7, ఫిబ్రవరి 2024, బుధవారం

సమస్య - 4669

8-2-2024 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“నక్కలనున్ స్రుక్కఁజేసినన్ మెచ్చఁదగున్”
(లేదా...)
“నక్కల స్రుక్కఁ జేసెడి గుణప్రవరున్ గొనియాడఁగాఁ దగున్”

20 కామెంట్‌లు:

గుండా వేంకట సుబ్బ సహదేవుడు చెప్పారు...

కందం
ఎక్కఁదగు గద్దె దక్షులు
మక్కువనభివృద్ధి పథము మన్నన నడుపన్
బొక్కసముఁ దరుగ మ్రింగెడి
నక్కలనున్ స్రుక్కఁజేసినన్ మెచ్చఁదగున్

ఉత్పలమాల
ఎక్కగనొప్పు పీఠమును నేర్పడ దక్షత దేశమేలఁగన్
మక్కువ వృద్ధిఁ జేయుచును మన్ననలంద ప్రపంచమంతటన్
బొక్కసమన్నదాని సరిపుచ్చక రాబడి పెంచి, మ్రింగెడున్
నక్కల స్రుక్కఁ జేసెడి గుణప్రవరున్ గొనియాడఁగాఁ దగున్

BMahalakshmi చెప్పారు...

అక్కునౄజేర్చినకొడుకును
ప్రక్క ఁజూచినభయపడిపాఱుటకంటెన్
స్రుక్కకమదిలో తండ్రియు
నక్కలనున్స్రుక్కఁజేసినన్మెచ్చగగున్

Sitharamayya Solasa చెప్పారు...

ప్రక్కన గలవారిపయిన
నక్కసు కలిగినను కూడ నగుపడ కుండన్
చక్కగ మాటాడెడి యా
నక్కలనున్ స్రుక్కఁజేసినన్ మెచ్చఁదగున్

గండూరి లక్ష్మీనారాయణ చెప్పారు...

నిక్కము లెక్కలేని సిరి నిర్భయ
మొప్పగ బ్రోగుజేయగన్
జిక్కిని బక్కవారలను జిత్రముగా
భయపెట్టి డబ్బులన్
మెక్కెచు నిత్యమున్ సతము మేదినిలో
నివసించునట్టి యా
నక్కల సృక్క జేసెడు గుణప్రవరున్
గొనియాడగా దగున్.

Zilebi చెప్పారు...

-

ముక్కాబలా ! జిలేబీ
ముక్కాబల! వెనుతిరుగకు మున్ముందుకుపో
తిక్కకుదురునటుల సదరు
నక్కలనున్ స్రుక్కఁజేసినన్ మెచ్చఁదగున్

M.B.G.TILAK చెప్పారు...

చక్కనిదేశపు ప్రగతిని
నక్కలవలె కాచుకొన్న నాయక ముఖ్యుల్
చిక్కుల పడజేతురుగద
నక్కలనున్ స్రుక్కఁజేసినన్ మెచ్చఁదగున్

విరించి చెప్పారు...


పెక్కుగ మననేత లిపుడు
రక్కసి మూకలను బోలి రాజ్యము నేలన్
లెక్కింపక నట్టి కపట
నక్కలనున్ స్రుక్కఁజేసినన్ మెచ్చఁదగున్.


చక్కని చుక్క దక్కెనని సంబర మించుక లేకపోయెనే
రక్కసు లక్కలే యొడయు రాలిని రాతము హింస పెట్టగా
పెక్కుగనేడ్చు పద్మముఖి వేదన దీర్చు నెపమ్ము తోడ తా
నక్కల స్రుక్కఁ జేసెడి గుణప్రవరున్ గొనియాడఁగాఁ దగున్.

తాను+ అక్కల= తా / నక్కల

కరణం రాజే శ్వర రావు చెప్పారు...

దక్కిన దానిని మ్రింగుచు
చిక్కిన దేమైన గాని చేకొనుచు సదా
మెక్కగ చూచెడు మానవ
నక్కల నున్ స్రు క్క జేసినన్ మెచ్చ దగున్

M.B.G.TILAK చెప్పారు...

నక్కలవంటివారుగద నాయక ముఖ్యులు పోల్చిచూడగా
చక్కని దేశమందుగల సంపద మొత్తము కొల్లగొట్టగా
మక్కువ చూపువారలను మార్కొని జిత్తులమారులైన యా
నక్కల స్రుక్కఁ జేసెడి గుణప్రవరున్ గొనియాడఁగాఁ దగున్

ఆదూరి ఫణీంద్రరావు చెప్పారు...

చొక్కటమగు మాటలతో
పెక్కురు సుజనులను మభ్యబెట్టుచు గమిలో
తప్పుడు పనులొనరించెడు
“నక్కలనున్ స్రుక్కఁజేసినన్ మెచ్చఁదగున్”

రామోక్తం చెప్పారు...

చక్కగ నిలబడి వాక్య
మ్మొక్కటి బల్కంగ లేక నుత్తమ పీఠం
బెక్కియు వ్రేలాడెడు యా
నక్కలనున్ స్రుక్కఁజేసినన్ మెచ్చఁదగున్

సరిగా నిలబడి ఒక వాక్యం పూర్తిగా పలుక లేకున్నా అధికార పీఠం వదలని అమెరికా అధ్యక్షుడు లాంటి వారు.

ఆదూరి ఫణీంద్రరావు చెప్పారు...

చొక్కఁపు మాటలన్ బలికి క్షోభము గూర్చెడు మోసకారులన్
చిక్కని స్నేహబంధమున చిచ్చును రేపెడు కల్మషాత్ములన్
పెక్కువిధాల సజ్జనుల వేసటఁ బెట్టెడు దుండగీడులౌ
నక్కల స్రుక్కఁ జేసెడి గుణప్రవరున్ గొనియాడఁగాఁ దగున్

Dhanikonda Ravi Prasad చెప్పారు...

కం:"నక్కయె రాజాజీ యని"
య క్కపటపు తెల్ల వాడె యచ్చెరు వొందెన్
చక్కని కౌటిల్యమ్మున
నక్కలనున్ స్రుక్క జేసినన్ మెచ్చ దగున్
(చక్రవర్తుల రాజగోపాలా చారి తెలివికికి బ్రిటిష్ వాళ్లే ఆశ్చర్య పడి మదరాసు గుంట నక్క అని పేరు పెట్టారు.ఆయన్ని మెచ్చుకోవాలి మరి!)

రామబ్రహ్మం పెనుకొండ చెప్పారు...

కం॥ చక్కని మాటల నాడుచు
మక్కువఁ బడయు కపటుల ప్రమాదము గనుచున్
టక్కున పాఠముఁ గరపుచు
నక్కలనున్ స్రుక్కఁ జేసినన్ మెచ్చఁదగున్

ఉ॥ కుక్కల వోలె నమ్మకము గొప్పగఁ జూపుచుఁ జెంతఁ జేరుచున్
నక్కల వోలె మోసమును నమ్మక ద్రోహముఁ జేయు వారలన్
గ్రక్కునఁ గాంచి వారలకు గట్టిగ బుద్ధిని నేర్పు యోధుఁడై
నక్కల స్రుక్కఁ జేసెడి గుణప్రవరున్ గొనియాడఁగాఁ దగున్

Dhanikonda Ravi Prasad చెప్పారు...

ఉ:అక్కట చూడుమా కరటకా! ఒక యెద్దున కింత సఖ్యమా
పక్కన జేరి పింగళకు బారిన చిక్కకనున్నదే కదా!
చక్కగ మిత్రభేదమును సాగక యున్నది వాని తెల్వి తో
నక్కల స్రుక్క జేసెడు గుణప్రవరున్ గొనియాడగా దగున్
(నీతి చంద్రిక లో కరటక దమనకులు నక్కలు.పింగళకు డనే సింహానికి,సంజీవకు డనే యెద్దుకి మిత్రభేదం కలిగించే ప్రయత్నం లో దమనకుని ఆశ్చర్యం.)

కామేశ్వర రావు పోచిరాజు చెప్పారు...

ఒక్కరి కైనను బోరున
దక్కునె శాంతి యిసుమంత తర్కించి యిటుల్
వెక్కసముగ నష్ట మొసఁగు
నక్కలనున్ స్రుక్కఁ జేసినన్ మెచ్చఁ దగున్

[కలను = యుద్ధము]


దిక్కయి యెల్ల వారలకు దేశ పురోగతి పైన నాత్మలో
మక్కువ మిక్కుటం బడర మాన్పఁగఁ గ్రక్కునఁ జిక్కు లింపుగాఁ
జిక్కక యేరికిం బుడమిఁ జిక్కిన రొక్కము నెల్ల బొక్కెడిన్
నక్కల స్రుక్కఁ జేసెడి గుణప్రవరున్ గొనియాడఁగాఁ దగున్

Subbarao Pochiraju చెప్పారు...

నిక్కముఁబలుకక యెప్పుఁడు
కుక్కలువలె మొఱుగు చుండు కుత్సిత బుద్ధిన్
జుక్కల నంటిన గుంటల
నక్కలనున్ స్రుక్కఁజేసినన్ మెచ్చఁదగున్

Subbarao Pochiraju చెప్పారు...

చక్కటి బాహువుల్గలిగి సాహస ఋద్ధిని వైరి వీరులన్
నక్కల స్రుక్కఁ జేసెడి గుణప్రవరున్ గొనియాడఁగాఁ దగున్
బక్కగ నుండువాఁడిహను భార్యను సైతము మూర్కొనంగడే
యిక్కడ యక్కడంయనక నెక్కడనైనను వేలుఁజూపుమా

పిన్నక నాగేశ్వరరావు. చెప్పారు...


పిన్నక నాగేశ్వరరావు.
హనుమకొండ.

టక్కరి మాటలు చెప్పుచు
చిక్కులు బెట్టుచు పదుగురు ఛీ యను
విధమున్
మిక్కిలి నయవంచకులౌ
నక్కలనున్ స్రుక్కఁ జేసినన్ మెచ్చదగున్.

డా.బల్లూరి ఉమాదేవి. చెప్పారు...

చక్కనివాడవీవునిను స్వాంతము నందున కోరుకొంటినే
మక్కువ తోడ పారుడవు మానిని యింగిత మీవెరుంగవే
నెక్కడికైనవచ్చెదనునీవున నౌననజాలునోసఖా
నక్కలు స్రుక్కజేసెడి గుణప్రవరున్ గొనియాడగాదగున్