14-4-2023 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“దారములో నీశ్వరుండు దాండవమాడెన్”
(లేదా...)
“దారములోన నీశ్వరుఁడు దాండవమాడెను నిర్వికల్పుఁడై”
(బులుసు అపర్ణ గారి ఒంగోలు శతావధాన సమస్య)
ఆరనితపమునజీవుండేజామునునిదురగనకడెందమునలయన్సారముశంభుండనకేదారములోనీశ్వరుండుతాండవమాడెన్
కోరిన వరమిచ్చును కేదారేశ్వరుడని తలచుచు దర్శింతురుగాకారణ కారణమును కేదారములో నీశ్వరుండు దాండవమాడెన్
కోరినవిచ్చునంచు చని కొల్తురు భక్తులు లక్షలాదిగాకారణకారణుండయిన కల్మష కంఠుని రూపురేఖలన్బారులుతీరుభక్తజన వాహిని తప్పక చెప్పుచుంద్రు కేదారములోన నీశ్వరుఁడు దాండవమాడెను నిర్వికల్పుఁడై
ధన్యవాదాలు గురూజీ 🙏
పారమునందగానరుడుపావనుశంకరురూపునాత్మలోకోరుచుసాధనన్మిగులకొందలమందకవిస్మరింపకన్మీరకశమభునామమునుమేకొనివేడగభక్తుడంతకేదారములోననీశ్వరుడుతాండవమాడెనునిర్వికల్పుడై
మీ పూరణ బాగున్నది. అభినందనలు. 'శంభునామమును' టైపాటు.
శంభునామమును
ఉ.చేరెను నాదిశంకరుడు శీతల భారత దేశ భాగమున్గూరిమితోడ లింగమును గొప్పగ స్థాపనఁ జేసె, హిందువై,పేరిమినొంద భక్తునికిఁ బెక్కు ప్రబంధములిచ్చు శక్తి, కే *దారములోన నీశ్వరుఁడు దాండవమాడెను నిర్వికల్పుఁడై.*
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
ధారాధరములు ముసురుచుభూరిగ నురుముచు మెరియుచు పూరణ మట నవ్వారిగ గురియ పలికె కం దారములో నీశ్వరుండు దాండవమాడెన్. భూరిగ వానలే కురిసి భూరిజ మెల్లెడ నీరుజేరె నవ్వారిగ సోమధారలవి పారగ వాసిగ పెర్గినట్టి యాపైరులు పిల్ల తెమ్మెరకు పల్లటిలన్ గని కాపు పల్కె కేదారములోన నీశ్వరుఁడు దాండవమాడెను నిర్వికల్పుఁడై.
కోరిన వరము లాసంగి యుదారము గా భక్త జనుల దైవం బగు చున్కారణు డై వెలసియు కేదారములో నీశ్వరుండు దాండవ మాడెన్
శ్రీరామ మంత్ర వేదియుఆ రామునిచరిత తెల్పె సతిపార్వతితోపేరిమి కథకు హృదయ కందారములో నీశ్వరుండు దాండవమాడెన్కందారము = మేఘము
నారాయణ నరులిరువురుపారి శివుని లింగమునకు వందని నిడగన్భూరిగ సంతస పడి కేదారములో నీశ్వరుండు దాండవమాడెన్
ఔరా భారత దేశముపోరాడి సమస్యల, గెలుపు తనదె యనగాహేరాళమ్ముగ నా కేదారములో నీశ్వరుండు దాండవమాడెన్జిలేబి
కూరిమి వరములనొసఁగెడుకారణకారణము లీల కలలో గంటిన్కోరఁగ గిరిరాట్సుత కేదారములో నీశ్వరుండు దాండవమాడెన్
కోరను భోగభాగ్యములఁ గోరను నే సురలోక సౌఖ్యముల్కోరితినొక్కమారు గన కూరిమి నీశ్వర సన్నిధానమున్గారవమొప్ప స్వప్నమున గాంచితి కన్నుల విందొనర్చి కేదారములోన నీశ్వరుఁడు దాండవమాడెను నిర్వికల్పుఁడై
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
కందంఘోరావమానమున నంగారమునందు సతి దూక కసినొక జటఁ దాజారిచి కైలాసపు కేదారములో నీశ్వరుండు దాండవమాడెన్ఉత్పలమాలచేరియు దక్షయజ్ఞమును జిచ్చఱకంటినిఁ గాదటంచుఁ దాఘోర పరాభవాన సతి గుండమునందున బూదియైననేజారిచి కాళరుద్రునిగ జయ్యన కేశము ద్రుంచి గేహ కేదారములోన నీశ్వరుఁడు దాండవమాడెను నిర్వికల్పుఁడై
🙏ధన్యోస్మి గురుదేవా!🙏
క్రొవ్విడి వెంకట రాజారావు: ఆరటపెట్టి మురిసి తన దార నపచరించినట్టి దక్షునిపైనన్ తా రుషతో హరగిరి కే దారములో నీశ్వరుండు దాండవమాడెన్. ఆరటపెట్టి దుందుడుకునన్ తన దార నధి:కరించి తా కేరిన దక్షునిన్ వడిని గీటడగించగ వీరభద్రునిన్ వేరుగ బంపి కోపమున వెల్గుచు తారకశృంగ కే దారములోన నీశ్వరుడు దాండవమాడెను నిర్వికల్పుడై.
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
హారములన్ ధరించి శివ హర్షముతో దరిచేరఁ బ్రీతితోదార మనోరథమ్మెఱిగి తద్దయు ప్రీతిఁ గదల్చి పాదముల్ప్రేరణ నిచ్చి, కన్గొనుచు ప్రేమగఁ బార్వతిఁ జెంగలించి కేదారములోన నీశ్వరుఁడు దాండవమాడెను నిర్వికల్పుఁడై
తారకుడట బలియుండటకారకుడట తన తనయుడు కడతేర్చంగాదారవు నుమ యిపు డని కేదారములో నీశ్వరుండు దాండవమాడెన్. ***తారకు డొక్క రాక్షసుడు ద్రాగగ నీయడు నీరు లేఖులన్కారకు డొక్కడే తనదు గాదిలి పుత్రుడు వాని దేర్చగన్కారణమయ్యెనే యుమను గాంచగ ‘దార’ గ నన్నవేడ్కఁ గే దారములోన నీశ్వరుడు దాండవమాడెను నిర్వికల్పుడై.కడయింటి కృష్ణమూర్తి..గోవా.. 14-4-23
కందంసారగ్రీవుని పైనన్భారము మోపి పరిచర్య బహుళము జేయన్ఏరి కయిన సరి మది మందారము లో నీశ్వరుండు దాండవ మాడెన్.
నీరము గాలియు భూమ్యాహారంబులు జీవకోటి హారమునందున్సారముగా నిలుపుకొరకుదారములో నీశ్వరుండు దాండవమాడెన్ .
గౌరియు యాగమునకు తానేరుగచనిననుజనకుడునెమ్మినివీడన్దారయుమరణించగ కేదారములో నీశ్వరుండు దాండవ మాడెన్
మరొక పూరణడా బల్లూరి ఉమాదేవి కోరుచుభర్తగాహరునిగుబ్బలిపట్టియుకానయందునాహారమువీడుచున్తపముయాపకచేయుచునుండగాంచుచున్తీరుగమెచ్చిసాగుచునుతెల్లనిసామియువేగచేరికేదారములోన నీశ్వరుడుదాండవమాడెనునిర్వికల్పుడై
కం॥ భారము నీదని భక్తినిగోరఁగ నీశును ముదముగఁ గోరికఁ దీర్చున్గోరఁగ నిజ భక్తుడిటుల దారములో నీశ్వరుండు దాండవ మాడెన్ఉ॥ మారక నిత్యమున్ భవుని మాన్యుని భక్తిని నిల్పి కొల్చినన్వేరొక చింత లేక మది ప్రేమతొ నింపినఁ జాలు నీశుఁడున్భారము మోసి ప్రోచు నిజ భక్తుఁడు కోరఁగఁ గోర్కెఁ దీర్చగన్దారములోన నీశ్వరుఁడు దాండవ మాడెను నిర్వికల్పుఁడై
నిజ భక్తుడేమి కోరిన మహా దేవుడు అనుగ్రహిస్తాడను గూడార్థము వచ్చేట్టుగా ఈసమస్యను తీసుకున్నానండి
ఆరనితపమునజీవుం
రిప్లయితొలగించండిడేజామునునిదురగనకడెందమునలయన్
సారముశంభుండనకే
దారములోనీశ్వరుండుతాండవమాడెన్
కోరిన వరమిచ్చును కే
రిప్లయితొలగించండిదారేశ్వరుడని తలచుచు దర్శింతురుగా
కారణ కారణమును కే
దారములో నీశ్వరుండు దాండవమాడెన్
కోరినవిచ్చునంచు చని కొల్తురు భక్తులు లక్షలాదిగా
తొలగించండికారణకారణుండయిన కల్మష కంఠుని రూపురేఖలన్
బారులుతీరుభక్తజన వాహిని తప్పక చెప్పుచుంద్రు కే
దారములోన నీశ్వరుఁడు దాండవమాడెను నిర్వికల్పుఁడై
ధన్యవాదాలు గురూజీ 🙏
తొలగించండిపారమునందగానరుడుపావనుశంకరురూపునాత్మలో
రిప్లయితొలగించండికోరుచుసాధనన్మిగులకొందలమందకవిస్మరింపకన్
మీరకశమభునామమునుమేకొనివేడగభక్తుడంతకే
దారములోననీశ్వరుడుతాండవమాడెనునిర్వికల్పుడై
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'శంభునామమును' టైపాటు.
శంభునామమును
రిప్లయితొలగించండిఉ.
రిప్లయితొలగించండిచేరెను నాదిశంకరుడు శీతల భారత దేశ భాగమున్
గూరిమితోడ లింగమును గొప్పగ స్థాపనఁ జేసె, హిందువై,
పేరిమినొంద భక్తునికిఁ బెక్కు ప్రబంధములిచ్చు శక్తి, కే
*దారములోన నీశ్వరుఁడు దాండవమాడెను నిర్వికల్పుఁడై.*
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిధారాధరములు ముసురుచు
రిప్లయితొలగించండిభూరిగ నురుముచు మెరియుచు పూరణ మట న
వ్వారిగ గురియ పలికె కం
దారములో నీశ్వరుండు దాండవమాడెన్.
భూరిగ వానలే కురిసి భూరిజ మెల్లెడ నీరుజేరె న
వ్వారిగ సోమధారలవి పారగ వాసిగ పెర్గినట్టి యా
పైరులు పిల్ల తెమ్మెరకు పల్లటిలన్ గని కాపు పల్కె కే
దారములోన నీశ్వరుఁడు దాండవమాడెను నిర్వికల్పుఁడై.
కోరిన వరము లాసంగి యు
రిప్లయితొలగించండిదారము గా భక్త జనుల దైవం బగు చున్
కారణు డై వెలసియు కే
దారములో నీశ్వరుండు దాండవ మాడెన్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిశ్రీరామ మంత్ర వేదియు
తొలగించండిఆ రామునిచరిత తెల్పె సతిపార్వతితో
పేరిమి కథకు హృదయ కం
దారములో నీశ్వరుండు దాండవమాడెన్
కందారము = మేఘము
నారాయణ నరులిరువురు
రిప్లయితొలగించండిపారి శివుని లింగమునకు వందని నిడగన్
భూరిగ సంతస పడి కే
దారములో నీశ్వరుండు దాండవమాడెన్
రిప్లయితొలగించండిఔరా భారత దేశము
పోరాడి సమస్యల, గెలుపు తనదె యనగా
హేరాళమ్ముగ నా కే
దారములో నీశ్వరుండు దాండవమాడెన్
జిలేబి
కూరిమి వరములనొసఁగెడు
రిప్లయితొలగించండికారణకారణము లీల కలలో గంటిన్
కోరఁగ గిరిరాట్సుత కే
దారములో నీశ్వరుండు దాండవమాడెన్
కోరను భోగభాగ్యములఁ గోరను నే సురలోక సౌఖ్యముల్
రిప్లయితొలగించండికోరితినొక్కమారు గన కూరిమి నీశ్వర సన్నిధానమున్
గారవమొప్ప స్వప్నమున గాంచితి కన్నుల విందొనర్చి కే
దారములోన నీశ్వరుఁడు దాండవమాడెను నిర్వికల్పుఁడై
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండికందం
రిప్లయితొలగించండిఘోరావమానమున నం
గారమునందు సతి దూక కసినొక జటఁ దా
జారిచి కైలాసపు కే
దారములో నీశ్వరుండు దాండవమాడెన్
ఉత్పలమాల
చేరియు దక్షయజ్ఞమును జిచ్చఱకంటినిఁ గాదటంచుఁ దా
ఘోర పరాభవాన సతి గుండమునందున బూదియైననే
జారిచి కాళరుద్రునిగ జయ్యన కేశము ద్రుంచి గేహ కే
దారములోన నీశ్వరుఁడు దాండవమాడెను నిర్వికల్పుఁడై
🙏ధన్యోస్మి గురుదేవా!🙏
తొలగించండిక్రొవ్విడి వెంకట రాజారావు:
రిప్లయితొలగించండిఆరటపెట్టి మురిసి తన
దార నపచరించినట్టి దక్షునిపైనన్
తా రుషతో హరగిరి కే
దారములో నీశ్వరుండు దాండవమాడెన్.
ఆరటపెట్టి దుందుడుకునన్ తన దార నధి:కరించి తా
కేరిన దక్షునిన్ వడిని గీటడగించగ వీరభద్రునిన్
వేరుగ బంపి కోపమున వెల్గుచు తారకశృంగ కే
దారములోన నీశ్వరుడు దాండవమాడెను నిర్వికల్పుడై.
మీ రెండు పూరణలు బాగున్నవి. అభినందనలు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిహారములన్ ధరించి శివ హర్షముతో దరిచేరఁ బ్రీతితో
రిప్లయితొలగించండిదార మనోరథమ్మెఱిగి తద్దయు ప్రీతిఁ గదల్చి పాదముల్
ప్రేరణ నిచ్చి, కన్గొనుచు ప్రేమగఁ బార్వతిఁ జెంగలించి కే
దారములోన నీశ్వరుఁడు దాండవమాడెను నిర్వికల్పుఁడై
తారకుడట బలియుండట
రిప్లయితొలగించండికారకుడట తన తనయుడు కడతేర్చంగా
దారవు నుమ యిపు డని కే
దారములో నీశ్వరుండు దాండవమాడెన్.
***
తారకు డొక్క రాక్షసుడు ద్రాగగ నీయడు నీరు లేఖులన్
కారకు డొక్కడే తనదు గాదిలి పుత్రుడు వాని దేర్చగన్
కారణమయ్యెనే యుమను గాంచగ ‘దార’ గ నన్నవేడ్కఁ గే
దారములోన నీశ్వరుడు దాండవమాడెను నిర్వికల్పుడై.
కడయింటి కృష్ణమూర్తి..గోవా.. 14-4-23
కందం
రిప్లయితొలగించండిసారగ్రీవుని పైనన్
భారము మోపి పరిచర్య బహుళము జేయన్
ఏరి కయిన సరి మది మం
దారము లో నీశ్వరుండు దాండవ మాడెన్.
నీరము గాలియు భూమ్యా
రిప్లయితొలగించండిహారంబులు జీవకోటి హారమునందున్
సారముగా నిలుపుకొరకు
దారములో నీశ్వరుండు దాండవమాడెన్ .
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిగౌరియు యాగమునకు తా
రిప్లయితొలగించండినేరుగచనిననుజనకుడునెమ్మినివీడన్
దారయుమరణించగ కే
దారములో నీశ్వరుండు దాండవ మాడెన్
మరొక పూరణ
రిప్లయితొలగించండిడా బల్లూరి ఉమాదేవి
కోరుచుభర్తగాహరునిగుబ్బలిపట్టియుకానయందునా
హారమువీడుచున్తపముయాపకచేయుచునుండగాంచుచున్
తీరుగమెచ్చిసాగుచునుతెల్లనిసామియువేగచేరికే
దారములోన నీశ్వరుడుదాండవమాడెనునిర్వికల్పుడై
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండికం॥ భారము నీదని భక్తిని
రిప్లయితొలగించండిగోరఁగ నీశును ముదముగఁ గోరికఁ దీర్చున్
గోరఁగ నిజ భక్తుడిటుల
దారములో నీశ్వరుండు దాండవ మాడెన్
ఉ॥ మారక నిత్యమున్ భవుని మాన్యుని భక్తిని నిల్పి కొల్చినన్
వేరొక చింత లేక మది ప్రేమతొ నింపినఁ జాలు నీశుఁడున్
భారము మోసి ప్రోచు నిజ భక్తుఁడు కోరఁగఁ గోర్కెఁ దీర్చగన్
దారములోన నీశ్వరుఁడు దాండవ మాడెను నిర్వికల్పుఁడై
నిజ భక్తుడేమి కోరిన మహా దేవుడు అనుగ్రహిస్తాడను గూడార్థము వచ్చేట్టుగా ఈసమస్యను తీసుకున్నానండి
రిప్లయితొలగించండి