2, ఏప్రిల్ 2023, ఆదివారం

సమస్య - 4385

3-4-2023 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“ముదిత చీర పొడవు మూరెఁడంత”
(లేదా...)
“పొలఁతుక చీరనుం గొలువ మూరెఁడు మాత్రమె యంతయే తగున్”

15 కామెంట్‌లు:


  1. చైత్రశుద్ధ నవమి జానకి రాముల
    పెండ్లి వేడుకలకు పిలిచి నంత
    సీత కొరకు పట్టు చేలమొసగె నొక
    ముదిత, చీర పొడవు మూరెఁడంత.

    రిప్లయితొలగించండి
  2. నీటిబుడగబ్రతుకునీకెందుకీగుట్టు
    ననుచుతెలియజెప్పునారినవ్య
    చీరలెందుకనుచుఛీయనిరోసెను
    ముదితచీరపొడవుమూరెడంత

    రిప్లయితొలగించండి
  3. ఆటవెలది
    కట్టు బొట్టు మఱచి గాజులెఱుగకుండ
    వగలు చిలుక భామ పాడియగునె
    పదిల పఱచలేని పయ్యెదకెంచెడు
    ముదిత చీర పొడవు మూరెఁడంత!

    చంపకమాల
    వలపులు సింది నాయకుని ప్రక్కన జేరుచు లొంగదీయగన్
    వలువలు సాలకే వగల వాటునదించెడు వారి రీతిగన్
    జిలుగల నేటి కాలమున సిందగ పాడియె? హవ్వ! కొంగుగన్
    బొలఁతుక చీరనుం గొలువ మూరెఁడు మాత్రమె! యంతయే తగున్?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఆటవెలది
      కట్టు బొట్టు మఱచి గాజులెఱుగకుండ
      వగలు చిలుక భామ పాడియగునె
      పదిల పఱచలేని పయ్యెదకెంచెడు
      ముదిత చీర పొడవు మూరెఁడంత!

      చంపకమాల
      వలపులు సింది నాయకుని ప్రక్కన జేరుచు లొంగదీయగన్
      వలువలు సాలకే వగల వాటునదించెడు వారి రీతిగన్
      జిలుగులు నేటి కాలమున సిందగ పాడియె? హవ్వ! కొంగుగన్
      బొలఁతుక చీరనుం గొలువ మూరెఁడు మాత్రమె! యంతయే తగున్?

      ✍️ *గుండా వేంకట సుబ్బ సహదేవుడు*

      తొలగించండి
  4. చం.

    *పొలఁతుక చీరనుం గొలువ మూరెఁడు మాత్రమె యంతయే తగున్*
    కలశమునన్ వశిష్ఠుడు నగస్త్యుడు నూర్వశి గాంచ దండ్రులున్
    విలపన హేతువై పృషద వీక్షణ, మేనక, సాడుపాటుగా,
    తలచుచు జూడ, ద్వాజుడు ఘృతాచిని, ద్రోణుడు పుట్టె వింతగా.

    రిప్లయితొలగించండి
  5. కొనియె ప్రతిమ నొకటి కోమలి కిష్ట మై
    పట్టు వలువ కట్ట పడతి వెడలి
    తెచ్చె వస్త్ర మొకటి. మెచ్చు కొనుచు జూడ
    ముదిత చీర పొడవు మూరె దంత

    రిప్లయితొలగించండి
  6. కూతురి కడనున్న కొత్త ప్రతిమలకై
    చీరలమ్ము వాని చెంతకేగ
    కడు సురూపమైన కఱ్ఱ బొమ్మలలోని
    ముదిత చీర పొడవు మూరెఁడంత

    రిప్లయితొలగించండి
  7. బొమ్మపొత్తికలను పొలుపుగ వధువుకుఁ
    గట్టి నుదుట చిన్న బొట్టు పెట్టి
    ముద్దులొలుకునటుల ముస్తాబు గావింప
    ముదిత చీర పొడవు మూరెఁడంత

    రిప్లయితొలగించండి

  8. పలువురు నిర్ణయించిరని పావనికిన్ రఘు రామమూ
    ర్తులకట పెండ్లిజేయుటకు, తోయలి తెచ్టెద కోకనంచు నా
    కొలతలు చెప్పమంచడగ కోవర మెందుకటంచు తెల్పెనా
    పొలఁతుక, చీరనుం గొలువ మూరెఁడు మాత్రమె యంతయే తగున్.

    రిప్లయితొలగించండి
  9. ప్రేక్షకాదరణము పెంపొందు విధమున
    సృజనసేయు చలనచిత్రమందు
    పాత్రలంగనుగొన బాపురే యందురే
    ముదిత చీర పొడవు మూరెఁడంత


    గలిబిలిచేయనెంచి ఘన కాముక దర్శక చక్రవర్తులే
    మెలకువతోసృజింత్రుగద మెత్తురు చూపఱులంచు పాత్రలన్
    పొలఁతుక చీరనుం గొలువ మూరెఁడు మాత్రమె యంతయే తగున్
    కలియుగమందునన్ వెలయు గర్హ్యపు చిత్రము లెంచి చూడగా


    రిప్లయితొలగించండి
  10. నాయికా నాయకుల్ నాట్య సల్లాపముల్
    జరుపు సమయమున సరస మైన

    దూరము పాటించ నేరంబు గాదె, చ
    లన చిత్రముల‌్ నేడు మనగ లేవు,

    మెప్పును బడయుగా జొప్చించ ఘాటైన
    కౌగిలింతలు కూడి గాలి కూడ

    జొరబడ లేనట్టి సరసంపు సన్నివే
    సములను సృష్టించ,జనులు‌మెచ్చ


    బోరు కట్టనారు గజముల్ చీర నేడు ,

    వదల వలయు నాటి వలువల్, ముదిత చీర

    పొడవు మూరెడంతయె చాలు, దడుపు మాన

    మనెను దర్శకుని గని‌ నిర్మాత యొకడు

    రిప్లయితొలగించండి
  11. లలిత మనోహరమ్ముగ నలంకరణమ్ములఁ జేసి బొమ్మకున్
    పొలుపుగ చిన్న నానమును మోమున దిద్దుచు పెండ్లికూఁతుగా
    జిలుగులనద్ది జెల్వముగ సిద్ధము సేసెను పెండ్లి తంతుకున్
    పొలఁతుక చీరనుం గొలువ మూరెఁడు మాత్రమె యంతయే తగున్

    రిప్లయితొలగించండి
  12. కులసతిద్రౌపదిన్గదిసికౌరవుడంతటసిగ్గులేక
    యున్
    తులువగచీరలాగెగదథూయనిరోయరుసభ్యులయ్యెడన్
    నలువకులేనివస్త్రములునారికిచేటునుదెచ్చెనీవిధిన్
    పొలతుకచీరనున్గొలువమూరెడుమాత్రమెయంతయేతగున్

    రిప్లయితొలగించండి
  13. ఆ॥ ముద్దుముద్దు గాను బొమ్మల పెండ్లిని
    జేయ నెంచి తగిన చీరఁ గొనఁగఁ
    బేరిమిఁ గని మగువ పెండ్లి కూతురు కని
    ముదిత చీర పొడవు మూరెడంత

    చం॥ వలదని ప్రాత పద్ధతులు వాటిని మార్చి విచిత్ర రీతులన్
    మలచిన నాట్య భంగిమల మానిని యాడుచు గంతు లేయఁగన్
    గలవర మాయె నాయుడుపుఁ గాంచఁగ నాట్య మయూరికిన్ యిటుల్
    పొలఁతుక చీరనుం గొలువ మూరెడు మాత్రమె యంతయే తగున్

    రిప్లయితొలగించండి
  14. నేసిరందముగను నేతగాళ్ళిచ్చట
    ముదితచీర,పొడవుమూరెడంత
    విడిగనేసిరటరవికకొరకనుచును
    నదియుకనగనొప్పె నద్భుతముగ.

    రిప్లయితొలగించండి