ఉ:ఏమి విచిత్రబంధ మిది ? యీమె సహోదరు జంపినట్టి మా భీముని పైన నీ పడతి ప్రేమను బొందుట యేమి? మాతయే ప్రేమ సహించుటేమి?యరి భీకరుడై యలరారు నుగ్రతా రాముఁడు పెండ్లియాడె నొక రాక్షసకాంతను మోహమగ్నుఁడై” (ఈమె సోదరుణ్ని మా భీముడు చంపితే ఆమె భీముణ్నే ప్రేమించట మేమిటి? ప్రేమిస్తే మాత్రం మా అమ్మ నిర్భయం గా సమర్థించట మేమిటి?అసలు వీరత్వం తో,కోపం తో ఉండే భీముడు దీని పట్ల మోహం లో పడట మేమిటి?అంతా విచిత్రమే అనుకొన్నాడు ధర్మరాజు.)
ఉ:"ఏమి కులమ్ము దాని?" దన,"నే మత?" మన్నను "నాకు నచ్చె, మీ కేమి సమస్య?" యంచు తన యిష్టము గా గొని కొంప నుంచె మా రాముడు, నా సుపుత్రుడగు రావణ తుల్యుడు,సర్వదుర్గుణా రాముఁడు పెండ్లియాడె నొక రాక్షసకాంతను మోహమగ్నుఁడై” (ఇతిహాసం జోలికి పోకండా ఇదొక కిలాడీ పూరణ.వాడి కొడుకు పేరు రాముడు కానీ అన్నీ దుర్గుణాలే అని ,కులము మతము చూడకండా ఒక రాక్షసిని కొంప లోకి తెచ్చాడని బాధ పడుతున్నాడు.)
ఈ మహి నెంద రుండ రఁట యింపును గొల్పఁగ రామ నాములై భూమిజు లెల్ల మానవులు భూజ సమేత మహా చరాచర గ్రామము లన్ని యెన్నఁగను గ్రన్ననఁ జెప్పుమ విశ్వ మందు నే రాముఁడు పెండ్లియాడె నొక రాక్షస కాంతను మోహ మగ్నుఁడై
కందం
రిప్లయితొలగించండికామించి శూర్పణఖయే
తామస వృత్తిని కలఁగన దశరథ సుతుడున్
శ్రీమన్మంగళ రూపుఁడు
రాముఁడు పెండ్లాడె నొక్క రాక్షసకాంతన్
ఉత్పలమాల
కాముము మీర శూర్పణఖ కంజదళాక్షుని రామచంద్రునిన్
నీమములెంచు వాడనెడు నిక్కమెఱుంగక కోరి నిద్రలో
తామస వృత్తినిన్ గనఁగ దాశరథిన్ గుతి స్వప్న సీమలో
రాముఁడు పెండ్లియాడె నొక రాక్షసకాంతను మోహమగ్నుఁడై
సువర్ణ:
తొలగించండిఉత్పలమాల మొదటి పాదము మొదటి పదము 'కామము' గా చదువుకొన మనవి.
నేమముతో వసించు తరి నీధ్రము, గండము దాటి పాండవుల్
రిప్లయితొలగించండిక్షేమముగా హిడింబువని చేరియె శ్రాంతము నొందువేళలో
భీమునిపై హిడింబ గొనఁ బ్రేమను, సమ్మతి ద్రౌపదీహృదా
రాముఁడు పెండ్లియాడె నొక రాక్షసకాంతను మోహమగ్నుఁడై
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిరాముని కొరకై నీవిటు
రిప్లయితొలగించండిబాముల పడనేల నింక పంతము విడుమా
భూమిజ! రూఢిగ వింటిని
రాముఁడు పెండ్లాడె నొక్క రాక్షసకాంతన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిఏమని జెప్పెద ! నిన్నటి
రిప్లయితొలగించండియామిని వేళన గలిగిన యరుదగు కలలో
భీముని పాత్రన తారక
రాముఁడు పెండ్లాడె నొక్క రాక్షసకాంతన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి"వేళను... భీముడుగా నా తారక.." అనండి. (పాత్రన.. అనరాదు)
🙏
తొలగించండిరాముఁడు రాముఁడంచు జవరాల తపించెదవేల నీకిటన్
రిప్లయితొలగించండిబాముల పెట్టువారెవరు? భామరొ రావణుడంత జోదునీ
ప్రేమను గోరుచుండెనిక వేదన వీడుము నీవెరుంగవే
రాముఁడు పెండ్లియాడె నొక రాక్షసకాంతను మోహమగ్నుఁడై
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండికోమలి చెప్పెనడిగె నని
రిప్లయితొలగించండిప్రేమికునకు, విగ్రహమున వేలుపు శింగిన్
భీముడు వధించి వినుమా
రాముడు, పెండ్లాడె నొక్క రాక్షసకాంతన్.
మా మొర నాలకించి యానుమానము తీర్చు మటంచు బాలూడే
ప్రేమగ చెంత చేరుకొని వేలిమి యొజ్జను కోర తెల్పనే
భీముడు ముష్టి యుద్ధమున వేలుపు శింగిని జంపి, వింటివా
రాముడు, పెండ్లి యాడె నొక రాక్షస కాంతను మోహ మగ్నుడై.
ఉషా పరిణయము:
రిప్లయితొలగించండిరోమములన్ని నిక్కుననిరుద్ధుని ప్రేమ చరిత్రఁ జూడగన్
భామను కోరి పట్టుబడె బాణుని చేతికి, పోరు సల్పగా
ధీమతులంత మెచ్చి యరుదెంచగ తాతలు వాసుదేవుడున్
రాముఁడు పెండ్లియాడె నొక రాక్షసకాంతను మోహమగ్నుఁడై!!
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండికం:నీమముగ సీత నొకతెనె
రిప్లయితొలగించండిరాముఁడు పెండ్లాడె, నొక్క రాక్షసకాంతన్
కామించితి నన నొల్లక,
యే మనుజుడు పొంద నట్టి యిడుముల బొందెన్.
ఉ:ఏమి విచిత్రబంధ మిది ? యీమె సహోదరు జంపినట్టి మా
రిప్లయితొలగించండిభీముని పైన నీ పడతి ప్రేమను బొందుట యేమి? మాతయే
ప్రేమ సహించుటేమి?యరి భీకరుడై యలరారు నుగ్రతా
రాముఁడు పెండ్లియాడె నొక రాక్షసకాంతను మోహమగ్నుఁడై”
(ఈమె సోదరుణ్ని మా భీముడు చంపితే ఆమె భీముణ్నే ప్రేమించట మేమిటి? ప్రేమిస్తే మాత్రం మా అమ్మ నిర్భయం గా సమర్థించట మేమిటి?అసలు వీరత్వం తో,కోపం తో ఉండే భీముడు దీని పట్ల మోహం లో పడట మేమిటి?అంతా విచిత్రమే అనుకొన్నాడు ధర్మరాజు.)
కం॥ తామసుఁ డెవ్వఁడు పల్కెనొ
రిప్లయితొలగించండి”రాముడు పెండ్లాడె నొక్క రాక్షసకాంతన్”
నేమముఁ దప్పున రాముఁడు
ధామము సద్గుణములకిల దశరథ సుతుఁడే!
ఉ॥ ”రాముఁడు పెండ్లియాడె నొక రాక్షస కాంతను మోహమగ్నుఁడై”
తామస రూపుఁడెవ్వఁడిటు తప్పుగఁ బల్కెనొ ధర్మరక్షణా
ధాముఁడు సద్గుణాఢ్యుఁడుగ ధాత్రిని నిల్చిన విష్ణుమూర్తినిన్
భీముఁడు పెండ్లియాడెఁ గద ప్రేమగ వేడిన రాక్షసాంగనన్
ఉ:"ఏమి కులమ్ము దాని?" దన,"నే మత?" మన్నను "నాకు నచ్చె, మీ
రిప్లయితొలగించండికేమి సమస్య?" యంచు తన యిష్టము గా గొని కొంప నుంచె మా
రాముడు, నా సుపుత్రుడగు రావణ తుల్యుడు,సర్వదుర్గుణా
రాముఁడు పెండ్లియాడె నొక రాక్షసకాంతను మోహమగ్నుఁడై”
(ఇతిహాసం జోలికి పోకండా ఇదొక కిలాడీ పూరణ.వాడి కొడుకు పేరు రాముడు కానీ అన్నీ దుర్గుణాలే అని ,కులము మతము చూడకండా ఒక రాక్షసిని కొంప లోకి తెచ్చాడని బాధ పడుతున్నాడు.)
పామరు డొక్కడు కలలో
రిప్లయితొలగించండితామసు డై వింత గాంచి తన మి త్రు లతో
కామితముగ పలికె నిటుల
రాముడు పెండ్లాడె నొక్క రాక్షస కాంతన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండివాట్సప్ లో సమీక్షించినవి ఇక్కడ సమీక్షించలేదని మిత్రులు గమనించగలరు.
రిప్లయితొలగించండిఏమకొ! సీతనుగద నౌ
రిప్లయితొలగించండిరాముడు పెండ్లాడె, నొక్క రాక్షస కాంతన్
రామ! యనదగునదుర్విన్
ఏమది పద్యపుసమస్యనిల కాక మరిన్?
దీక్షితులు మూల,అల్లవరం.
ఆమందోదరి సుమతినిఁ
రిప్లయితొలగించండిగామాంధుఁడు రావణుండు ఖలుఁ డా లంకా
ధాముఁడు క్రూరుఁడు వంచిత
రాముఁడు పెండ్లాడె నొక్క రాక్షస కాంతన్
ఈ మహి నెంద రుండ రఁట యింపును గొల్పఁగ రామ నాములై
భూమిజు లెల్ల మానవులు భూజ సమేత మహా చరాచర
గ్రామము లన్ని యెన్నఁగను గ్రన్ననఁ జెప్పుమ విశ్వ మందు నే
రాముఁడు పెండ్లియాడె నొక రాక్షస కాంతను మోహ మగ్నుఁడై
భూమాత దుహిత సీతను
రిప్లయితొలగించండిరాముఁడు పెండ్లాడె ,నొక్క రాక్షసకాంతన్
భీముఁడు సంతోషంబున
గామముతోఁబెండ్లియాడి గనియెను బిడ్డన్
కామా లేదట, సీతను
రిప్లయితొలగించండిరాముడు పెండ్లాడె నొక్క రాక్షస కాంతన్
ఏమియు కాదను పదమది
నే మఱచితి గురుతునిడుట నేరము నాదే
"లేదట" కి బదులుగా "లేదుగ" అంటే బాగుంటుందేమో🤔😆
రిప్లయితొలగించండి
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.
కోమలిని విల్లు ద్రుంచిన
రాముడు పెండ్లాడె; నొక్క రాక్షస కాంతన్
ప్రేమించెనన హిడింబిని
భీముడు సమ్మతిని తెలిపి పెండిలియాడెన్.
మామా! నిజమే! భూజను
రిప్లయితొలగించండిరాముడు పెండ్లాడె, నొక్కరాక్షసకాంతన్
ఏమది తాటక వధగొని,
సేమముగానే చనియెను చేరగ మిథిలన్
భామా! నిజమే! సీతను
రాముడు పెండ్లాడె, నొక్కరాక్షసకాంతన్
ఏమన తాటక వధనిడి,
రాముడు పెండ్లాడె, కాదు రాక్షసకాంతన్
మామా! నిజమే ఔగా!
రాముడు పెండ్లాడె, నొక్కరాక్షసకాంతన్
ఏమన తాటక వధనిడి,
భూమిజనే పెండ్లియాడెపో రక్కసినే?
మామా! నిజమే సుమ్మీ!
రాముడు పెండ్లాడె, నొక్కరాక్షసకాంతన్
ఏమన తాటక వధచే
సిన్, మైథిలినే మనువిడె జితముగ మిథిలన్
స్వామివిలువిరిచి మహిజను
రిప్లయితొలగించండి*“రాముఁడు పెండ్లాడె ,నొక్క రాక్షసకాంతన్”*
భీముడు వివాహమాడెను
ప్రేమగదరిచేరినంత పృథయను మతితో
ఆమహిజన్ స్వయంవరమునందుననీశునివిల్విరించియా
*“రాముఁడు పెండ్లియాడె నొక రాక్షసకాంతను మోహ మగ్నుఁడై”*
భీముడు కానయందునతిభీకరరూపుమువీడుచున్ వడిన్
కామినితిర్గుచుండగనుగాంచుచుకోరగ పెండ్లియాడెతా