5, ఏప్రిల్ 2023, బుధవారం

సమస్య - 4387

6-4-2023 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“ఏడుపులె కాపురమ్మున వేడుక యగు”
(లేదా...)
“ఏడ్పులు సంతసమ్ముఁ గలిగించును కమ్మని కాపురమ్మునన్”
(అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారికి ధన్యవాదాలతో...)

22 కామెంట్‌లు:

  1. వారి యన్యోన్య దాంపత్య ఫలిత మదియె
    సతియె గర్భమ్ము దాల్చుట సంతసమ్మె
    యింట ముద్దుసుత జనించె చంటి పాప
    ఏడుపులె కాపురమ్మున వేడుక యగు.

    రిప్లయితొలగించండి
  2. మనసుగలిసినజంటలమార్గమందు
    శిశువుజనియింపనొనగూడుసేమమంత
    బాల్యచేష్టలరోదింపబాధలేదు
    ఏడుపులెకాపురమ్మునవేడుకయగు

    రిప్లయితొలగించండి
  3. తేటగీతి
    బ్రతుక జాలను కడుపది పండకుండ
    తల్లి తనమునఁ దరియించు తరుణిజన్మ
    మగడ! పసికూనలాడుచు మసల వారి
    యేడుపులె కాపురమ్మున వేడుక యగు

    ఉత్పలమాల
    కడ్పున కాయకాయకయె కాదది జన్మము స్త్రీ కటంచు చే
    మోడ్పుల నెల్ల దేవతల ముచ్చట దీరగ వేడుకొంటినే,
    నూడ్పగ లేవకో మగడ! యొక్కడు పుట్టిన చాలు వానివౌ
    నేడ్పులు సంతసమ్ముఁ గలిగించును కమ్మని కాపురమ్మునన్

    రిప్లయితొలగించండి

  4. కడ్పది పండి యంగభువు కావలెనంచును కోర్కె హెచ్చగా
    ముడ్పును గట్టి కోరుకున పుత్రుడు పుట్టెను వాడు బట్టలన్
    దడ్పిన నేమి ఛీయనరు తల్లియు తండ్రియు నింట చంటివా
    రేడ్పులు సంతసమ్ముఁ గలిగించును కమ్మని కాపురమ్మునన్.

    రిప్లయితొలగించండి
  5. చేడ్పడిసత్యభామయునుశోకమునందుచుకృష్ణుసన్నిధిన్
    గాడ్పునెఱ్ఱవారినముఖాగ్రమునందుచుబిట్టునుల్కుచున్
    కడ్పదిసంద్రమా
    నగగర్జనజేయుచురోదనందెగా
    ఏడ్పులుసంతసమ్మునుగలిగించునుకమ్మనికాపురమ్మునన్

    రిప్లయితొలగించండి
  6. పెక్కు విధముల యత్నించి విఫలు లైన
    దంపతులకొక్క పుత్రుడు దయము గాగ
    ముదము పొంగగ వారింట ముద్దు పాప యేడుపు లె కాపు రమ్మున వేడుక లగు

    రిప్లయితొలగించండి
  7. కొమరునికి పెండ్లి బంధము కుదిరి నంత
    జాగు సేయక వివహము జరుపగ , దొలి
    వత్సరమునందె యింటన పసిశిశువుల
    యేడుపులె కాపురమ్మున వేడుక యగు

    రిప్లయితొలగించండి
  8. రిప్లయిలు
    1. చక్కనైనట్టి భర్తకు చక్కని సతి
      మేలి వలపుల గుర్తుగ చూలునమరి
      కనులవిందుగ తమకుపుట్టిన శిశువుల
      యేడుపులె కాపురమ్మున వేడుక యగు

      తోడ్పడు పత్నియే మిగుల తోషము నొందగ పట్టుబట్టి తా
      చేడ్పడి చూలునొంది పతి చెంతకు చేరిన ముద్దుగుమ్మ కై
      మోడ్పుల తోడతెల్పె తన ముద్దుల బిడ్డల గాంచి హాయిగా
      'ఏడ్పులు సంతసమ్ముఁ గలిగించును కమ్మని కాపురమ్మునన్'

      తొలగించండి
  9. తోడ్పడు చుండ నాలు పతితో, మరి భర్తయు ప్రేమ సీమలన్
    గడ్పగ యాలి తోడుత, సుగంధము లెన్నియొ నింట వీచ నా
    గాడ్పుల నుండి యొక్క పసి కందు జనించి యొనర్చినట్టి వౌ
    యేడ్పులు సంతసమ్ము కలిగించును కమ్మని కాపురమ్మునన్!

    రిప్లయితొలగించండి
  10. చేడ్పడి రింటియందు నొక చిన్నరి పాపయులేక వేసవిన్
    గాడ్పులువీచినట్లు మదిఁ గాసిలి సంతతిఁ గోరి భక్తి కై
    మోడ్పులఁ జేసి దైవమును మ్రొక్కగఁ బుట్టెను ముద్దు బిడ్డఁడా
    యేడ్పులు సంతసమ్ముఁ గలిగించును కమ్మని కాపురమ్మునన్

    రిప్లయితొలగించండి
  11. చిట్టి పాపడు దోగాడనట్టి యింట
    నెన్ని భోగభాగ్యములున్న నేమి ఫలము
    వీనులకు విందు గూర్చుచు పిల్లవాండ్ర
    ఏడుపులె కాపురమ్మున వేడుక యగు

    రిప్లయితొలగించండి
  12. ఉ.

    గాడ్పులు వేడిగా విసర గబ్బున దేహములయ్యె నార్తితో
    *నేడ్పులు, సంతసమ్ముఁ గలిగించును కమ్మని కాపురమ్మునన్*
    దోడ్పడు వాయుమండలము తోయముఁ జల్లగ యంత్ర సాధనల్
    మాడ్పులు తూగ, జంపతుల మైథున వాంఛను వంశవృద్ధికై.

    రిప్లయితొలగించండి
  13. కొనింటి. రమేశ్

    తే.గీ
    నవ్వు లొకనాడు భార్యతో నప్పునట్లు
    సరస విరసాలు సంసార సాగరమున
    కష్టసుఖముల నెదురొడ్డి కలిసి బ్రతుక
    *నేడ్పులే కాపురమ్మున వేడ్క యగును !*

    రిప్లయితొలగించండి
  14. తే॥ కలిసి యన్యోన్య దాంపత్య కమ్మదనపు
    మచ్చటఁ దనియఁ బుట్టగ ముద్దులొలుకు
    చిన్ని పాప యాయింటను జిట్టి పాప
    యేడుపులె కాపురమ్మున వేడుక యగు

    ఉ॥ ముడ్పులు గట్టి యింతి ఘన మోహన రూపుని వేడ సంతుకై
    తోడ్పడె భర్తయున్ గొలిచి దోగాడు బాలుడు చిన్ని పాపకై
    మాడ్పు మొకంబులున్ వెలుగ మానిని పుత్రుఁ గనంగఁ బాలకుం
    యేడ్పులు సంతసమ్ముఁగలిగించును కమ్మని కాపురమ్మునన్

    రిప్లయితొలగించండి
  15. సమస్య: ఏడ్పులు సంతసంబు కలిగించును కమ్మని కాపురంబునన్
    తోడ్పడ వెజ్జు బిడ్డఁ గని తోషముతో చనుదెంచ భార్య తాన్
    గాడ్పుల నుండి కావ చలిగాలి నొసంగెడి యంత్ర ముంచగా
    కడ్పున బుట్టినట్టి చిరు కన్నడు తల్లిని గాంచ చేయు నా
    యేడ్పులు సంతసంబు కలిగించును కమ్మని కాపురంబునన్

    రిప్లయితొలగించండి

  16. పిన్నక నాగేశ్వరరావు.

    సంతు లేదని దంపతుల్ చింతనొందె
    కడకు గర్భము దాల్చె నా పడతి తనదు
    మ్రొక్కులు ఫలించి;యొక మంచి రోజున ప్రస
    వమ్మునందె కవలలను, పసి శిశువుల
    యేడుపులు కాపురమ్మున వేడుక యగు.

    రిప్లయితొలగించండి
  17. ఉ||
    కడ్పున కాయగాచెనని కన్నులపండువ యైనదంచు చే
    మోడ్పుల నెల్ల దేవతల మొక్కగ, నొప్పుల మర్చియెల్ల డన్
    తోడ్పడు భర్తగాంచి తనదోసిట నుండిన ముద్దుబిడ్డడా
    యేడ్పులు సంతసమ్ముఁగలిగించును కమ్మని కాపురమ్మునన్

    రిప్లయితొలగించండి
  18. సంతుకోరివ్రతమ్ములుచక్ఠగాను
    నాచరించినతరువాయినతివ కడుపు
    పండిసదనమందునపసి పాప యొక్క
    యేడుపులె కాపురమ్మున వేడుకయగు.

    మరొక పూరణ

    కడ్పది పండకున్ననికకాయము వ్యర్థముగొడ్డురాలిగా
    నేడ్పుమొగమ్ముతోడమననిచ్చయులేదయ రమ్ముకొండకున్
    ముడ్పులుగట్టిసాగుదము,పుట్టినచాలునుబిడ్డనింక నా
    యేడ్పులుసంతసమ్ముకలిగించునుకమ్మనికాపురమ్మునన్

    రిప్లయితొలగించండి