13-4-2023 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
(ఛందో గోపనము)
“కరమ్మును బట్టఁగ ముని మానసము సెడెన్”
(లేదా...)
“కరముఁ బట్టినంత ముని మానసమయ్యొ వికారమయ్యెరా”
(బులుసు అపర్ణ గారి ఒంగోలు శతావధాన సమస్య)
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
చంపకమాలముకులిత నేత్ర మధ్యమున బూనియు దృష్టి తపమ్మునందునన్సకలము గాంచు ద్రష్టయన సైచక కౌశికు లొంగఁ దీయఁగన్జకిత నగారి మేనకను సారసనేత్రను బంపినంత భామ కరముఁ బట్టినంత ముని మానసమయ్యొ వికారమయ్యెరా
కందంఅకలంక యతికిఁ గౌశికునకు వెఱచి తపమ్ము సెరుప నగవైరియె మేనకఁ బనుప సరసముగ లేమ కరమ్మును బట్టఁగ ముని మానసము సెడెన్
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
🙏ధన్యోస్మి గురుదేవా 🙏
సకలముదైవాధీనమునికరంబగుదీక్షగొనగనిష్కాముండైముకుళితనేత్రునిశంకరుమకరమును బట్టగమునిమానసముసెడెన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.'మకరమ్మును బట్ట...'
చం.చకితులు గారె తాపసులు చక్కని కొమ్మలు దాపుచేరగాప్రకృతిని దేవవేశ్య మురిపాలిడి నాట్యము జేయుచుండెడిన్తికమకనొంది తేరుకొని తిప్పలపాలయి, సుందరాంగి, రామ,*కరముఁ బట్టినంత ముని మానసమయ్యొ వికారమయ్యెరా.*
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
అరయగదేవదేవియనునమ్మణినాట్యవిలాససంపదన్తఱిగనివిప్రుడాసిఘనతామసముగ్ధవచోభిరామయైమురియుచువద్దజేరినవమోహనరూపునచెట్టబట్టతాకరమునుబట్టినంతమునిమానసమయ్యొవికారమయ్యెరా
ప్రశస్తమైన పూరణ. అభినందనలు.
కందంపకపక నవ్వుచు హోయలొలికించి సరి హావభావ లీలలు జూపన్సకియ, యమనియమ ముని వామకరమ్మును బట్టఁగ ముని మానసము సెడెన్ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రిఉండవల్లి సెంటరు.
చక్కని పూరణ. అభినందనలు.
అకలంక ముని యనుచు దలచి కవ్వడిని భక్తితోడ సేవించెడి యాసకి కృష్ణ సహోదరి కోమ కరమ్మును బట్టఁగ ముని మానసము సెడెన్.సకల సుఖమ్ములన్ విడిచి సాధు వశిష్ఠుని తోడ భీష్మ బంధనమొనరించి గాధిజుడు తాపసియై తపమాచరింపగన్ వికృత మనస్కుడైన నగభిత్తపుడంపిన దేవవేశ్య కోమ కరముఁ బట్టినంత ముని మానసమయ్యొ వికారమయ్యెరా.
ప్రశస్తమైన పూరణలు. అభినందనలు.
సుకరముగా సుర లోకాధికరణము నెలకొనమౌని దీక్షనుడుప మేనకనంపెను సురపతి భామకరమ్మును బట్టఁగ ముని మానసము సెడెన్
చకితుని సేయగ వచ్చినసకి య గ మేనక హొయలుల సంకే తము తోచక చక గాధి సుతు ని వామ కరమ్ము ను బట్ట గ ముని మానసము సెడె న్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.'చకితుని జేయగ' అనండి. అక్కడ గసడదవాదేశం రాదు. సరళాదేశం వస్తుంది.
ఒకనాడింద్రుడు పంపగచకచకమనితరలివచ్చె చతురత తోడన్తకతకమని యాడుచు రంభ కరమ్మును బట్టఁగ ముని మానసము సెడెన్
సకలము సాధ్యమంచు ముని సల్పు తపంబును గాంచినోర్వకన్వికలముసేయగా దలచి విహ్వల చిత్తుడు యింద్రుడంపగాచకచక వచ్చెనప్సరస సత్వరమాతని దీక్ష నాప రంభ కరముఁ బట్టినంత ముని మానసమయ్యొ వికారమయ్యెరా
నికము దెలుప ఛాత్రునడుగచకచక వాచించినట్టి చరితము నందున్దకరారుగ దొలుత కరియెమకరమ్మును బట్టఁగ ; ముని మానసము సెడెన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
సకినము మేనక! ఆయమ్మ కరమ్మును బట్టగ ముని మానసము సెడెన్ప్రకటంబాయెను ప్రణయముశకుంతల జననము పండె శాకుంతలమై
సకల జగంబులందు ముని సల్పు తపోనల మాక్రమింపగావికల మనస్కుడై కులిశి వేగమె మౌని తపంబునాప మేనకయను నప్సరన్ బనిచె నాట్యము సల్పుచు చెంత జేరు భామ కరముఁ బట్టినంత ముని మానసమయ్యొ వికారమయ్యెరా
తికమకపడకతపముకౌశికుడొనరించుసమయమునచెరుపంగామేనకయరుదెంచవడిగలేమకరమ్మునుబట్టగమునిమానసముచెడెన్
నికరంబగు భక్తితనదివికలం బాయెనుగ దేవ వేశ్యను చూడన్వికటమ్ముగసరసపుభామ కరమ్మును పట్టగ ముని మానసము చెడెన్
సకల శివమ్ములన్ బడిచి క్షాపతిగా తనరారుచుండి కౌశికుడు మునీంద్రుడై వెలఁగఁ, జేసె తపమ్ము కరమ్ము దీక్షతోడ కలతనొంది వాసవుడడంచగ మేనక నంప, దివ్య భా మ, కరముఁ బట్టినంత ముని మానసమయ్యొ వికారమయ్యెరా
మీ పూరణ బాగున్నది. అభినందనలు.'శివమ్ములన్ బడసి' టైపాటు. 'దీక్షతోడ(న్) + కలత = దీక్షతోడ గలత' అవుతుంది. దానివల్ల ప్రాస తప్పుంతుంది.
revisedసకల శివమ్ములన్ బడచి క్షాపతిగా తనరారుచుండి కౌశికుడు మునీంద్రుడై వెలఁగఁ, జేసె తపమ్ము మనమ్ము దీక్షనుంచి కలతతోడ వాసవుడు చెన్నగు మేనక నంప, దివ్య భా మ, కరముఁ బట్టినంత ముని మానసమయ్యొ వికారమయ్యెరా
కం॥ సకలము నాకీశుఁడనుచుముకుళిత నేత్రములఁ దపము ముని సేయఁ గటాప్రకటిత మైన నొకలలామ కరమ్మును బట్టఁగ ముని మానసము సెడెన్చం॥ సకలము నీశు వాసమగు సర్వులఁ బ్రోచు గదయ్య మక్కువన్ముకుళిత నేత్రుఁడై తపము మోదము తోడను జేతు మక్తికైసకలము వీడెదన్ దనకు సర్వము నీశుఁడనంగ నొక్క భామ కరముఁ బట్టి నంత ముని మానసమయ్యొ వికారమయ్యెరా
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిచంపకమాల
తొలగించండిముకులిత నేత్ర మధ్యమున బూనియు దృష్టి తపమ్మునందునన్
సకలము గాంచు ద్రష్టయన సైచక కౌశికు లొంగఁ దీయఁగన్
జకిత నగారి మేనకను సారసనేత్రను బంపినంత భా
మ కరముఁ బట్టినంత ముని మానసమయ్యొ వికారమయ్యెరా
కందం
తొలగించండిఅకలంక యతికిఁ గౌశికు
నకు వెఱచి తపమ్ము సెరుప నగవైరియె మే
నకఁ బనుప సరసముగ లే
మ కరమ్మును బట్టఁగ ముని మానసము సెడెన్
మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండి🙏ధన్యోస్మి గురుదేవా 🙏
తొలగించండిసకలముదైవాధీనము
రిప్లయితొలగించండినికరంబగుదీక్షగొనగనిష్కాముండై
ముకుళితనేత్రునిశంకరు
మకరమును బట్టగమునిమానసముసెడెన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'మకరమ్మును బట్ట...'
చం.
రిప్లయితొలగించండిచకితులు గారె తాపసులు చక్కని కొమ్మలు దాపుచేరగా
ప్రకృతిని దేవవేశ్య మురిపాలిడి నాట్యము జేయుచుండెడిన్
తికమకనొంది తేరుకొని తిప్పలపాలయి, సుందరాంగి, రా
మ,*కరముఁ బట్టినంత ముని మానసమయ్యొ వికారమయ్యెరా.*
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిఅరయగదేవదేవియనునమ్మణినాట్యవిలాససంపదన్
రిప్లయితొలగించండితఱిగనివిప్రుడాసిఘనతామసముగ్ధవచోభిరామయై
మురియుచువద్దజేరినవమోహనరూపునచెట్టబట్టతా
కరమునుబట్టినంతమునిమానసమయ్యొవికారమయ్యెరా
ప్రశస్తమైన పూరణ. అభినందనలు.
తొలగించండికందం
రిప్లయితొలగించండిపకపక నవ్వుచు హోయలొ
లికించి సరి హావభావ లీలలు జూపన్
సకియ, యమనియమ ముని వా
మకరమ్మును బట్టఁగ ముని మానసము సెడెన్
ప్రబల వేంకట సుబ్రహ్మణ్య శాస్త్రి
ఉండవల్లి సెంటరు.
చక్కని పూరణ. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిఅకలంక ముని యనుచు దల
చి కవ్వడిని భక్తితోడ సేవించెడి యా
సకి కృష్ణ సహోదరి కో
మ కరమ్మును బట్టఁగ ముని మానసము సెడెన్.
సకల సుఖమ్ములన్ విడిచి సాధు వశిష్ఠుని తోడ భీష్మ బం
ధనమొనరించి గాధిజుడు తాపసియై తపమాచరింపగన్
వికృత మనస్కుడైన నగభిత్తపుడంపిన దేవవేశ్య కో
మ కరముఁ బట్టినంత ముని మానసమయ్యొ వికారమయ్యెరా.
ప్రశస్తమైన పూరణలు. అభినందనలు.
తొలగించండిసుకరముగా సుర లోకా
రిప్లయితొలగించండిధికరణము నెలకొనమౌని దీక్షనుడుప మే
నకనంపెను సురపతి భా
మకరమ్మును బట్టఁగ ముని మానసము సెడెన్
చక్కని పూరణ. అభినందనలు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిచకితుని సేయగ వచ్చిన
రిప్లయితొలగించండిసకి య గ మేనక హొయలుల సంకే తము తో
చక చక గాధి సుతు ని వా
మ కరమ్ము ను బట్ట గ ముని మానసము సెడె న్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'చకితుని జేయగ' అనండి. అక్కడ గసడదవాదేశం రాదు. సరళాదేశం వస్తుంది.
ఒకనాడింద్రుడు పంపగ
రిప్లయితొలగించండిచకచకమనితరలివచ్చె చతురత తోడన్
తకతకమని యాడుచు రం
భ కరమ్మును బట్టఁగ ముని మానసము సెడెన్
సకలము సాధ్యమంచు ముని సల్పు తపంబును గాంచినోర్వకన్
తొలగించండివికలముసేయగా దలచి విహ్వల చిత్తుడు యింద్రుడంపగా
చకచక వచ్చెనప్సరస సత్వరమాతని దీక్ష నాప రం
భ కరముఁ బట్టినంత ముని మానసమయ్యొ వికారమయ్యెరా
ప్రశస్తమైన పూరణలు. అభినందనలు.
తొలగించండినికము దెలుప ఛాత్రునడుగ
రిప్లయితొలగించండిచకచక వాచించినట్టి చరితము నందున్
దకరారుగ దొలుత కరియె
మకరమ్మును బట్టఁగ ; ముని మానసము సెడెన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిసకినము మేనక! ఆయ
మ్మ కరమ్మును బట్టగ ముని మానసము సెడెన్
ప్రకటంబాయెను ప్రణయము
శకుంతల జననము పండె శాకుంతలమై
చక్కని పూరణ. అభినందనలు.
తొలగించండిసకల జగంబులందు ముని సల్పు తపోనల మాక్రమింపగా
రిప్లయితొలగించండివికల మనస్కుడై కులిశి వేగమె మౌని తపంబునాప మే
నకయను నప్సరన్ బనిచె నాట్యము సల్పుచు చెంత జేరు భా
మ కరముఁ బట్టినంత ముని మానసమయ్యొ వికారమయ్యెరా
ప్రశస్తమైన పూరణ. అభినందనలు.
తొలగించండితికమకపడకతపముకౌ
రిప్లయితొలగించండిశికుడొనరించుసమయమునచెరుపంగామే
నకయరుదెంచవడిగలే
మకరమ్మునుబట్టగమునిమానసముచెడెన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండినికరంబగు భక్తితనది
రిప్లయితొలగించండివికలం బాయెనుగ దేవ వేశ్యను చూడన్
వికటమ్ముగసరసపుభా
మ కరమ్మును పట్టగ ముని మానసము చెడెన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిసకల శివమ్ములన్ బడిచి క్షాపతిగా తనరారుచుండి కౌ
రిప్లయితొలగించండిశికుడు మునీంద్రుడై వెలఁగఁ, జేసె తపమ్ము కరమ్ము దీక్షతో
డ కలతనొంది వాసవుడడంచగ మేనక నంప, దివ్య భా
మ, కరముఁ బట్టినంత ముని మానసమయ్యొ వికారమయ్యెరా
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'శివమ్ములన్ బడసి' టైపాటు. 'దీక్షతోడ(న్) + కలత = దీక్షతోడ గలత' అవుతుంది. దానివల్ల ప్రాస తప్పుంతుంది.
revised
తొలగించండిసకల శివమ్ములన్ బడచి క్షాపతిగా తనరారుచుండి కౌ
శికుడు మునీంద్రుడై వెలఁగఁ, జేసె తపమ్ము మనమ్ము దీక్షనుం
చి కలతతోడ వాసవుడు చెన్నగు మేనక నంప, దివ్య భా
మ, కరముఁ బట్టినంత ముని మానసమయ్యొ వికారమయ్యెరా
కం॥ సకలము నాకీశుఁడనుచు
రిప్లయితొలగించండిముకుళిత నేత్రములఁ దపము ముని సేయఁ గటా
ప్రకటిత మైన నొకలలా
మ కరమ్మును బట్టఁగ ముని మానసము సెడెన్
చం॥ సకలము నీశు వాసమగు సర్వులఁ బ్రోచు గదయ్య మక్కువన్
ముకుళిత నేత్రుఁడై తపము మోదము తోడను జేతు మక్తికై
సకలము వీడెదన్ దనకు సర్వము నీశుఁడనంగ నొక్క భా
మ కరముఁ బట్టి నంత ముని మానసమయ్యొ వికారమయ్యెరా