వనమున్జొచ్చినరాముజూచెనచటన్భాస్వంతుబింబంబహో
    ఉనికిన్గోల్పడికాంతిపుంజములనుఱ్ఱూతల్వడిన్వీడుచున్
    కునుకున్దీయగరాచకార్యమునుతాకోదండుకిచ్చెన్తగన్
    కనగన్సూర్యుడుసూక్ష్మరూపుడగుచున్కాంతిన్త్యజించెన్కటా

    రిప్లయితొలగించండి
  4. మ.

    వినగన్ శ్రద్ధగ శాపమున్ సుమతి, నొప్పిన్ మౌని మాండవ్యు చే,
    పనిచెన్ గౌశిక రక్షణార్థము వివస్వంతున్, స్థిరంబౌననెన్,
    మనుచున్ దేవుడు భక్తికై యణగి ప్రామాణ్యమ్ము సూచించెనే
    *కనఁగన్ సూర్యుఁడు సూక్ష్మరూపుఁ డగుచున్ గాంతిన్ ద్యజించెన్ గటా.*

    రిప్లయితొలగించండి
  5. అవనికి దనకు మధ్యన నబ్జుడడ్డు పడగ
    గపిలుని కొలత తగ్గుట గనిన నరులు
    “సూక్ష్మరూపుఁడై ద్యుతి వీడె సూర్యుఁ డయ్యొ”
    ననుచు గడు బాధ పడుచుండిరచల నుండి

    రిప్లయితొలగించండి
  6. గగన మందున మబ్బులు గ్రమ్ము కొనగ
    సూక్ష్మ రూపుడై ద్యు తి వీడె సూర్యుడయ్యొ
    యనుచు వీక్షించి రయ్యె డ. యవని యపుడు
    చీకటు లు ముసిరె జగ మంత ప్రాక ట ముగ

    రిప్లయితొలగించండి
  7. కరము తిగ్మపు కరముల కాఁకవెలుగు
    గగనమందున గమకించి మగుడుచుండ
    కడఁగి రాహువు పట్టఁగ కరుణమాలి
    సూక్ష్మరూపుఁడై ద్యుతి వీడె సూర్యుఁ డయ్యొ

    రిప్లయితొలగించండి
  8. తేటగీతి
    కనఁగ నింగిని సంపూర్ణ గ్రహణవేళ
    చంద్రబింబమ్ము కప్పుచున్ సాగినంత
    చివర నుంగరమున్ బోలి చెల్లి క్షణము
    సూక్ష్మరూపుఁడై ద్యుతి వీడె సూర్యుఁ డయ్యొ


    మత్తేభవిక్రీడితము
    వినువీధిన్ గనవచ్చు నుంగరముగన్ వేవెల్గునిన్ రమ్మనన్
    ప్రణుతిన్ జేయగ సిద్ధమై గ్రహణవేళన్ వేగమే బోవగన్
    గొనభాగమ్మును గప్పబోవ శశియే క్రొంగొత్త దృశ్యమ్మునై
    కనఁగన్ సూర్యుఁడు సూక్ష్మరూపుఁ డగుచున్ గాంతిన్ ద్యజించెన్ గటా!

    రిప్లయితొలగించండి
  9. ఘనమౌభారత యుద్ధరంగముననా కర్ణుండు గాండీవితో
    రణమున్ సల్పెడి వేళ కర్ణరథచక్రంబా భువిన్‌
    కూలగన్
    వనజాతాప్తసుతుండు‌ వ్రాలె ధరణిన్ పార్థాస్త్ర తేజ మ్ముచే
    కనఁగన్ సూర్యుఁడు సూక్ష్మరూపుఁ డగుచున్ గాంతిన్ ద్యజించెన్ గటా

    రిప్లయితొలగించండి

  10. అనిలో సూర్యజు డుగ్రరూపుడగుచున్ యాతవ్యులన్ జీల్చి సా
    ధనమున్ పొందునటంచు నెంచిన మహా దండారమే సాది శ
    ల్యుని సారథ్యములోన నెల్లిదముతో గ్రుంకెన్ గదా సోదరా
    కనఁగన్ సూర్యుఁడు సూక్ష్మరూపుఁ డగుచున్ గాంతిన్ ద్యజించెన్ గటా.

    రిప్లయితొలగించండి
  11. శ్రీలు రెంటిని ధరియించి చెలగు వాడు
    తెలుగు విప్లవ సాహితీ వెలుగుఱేడు
    కిరణ కాంతులు కొడిగట్ట ధరను వీడె
    సూక్ష్మరూపుఁడై ద్యుతి వీడె సూర్యుఁ డయ్యొ

    రిప్లయితొలగించండి
  12. వినువీధిన్ గమకించి కంజహితుఁడాభీలంబుగా రశ్ములన్
    యనలంబోయన నుర్విపై బరచె తానత్యంత తీక్ష్ణంబుగన్
    ఘనతేజంబునకడ్డుకట్టగ వెసన్ గ్రస్తంబవన్ రాహుచే
    కనఁగన్ సూర్యుఁడు సూక్ష్మరూపుఁ డగుచున్ గాంతిన్ ద్యజించెన్ గటా

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'రశ్ములన్ + అనలంబో' అన్నపుడు యడాగమం రాదు. "రశ్ములే యనలంబో" అనండి. 'అవన్' అన్న ప్రయోగం సాధువు కాదు.

      తొలగించండి
    2. ధన్యవాదములు గురువుగారూ! తప్పులు సవరించుకుంటాను. 🙏

      తొలగించండి
    3. వినువీధిన్ గమకించి కంజహితుఁడాభీలంబుగా రశ్ములే
      యనలంబోయన నుర్విపై బరచె తానత్యంత తీక్ష్ణంబుగన్
      ఘనతేజంబునకడ్డుకట్టగ వెసన్ గ్రస్తంబయెన్ రాహుచే,
      కనఁగన్ సూర్యుఁడు సూక్ష్మరూపుఁ డగుచున్ గాంతిన్ ద్యజించెన్ గటా

      తొలగించండి
  13. పగటి‌ సామ్రాజ్య రారాజు‌ భాస్కరుండు
    జగతి‌ కంతయుపంచెను‌ జాగృతంబు‌
    పశ్చిమంబున పవళింప‌ భానుమూర్తి
    సూక్ష్మరూపుఁడై ద్యుతి వీడె సూర్యుఁ డయ్యొ”

    రిప్లయితొలగించండి
  14. అనిలో ప్రార్థుని పుత్రుడైన ఘనతేజార్కు
    నిన్ శూరునిన్
    దునుమన్ నల్గురు కౌరవాదులకటా దుర్బద్ధి
    తో గూడియున్
    ఘన బాణంబులు సుట్టుముట్టియు వడిగా
    నబ్బాలుపైవేయగా
    కనగన్ సూర్యుడు సూక్ష్మ రూపమగుచున్
    కాంతిన్ త్యజించెన్ గటా!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మొదటి, మూడవ పాదాలలో గణభంగం. "పార్థుని... తేజార్కుండునౌ శూరునిన్..."
      మూడవ పాదంలో యతి కూడ తప్పింది. సవరించండి.

      తొలగించండి
  15. రాహుఁ బట్టగా నప్పుఁడు రజతఁదొలఁగి
    సూక్ష్మరూపుఁడై ద్యుతి వీడె సూర్యుఁ డయ్యొ
    కాల సర్పము కాటును వీలు కాదు
    తొలఁగఁ జేయఁగ నేరికి యిలను సామి!

    రిప్లయితొలగించండి
  16. మనుచున్ దేశము కోసమై నిరత మున్ మన్యంపు వీరుండు దా
    ఘనుడై పోరుచు నాంగ్లు లన్ దరుమగా గాఢ o పు దర్పో న్న తిన్
    నినదిం చెన్ బహు రోషు డై మృతు డయ్యు న్ నిల్చె న్ గదా ధాత్రిలో
    గనగన్ సూర్యుడు సూక్ష్మ రూపుఁ డ గు చున్ గాంతిన్ ద్యజి o చెన్ గటా!

    రిప్లయితొలగించండి
  17. అనఘా! వింటివె నాదుమా టలివి మాయారాహు వేపట్టంగాఁ
    గనఁగన్ సూర్యుఁడు సూక్ష్మరూపుఁ డగుచున్ గాంతిన్ ద్యజించెన్ గటా
    కినుకంబొందిన రాహువట్లుగను బెన్గీడుం దలంబోయుటన్
    వినగా నొప్పదు కార్తికేయ!యిది విన్వీధింగనంజీకటే

    రిప్లయితొలగించండి
  18. నేనెలా ప్రయత్నించిన స్వాతంత్ర్యము ఇలాగే వస్తున్నదండి గౌతమి ఫాంట్లో బాగున్నదండి.

    రిప్లయితొలగించండి
  19. తే॥ ఘనుఁడు మోహన దాసుఁడు కర్మ యోగి
    శాంతి దూత, స్వాతంత్ర్యము శాంతి మార్గ
    మందు సాధించిన మనీషి మాన్యుఁడతఁడు
    సర్వులకహింస నేర్పిన సరళ జీవి
    తనను గాల్చ నేలకొరగు తరుణమందు
    దలచి శ్రీరాము నొకపరి తనను గనఁగ
    నెల్లరున్ శోక తప్తులై యిహము వదిలె
    సూక్ష్మ రూపుఁడై ద్యుతి వీడె సూర్యుడయ్యొ

    (సందర్భాను సారంగా తేటగీతిలో పాదములు సాధ్యమైనంతవరకు సరి సంఖ్యలో పెంచుకొన వచ్చునని విన్నానండి)

    మ॥కనఁగన్ సూర్యుఁడు సూక్ష్మ రూపుఁడగుచున్ గాంతిన్ ద్యజించెన్ గటా
    విననీ వాక్యము సత్యదూరముఁ గదా వేవేల కాంతుల్ భువిన్
    ఘనుఁడా భానుఁడు చిమ్మకున్న యిహ లోకమ్మంత నిర్జీవమౌ
    కనఁగన్ సూర్యుడి శక్తితో నడచు లోకంబందు జీవమ్మిటుల్

    రిప్లయితొలగించండి

  20. పిన్నక నాగేశ్వరరావు.

    కనగ సంపూర్ణ సూర్యగ్రహణము వేళ
    కప్పగా శశి రవిని చీకట్లు ముసర
    నుంగరము వోలె కనుపించి యుర్వి ప్రజకు
    సూక్ష్మ రూపుడై ద్యుతి వీడె సూర్యుడయ్యొ.

    రిప్లయితొలగించండి
  21. క్రొవ్విడి వెంకట రాజారావు:

    గ్రహణ కాలము నందున కల్లరియగు
    రాహువు ప్రభాకరుని జేరి రాక్షసముగ
    మ్రింగు వేళను క్రమముగ మేను జంకి
    సూక్ష్మరూపుడై ద్యుతి వీడె సూర్యుడయ్యొ!

    రిప్లయితొలగించండి
  22. క్రొవ్విడి వెంకట రాజారావు:

    తనుగా రాహువు క్రూర రూపమున పంతంబొంది శ్రేష్ఠుండునౌ
    దిననాథున్ దరిజేరి యాతనిని యుద్రేకించి చేపట్టుచున్
    వినువీధిన్ దిరుగాడు వేళ తమమే విస్తారమయ్యెన్ మహిన్,
    కనగన్ సూర్యుడు సూక్ష్మ రూపుడగుచున్ గాంతిన్ ద్యజించెన్ గటా!

    రిప్లయితొలగించండి