18, డిసెంబర్ 2024, బుధవారం

సమస్య - 4976

19-12-2024 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“వాణీసుతుఁ డెలుకపైఁ బ్రపంచముఁ జుట్టెన్”
(లేదా...)
“వాణీనందనుఁ డాఖువాహనముపైఁ బల్మాఱుఁ దిర్గెన్ భువిన్”

26 కామెంట్‌లు:

గుండా వేంకట సుబ్బ సహదేవుడు చెప్పారు...

కందం
రాణించి పరీక్ష గెలువ
మానితముగఁ జేర దీసి మహదేవుండున్
బూనుచ గణపతిగన్ శ
ర్వాణీసుతుఁ డెలుకపైఁ బ్రపంచముఁ జుట్టెన్

M.B.G.TILAK చెప్పారు...

స్థాణువు పుత్రుడు తానె ప
రీణాహుని చుట్టుతిరిగి లీలామహిమన్
జాణతనము చూపెన్ శ
ర్వాణీసుతుఁ డెలుకపైఁ బ్రపంచముఁ జుట్టెన్

Sitharamayya Solasa చెప్పారు...

బాణుడు ప్రసిద్ధి కెక్కిన
వాణీసుతుఁ ; డెలుకపైఁ బ్రపంచముఁ జుట్టెన్
రాణగ గౌరీ సుతుడు
ప్రాణుల బ్రోవగ , తనపయి భక్తిని జూపన్

గుండా వేంకట సుబ్బ సహదేవుడు చెప్పారు...

శార్దూలవిక్రీడితము
రాణింపంగ పరీక్షనెగ్గి మిగులన్ రంజిల్లి ముక్కంటి తా
నానందించి గణాధిపత్యమున సర్వాధిక్యమందింపగన్
బూనెన్ భాధ్యతఁ గన్నవారు పొగడన్ మోదాతి రేకాన శ
ర్వాణీనందనుఁ డాఖువాహనముపైఁ బల్మాఱుఁ దిర్గెన్ భువిన్

ఆదూరి ఫణీంద్రరావు చెప్పారు...

నేనొకమఱగుజ్జని పో
బోననిసోదరునిదాటి ముల్లోకములన్
తానుమదినితలపకశ
ర్వాణీసుతుఁ డెలుకపైఁ బ్రపంచముఁ జుట్టెన్

విరించి చెప్పారు...


త్రాణవు నీవై రమ్మిక
పాణిన్ పర్శువు ధరించి వసుధను బ్రోవన్
గాణాచి విడిచి యన శ
ర్వాణీసుతుఁ డెలుకపైఁ బ్రపంచముఁ జుట్టెన్.


వీణన్ జేతను బట్టి యొజ్జయొక డా విద్యాలయమ్మందునన్
త్రాణంబీవె యటంచు పాడుచు నిటన్ ధర్మంబు రక్షింపగా
పాణిన్ పర్శువు దాల్చి రమ్మనుచు నాహ్వానింపగా వేగ శ
ర్వాణీనందనుఁ డాఖువాహనముపైఁ బల్మాఱుఁ దిర్గెన్ భువిన్.

M.B.G.TILAK చెప్పారు...

క్షీణించెన్ మదిలోని ధైర్యమనుచున్ గేదారునిన్ వేడి తా
రాణించెన్ గద పార్వతీతనయుడే ప్రావీణ్యుడై స్పర్ధలో
క్షోణిన్ గ్రుమ్మరకే సహోదరునికే చూపెన్ గదా మిథ్య శ
ర్వాణీనందనుఁ డాఖువాహనముపైఁ బల్మాఱుఁ దిర్గెన్ భువిన్

జిగురు సత్యనారాయణ చెప్పారు...

లోనన్ మోదము చేత మోదకము భూలోకమ్మె రమ్యంబు భ
క్త్యానందాతిశయమ్ము జూపి జనులాహ్వానంబు సేయంగ వి
జ్ఞానంబున్ మరి పెంచగా తొలగ నజ్ఞానాంధకారమ్ము
ర్వాణీనందనుఁ డాఖువాహనముపైఁ బల్మాఱుఁ దిర్గెన్ భువిన్!!

కంది శంకరయ్య చెప్పారు...

మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.
మూడవ పాదంలో గణభంగం. "గౌరీపుత్రుడు" అనండి.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.
న-ణ ప్రాసను వర్జించండి.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.
న-ణ ప్రాసను వర్జించండి.

M.B.G.TILAK చెప్పారు...

ధన్యవాదాలు గురూజీ 🙏

రామబ్రహ్మం పెనుకొండ చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రామబ్రహ్మం పెనుకొండ చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రామబ్రహ్మం పెనుకొండ చెప్పారు...

కం॥ కోణంగి హాస్యమునకనె
వాణీసుతుఁ డెలుకపైఁ బ్రపంచముఁ జుట్టెన్
గాణాచి వెండిగిరి శ
ర్వాణి సుతునకు నెలుక యగు వాహనము గదా!

శా॥ ప్రాణంబంతయుఁ బెట్టి ధ్యాసనిడ సంప్రాప్తించె జ్ఞానమ్ము గీ
ర్వాణాంధ్రమ్ముల శోధనన్ గనుచు సారాంశమ్ముఁ దెల్పంగ శ
ర్వాణీ పుత్రుఁడె యాఖ వాహనుఁడుగా భాసిల్లె నెట్లందువో
వాణీనందనుఁ డాఖ వాహనముపైఁ బల్మాఱుఁ దిర్గెన్ భువిన్

కరణం రాజే శ్వర రావు చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
Sitharamayya Solasa చెప్పారు...

🙏

Dhanikonda Ravi Prasad చెప్పారు...

కం:వాణిన్ గని పతి యనె ప్రా
మాణికతయె శాస్త్ర మగు సుమా !శోధనతో
పూణే విడి చర్చింపగ
వాణీ! సుతుఁ డెలుకపైఁ బ్రపంచముఁ జుట్టెన్.
(వాణీ! నీ కొడుకు ఎలుకల మీద పరిశోధన చేసి పూణే వదలి చర్చించటానికి ప్రపంచం చుట్టాడు.)

Dhanikonda Ravi Prasad చెప్పారు...

శా:గాణాపత్యపు స్పర్థ లోన జయమున్ గాంచంగ ,నష్టాక్షరీ
బాణమ్ముం గొని శంభు బోధనల సుబ్రహ్మణ్యు పై గెల్వ గా
త్రాణన్ బొంది, హరిన్ దలంచి, ఘనుడౌ రౌతై విజృంభించి శ
ర్వాణీనందనుఁ డాఖువాహనముపైఁ బల్మాఱుఁ దిర్గెన్ భువిన్”

కామేశ్వర రావు పోచిరాజు చెప్పారు...

ఏణాంక శిరస్సూనుఁడు
ప్రాణప్రద మోదకములు భాసింప లస
త్పాణితలం బందున్ శ
ర్వాణీసుతుఁ డెలుకపైఁ బ్రపంచముఁ జుట్టెన్


ప్రాణివ్రాతము వొందు విఘ్నముల విధ్వంసంబు గావింప శ
ర్వాణీపుత్రుఁడు స్వీయ భక్తజన గాత్రస్తోత్ర గానస్రవ
ద్వాణీ మోద మనస్కుఁ డేక విలసద్దంష్ట్రుండు వీక్షింపఁగా
వాణీనందనుఁ డాఖువాహనముపైఁ బల్మాఱుఁ దిర్గెన్ భువిన్

కరణం రాజే శ్వర రావు చెప్పారు...

జాణ గ సోదరుడు వెడల
స్థాణు వు గా నుండ బోక స్థై ర్య ము తోడన్
త్రాణ ను జూపింప గ శ
ర్వా ణీ సుతు డెలుక పై ప్ర పంచము చుట్టె న్

రామబ్రహ్మం పెనుకొండ చెప్పారు...

ఆఖు ను ఆఖ అని పొరపాటున వ్రాసానండి

పిన్నక నాగేశ్వరరావు. చెప్పారు...


పిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.

కాణీపాకము నందున
రాణించగ వెలసినాడు లంబోదరుడున్
త్రాణముగా నిలిచిన శ
ర్వాణీ సుతు డెలుకపై ప్రపంచముఁ జుట్టెన్.

ఆదూరి ఫణీంద్రరావు చెప్పారు...

ఆదరబాదరా బ్రతుకు యాదట కానగరాదు సంతతం బూఁదరఁగొట్టు వ్యాపకము లుక్కిరిబిక్కిరి సేయ జీవనో
పాధికి నిర్విరామముగ పర్గులుదీయు జనాళి సూడగన్
హైదరబాదు భాగ్యనగరాఖ్యనుఁ బొందుట సత్యదూరమౌ

డా.బల్లూరి ఉమాదేవి. చెప్పారు...

బాణాసంచయు ప్రేల్చగ
తాణెము సేయగ జనులనుతహతహ తోడన్
తూణీరమువోలెనుశ
*"ర్వాణీసుతుఁ డెలుకపైఁ బ్రపంచముఁ జుట్టెన్”*