1, సెప్టెంబర్ 2023, శుక్రవారం

సమస్య - 4520

2-9-2023 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“క్రూరజనులకు నిలయమ్ము గుంతకల్లు”
(లేదా...)
“క్రూరులు దుష్టకర్ములును గుత్సితులుందురు గుంతకల్లులో”

34 కామెంట్‌లు:

  1. సమతసహధర్మసంస్కార, సాధనమున

    లొంరీపట్నవాసులులోలబుద్ధి
    కుటిలలౌక్యంబు జట్టునుకోరరెవరు
    క్రూరజనులకునిలయమ్ముగుంతకల్లు

    రిప్లయితొలగించండి
  2. "క్రూరజనులకు నిలయమ్ము గుంతకల్లు”
    ననగ నా పుర జనులెల్ల నక్కసు బడి
    దిట్టీ పోయు చుం దురు నిన్ను, తీరు నెరిగి
    మాట లాడుట సతతము మాన్యమౌను

    రిప్లయితొలగించండి

  3. తే.గీ:
    ఊరు రైళ్ళకు నిలయమ్ము, పేరు మంచి
    వూరని, ప్రజలు బహు మంచి వారలిచట,
    చేరుదురు రైళ్ళ‌ నెక్కిన చెడు జనులు,
    క్రూరజనులకు నిలయమ్ము గుంతకల్లు”

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'వూరు' అనడం సాధువు కాదు. వు,వూ,వొ,వో లతో మొదలయ్యే తెలుగు పదాలు లేవు. "మంచి యూరని" అనండి. 'చెడు జనులు' అన్నచోట గణభంగం. "చెడ్డజనులు" అనండి.

      తొలగించండి
  4. ఆటవెలది
    శంకరార్య!"క్రూర జనులకు నిలయమ్ము
    గుంతకల్లు"కాదు సంతతంబు
    సజ్జనాళి మెచ్చ సాహితీ గోష్ఠుల
    సరస కవులతోడ వరలుచుండు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఉత్పలమాల
      ఔర!కనంగనెల్లెడలహంత,కిరాతక,జారచోరులున్
      *క్రూరులు,దుష్టకర్ములును,గుత్సితులుందురు;గుంతకల్లులో*
      వీరలు గాక పండితులు,వేదవిదుల్, ఘనదానశీలురున్
      శూరులు,సుందరాంగులును చూడ్కికి వేడ్కనొసంగఁజేయరే!

      తొలగించండి
    2. మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
  5. తే॥ "క్రూరజనులకు నిలయమ్ము గుంతకల్లు"
    పాడియౌన యీపగిదినిఁ బలుకఁ గాను
    నాది యీప్రాంతమే నయ్య నమ్ము మయ్య
    మనుజులిచట మాన్యులు కడుమంచి వారు

    ఉ॥ “క్రూరులు దుష్టకర్ములును గుత్సితులుందురు గుంతకల్లులో”
    నేరక బుద్ధి హీనతను నీతిని వీడిన వారి పల్కులన్
    ఘోరము గాద నమ్మగను గొంత స్వబుద్ధిని నిల్పి చూడుమా
    వేరుగ చెప్పనేలఁ గను విందుగఁ జూడఁగ గొప్పవారలన్

    మాసొంతూరు పెనుకొండ (అనంతపురం జిల్లా ప్రస్తుతము సత్యసాయి జిల్లా) అండి

    రిప్లయితొలగించండి
  6. తేటగీతి
    మంచివారల కాపాడు మాన్యులుండి
    కాంచుచు పరోపకారమ్ము ఘనులుమనఁగ,
    సైచకుండ సింహస్వప్నమౌచుఁజెలఁగఁ
    గ్రూర జనులకు, నిలయమ్ము గుంతకల్లు

    ఉత్పలమాల
    నేరక దుష్టబుద్ధులను నిత్యము వారు పరోప కారులై
    భూరి దయార్ద్ర చిత్తమునఁబోలి కసాపుర వాత పుత్రునిన్
    మీరగ ధర్మవర్తనము మేదిని రాక్కసకోటి పాలిటన్
    క్రూరులు దుష్టకర్ములును గుత్సితులుందురు గుంతకల్లులో

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి

    2. 🙏ధన్యోస్మి గురుదేవా 🙏
      వృత్తం మూడవ పాదములో 'రాక్షస కోటి' అని చదువుకొన మనవి

      తొలగించండి
  7. లేరిట నేరగాండ్రు, గనలేమిట దుష్టుల మోసగాండ్ర, సం
    సారులు సద్గుణాన్వితులు, ఛాయగనైనను గానరామిటన్
    క్రూరులు దుష్టకర్ములును గుత్సితు, లుందురు గుంతకల్లులో
    సారెకు సారెకున్ బరుల సౌఖ్యముకై తపియించు మాన్యులే

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
      'సౌఖ్యమునకై' అనడం సాధువు. *సౌఖ్యము నెప్పుడు గోరు మాన్యులే* అందామా?

      తొలగించండి
  8. సరస సాహిత్య ముల కెల్ల స్థావ రమ్ము
    జరిగె నవధానములు బెక్కు చక్కగాను
    క్రూర జనులకు నిలయమ్ము గుంతకల్లు
    కాదు కాదండ్రు మాన్యులు ఖండి తముగ

    రిప్లయితొలగించండి
  9. కానరామిట గ్రూరులఁ గర్కశులను
    పురనివాసులు మాన్యులు పుణ్య ధనులు,
    కాదు ముమ్మాటికి నిజము కాదు కాదు
    క్రూరజనులకు నిలయమ్ము గుంతకల్లు

    రిప్లయితొలగించండి

  10. ధనము నార్జించుటదియేను ధర్మమనుచు
    నీతి నియమాల తప్పిరే నేడు జూడ
    తెలుగు రాష్ట్రాలు రెండునూ దేబె గాండ్రు
    క్రూరజనులకు నిలయమ్ము , గుంతకల్లు
    నందు మాత్రము కనగలేమట్టి జనుల.


    చేరితి కష్టమంచనక స్నేహితునింటికి పిల్చినంత నా
    యూరున గాంచగా మనుజు లుత్తములున్ గుణ శీలురే
    వారల లోన మిక్కిలిగ పండితులే మరి యెచ్చట నటన్
    క్రూరులు దుష్టకర్ములును గుత్సితులుందురు గుంతకల్లులో?

    రిప్లయితొలగించండి
  11. రిప్లయిలు
    1. మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
      చోరులు బహువచనం, గోచరమౌను ఏకవచనం. *చోరులు గోచరమౌదురే కనన్* అందామా?

      తొలగించండి
    2. ధన్యవాదాలు గురూజీ🙏

      ముంతకల్లును గ్రోలుచు గొంతుకోయఁ
      గ్రూరజనులకు నిలయమ్ము గుంతకల్లు
      కాదు; చెడుగు సుంతైనను లేదు చీకు
      చింతలు కనరాని పురము గుంతకల్లు

      దారుణ విశ్వకద్రువల ధామముకావున లోకమందునన్
      గ్రూరులు దుష్టకర్ములును గుత్సితులుందురు; గుంతకల్లులో
      చోరులులేరు నీహృదయ చోరులు గోచరమౌదురేకనన్
      ఘోరపు కృత్యముల్ సలుపు కుత్సిత బుద్ధులు లేరులేరహో!

      తొలగించండి
  12. తెలుఁగు వారలు బళ్ళారి వలసపోయి
    తిరిగి చేరఁగఁ దలఁచిరి తెలుఁగునేల
    కన్నడిగులు పోవలదంచు కల్ల లనిరి
    "క్రూరజనులకు నిలయమ్ము గుంతకల్లు"

    వారలు తెల్గువారె పరివారముతోడ వసించువారు బ
    ళ్ళారి పురంబులో నచట లాఁతి జనుల్ గలరంచు నెంచి సొం
    పారఁగ గుంతకల్లు పురమందు వసింపఁగఁ గోర చెప్పిరే
    "క్రూరులు దుష్టకర్ములును గుత్సితులుందురు గుంతకల్లులో"

    రిప్లయితొలగించండి
  13. ధారుణి లోపలన్ నిజము దప్పక
    మానవ జాతియందునన్
    క్రూరులు దుష్ట కర్ములును గుత్సితు
    లుందురు, గుంతకల్లులో
    ధీరులు మానవాత్ములును దీనద
    యాలులె గాని యిచ్చటన్
    నేర చరిత్రులున్ ఖలులు నిక్కము
    లేరిట నేమి చిత్రమో!

    రిప్లయితొలగించండి
  14. వైరము పూనిపండితుల ప్రస్తుతి చేయక తిట్టువారలున్
    కూరిమి చూపకన్ పరులగొట్టెడివారలుకొందరెల్లెడన్
    క్రూరులు దుష్టకర్ములును కుత్సితలుందురు, ,గుంతకల్లు లో
    వారి జనాభునిన్ కొలుచు వారలెయుందురు గ్రామమంతటన్


    జనులు లేని యరణ్యమే జగతియందు
    *క్రూరజనులకు నిలయమ్ము గుంతకల్లు”*
    వాసయోగ్యమయ్యెనుకదాభక్తితోడ
    జపతపమ్ములు చేసెడి జనుల కెల్ల

    రిప్లయితొలగించండి