19, ఏప్రిల్ 2023, బుధవారం

సమస్య - 4399

20-4-2023 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“చప్పిడి పద్యముల రచన చాల్చాలు మిఁకన్”
(లేదా...)
“చాలును చాలు చాలుమిఁకఁ జప్పిడి పద్యము లల్లఁబోకుమా”
(బులుసు అపర్ణ గారి ఒంగోలు శతావధాన సమస్య)

24 కామెంట్‌లు:


  1. కాలము మారెనంచు మమకారము వీడుచు మాతృభాషనే
    హేళన జేయువారలిట హెచ్చిరటంచు రచింపనేల వై
    మాలముగా నిరర్థకపు మాటల తోరస హీన పద్యముల్
    చాలును చాలు చాలుమిఁకఁ జప్పిడి పద్యము లల్లఁబోకుమా.

    రిప్లయితొలగించండి

  2. తప్పుడు పదముల గూర్చుచు
    కుప్పలు తెప్పలుగ వ్రాసి క్షుణ్ణుడ ననుచున్
    జెప్పితి వౌరా? యేలర
    చప్పిడి పద్యముల రచన? చాల్చాలు మిఁకన్.

    రిప్లయితొలగించండి
  3. ఒప్పించరుబుధులసభను
    తొప్పించరుసారమంతసోద్యమెకాదా
    కుప్పించియెగురుకవులై
    చప్పిడిపద్యములరచనచాల్చాలుమికన్

    రిప్లయితొలగించండి
  4. రిప్లయిలు
    1. 1. కవిత్వమాధర్యము అలంకార శోభితమైన పద్యము చెప్పినప్పటికీ అర్థము చేసుకోలేని మూర్ఖునితో ఒక కవిపుంగవుడు:

      కందం
      గొప్ప యలంకారము మే
      లొప్పగ భావమధురిమల నూరెడు పగిదిన్
      జెప్పిన నీకగునే యది
      చప్పిడి, పద్యముల రచన చాల్చాలు మిఁకన్!

      2. ఏకాంతముగా పద్య గురువు తన శిష్యులతో:

      ఉత్పలమాల
      గాలికి తోచినట్టుల నకారణ రీతిగ నూతనత్వమన్
      గోలలతో నలంకరణఁ గూర్పక, భావము శుద్ధి లేదనన్
      మేలగునే? లిఖించెడు నిమిత్తము వ్రాయుదె? శిష్య! మీదటన్
      చాలును చాలు చాలుమిఁకఁ జప్పిడి పద్యము లల్లఁబోకుమా!

      తొలగించండి
  5. చెప్పిరి పండితులెందరొ
    చప్పిడి పద్యముల రచన చాల్చాలుమికన్!
    అప్ప జిలేబీ వినెనా ?
    దెప్పిన పల్కులను బేర్చి దెబ్బలు వేసెన్ :)


    నారదా ! బేగనే బారో :)

    జిలేబి

    రిప్లయితొలగించండి
  6. క్రొవ్విడి వెంకట రాజారావు:

    చెప్పకుమయ్య పటుత్వమె
    దప్పి వఱలు భావహీన దబ్బులతోడన్
    మెప్పు నొసంగక సెలగెడి
    చప్పిడి పద్యముల రచన, చాల్చాలు మికన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. చెప్పకుమయ్య పటుత్వమె
      దప్పి వఱలునట్టి దుడుకు దబ్బులతోడన్
      మెప్పు నొసంగక చెలగెడి
      చప్పిడి పద్యముల రచన, చాల్చాలు మికన్.

      తొలగించండి
  7. మెప్పును బొందని విధముగ
    చప్పున తోచినవి వ్రాసి చక్కని వనుచున్
    గొప్పలు చెప్పుట మానుము
    చప్పిడి పద్యముల రచన చాల్చా లు మిక న్

    రిప్లయితొలగించండి
  8. ఎప్పుడయినను జ దువరుల
    కొప్పిదమగు కతల రచన యొప్పగు నుగదా
    యిప్పుడయిన దీనినెరిగి
    చప్పిడి పద్యముల రచన చాల్చాలు మిఁకన్

    రిప్లయితొలగించండి
  9. గొప్పగ రచనల్ సల్పిన
    చప్పట్లు చరచు విధమున చప్పున బుధులన్
    మెప్పించవలెన్ వినినన్
    చప్పిడి పద్యముల రచన చాల్చాలు మిఁకన్

    కాలముపైనెపంబిడుచు కల్పన చేయకు వెఱ్రిమొఱ్రిగన్
    గాలమువేయబోకు పదగారడి చూపుచు పద్యమందునన్
    లాలనతొంగిచూచియుపలబ్దము గావలె భావమందులో
    చాలును చాలు చాలుమిఁకఁ జప్పిడి పద్యము లల్లఁబోకుమా

    రిప్లయితొలగించండి
  10. క్రొవ్విడి వెంకట రాజారావు:

    మేలిమికాని వాక్యములు మెండుగ జెప్పుచు నిత్యమంతయున్
    వ్రాలుచు సంఘమందు ననువవ్వని సూత్రములేర్చి కూర్చుచున్
    వాలకమంత తోపడగి వ్యర్థములై తనరారు భావముల్
    చాలును చాలు చాలుమిఁకఁ, జప్పిడి పద్యము లల్లఁబోకుమా!

    రిప్లయితొలగించండి
  11. ఒప్పిదమగు పదములతో
    మెప్పుగ పద్దెముల వ్రాయ మేలగు నతుకుల్
    జొప్పించి పేలవంబగు
    చప్పిడి పద్యముల రచన చాల్చాలు మిఁకన్

    రిప్లయితొలగించండి
  12. శ్రీ లలితాంగి మెచ్చుతరి చెక్కిన శిల్పపు రీతి పద్యముల్
    వేలకు వేలు చెప్పిరట పేర్మి కవీశులు ధార కల్గియున్
    చాలదె మంచి బావియది? సాగర తోయములెల్ల దేనికో?
    చాలును చాలు చాలుమిఁకఁ జప్పిడి పద్యము లల్లఁబోకుమా

    రిప్లయితొలగించండి
  13. ఏల వికార చేష్టితము లేల కవీంద్రుడనంచు నీవిధిన్
    గోలగ పద్యపూరణలు కొల్లలు కొల్లలుగా నొనర్చుచున్
    హేలగ నీవిధిన్ జనుల నెక్కుడుగా విసిగించుచుంటివో
    చాలును చాలు చాలుమిఁకఁ జప్పిడి పద్యము లల్లఁబోకుమా

    రిప్లయితొలగించండి
  14. మేలగు పద్య కావ్యములు మేది
    నపై విలసిల్లె నెన్నియో
    లాలిత భారతంబు ఘన లక్షణ
    పద్యపు గ్రంథరాజముల్
    ఏలనొ పుస్తకాలు రసహీనముగాను
    రచింతురిత్తరిన్
    చాలును చాలు చాలినిక సప్పిడి
    పద్యము లల్లబోకుమా

    రిప్లయితొలగించండి
  15. కందం
    ఒప్పిద పద్య కవియొకడు
    చెప్పిన పద్యములలోన చెతురత లేకన్
    చెప్పగ వినిన జనులనెన్
    చప్పిడి పద్యముల రచన చాల్చాలు మికన్

    రిప్లయితొలగించండి
  16. ఎప్పుడు వ్రాసిన నవియే
    చప్పిడి పద్యముల రచన చాల్చాలు మిఁకన్
    గొప్పలు మానుము సాధన!
    దిప్పలు వెట్టంక వ్రాయు తీయని పద్యాల్

    రిప్లయితొలగించండి
  17. కం॥ ఒప్పును రసధారలఁ గని
    తప్పులు లేక నుడువఁగను దప్పుల తడకై
    నప్పని రసహీనమ్మగు
    చప్పిడి పద్యముల రచన చాల్చాలు మిఁకన్

    ఉ॥ పోలుచు భక్తి భావమునఁ బోతన రీతిని వ్రాయనైతివే
    మేలగు రీతి పద్యముల మేదిని మంచిని నేర్పనైతివే
    యేలను భావ శూన్యముగ నీవిధి వ్రాయఁగఁ బద్య మాలలన్
    జాలును చాలు చాలు మిఁకఁ జప్పిడి పద్యము లల్లబోకుమా

    రిప్లయితొలగించండి
  18. బాల!యివేమిపద్యములు బచ్చిగ నున్నవి చూడచూడగా
    చాలును చాలు చాలుమిఁకఁ జప్పిడి పద్యము లల్లఁబోకుమా
    గోలలు దప్ప యేమియును గొంచెము కూడను నర్ధ మౌటలే
    మేలుగ వ్రాయబూనుమిఁక మీగడ లూరెడు భావ సంపదన్

    రిప్లయితొలగించండి
  19. తప్పుగయతులనువేయుచు
    గొప్పగ వ్రాయుదు నటంచు కూర్చుచు సతతం
    బొప్పని ప్రాసపదంబుల
    *“చప్పిడి పద్యముల రచన చాల్చాలు మిఁకన్”*

    రిప్లయితొలగించండి
  20. మేలగు రైతుగా మనుచు మేడిని గైకొని దున్ని క్షేత్రముల్
    హేలగ వ్రాసె భాగవత మింపుగ పోతన భక్తి యుక్తుడై
    పాలకులిచ్చు ముల్లెకయి ప్రస్తుతి జీయ కొఱంత పాండితిన్
    చాలును చాలు చాలుమిఁకఁ జప్పిడి పద్యము లల్లఁబోకుమా

    రిప్లయితొలగించండి

  21. పిన్నక నాగేశ్వరరావు.

    తప్పుడు యతి ప్రాసలతో
    కుప్పలు తెప్పలుగ వ్రాసి గొప్పల కొఱకై
    మెప్పును పొందగ లేనివి
    చప్పిడి పద్యముల రచన చాల్చాలు మికన్.

    రిప్లయితొలగించండి