19, ఫిబ్రవరి 2024, సోమవారం

సమస్య - 4681

20-2-2024 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“మారీచుం డుత్తముఁడును మాన్యుండె యగున్”
(లేదా...)
“మారీచుండు మహాత్ముఁడే యగును సన్మానార్హుఁడై యొప్పెడిన్”
(ధనికొండ రవిప్రసాద్ గారికి ధన్యవాదాలతో...)

49 కామెంట్‌లు:

BMahalakshmi చెప్పారు...

పోరున గెలువగరాదని
వారింపగరావణుండు వైరముతోడన్
మీరెన్ తాటకిపుత్రుని
మారీచుండుత్తముడును మాన్యుండెయగున్

గండూరి లక్ష్మీనారాయణ చెప్పారు...

కోరియు వైరము గూడదు
వీరుడు రఘురామచంద్రువినురావణ!యా
క్రూరుడు వినకను మడిసెను
మారీచుండుత్తముండు మాన్యుండయ్యెన్

కరణం రాజే శ్వర రావు చెప్పారు...

మారెను బంగరు జింకగ
చేరియు విపినమును దాను జే టొ న రిం చెన్
దారుణ మొన రింప నెటు ల
మారీచుండు త్త ముడును మాన్యుం డ య్యె న్?

BMahalakshmi చెప్పారు...

కోరంగాగనిరాచకార్యమును తాకూర్చెంగ చిత్రాకృతిన్
పారంబంటెనురాముబాణమున తాపంబున్విడెన్శాంతుడై
నారిన్సీతనుదెచ్చుకార్యమున తానైక్యంబునందెన్హరిన్
మీరీచుండుమహాత్ముడేయగును సన్మానార్హుడైయొప్పెడిన్

BMahalakshmi చెప్పారు...

మారీచుండు

గుండా వేంకట సుబ్బ సహదేవుడు చెప్పారు...

కందం
మీరి దశకంఠుఁ జావక
శ్రీరాముని చేతఁజచ్చి చెందె ముగితి! నిం
ద్రారుల మధ్యన ధన్యుడు!
మారీచుం డుత్తముఁడును మాన్యుండె యగున్

శార్దూలవిక్రీడితము
మీరన్జూడక రావణాసురుని నున్మేషాన ధర్మాత్ముడౌ
శ్రీరామున్ మదినెంచి బాణహతి నిర్జీవుండునయ్యెన్ గదా!
క్రూరత్వంబున రేగు రాక్షసుల సద్గుణ్యంబునౌ చింతనన్
మారీచుండు మహాత్ముఁడే యగును సన్మానార్హుఁడై యొప్పెడిన్

రామోక్తం చెప్పారు...

వైరము వలదని దెల్పియు
క్రూరుడు రావణుని చేత గూలుటకన్నన్
శ్రీరామ శరమునడగిన
మారీచుం డుత్తముఁడును మాన్యుండె యగున్

Sitharamayya Solasa చెప్పారు...

ఆరామాయణ కథలో
ఆరావణు డాధరణిజ నంకించుటకై
మారి మెకముగ గతించిన
మారీచుం డుత్తముఁడును మాన్యుండె యగున్

Subbarao Ayyalasomayajula చెప్పారు...

శా.

శ్రీరాముండు సుబాహు జంపె, మునికై సిద్ధాశ్రమాధ్వర్యమున్
మారీచుండు శిలీముఖంబు హతి వైమాలమ్ముగా డుల్లుటన్
ఆరాధ్యుండని రావణాజ్ఞ, హతుడై, హాహా! కురంగమ్ముగా
*మారీచుండు మహాత్ముఁడే యగును సన్మానార్హుఁడై యొప్పెడిన్.*

విరించి చెప్పారు...


శ్రీరామునిచే చచ్చుటె
పారమ్యమ్మనుచు తాను భావించుచు తా
సారంగముగను మారిన
మారీచుం డుత్తముఁడును మాన్యుండె యగున్.


సారంగమ్ముగ మారి రాఘవుని యా శల్యమ్ము తో చచ్చుటే
పారమ్యమ్మని యెంచుచున్ గదలె సంవాదమ్మునే పెంచకన్
శ్రీ రాముండన భక్తి జూపెగద జేజేగొంగ తానైన నా
మారీచుండు మహాత్ముఁడే యగును సన్మానార్హుఁడై యొప్పెడిన్,

ఆదూరి ఫణీంద్రరావు చెప్పారు...

కోరివరించెను మృత్యువు
శ్రీరాముని చేతులందు శివమగుననుచున్
మారెను బంగరు జింకగ
మారీచుం డుత్తముఁడును మాన్యుండె యగున్

M.B.G.TILAK చెప్పారు...

క్రూరుండౌ లంకేశుని
వారింపగ లేనివాడు ప్రాణము విడిచెన్
కోరిన సాయము చేసిన
మారీచుం డుత్తముఁడును మాన్యుండె యగున్

M.B.G.TILAK చెప్పారు...

క్రూరాత్ముండగు రావణుండు కొసరెన్ కొంగ్రొత్త మోసంబునే
వేరేమార్గము లేక పాల్గొనెఁ గదా విద్రోహ కార్యంబులో
శ్రీరాముండు వధింపగా గతపడెన్ జేకొన్న కార్యార్థమై
మారీచుండు మహాత్ముఁడే యగును సన్మానార్హుఁడై యొప్పెడిన్

ఆదూరి ఫణీంద్రరావు చెప్పారు...

శ్రీరాముండవతారమూర్తి హరియే శిక్షించుతాఁ దైత్యులన్
వారింపన్ వినకున్న రావణుడహో బంగారు రిశ్యమ్ముగా
నారామంబునకంపె పుణ్యగతులే యారాముడీయంగనా
మారీచుండు మహాత్ముఁడే యగును సన్మానార్హుఁడై యొప్పెడిన్

Dhanikonda Ravi Prasad చెప్పారు...

కం:శ్రీరాముని గుడి గట్టం
గా రానే రామటంచు,కళవళ బడు నా
నా రభసల జూడ నసుర
మారీచుం డుత్తముడును మాన్యుండె యగున్

రామబ్రహ్మం పెనుకొండ చెప్పారు...

కం॥ ఆరావణు మాట వినుచు
శ్రీరాముని కార్యమునకు సేవను జేసెన్
మారీచుఁడు సమిధగనై
మారీచుం డుత్తముఁడును మాన్యుండె యగున్

శా॥ శ్రీరాముండిలఁ బుట్టె ధర్మమును రక్షించంగ సద్వర్తనన్
బారావారముఁ గాంచు మార్గమును సంభావించెడిన్ వారలన్
సారించంగఁ బరోక్ష రీతిగఁ గనెన్ సాయంబు మారీచుఁడే
మారీచుండు మహాత్ముఁడే యగును సన్మానార్హుఁడై యొప్పెడిన్

Dhanikonda Ravi Prasad చెప్పారు...

శా:శ్రీరామున్ గుడి నిల్ప భక్తియుతులై సేవింప రారైరి పో!
మీరన్ కక్షలు, హిందు జాతి మదిలో మెప్పొంద గా నైన నౌ
రా! రాకుండిరి,వీరి కంటె తుది లో రామా యటం చేడ్చు నా
మారీచుండు మహాత్ముడే యగును సన్మానార్హుడై యొప్పెడిన్

డా.బల్లూరి ఉమాదేవి. చెప్పారు...

శ్రీరాముని బలమెరిగిన
మారీచుడు రావణునకు మంచిగ బోధన్
తీరుగ చేసె గన నసుర
మారీచుండుత్తముడును మాన్యుండె యగున్

Subbarao Pochiraju చెప్పారు...

ఆరామామణి సీతను
దారుణముగ మోసగించ దవ్వులదిరుగన్
గ్రూరుఁడు దుష్టుఁడె,యెటులుగ
మారీచుం డుత్తముఁడును మాన్యుండె యగున్

వివియన్ వరలక్ష్మి చెప్పారు...

ఆరాముడప్రమేయుడుఁ
బోరాడగ తగవవనిజ పోకార్చు నినున్
మారామేటికఁ బలికిన
మారీచుండుత్తముడును మాన్యుండెయగున్

కామేశ్వర రావు పోచిరాజు చెప్పారు...

ఏ రీతిని రామునితోఁ
బోరు దలంపఁ దగ దంచు బోధింపంగా
నా రావణునకు ధర్మము
మారీచుం డుత్తముఁడును మాన్యుండె యగున్


ఆరాధ్యుం డగు దైత్య దానవ విహం గాదిత్య సిద్ధాప్స రో౽
నూరశ్యేన గవాశ్వ యక్ష తరు నాగోష్ట్రౌఘ శార్దూల ర
క్షోరాడ్వ్రాత మృగేంద్ర గార్దభముఖస్థోమమ్ముఁ బుట్టించె నో
ధారాళమ్ముగ నెవ్వఁ డివ్వసుధ నాతం డౌను నిక్కమ్ముగా
మారీచుండు మహాత్ముఁడే యగును సన్మానార్హుఁడై యొప్పెడిన్

కామేశ్వర రావు పోచిరాజు చెప్పారు...

[మారీచుఁడు = మరీచి పుత్రుఁడు, కశ్యపుఁడు]

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.
'కూర్చెంగ' అనడం సాధువు కాదు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.

డా.బల్లూరి ఉమాదేవి. చెప్పారు...

శ్రీరామా యనికేకవెట్టుచును తా శీఘ్రమ్ముగా కానలో
నారాచమ్మునవేగఘాతినటబొందన్ ఖిన్నుడౌచున్నటన్
శ్రీరామున్కరమందెజచ్చెనసురశ్రేష్టుండునచ్చోటనా
*“మారీచుండు మహాత్ముఁడే యగును సన్మానార్హుఁడై యొప్పెడిన్”*



Dhanikonda Ravi Prasad చెప్పారు...

అయ్యా!ధన్యవాదం.

గుండా వేంకట సుబ్బ సహదేవుడు చెప్పారు...

🙏ధన్యోస్మి గురుదేవా!🙏

BMahalakshmi చెప్పారు...

సవరిస్తాను

M.B.G.TILAK చెప్పారు...

ధన్యవాదాలు గురూజీ 🙏

పిన్నక నాగేశ్వరరావు. చెప్పారు...


పిన్నక నాగేశ్వరరావు.
హనుమకొండ.

నారిని రాముని కిడమన
నా రావణుడు వినకుండె;నంతట వనికే
గెన్ రామునిచే మడియగ
మారీచుండుత్తముడును మాన్యుండె యగున్
.

పిన్నక నాగేశ్వరరావు. చెప్పారు...


పిన్నక నాగేశ్వరరావు.
హనుమకొండ.
(సవరణతో...)
నారిని రాముని కిడమన
నా రావణుడు వినకుండె;నంతట చనె తా
నా రామునిచే మడియగ
మారీచుండుత్తముడును మాన్యుండె యగున్

వివియన్ వరలక్ష్మి చెప్పారు...

ధన్యవాదాలు