26, ఫిబ్రవరి 2024, సోమవారం

సమస్య - 4688

27-2-2024 (మంగళవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“గంధరహిత సుమమ్ముల గౌరవింత్రు”
(లేదా...)
“గంధము లేని పూవులకె గౌరవమబ్బు సమాజమందునన్”
(డా॥ వజ్జల రంగాచార్య గారికి ధన్యవాదాలతో...)

48 కామెంట్‌లు:

gsnatp చెప్పారు...

మందబుద్ధులకెంతయొ మంచి జరుగు
పలుకు బడియున్న చాలును ఫలము దొరకు
మేధ గలిగిన వాడికి మిగులు చేదు
“గంధరహిత సుమమ్ముల గౌరవింత్రు”



గండూరి లక్ష్మీనారాయణ చెప్పారు...

పలుకుబడిపైస లుండన బనికిరాని
తెలివి హీనులకే దక్కు దేశమందు
గౌరవమునేడు, సుజనుల గానరెవరు
గంధ రహిత సుమ్మల గౌరవింత్రు.

గుండా వేంకట సుబ్బ సహదేవుడు చెప్పారు...

తేటగీతి
సద్గుణము పరిమళముగ సంఘమందు
మన్ననన్గొని రాణింత్రు మనుజులెపుడు
ప్రీతి భగవదర్చనకు భరింపరాని
గంధరహిత సుమమ్ముల గౌరవింత్రు

ఉత్పలమాల
సంధిత సద్గుణాళిఁగని సంఘమునందున గౌరవించుటల్
బంధురమౌను! మానవుఁడు వాసిగడించును నుత్తముండుగన్
బొందిన తావితో ప్రభుని పూజకు నొప్పెడివంచుఁదెచ్చు దు
ర్గంధము లేని పూవులకె గౌరవమబ్బు సమాజమందునన్

కరణం రాజే శ్వర రావు చెప్పారు...

మంచి మర్యాద తెలిసిన మానవులను
చుల్క నగ జూచు సంఘమ్ము చోద్య ముగను
పై న మెరుగులు గాంచియు ప్రజలు మెచ్చి
గంధ రహిత సుమమ్ముల గౌర వింత్రు

డా.బల్లూరి ఉమాదేవి. చెప్పారు...

కాలమెంతయొమారెనుగనుడునేడు
పైమెరుగులకెజనులిల భ్రమను పడుచు
మంచియలవాట్లనేల్లయు మరుగు పరచి
గంధరహితసుమమ్ములగౌరవింత్రు


బంధమువీడనాడుచునుపాతయురోతని యీసడించుచున్
నంధులవోలెనేదియునునాదరమొప్పగగారవించకన్
కొందరుమందులై సతము గొప్పలుచెప్పుట జూచుచుండగా
గంధములేని పూవులకె గౌరవ మబ్బు సమాజ మందునన్

Sitharamayya Solasa చెప్పారు...

ముదితలకు దమ సిగలోన ముడుచుకొనగ
పరిమళమునిడు పూవులు వలయుగాని
మూడుకనుల వానికి నిత్య పూజసేయ
గంధరహిత సుమమ్ముల గౌరవింత్రు

M.B.G.TILAK చెప్పారు...

మంచియన్నది గతముగ మాఱిపోయె
పనికి మాలిన వారికి పదవులిచ్చి
గంధరహిత సుమమ్ముల గౌరవింత్రు
కలియుగమ్మున నివ్విధి కాననగును

Subbarao Ayyalasomayajula చెప్పారు...

ఉ.

బంధుర హస్తముల్ తగుల వస్త్ర శరీరములన్ దృఢమ్ముగన్
దంధనమౌ మనుష్యకృత దైనిక హారములన్ ధరించెడిన్
కంధరమందు మాలలను కాంతము విద్యుత కందముల్ సభన్
*గంధము లేని పూవులకె గౌరవమబ్బు సమాజమందునన్.*

రామోక్తం చెప్పారు...

అందలమునెక్కు అసమర్ధులైనవారు
అందచందముల్గల్గగ నవనిలోన
మందమతుల చందమ్మిది మహిని నేడు
గంధరహిత సుమమ్ముల గౌరవింత్రు

రామోక్తం చెప్పారు...

ఇందుని యందచందములు ఇంపగురూపము గల్గియుండగన్
మందుని గొల్తురెల్లరును మాన్యుడనంచును మాటిమాటికిన్
అంధులు లోకులీ జగతినందున సత్యము గానలేరుగా
గంధము లేని పూవులకె గౌరవమబ్బు సమాజమందునన్

M.B.G.TILAK చెప్పారు...

కొందరి కందుచుండుగద కోరిన రీతిని భోగభాగ్యముల్
నిందితులైనగాని తమ నేర్పరిమాటల మేళనమ్ముతో
చిందులువేయువారలకు చిక్కును గాంచగ పెత్తనమ్మిలన్
గంధము లేని పూవులకె గౌరవమబ్బు సమాజమందునన్

ఆదూరి ఫణీంద్రరావు చెప్పారు...

అందరి మేలుకోరుకొను నాప్తునివోలె చరించు పోఁడిమిన్
డెందమునందు నిశ్చలత ఠేవణమూను విపత్తులందునన్
బందువువోలె నాదుకొని బాయక పేదలఁగాఁచు నట్టిదు
ర్గంధము లేని పూవులకె గౌరవమబ్బు సమాజమందునన్

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.

గుండా వేంకట సుబ్బ సహదేవుడు చెప్పారు...

🙏ధన్యోస్మి గురుదేవా!🙏

M.B.G.TILAK చెప్పారు...

ధన్యవాదాలు గురూజీ 🙏

Dhanikonda Ravi Prasad చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రామబ్రహ్మం పెనుకొండ చెప్పారు...

తే॥ దంధన కపటము భువిని ధర్మమైన
బంధనము బాధ్యతలిలను బాధవెట్ట
బంధురము నందమైనను బ్రజలెలమిని
గంధరహిత సుమమ్ముల గౌరవింత్రు

ఉ॥ అంధుల లోకమందునను న్యాయము నప్పదు మూర్ఖులైనచో
దంధన రాజకీయమున ధర్మము చేయ నటంచు నొప్పఁగన్
బంధురమౌచు నందము నిబద్ధత నెంచని చోటఁ జక్కనౌ
గంధము లేని పూవులకె గౌరవమబ్బు సమాజమందునన్

(పైమెఱుగులకే పెద్ద పీట యని అండి)

Dhanikonda Ravi Prasad చెప్పారు...

ఉ:బంధము లందు మున్ గుచును,బంధము లన్ విడు డంచు శ్రీ యశో
బంధము లందు జిక్కుకొను పండితు లొందగ గౌరవమ్ములన్
బంధము వీడి ముక్తులగు వారికి శ్రీ యశముల్ లభించునే
గంధము లేని పూవులకె గౌరవ మబ్బు సమాజ మందునన్

Dhanikonda Ravi Prasad చెప్పారు...

1)తే.గీ:మల్లె,సంపెంగ పూవులు మరులు గొలుపు
వాని స్థానమ్ము జంటల పడక గదులు
దైవపూజాదులందు మందారముఖ్య
గంధరహితసుమమ్ముల గౌరవింత్రు

subbarao చెప్పారు...

చదువు సంధ్యలు లేకున్న చట్ట సభలఁ
దానె మొనగాడ నంచును దర్పమలరి
కారు కూతలు కూసిన కస్సుమనక
గంధరహిత సుమమ్ముల గౌరవింత్రు

వివియన్ వరలక్ష్మి చెప్పారు...

గంధసుమంబుల్పుట్టు జతగానిడు నందముఁ గొమ్మకన్నుకు
న్బంధము వేయు పెండ్లి కడ బారెడు కాగితం తోరణంబులు
న్కంధరమందు వేణులను కాంతలు కాగిత పూలఁదాల్చు నే
గంధము లేని పూవులకె గౌరవమబ్బు సమాజమందునన్

subbarao చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
subbarao చెప్పారు...

బంధురమైన భావమున బంధు జనంబులఁజూ డఁగోరుచున్
బంధముఁ జిక్కనౌ నటుల బాధ్యత తోడను సాయ మొందుచోన్
గంధర మందునన్ కనక కాంతుల మాల వేయ దు
ర్గంధము లేని పూవులకె గౌరవమబ్బు సమాజమందునన్

రిప్లయితొలగించండి

ఆదూరి ఫణీంద్రరావు చెప్పారు...

అందరి తలలో నాలుకయట్లు మెలఁగి
యార్తులను శక్తికొలదిగ నాదుకొనెడు
విమలచరితులై యశమున వెలుఁగు కలుష
గంధరహిత సుమమ్ములగౌరవింత్రు

కామేశ్వర రావు పోచిరాజు చెప్పారు...

నర సు రాసుర గంధర్వ నాగ కిన్న
రాప్సరో గణ యక్ష విహంగ రాజు
లరయఁ బదునాల్గు లోకము లందు నెలమిఁ
గంధ రహిత సుమమ్ముల గౌరవింత్రు

[కంధము = మేఘము; సుమము = ఆకాశము]


అంధులు గూడ సంఘమున నర్హులు మన్నన లంద నెంచఁ గా
మాంధు లనర్హు లందఁగ నిహమ్మున గౌరవ మించు కేనియున్
గంధము లేని పుష్పములుఁ గంజ దళాక్షుని యర్చ కొప్పు దు
ర్గంధము లేని పూవులకె గౌరవ మబ్బు సమాజ మందునన్

పిన్నక నాగేశ్వరరావు. చెప్పారు...


పిన్నక నాగేశ్వరరావు.
హనుమకొండ.

ధనము కలిగిన వారల దరికి చేరి
దుష్టులైనను వారినే యిష్టపడుచు
గుణము లేకున్న ధనమును గుంజవచ్చు
ననెడు నాశతోడను మెచ్చుకొనుచు నుంద్రు
గంధ రహిత సుమమ్ముల గౌరవింత్రు.

రామోక్తం చెప్పారు...

🙏

కంది శంకరయ్య చెప్పారు...

మీ రెండు పూరణలు ప్రశస్తమ్గా ఉన్నవి. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.
మొదటి పాదంలో గణభంగం. 'కాగితం' అనడం వ్యావహారికం.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ రెండు పూరణలు అద్భుతంగా ఉన్నవి. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

Dhanikonda Ravi Prasad చెప్పారు...

Thank you sir!

విరించి చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
విరించి చెప్పారు...

మందమతులగుచు జనులు మద్యమునకు
బానిసలుగ మారుచు దేశ ప్రగతి మరచి
గర్హ్యులకునధికారమ్ము కట్టబెట్ట
గంధరహిత సుమమ్ముల గౌరవింత్రు.


ఇందునిభాస్య కైశికము నింపుగ దాల్చగ నైన సచ్చిదా
నందము జేరి కొల్చు తరుణమ్మున నైనను ధర్మరక్ష కా
స్కందము గీర్తిశేషులగు గండరగండ సమాధి నైనను దు
ర్గంధము లేని పూవులకె గౌరవమబ్బు సమాజమందునన్.


మందులు లోకులై యుచిత మాదక ద్రవ్యము మద్య మాంసముల్
పొందుటె లక్ష్యమై చెలగి మూఢులు వేశ్యలు వీధులందునన్
చిందులు వేయువారలనె శ్రేష్ఠులుగా గెలిపించు కాలమున్
గంధము లేని పూవులకె గౌరవమబ్బు సమాజమందునన్ .