29, ఏప్రిల్ 2023, శనివారం

సమస్య - 4408

30-4-2023 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“ముగురు పంచపాండవులు సంపూజ్యులైరి”
(లేదా...)
“ముగ్గురు పంచపాండవులు మూడు జగంబుల వన్నె కెక్కిరే”
(బులుసు అపర్ణ గారి ఒంగోలు శతావధాన సమస్య)

34 కామెంట్‌లు:


  1. వగ్గులె యైననేమి కడు పౌరుష వంతులు భీష్మద్రోణులన్
    నెగ్గెడు వాడెవండనిని నీరజ నేత్రి సుభద్ర పుత్రుడా
    మొగ్గరమందు గూలినను బోదడు వాడభి మన్యుతోడనా
    ముగ్గురు, పంచపాండవులు మూడు జగంబుల వన్నె కెక్కిరే.

    రిప్లయితొలగించండి
  2. తాతభీష్మునియొడిలోనదారిగనిరి
    గురుడుద్రోణునిశిక్షణకుశలులైరి
    దేవదేవుండుతోడుగాతేటపడిరి
    ముగురుపంచ, పాండవులుసంపూజ్యులైరి

    రిప్లయితొలగించండి
  3. సిగ్గులమొగ్గ ద్రోవదిని చేగొని నట్టి మహామహుండ్రు తా
    మెగ్గులనెల్లనోరిమి వహించి సహించుచు కాననమ్మునన్
    మ్రగ్గిన నేమిరా కనగ మాద్రికి నిర్వురు గాగ కుంతికిన్
    ముగ్గురు పంచపాండవులు మూడు జగంబుల వన్నె కెక్కిరే.

    రిప్లయితొలగించండి
  4. తగ్గనిధైర్యసాహసముతాతగభీష్ముఁడుపంచియిచ్చెనే
    నిగ్గునుజూపయుద్ధముననేర్పరులైరిగద్రోణుశిక్షలో
    పగ్గములందకృష్ణుడునుభాసురకీర్తివిజేతలైరిగా
    ముగ్గురుపంచపాండవులుమూడుజగంబులవన్నెకెక్కిరే

    రిప్లయితొలగించండి

  5. ధర్మ మార్గము విడని యాదర్శమూర్తు
    లనుచు కీర్తి బడసినట్టి యనఘులు గద
    మాద్రి సుతులిర్వురు పృథకు మారు లైన
    ముగురు పంచపాండవులు సంపూజ్యులైరి.

    రిప్లయితొలగించండి
  6. తేటగీతి
    దేవతల మారు రూపముల్ చేవఁగలిగి
    ధర్మ సంరక్షణార్థము ధరణి దిగగ
    మాద్రి సుతులిద్దరు, పృథ కుమారులౌచు
    ముగురు, పంచపాండవులు సంపూజ్యులైరి

    ఉత్పలమాల
    అగ్గజమైన వేదనల నందెను సంతతి పాండురాజటన్
    నెగ్గిన భార్యలిద్దరును నిస్తులమైన వరాలఁ వేడఁగన్
    దగ్గర జేరి మాద్రికిడ దైవములిర్వురిఁ గుంతి పొందగన్
    ముగ్గురు, పంచపాండవులు మూడు జగంబుల వన్నె కెక్కిరే

    రిప్లయితొలగించండి
  7. క్రొవ్విడి వెంకట రాజారావు:

    ధర్మపథమున నిల్పెడి కర్మలన్ని
    దృఢమనస్కులై సలిపి మాద్రికగు జంట
    కొడుకులను గూడి వెల్గిన కుంతిసుతులు
    ముగురు పంచ పాండవులు సంపూజ్యులైరి.

    రిప్లయితొలగించండి
  8. ధర్మ ముకు మారు రూ పైన ధర్మ జుడును
    భీమ పార్థులు వెల్గిరి వీరు లగుచు
    మాద్రి సుతు లి ర్వురు పృథ కుమారులైన
    ముగురు పంచ పాండవులు సం పూజ్యులైరి

    రిప్లయితొలగించండి
  9. ముగ్గురు పాండవేయులకు పూజ్యులు భీష్మ పితామహుండు బల్
    లగ్గగు రీతి విద్యలను రక్తిగ నేర్పిన కుంభజన్ముడున్
    పగ్గముబూని యుద్ధమున బాసట నిల్చిన కృష్ణమూర్తి, యీ
    ముగ్గురు, పంచపాండవులు మూడు జగంబుల వన్నె కెక్కిరే

    రిప్లయితొలగించండి
  10. భీష్ముఁడును కుంభజన్ముఁడు పేర్మినరసి
    వెన్నుదన్నుగ నిలచిన వేణుధరుఁడు
    పాండుసుతులకు పూజ్యులు మండితముగ
    ముగురు, పంచపాండవులు సంపూజ్యులైరి

    రిప్లయితొలగించండి
  11. క్రొవ్విడి వెంకట రాజారావు:

    నిగ్గునొసంగు ధర్మములు నిత్యము పూనికతో ఘటించియున్
    బెగ్గలమొందనట్టి నెఱి భీమరమందు పెనంగి జేతలై
    అగ్గలమొంది మాద్రి వర యౌరసులిద్దరు, కుంతి సూనులున్
    ముగ్గురు పంచపాండవులు మూడు జగంబుల వన్నె కెక్కిరె!

    రిప్లయితొలగించండి
  12. భరత కావ్యమునందున పాండు సుతులు
    మాద్రి కిరువురై జన్మించి మాన్యులైరి
    ధీరులై ప్రకాశించు కుంతి హృదయజులు
    ముగురు పంచపాండవులు సంపూజ్యులైరి


    ముగ్గురు కారు పాండవులు మొక్కరమేమియు లేని వారలున్
    తగ్గక యుద్ధమందు తమ ధాటిని చూపిన వీర వర్యులై
    నెగ్గిరి మాద్రి పుత్రులుగ నిద్దరు భాసిలు కుంతి పుత్రులై
    ముగ్గురు పంచపాండవులు మూడు జగంబుల వన్నె కెక్కిరే

    రిప్లయితొలగించండి
  13. వన్నె గనిరి చరితమున పాండు సుతులు ,
    రామ నామధేయులు బలరామ, పరశు
    రామ ; శ్రీ రాములు మన పు రాణ ములన
    భరత జాతికంతకు వారె బైసి నొసగి
    ముగురు , పంచపాండవులు సంపూజ్యులైరి

    రిప్లయితొలగించండి
  14. తే॥ ధర్మమూర్తులనుచుఁ బేరుఁ గర్మ ఫలము
    తోడఁ బొంది కృష్ణుని గృప తోడ వెలుఁగు
    మాద్రి సుతులిరువురు కుంతి మాత సుతులు
    ముగురు పంచపాండవులు సంపూజ్యులైరి

    ఉ॥ సిగ్గును వీడి కౌరవులు చేయఁ గుతంత్రము యుద్ధమందునన్
    నెగ్గిరి కృష్ణుఁడండగను నిల్వఁగ మేటిగ ధర్మమూర్తులే
    యెగ్గుల సైఁచి మాద్రి సుతులిద్దరు పుత్రులు మాత కుంతికిన్
    ముగ్గురు పంచపాండవులు మూడు జగంబుల వన్నెకెక్కిరే

    రిప్లయితొలగించండి
  15. నెగ్గెడి సత్త యుండినను నిక్కము
    భీష్ముడు ద్రోణ కర్ణులున్
    దిగ్గజ వీరు లోడిరని దేజు లధర్ముల
    ప్రక్కజేరి యా
    ముగ్గురు, పంచ పాండవులు మూడు
    జగంబుల వన్నెకెక్కిరే
    మొగ్గరమందు గెల్చియును బూజ్యులు
    మిక్కిలి ధర్మ తేజులున్

    రిప్లయితొలగించండి
  16. అగ్గలమైన ప్రేమమున నా పృథఁ గాంచుచు సంచరించి పె
    న్నెగ్గులు పెట్టు జ్ఞాతుల సహించుచు ధర్మము నెంచి, వైరులన్
    మ్రగ్గగ చేసి, యిర్వురు కుమారులు మాద్రికి, కుంతి పుత్రులౌ
    ముగ్గురు పంచపాండవులు మూడు జగంబుల వన్నెకెక్కిరే

    రిప్లయితొలగించండి
  17. సృష్టిని స్థితిని లయమునున్ చేయు వారు
    పెండ్లి యాడిరి ద్రౌపదిన్ వేడ్కతోడ
    జనుల చేతను వీరలు జగతియందు
    ముగురు పంచపాండవులు సంపూజ్యులైరి”*

    రిప్లయితొలగించండి