27, డిసెంబర్ 2024, శుక్రవారం

సమస్య - 4985

28-12-2024 (శనివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“ఎలుకం దినువాఁ డతనికి నేనుఁగు గొప్పా”
(లేదా...)
“ఎలుకను మ్రింగువాఁ డతని కేనుఁగు గొప్ప యనంగ నొప్పునే”

25 కామెంట్‌లు:

గుండా వేంకట సుబ్బ సహదేవుడు చెప్పారు...

కందం
తలచిరి కరిగారాముని
మెలకువఁగొన కుంభకర్ణు మించగ తరమే?
సులువుగ సింహము, వీడుచు
నెలుకం, దినువాఁ డతనికి నేనుఁగు గొప్పా?

చంపకమాల
తలచిరి రామునిన్ గరిగఁ దానొక మానవమాత్రుడే సుమా!
మెలకువఁ గాంచ యుద్ధమున మించఁగ లేరన కుంభకర్ణునిన్
సులువుగ సింహమున్ జెలఁగి జోరుగ నోటను బెట్టి, వీడుచున్
ఎలుకను, మ్రింగువాఁ డతని కేనుఁగు గొప్ప యనంగ నొప్పునే?

గుండా వేంకట సుబ్బ సహదేవుడు చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
గుండా వేంకట సుబ్బ సహదేవుడు చెప్పారు...

రావణాసురుని భావనగా...

విరించి చెప్పారు...


బలవంతుడనను గర్వితు
డలవోకగ తెలమెకముల నాహారముగా
తలచుచు దొరికిన వీడుచు
నెలుకం , దినువాఁ డతనికి నేనుఁగు గొప్పా.


బలయుతు డైననేమి శలభమ్ముల నైనను వీడడయ్యె నా
కలియది బాధపెట్టిన మఖద్విషుడాతడు క్రూరుడౌచు కుం
దిలమున తా చరించుతరి దీప్తము గాంచిన చిలు వీడి తా
నెలుకను , మ్రింగువాఁ డతని కేనుఁగు గొప్ప యనంగ నొప్పునే.

Sitharamayya Solasa చెప్పారు...

చెలిమరి యింటన బొమ్మల
కొలువున చిటిగజము, పెద్ద కుహనము లుండన్
వలపున నచ్చట తియ్యని
ఎలుకం దినువాఁ డ , తనికి నేనుఁగు గొప్పా

M.B.G.TILAK చెప్పారు...

అలయక తలపడుచుండును
బలిమిని కంఠీరవమును పట్టును తానే
తలమున దుంపలు కాయలు
నెలుకం దినువాఁ డతనికి నేనుఁగు గొప్పా

జలమున శ్వేతవాహనముఁ జంపెడు మానవుడాతడందురే
బలిమిని రిక్తహస్తముల పట్టును తానిట కోడె సిం హమున్
దలచినఁ గొండనైన తన తాడనతో నుసి చేయు ధీరుడే!
ఎలుకను మ్రింగువాఁ డతని కేనుఁగు గొప్ప యనంగ నొప్పునే

[ఎలుక = చెవి ఆకు]

కవుతా రామకృష్ణ చెప్పారు...

పలుకగ స్తుతిపాఠములు వందలు జంబుకమొండు పిల్లికిన్
"గెలిచద వీవు సింహమును, గీడును చెందును నీవు గొట్టగాఁ
బులి, సరి నీవె రాజపదమున్ గొన" నంచుఁ , జరించ నమ్మి చి
ట్టెలుకను మ్రింగువాఁ, డతని కేనుఁగు గొప్ప యనంగ నొప్పునే?

కరణం రాజే శ్వర రావు చెప్పారు...

తెలిపె నట తారు మారుగ
తెలిసిన సామెత నొకండు దెలియక నొకచో
కలవర పడి రట నె ట్టుల
నెలుకo దిను వా డ తనికి నే నుగు గొప్పా?

కవుతా రామకృష్ణ చెప్పారు...

*స్తోత్రపాఠములు

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ రెండు పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
నల్లాన్ చక్రవర్తుల శ్రీనివాసాచార్యుల 'బిడాల మోక్షము' కావ్యాన్ని గుర్తుకు తెచ్చారు.

కంది శంకరయ్య చెప్పారు...

మీ పూరణ బాగున్నది. అభినందనలు.

Dhanikonda Ravi Prasad చెప్పారు...

కం:ఎలుకల,నేనుగు రూప
మ్ముల బిస్కెట్లిచ్చి దుఃఖ మును మాన్ పగ న
వ్వుల నతని తల్లి యిట్లనె
ఎలుకం దినువాఁ డతనికి నేనుఁగు గొప్పా”

Dhanikonda Ravi Prasad చెప్పారు...

చం:"తలపక జాలి యేనుగుల దంతములన్ గొన జంపు నెట్లొ!" యం
చల గజహంతకున్ దలచి యచ్చెరు వొందెద రేల తిండిలో
తలపక నెట్టి ఏహ్యతను దారుణ రీతిగ బాల్యమందునే
ఎలుకను మ్రింగువాఁ, డతని కేనుఁగు గొప్ప యనంగ నొప్పునే”
(చిన్నప్పుడే ఎలుకని తినేసే వాడు కాబట్టి దంతాల కోసం ఏనుగుని చంపటం ఆశ్చర్యమా?వీరప్పన్ లాంటి వాడు.)

M.B.G.TILAK చెప్పారు...

ధన్యవాదాలు గురూజీ 🙏

ఆదూరి ఫణీంద్రరావు చెప్పారు...

పలువురు పోవు మార్గమును బట్టుటకొప్పఁడు పార్షదుండు యిం
పలరగ స్తోత్రపాఠముల బల్కునధీశుని మెప్పునొందగన్
తెలివిడి లేమిచే బొగడఁ దెల్పెను నేత గుణమ్ము నివ్విధిన్
ఎలుకను మ్రింగువాఁ డతని కేనుఁగు గొప్ప యనంగ నొప్పునే

Dhanikonda Ravi Prasad చెప్పారు...

కం:తెలియక ఏనుగు లక్ష్మణు
పలుకులకే వంక వెట్టె పండితుడగునే?
తెలుగే నేర్వడు,పందిని
నెలుకం దినువాఁ డతనికి నేనుఁగు గొప్పా?"
( ఎవడో ఏనుగు లక్ష్మణ కవిని విమర్శిస్తే ఆ కవి యొక్క అభిమాని ఇలా స్పందించాడు.)

Bapatla Venkateswara sai చెప్పారు...
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
Bapatla Venkateswara sai చెప్పారు...

తొలుతగ తమ్ముల బెట్టుచు
బలముగ పత్నిని సహితము పాచికలందున్
తలచగ ధర్మజు డయ్యేన్
ఎలుకం దినువాఁ డతనికి నేనుఁగు గొప్పా”

కామేశ్వర రావు పోచిరాజు చెప్పారు...

బలవంతుఁడు మేధావియు
నిలలో నరుఁ డెన్నఁ డైన నే భేదమ్ముం
దలఁపండు చిన్న పెద్దల
నెలుకం దినువాఁ డతనికి నేనుఁగు గొప్పా


కలవర మంద దెన్నఁడును గాపుర ముండు గృహమ్ము లందు నా
కఁలి కలుగంగ దాని కెలుకల్ దగు నోగిర మౌను మెక్కఁగాఁ
బులుల కులంపుఁ బిల్లి పలు పోకల జిత్తులమారి కాంచఁ జి
ట్టెలుకను మ్రింగువాఁ డతని కేనుఁగు, గొప్ప యనంగ నొప్పునే

[ఏనుఁగు = పెద్దది; ఎలుక పిల్లికిఁ బెద్ద గొప్ప కాదని భావము]

ఆదూరి ఫణీంద్రరావు చెప్పారు...

తెలియని తనమున మొఱకుడు
పలుకగతన నేతనుకడు బలవంతునిగా
తెలుపును తానివ్విధమున
యెలుకం దినువాఁ డతనికి నేనుఁగు గొప్పా

పిన్నక నాగేశ్వరరావు. చెప్పారు...


పిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.

అలవాటుగ నాహారము
తెలడాలు మెకముల సతము తినుచున్న
తఱిన్,
సులువుగ దొరికిన వీడుచు
నెలుకం, దినువాడతనికి నేనుగు గొప్పా?

కవుతా రామకృష్ణ చెప్పారు...

అవును గురువుగారూ, నల్లాన్ చక్రవర్తుల కృష్ణమాచార్యుల వారి బిడాలమోక్షము స్పురణతోనే పూరించినాను 🙏

డా.బల్లూరి ఉమాదేవి. చెప్పారు...

కలుపుచు చక్కెర పాకము
పలికెను చేసెద ప్రతిమలు పలు విధములుగా
నలయక తినుమన హితుడనె
నెలుకం తిను వాడతనికి నేనుగు గొప్పా.