14, ఏప్రిల్ 2023, శుక్రవారం

సమస్య - 4395

15-4-2023 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“దధిపాత్రన్ విష మెసంగె దావానలమై”
(లేదా...)
“దధిపాత్రమ్మున కాలకూట మెగసెన్ దావానలాభీలమై”
(బులుసు అపర్ణ గారి ఒంగోలు శతావధాన సమస్య)

29 కామెంట్‌లు:

  1. అధరములందునమధువును
    కధనముచూడగకటువునుకాంతునినడతన్
    కుదరదుపొంతనకాంతకు
    దధిపాత్రన్విషమెసంగెదావానలమై

    రిప్లయితొలగించండి
  2. విధిరాత కారణముగా
    ప్రధర్షణను తాళలేక బ్రతుకుతెరువులే
    క ధవము చేర్చంగ నతడు
    దధిపాత్రన్ విషమెసంగె దావానలమై!



    జిలేబి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'రాత' వ్యావహారికం. "విధి వ్రాత" అనండి.

      తొలగించండి
  3. కందం
    సుధనందుటె తమ పరమా
    వధిగ గిరికి ఫణిని జుట్టి వాటున జిల్కన్
    విధిమాయయనఁగ క్షీరో
    దధి పాత్రన్ విషమెసంగె దావానలమై!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మత్తేభవిక్రీడితము
      సుధఁబొందంగ సురాసురుల్ గిరినటన్ జొక్కంపు కవ్వమ్ముగన్
      విధిగా వాసుకిఁ ద్రాడు సేసి మిగులన్ విద్వత్ప్రయోగంబుగన్
      మథియింపన్ దొలుతన్ విచిత్రమన దున్మాడంగ సృష్టిన్ బయో
      దధిపాత్రమ్మున కాలకూట మెగసెన్ దావానలాభీలమై!

      తొలగించండి
    2. మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి

  4. దధిచారము మందరగిరి
    యధి జిహ్వమె త్రాడుగాగ యసురులు సురలం
    బుధిని మధించు తరి పయో
    దధిపాత్రన్ విష మెసంగె దావానలమై.


    అధి జిహ్వమ్మది పాణిసర్గ్యమచలంబా మంథి శైలమ్మునే
    దధిచారమ్ముగ జేయుచున్ సురలు ప్రాదయ్య మ్ములే మిత్రులై
    సుధనాశించి మధించెడంతరమటన్ జోద్యంబుగా నా పయో
    దధిపాత్రమ్మున కాలకూట మెగసెన్ దావా నలా భీలమై.

    రిప్లయితొలగించండి
  5. సుధకై చిల్కెను క్షీరసాగరమునే శోభిల్లగా శేషుతో
    మధువైరి ప్రముఖాదులెల్లరు విషంబుంగూర్చి చింతించి యా
    విధివంద్యుండగు శంకరుందలువగా, వేంచేయునా శర్వుకున్
    దధిపాత్రమ్మున కాలకూట మెగసెన్ దావానలాభీలమై

    రిప్లయితొలగించండి
  6. సుధ కై డైత్యులు సురలును
    విధి గా దరువగ దొడగగ వెలువడె జగతి న్
    వధ జేయునో యనం గ ను
    దధి పాత్రన్ వి మెసెo గె దావాన ల మై

    రిప్లయితొలగించండి
  7. విధి వక్రించిన వేళన
    నధిదేవుని ధూపమొసగి యర్చన జేయన్
    నధికమగు వేడిమికి యా
    దధిపాత్రన్ విష మెసంగె దావానలమై

    దధి = సరళమను ధూపద్రవ్యము
    విషము = రసాయనము

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      "వేళను... యర్చింపగ నా యధికమగు...* అనండి.

      తొలగించండి
  8. సుధలన్ జిల్కెడు నూత్న యవ్వనమునన్  శోభాయ మానంబుగా
    విధుడున్ కౌముదులొక్కటైన పగిదిన్ వెల్గొందిరా దంపతుల్
    విధితానాడిన వింతనాటకమునన్ వేరైతిరా యిర్వురున్
    దధిపాత్రమ్మున కాలకూట మెగసెన్ దావానలాభీలమై

    రిప్లయితొలగించండి
  9. సుధలొలికెడు కాపురమున
    విధియాడిన నాటకమ్ము విడదీసె జతన్
    వ్యధ మధువును కోరుకొనెను
    దధిపాత్రన్ విష మెసంగె దావానలమై

    రిప్లయితొలగించండి
  10. సుధనాశించి యొనర్చిన
    మథనమునన్ సురనసురులు మనికితపడగా
    విధివిహితముగా కలశో
    దధిపాత్రన్ విష మెసంగె దావానలమై

    రిప్లయితొలగించండి
  11. సుధకై పాలసముద్రమున్ జిలుకగా శుక్రాంతవాసుల్ సురల్
    మధుజిత్ కచ్ఛపమై చరించుచును హేమాద్రిన్ భరించంగ నా
    మదనారీ గళ భూషణమ్మువటియై మన్నించి, క్రక్కన్, మహో
    దధిపాత్రమ్మున, కాలకూట మెగసెన్ దావానలాభీలమై

    రిప్లయితొలగించండి
  12. సుధకై సురలసురులు నం
    బుధినిచిలుకుచుండగనటబుట్టెనుతొలుతన్
    విధియుభవుడుగనకలశో
    దధిపాత్రన్విషమెసంగెదావానలమై


    రిప్లయితొలగించండి
  13. మధుసూదను నాదేశము
    సుధ బొందను శుద్ధ కడలి సురలసురులు తా
    మధి కాంక్షను జిల్కగ నా
    దధి పాత్రన్ విషమెసంగె దావానలమై.
    కడయింటి కృష్ణమూర్తి..గోవా.. 15-4-23

    రిప్లయితొలగించండి
  14. కం॥ విధిగా కశ్యప సంతతి
    సుధకై చిలికిరట క్షీర సాగరముఁ గనన్
    సుధకన్న ముందు సంద్రము
    దధి పాత్రన్ విషమొసంగె దావానలమై

    మ॥ అధికారమ్మన రాజకీయమున హాహాకారముల్ సేయుచున్
    బుధమార్గమ్మును వీడి నాయకులు కోపోద్రిక్తులై పోరుచున్
    వ్యధలన్ బెంచుచు మానవాళులనిటుల్ పాలించుటన్ జూడఁగన్
    దధిపాత్రమ్మున కాలకూట మెగసెన్ దావనలాభీలమై

    మరొక పూరణ
    మ॥ అధికారమ్మునకై సతీపతులు హాహాకారముల్ సేయఁగన్
    సుధలన్ జిమ్మెడు కాపురమ్మున నిటుల్ సాధింపులే గ్రమ్మఁగన్
    బుధవర్గమ్ముల బోధనల్ వినక నాపోరుల్ ఘనమ్మై చనన్
    దధిపాత్రమ్మున కాలకూటమెగసెన్ దావానలాభీలమై

    రిప్లయితొలగించండి