6, ఏప్రిల్ 2023, గురువారం

సమస్య - 4388

7-4-2023 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“బొబ్బిలి యుద్ధమ్ము జరిగెఁ బొలఁతుక కొఱకై”
(లేదా...)
“పొలఁతుక కోసమై జరిగె బొబ్బిలి యుద్ధము ప్రొద్దుటూరులో”

22 కామెంట్‌లు:



  1. గొబ్బెత కోరెనటంచును
    బొబ్బిలి వీరుల గురించి ముదమగు కథతో
    నబ్బురమయిన ప్రదర్శన
    బొబ్బిలి యుద్ధమ్ము , జరిగెఁ బొలఁతుక కొఱకై.

    రిప్లయితొలగించండి

  2. నెలతుక కోరెనంచు పరిణేత కళత్రపు కోర్కె దీర్చగా
    నిలను యశమ్ము నందిన ప్రదర్శన నింపుగ నిచ్చు వారినే
    పిలిచి మహాద్భుతమ్ముగ నభీష్టకు తోషము నందజేసె నా
    పొలఁతుక కోసమై జరిగె బొబ్బిలి యుద్ధము ప్రొద్దుటూరులో.

    రిప్లయితొలగించండి
  3. కందం
    బొబ్బిలి ప్రేమికులిరువురు
    సుబ్బిని ప్రేమించ, నందు సోగ్గాడొకడున్
    గొబ్బునఁ గొన పగ రగిలియు
    బొబ్బిలి యుద్ధమ్ము జరిగెఁ బొలఁతుక కొఱకై

    చంపకమాల
    వలచియు భామనొక్కతెను వాదుకు బొబ్బిలి ప్రేమికుల్ వగన్
    జెలగుచు నిద్దరున్ దిగగ, చెచ్చెర నొక్కడు లేవదీసియున్
    లలనను చేర్చ' నచ్చట' విలాసము గన్గొని చేర వైరులున్
    బొలఁతుక కోసమై జరిగె బొబ్బిలి యుద్ధము 'ప్రొద్దుటూరులో'

    రిప్లయితొలగించండి
  4. బొబ్బిలినగరమునందున
    యబ్బురమౌరీతిగానుయాశించంగన్
    నిబ్బరముగసాగగనా
    బొబ్బిలి యుద్ధమ్ముజరిగె పొలతుక కొరకై

    రిప్లయితొలగించండి
  5. చం.

    అలుపున ఫ్రెంచి చర్చి గొనియాడుచు నన్యమతస్థులై వడిన్
    గలిసిన రాజవీరులను కట్టడచేయగ బ్రాతికూల్యమున్
    కులమత భేద భావములె, గోవుల మాంసము నారగించగా
    *పొలఁతుక కోసమై జరిగె బొబ్బిలి యుద్ధము ప్రొద్దుటూరులో.*

    రిప్లయితొలగించండి
  6. అబ్బురముగ. నీటి కొరకు
    బొబ్బిలి యుద్ధమ్ము జరిగె ; బొలఁతుక కొఱకై
    దబ్బున పరులయిరి నృపులు
    సిబ్బందులు వెంట రాగ చేసిరి పోరుల్

    రిప్లయితొలగించండి
  7. గురువర్యులకు నమస్సులు. నా నిన్నతి మొన్నతి పూరణలను పరిశీలించి తప్పొప్పుల తెలుప ప్రార్థన.

    తోడ్పడు చుండ నాలు పతితో, మరి భర్తయు ప్రేమ సీమలన్
    గడ్పగ యాలి తోడుత, సుగంధము లెన్నియొ నింట వీచ నా
    గాడ్పుల నుండి యొక్క పసి కందు జనించి యొనర్చినట్టి వౌ
    యేడ్పులు సంతసమ్ము కలిగించును కమ్మని కాపురమ్మునన్!

    పచ్చి నిజమ్ములన్ బ్రజకు పంచగ సక్రమ పాలనమ్మనన్
    యచ్చెరువంద సంవదన మబ్దములన్ గొన సాగుచుండగా
    మచ్చలు లేని బాధితుల మానము సైతము రచ్చ కెక్కినన్
    జచ్చిన పామునే మరలఁ జంపుట న్యాయము సత్య శోధనన్
    ధన్యవాదములు. శ్రీధరరావు.

    రిప్లయితొలగించండి
  8. కొబ్బరి బొండలము విసరి
    బెబ్బులినేచంపితినను పిట్టలదొరలా
    సుబ్బడుపల్కినమాటలు
    'బొబ్బిలి యుద్ధమ్ము జరిగెఁ బొలఁతుక కొఱకై'

    పొలతుక వేయనెంచెనట బొబ్బిలియుద్దము నాటకంబులో
    విలసితమైన వేషమును వీక్షకులే కనరాక వేదికే
    వెలవెలబోయినన్ కడకు విజ్ఞవరానన కోరినంతటన్
    పొలఁతుక కోసమై జరిగె 'బొబ్బిలి యుద్ధము' ప్రొద్దుటూరులో

    రిప్లయితొలగించండి
  9. అబ్బురపు నాటకమ్మును
    నిబ్బర ముగ. జూడ నెంచ నె ఱు లుగ. బతి తా
    గొ బ్బె త గొని బోవగ నా
    బొబ్బిలి యుద్ధమ్ము జరిగె పొలతు క కొఱ కై

    రిప్లయితొలగించండి
  10. అబ్బురపడె గనినంతనె
    బొబ్బిలి యుద్ధమ్ము, జూప పురమున సతికిన్
    సుబ్బయ కోరఁగ మిత్రుని
    బొబ్బిలి యుద్ధమ్ము జరిగెఁ బొలఁతుక కొఱకై

    రిప్లయితొలగించండి
  11. పలువురి మన్ననల్వడసి పండితపామర రంజకమ్ముగా
    పలు నగరమ్ములందుఁ బొలుపార ప్రదర్శనలిచ్చి నంతటన్
    లలనకు నూరివారలను రంజిలజేయగ కోర్కిబుట్టగన్
    పొలఁతుక కోసమై జరిగె బొబ్బిలి యుద్ధము ప్రొద్దుటూరులో

    రిప్లయితొలగించండి
  12. నిబ్బరమించుకలేకను
    మబ్బునుతోడైమనసునమగవాడుండన్
    కబ్బములన్నిటకలతలు
    బొబ్బిలియుద్ధమ్ముజరిగెపొలతుకకొఱకై

    రిప్లయితొలగించండి
  13. కులసతిసీతదెచ్చెగదకుందకరావణుడంతరాత్మలో
    కలతలరాజుయోధనుడుకాంతనుద్రౌపదిచేలమూడ్చెనే
    పలుమరువేటగాండ్రువలెపంతముతోడుతవీరులుండిరే
    పొలతుకకోసమైజరిగెబొబ్బిలియుద్ధముప్రొద్దుటూరులో

    రిప్లయితొలగించండి
  14. తలపున పుట్టె నాకిపుడు తప్పక బొబ్బిలి యుద్ధము చూడకోర్కె యం
    చ లరుచు పల్కు కోమలిని చక్కగజేకొని ప్రొద్దుటూరికిన్
    విలసిత రీతిగా వెడలి వెంట నె నాటకరంగమందు నా
    పొలతు క కోసమై జరిగె బొబ్బిలి యుద్ధము ప్రొద్దుటూరు లో

    రిప్లయితొలగించండి
  15. కం॥ ఇబ్బడిముబ్బడి ప్రేమతొ
    యబ్పురముగఁ జరుగఁ బెండ్లి యమ్మడు దండ్రే
    జబ్బలఁ జరచఁగ నచ్చక
    బొబ్బిలి యుద్ధమ్ము జరిగెఁ బొలఁతుక కొరకై

    చం॥ వలచిన భామ ప్రేమఁగని ప్రాణమటంచును బెండ్లి యాడఁగన్
    దలచుచు నామె బంధువులు తక్కువ వాఁడని వేరుఁ జేయఁగన్
    గలహము రేఁగ నామిషను గ్రామమునందునఁ జిచ్చు పెద్దదై
    పొలతుక కోసమై జరిగె బొబ్బలి యుద్ధము ప్రొద్దుటూరులో

    రిప్లయితొలగించండి
  16. అబ్బురమవి నీమాటలు
    బొబ్బిలి యుద్ధమ్ము‌ జరిగె‌ఁ‌ బొల‌ఁతుక‌ కొఱకై‌;
    దెబ్బలు‌ తగులును‌ నీకును‌
    బొబ్బిలి చరితను‌ చెరచిన‌, బొంకకు‌ చిన్నా!

    రిప్లయితొలగించండి