20, ఏప్రిల్ 2023, గురువారం

సమస్య - 4400

21-4-2023 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కప్పకుఁ గప్పంబు వేయఁ గడలిం జొచ్చెన్”
(లేదా...)
“కప్పనుఁ గప్ప మిమ్మనఁగఁ గాతరమందుచుఁ జొచ్చె వార్ధిలోన్”
(బులుసు అపర్ణ గారి ఒంగోలు శతావధాన సమస్య)

17 కామెంట్‌లు:

  1. చెప్పినపనిసేయుటకై
    ఒప్పుగమాటలసిరులవియొడిలోబోయన్
    విప్పినఱెక్కలనెగురుగ
    కప్పకుకప్పంబువేయకడలిన్జొచ్చెన్

    రిప్లయితొలగించండి
  2. సంక్షేమ ఫలాలనందిన వెంకప్పకు సైతము పన్నులు వేయగ, తిప్పలు పడువారి గుంపు నొక సముద్రమన, నా సముద్రములో చొచ్చినాడను భావము....

    కందం
    తిప్పలు వెట్టఁగ నేలిక
    నిప్పులు సెరిగెడు జనులట 'నీరధి' మించన్
    గొప్పగ సాయము గొను వెం
    కప్పకుఁ గప్పంబు వేయఁ 'గడలిం' జొచ్చెన్


    ఉత్పలమాల
    తిప్పలు వెట్ట నేలికకు తిక్కఁ గుదర్చఁగ మించి 'నీరధిన్'
    నిప్పలు సెర్గగన్ జనులు నేరములెంచుచు నోపలేమనన్
    గొప్పఁగ సాయమున్ గొనియుఁ గూర్మిని జూపుచు నుండు పేద వెం
    కప్పనుఁ గప్ప మిమ్మనఁగఁ గాతరమందుచుఁ జొచ్చె 'వార్ధిలోన్'

    రిప్లయితొలగించండి

  3. తప్పుడు నేతలు వారే
    యిప్పుడమిని గాలిపీల్చి యిట జరియింపన్
    తప్పదు చెల్లింప మనుచు
    కప్పకుఁ గప్పంబు వేయఁ గడలిం జొచ్చెన్.



    అప్పులతో గృహమ్ము కొనినందుల కింతయటంచు నుప్పుకున్
    బప్పుకు రుద్రభూమికిని పాంశువు లాది సమస్త వస్తువుల్
    పిప్పలమున్ రసోత్తమము పిచ్చల మైనను వీడకుండ వెం
    కప్పనుఁ గప్ప మిమ్మనఁగఁ గాతరమందుచుఁ జొచ్చె వార్ధిలోన్.

    రిప్లయితొలగించండి
  4. కందం
    అప్పుల వెంకని ఋణముకు
    తప్పుడు లెక్క ఋణదాత, ధనముకు వేయన్
    కుప్పవడిన జీవుడు వెం
    కప్పకుఁ గప్పంబు వేయఁ గడలిం జొచ్చెన్

    రిప్లయితొలగించండి
  5. అప్పులు బెర్గిపోయిన నహర్నశమున్
    శ్రమియించి సేధ్యమున్
    దిప్పలు లెక్కజేయకను దేకువతోడను
    జేయు రైతు తా
    దప్పడు యన్నదాత గద, తక్షణమా కృషి
    కుండునైన వెం
    కప్పను గప్పమిమ్మనగ గాతరమందుచు
    జొచ్చె వార్ధిలో.

    రిప్లయితొలగించండి
  6. అప్పాపురమ్మునేలెడు
    తిప్పనతానప్పనముగతిననెంచంగన్
    తప్పనిసరిగా నావెం
    కప్పకుగప్పంబువేయగడలింజొచ్చెన్

    రిప్లయితొలగించండి
  7. తెప్ప పయి సరకుగని వెం
    కప్పకుఁ గప్పంబు వేయఁ ; గడలిం జొచ్చెన్
    తప్పించుకొనగ , నయ్యో
    యప్పటికే వచ్చిరి గద సధిపతు లటకున్

    రిప్లయితొలగించండి
  8. ముప్ప యె సామo తు డొక డు
    చెప్పక శిక్షను విధించి చేటు ను గూర్పన్
    గొప్పగ చెల్లింప గ వెం
    కప్పకు గప్పంబు వేయ కడలి o జొచ్చె న్

    రిప్లయితొలగించండి
  9. క్రొవ్విడి వెంకట రాజారావు:

    మెప్పగు పాలన నిచ్చెద
    తప్పక యోటివ్వమనిన ద్రాబయె నేడున్
    తప్పుగ పన్నులు వేయుచు
    కప్పకు గప్పంబు వేయ గడలిం జొచ్చెన్.

    రిప్లయితొలగించండి
  10. క్రొవ్విడి వెంకట రాజారావు:

    మెప్పగు పాలనన్ యొసగి మేలును గూర్చెద నెల్లవేళలన్
    తప్పక యోటునిచ్చి నను దక్షత నెన్నుము నన్నవాడిలన్
    తప్పుగ గెల్చి పన్నుల నుదారముగా నిడుచున్ విలాతిలో
    కప్పనుఁ గప్ప మిమ్మనఁగఁ గాతరమందుచుఁ జొచ్చె వార్ధిలోన్.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మెప్పగు పాలనమ్మొసగి మేలును గూర్చెద నెల్లవేళలన్
      తప్పక యోటునిచ్చి నను దక్షత నెన్నుము నన్నవాడిలన్
      తప్పుగ గెల్చి పన్నుల నుదారముగా నిడుచున్ విలాతిలో
      కప్పనుఁ గప్ప మిమ్మనఁగఁ గాతరమందుచుఁ జొచ్చె వార్ధిలోన్.

      తొలగించండి
  11. అప్పుల కుప్పకు తిప్పలు
    ముప్పులు తప్పెడు తలపులు ముప్పిరిగొనగా
    కప్పుకు చొప్పకు నుప్పుకు
    కప్పకుఁ గప్పంబు వేయఁ గడలిం జొచ్చెన్

    అప్పులకుప్పయే నిలుపు నప్పనమందున దృష్టి యెన్నడున్
    తప్పుడు మార్గమున్ సొగసి తామసమొప్పెడు పన్నులే సదా
    కుప్పలుతెప్పలౌనటుల గొప్పగ వైచిరి చెత్తపైన బొం
    కప్పనుఁ గప్ప మిమ్మనఁగఁ గాతరమందుచుఁ జొచ్చె వార్ధిలోన్

    రిప్లయితొలగించండి
  12. నిప్పుకు నుప్పుకున్ మరియు నిత్యము మానక బీల్చు గాలికిన్
    పప్పుకు పాలకున్ జనులు బాయక వంటికిఁ గట్టు బట్టకున్
    తప్పక గప్పమీయవలె ద్రావగ నిమ్మన హాహలమ్ము వెం
    కప్పనుఁ గప్ప మిమ్మనఁగఁ గాతరమందుచుఁ జొచ్చె వార్ధిలోన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మూడవ పాదంలో 'ద్రావఁగ నిమ్మన' బదులు ద్రావఁగ నిమ్ముగ' అని చదువగోర్తాను🙏🏿

      తొలగించండి
  13. పప్పుకు నుప్పుకు నప్పుకు
    నిప్పుకు నిరతమ్ము ద్రాగు నీటికి కప్పం
    బొప్పును మద్యమునకు వెం
    కప్పకుఁ గప్పంబు వేయఁగడలిం జొచ్చెన్

    రిప్లయితొలగించండి
  14. కం॥ తిప్పలఁ బెట్టఁగఁ గప్పము
    తప్పని యొప్పక మనుజులుఁ దప్పించుకొనన్
    ముప్పును వెదుకర దారులు
    కప్పకుఁ గప్పము వేయఁ గడలిం జొచ్చెన్

    ఒప్పును గప్పమున్ జనులు నొప్పఁగ నొప్పిని బొందకుండఁగన్
    నప్పును గప్పమెల్లరకు న్యాయముఁ దప్పక నొప్పుచుండగన్
    గప్పము యెక్కువై చనఁగఁ గట్టరు చప్పున నెట్టి వారలున్
    గప్పను గప్ప మిమ్మనఁగఁ గాతరమందుచుఁ జొచ్చె వార్థిలోన్

    రిప్లయితొలగించండి
  15. అప్పాపురమ్మునేలెడు
    తిప్పనతానప్పనముగతిననెంచంగన్
    తప్పనిసరిగా నావెం
    కప్పకుగప్పంబువేయగడలింజొచ్చెన్.

    రిప్లయితొలగించండి