14, ఫిబ్రవరి 2024, బుధవారం

సమస్య - 4676

15-2-2024 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“తాళిని దొలగించె భర్త తరుణియె మెచ్చన్”
(లేదా...)
“తాళీని దీసె భర్త వనితామణి మెచ్చగ ప్రేమతోడుతన్”
(శతావధాని యం.వి.పట్వర్ధన్ గారికి ధన్యవాదాలతో...)

37 కామెంట్‌లు:

గుండా వేంకట సుబ్బ సహదేవుడు చెప్పారు...

కందం
కాలిని ముల్లు దిగిందని
యాలియె మంచాన వంగి నాత్రుతఁ దీయన్
వ్రేలాడి కొయ్యఁ జుట్టిన
తాళిని దొలగించె భర్త తరుణియె మెచ్చన్

ఉత్పలమాల
కాలికి ముల్లుగుచ్చుకొని గాయము సేయఁగ బాధనుండ న
య్యాలియె చేరవచ్చి తనె యాత్రుత తోడను దీయ వంగఁగన్
వ్రేలుచు చుట్ట చుట్టుకొన బేగిని మంచపు కొయ్యనుండియున్
తాళిని దీసె భర్త వనితామణి మెచ్చగ ప్రేమతోడుతన్

BMahalakshmi చెప్పారు...

కాళముమెడలోగలిగిన
గోళాకారుడుశివుడునుకూడగపత్నిన్
మేలములాడుచు సగమై
తాళినితొలగించెభర్తతరుణియెమెచ్చన్

BMahalakshmi చెప్పారు...

చేలముఁజూడషర్టుగన చెన్నుగపాంటునుదాల్చునాయమన్
వేళలునవ్యమైచనగ వింతయగాదనుభావమెంచుచున్
వ్రేళులనుంగరంబునట విజ్ఞాన జూపవివాహ బంధమున్

తాళినిఁదీసెభర్తవనితామణి మెచ్చి ప్రేమతోడుతన్

BMahalakshmi చెప్పారు...

విజ్ఞత

gsnatp చెప్పారు...

కం:
తాళిని గట్టెను, నలుపని
కాళియనుచు పలువురు వెటకారము జేయన్
కేళీ విలాసియై యెగ
తాళిని దొలగించె భర్త తరుణియె మెచ్చన్”

Sitharamayya Solasa చెప్పారు...

పాళెము నందలి గుడిలో
కేళికను సలిపెడి వేళ గ్రీవకు సుడియన్
తాళుకొన లేక బోవగ
తాళిని దొలగించె భర్త తరుణియె మెచ్చన్

కరణం రాజే శ్వర రావు చెప్పారు...

మేళము లాడుచు పత్నిని
వేళా కోళము చేయుట గని వెలదుల నాపెన్
చాలును పొండని యపు డెగ
తాళిని దొలగించె భర్త తరుణి యె మెచ్చ న్

విరించి చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
విరించి చెప్పారు...

కేళిగృహమున రమించెడు
పాళమ్మున చిక్కుపడగ ప్రాణేశుండా
వేళ నివీతము జిక్కిన
తాళిని దొలగించె భర్త తరుణియె మెచ్చన్.


కేళి గృహమ్మునందు రతి కేళిని మున్గు రసాన్వితమ్మె యౌ
పాళము నందు చిక్కుబడె భర్త నివీతము థోడనంచు న
వ్వేళ తితిక్షతో కడు ప్రవీణత జూపుచు గేస్తురాలి యా
తాళిని దీసె భర్త వనితామణి మెచ్చగ ప్రేమతోడుతన్.

Subbarao Ayyalasomayajula చెప్పారు...

ఉ.

గోళపు బొబ్బ, పుండులను గూర్కొను చక్కని బోర వస్త్రమున్
తాళగ లేని భార్య గని తక్షణమే ప్రతికూలమభ్రమే
ధూళిని రాల్చి మందునిడి ధూపము వేయగ బుద్ధిమంతుడై
*తాళిని దీసె భర్త వనితామణి మెచ్చగ ప్రేమతోడుతన్.*
.....
అభ్రము = బంగారు

ఆదూరి ఫణీంద్రరావు చెప్పారు...

ఉత్పలమాల:
తాళగజాలనీ విరహ తాపమటంచు సుభద్ర సూనుఁడే
లాలనతోడనుత్తరను రంజిలఁ జేయుచు మేని భూషలన్
కేళిగ నూడ్చుచున్ మదనకేళి నిరోధకమంచు హేలగా
తాళిని దీసె భర్త వనితామణి మెచ్చగ ప్రేమతోడుతన్

M.B.G.TILAK చెప్పారు...

వేళకు శయ్యాగృహమున
తాళక తిమిరించునపుడు తమకము తోడన్
కేళీ వినోద చిత్తుడు
తాళిని దొలగించె భర్త తరుణియె మెచ్చన్

తాళిని గట్టియున్న పతి తన్మయ చిత్తుడు పుష్పకేతువే
తాళగ శక్యమా మదిని దాగిన కోర్కెల నాప సాధ్యమా
వేళకు శయ్యపై నిగుడు ప్రేయసి వెచ్చని కౌగిలింతకై
తాళిని దీసె భర్త వనితామణి మెచ్చగ ప్రేమతోడుతన్

ఆదూరి ఫణీంద్రరావు చెప్పారు...

ఆలిని బిగికౌగిలిలో
లాలనగా జేర్చిభర్త రంజిలు వేళన్
వాలాయముగా నిలచిన
తాళిని దొలగించె భర్త తరుణియెమెచ్చన్

Dhanikonda Ravi Prasad చెప్పారు...

కం:తాళియె స్త్రీస్వేచ్ఛకు నెగ
తాళి యనెడు నవ్యభావ తతులను,సిద్ధాం
తాళిని నమ్ముచు కట్టిన
తాళిని దొలగించె భర్త తరుణియె మెచ్చన్

Dhanikonda Ravi Prasad చెప్పారు...

ఉ:తాళియె మంగళ మ్మనుచు,ధర్మ మటంచును,భర్త పోగ నా
తాళిని ద్రెంచు రీతి గని,తద్దయు కుంది ,తెగింపు నొంది యీ
తాళి యనంగ స్త్రీకి నురి తాడను నూతన భావ దీప్తి తో
తాళిని దీసె భర్త వనితామణి మెచ్చగ ప్రేమ తోడుతన్

కంది శంకరయ్య చెప్పారు...

మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'విజ్ఞత జూప' అనండి.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.
రెండవ పాదంలో గణభంగం. "వేళాకోళ మిడగ గని" అందామా?

కంది శంకరయ్య చెప్పారు...

మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

Dhanikonda Ravi Prasad చెప్పారు...

ధన్యవాదం గురువు గారు!

రామబ్రహ్మం పెనుకొండ చెప్పారు...

కం॥ తాళక నాతప తాపము
వేళకు స్నానమ్ముఁ జేయ వెడలఁగ మగనిన్
తాళిని భద్రపరచుమన
తాళిని దొలగించె భర్త తరుణియె మెచ్చన్

ఉ॥ తాళిని దీసెభర్త వనితామణి మెచ్చఁగ ప్రేమతోడుతన్
దాళిని గారవించు వనితామణి తప్పని స్థానకమ్మునన్
దాళికి మారుగన్ బసుపు దారముఁ గొమ్మును గట్టుకొన్నదై
తాళిమితోఁ గటుంబ నిజదైన్యతఁ బాపఁగ నెంచి యత్తరిన్

మరొక పూరణ

ఉ॥ తాళిని గారవించు వనితామణు లెల్లరు నుద్యమించుచున్
కాళిక లౌచు చెండుదురు కాలుని వోలెను దూలనాడుచున్
హేళనఁ జేయఁ దాళినిల హేయము నియ్యది యంచు నెచ్చటన్
దాళిని దీసె భర్త వనితామణి మెచ్చఁగ ప్రేమతోడుతన్

స్థానకము పరిస్థితి (నిఘంటువు సహాయమండి)

M.B.G.TILAK చెప్పారు...

ధన్యవాదాలు గురూజీ 🙏

గుండా వేంకట సుబ్బ సహదేవుడు చెప్పారు...

🙏ధన్యోస్మి గురుదేవా 🙏

తమరి సూచనల మేరకు సవరించిన పూరణలు:

కందం
కాలిని ముల్లు దిగిందని
యాలియె మంచాన వంగి యార్తిని దీయన్
వ్రేలాడి కొయ్యఁ జుట్టిన
తాళిని దొలగించె భర్త తరుణియె మెచ్చన్

ఉత్పలమాల
కాలికి ముల్లుగుచ్చుకొని గాయము సేయఁగ బాధనుండ న
య్యాలియె చేరవచ్చి తనె యాత్రము తోడను దీయ వంగఁగన్
వ్రేలుచు చుట్ట చుట్టుకొన బేగిని మంచపు కొయ్యనుండి యా
తాళిని దీసె భర్త వనితామణి మెచ్చగ ప్రేమతోడుతన్

Subbarao Pochiraju చెప్పారు...

వేళాకోళము లాడగ
నాలును మగలును సరసపు టాటల తోడన్
దాళియ భర్తకుఁదగులగఁ
దాళిని దొలగించె భర్త తరుణియె మెచ్చన్

కామేశ్వర రావు పోచిరాజు చెప్పారు...

వ్రేళుల నైపుణ్యమ్మున
వేళాకోళమ్ము గాఁగ విపరీతముగా
లీల నగ లందు నంతటఁ
దాళిని దొలఁగించె భర్త తరుణియె మెచ్చన్

[వేళాకోళము = చిక్కయినది]


మేళము లింపుగాఁ దనరి మిన్నును నంటఁగ మ్రోగుచుండఁగాఁ
దాళము లింక వాద్యములు దద్ద పురోహితుఁ డన్న యట్టి యా
వేళ నెడంద మిక్కుటపుఁ బేర్మి ముహూర్తము నందుఁ గట్టఁగాఁ
దాళిని దీసె భర్త వనితామణి మెచ్చఁగఁ బ్రేమ తోడుతన్

Subbarao Pochiraju చెప్పారు...

ఆలిని గౌగలించుతఱి యౌదలఁజుట్టిన భృంగరూపమౌ
తాళిని దీసె భర్త వనితామణి మెచ్చగ ప్రేమతోడుతన్
కేళి గృ హంబునందుగలకీచుకలాటలు వర్జ శక్యమే
యాలును భర్తయున్మిగుల హర్షను తోడను దెల్లవార్తురే

పిన్నక నాగేశ్వరరావు. చెప్పారు...


పిన్నక నాగేశ్వరరావు.
హనుమకొండ.

బాలుండు పాలు కుడుచుచు
తాళిని పట్టుకొని యాడ తగులగ గొలుసున్
తాళియె గొలుసుకు మెలిపడ
తాళిని తొలగించె భర్త తరుణియె మెచ్చన్.

డా.బల్లూరి ఉమాదేవి. చెప్పారు...

తాళియుతెగిపోగవడిగ
తాళగలేకటపసిండి తంతిని దానిన్
లాలనగ క్రొత్త దుంచుచు
తాళిని తొలగించె భర్త తరుణియె మెచ్చన్