15, జనవరి 2025, బుధవారం

సమస్య - 5004

16-1-2025 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“చాచా తుర్యంబు శ్రవణసౌఖ్యం బొసఁగున్”
(లేదా...)
“చాచా తుర్యము వింతగన్ జెవులకున్ సౌఖ్యంబు నిచ్చున్ గదా”
(కందపాదం నారసింహ పురాణం లోనిది)

15 కామెంట్‌లు:

  1. లోచకులగు మనుజులెపుఁడు
    వాచాలత్వమును జూపి వదరుదురేలో
    యోచనతో సలిపెడు వా
    చా చాతుర్యంబు శ్రవణసౌఖ్యం బొసఁగున్

    రిప్లయితొలగించండి
  2. వాచాలత్వము విడువగ
    తూచా తప్పని జతనము దోషరహితమౌ
    వాచకుని గౌశలము వా
    చా చాతుర్యంబు శ్రవణసౌఖ్యం బొసఁగున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. వాచాలత్వము వీడు దీమసముతో వాగ్వాదముల్ దూరమౌ
      తూచాతప్పని నీమమెన్నడయినన్ దోట్పాటునందించుగా
      ప్రాచీనంబగు కావ్యముల్ చదువగా ప్రాప్తించు వాగ్ధాటి వా
      చా చాతుర్యము వింతగన్ జెవులకున్ సౌఖ్యంబు నిచ్చున్ గదా

      తొలగించండి

  3. వాచాలుడు వాడైనను
    ప్రాచుర్యము పొందినట్టి పండితు డతడే
    వాచించిన వాడిక చా
    చా! చాతుర్యంబు శ్రవణసౌఖ్యం బొసఁగున్.


    వాచాలుండని యెంచబోకు మతడే ప్రాజ్ఞుం డటం చున్ భువిన్
    బ్రాచుర్యంబు వహించె హాస్యయుతమౌ వాగ్ధాటి నాలించి నన్
    వైచిత్ర్యంబిదె బాధలన్ మరతురే వాడాడు పానాలు చా
    చా! చాతుర్యము వింతగన్ జెవులకున్ సౌఖ్యంబు నిచ్చున్ గదా!

    రిప్లయితొలగించండి
  4. కందం
    ' బ్రో' 'చేవారెవరంచును
    దోచెను మది త్యాగరాజు, తొలుతన్ మనమా
    లోచింప 'ప్రో' యనని వా
    చా చాతుర్యంబు శ్రవణసౌఖ్యం బొసఁగున్!

    శార్దూలవిక్రీడితము
    'బ్రో 'చేవారెవరంచు త్యాగయ గళమ్మున్ విప్ప శ్రీరాముడున్
    దాచన్ జూచునె భక్తవత్సలత సంధానింపఁ గారుణ్య, మా
    లోచింపంగను కీర్తనన్ తొలుతఁ దా 'ప్రో' వాడగా లేని వా
    చా చాతుర్యము వింతగన్ జెవులకున్ సౌఖ్యంబు నిచ్చున్ గదా!

    రిప్లయితొలగించండి
  5. ప్రాచుర్యంబగు నుడుల స
    దా చారపు భాష ణంబుతా త్విక సొబగుల్
    యో చించు చు సల్పె డు వా
    చా చా తుర్య o బు శ్రవణ సౌఖ్య o బొసగున్

    రిప్లయితొలగించండి
  6. వాచాలుడు పలుకు నిటుల
    "చాచా తుర్యంబు శ్రవణసౌఖ్యం బొసఁగున్”
    ఆచరణీయము కాదది ,
    శొచనము సలిపెడి పేళ శోభనిడదుగా

    రిప్లయితొలగించండి
  7. యోచన తెలియని‌ మాటలు
    పేచీలకుదారిపెట్టి‌ పెరుగును‌ రిపులున్‌
    వాచకశుద్ధియు‌ ఘనవా‌
    చా చాతుర్యంబు‌ శ్రవణసౌఖ్యం‌ బొసఁగున్



    రిప్లయితొలగించండి
  8. వాచాలత్వముతోడ లోచకులు సంభావింపకన్ సత్యమున్
    బైచేయిన్ ప్రకటింప జూచెదరు సంవాదంబు నందెన్నడున్
    వాచాలత్వము నిష్పలంబగుటచే వర్జించ క్షేమంబు వా
    చా చాతుర్యము వింతగన్ జెవులకున్ సౌఖ్యంబు నిచ్చున్ గదా

    రిప్లయితొలగించండి
  9. కం:ఓ చెలికాడా!నీ కడ
    నే చదువును లేదు కాని!ఎట నేర్చితివో
    ఈ చిలిపి తనము! నీ వా
    చాచా తుర్యంబు శ్రవణసౌఖ్యం బొసఁగున్

    రిప్లయితొలగించండి
  10. కం॥ యోచనఁ జేయఁగ నేలనొ
    వాచాలత్వము విడువఁగ బహు సాధువుగన్
    బ్రాచుర్యము నొసఁగెడు సూ
    చా చాతుర్యంబు శ్రవణ సౌఖ్యంబొసఁగున్

    శా॥ నీచత్వంబును వీడి మానవులిలన్ నెమ్మిన్ బ్రవర్తిల్లఁగన్
    వాచాలత్వముఁ గాంచ కుండఁగను సద్భావమ్ముతో సర్వదా
    ప్రాచుర్యమ్మును వచ్చుఁ గాంచఁగనటుల్ భాగ్యమ్ముగా నొప్పు సూ
    చా చాతుర్యము వింతగన్ జెవులకున్ సౌఖ్యంబు నిచ్చున్ గదా

    సూచా అభినయః దర్శనమ్ నిఘంటువు సహాయమండి

    రిప్లయితొలగించండి
  11. శా:నీ చెంతన్ బడియుండ జేసితివి కానీ,మేని దాకంగనే,
    నీ చెంపన్ నిమరంగ,ముద్దు నిడగా నీ సిగ్గు జూపించి నన్
    "చీ చా" యందువు, నా కదే మథురమౌ,సిగ్గొంది నీ పల్కు "చీ
    చా" చాతుర్యము వింతగన్ జెవులకున్ సౌఖ్యంబు నిచ్చున్ గదా”

    రిప్లయితొలగించండి
  12. ప్రియుడి భాషణం
    (2)శా:నీ చెంతన్ బడియుండ జేసితివి కానీ,మేని దాకంగనే,
    నీ చెంపన్ నిమరంగ,ముద్దు నిడగా నీ సిగ్గు జూపించి నన్
    "చీ చా" యందువు, నా కదే మథురమౌ,సిగ్గొంది నీ పల్కు "చీ
    చా" చాతుర్యము వింతగన్ జెవులకున్ సౌఖ్యంబు నిచ్చున్ గదా”

    రిప్లయితొలగించండి
  13. రోచిస్సు లడర ముఖమునఁ
    బ్రాచీనాచారములను బాటించినచో
    నీచార్థ రహిత తద్వా
    చా చాతుర్యంబు శ్రవణసౌఖ్యం బొసఁగున్


    ఆచారమ్ముల ధ్యాస నుంచి సుర నిత్యారాధ నార్థమ్ముగా
    వాచాలత్వము వీడి భక్తిఁ దనరన్ వాక్ఛుద్ధి భాసిల్లగా
    శౌచస్వాంతము సామ వేద విహితాంచద్రాగ వత్కీర్త నా
    ర్చా చాతుర్యము వింతగన్ జెవులకున్ సౌఖ్యంబు నిచ్చున్ గదా

    రిప్లయితొలగించండి
  14. నీచిలిపిచూపులవియును
    నాచక్షువులకునుతోచెనారాచములై
    ఓచెలి నీతీయని వా
    *"చాచా తుర్యంబు శ్రవణసౌఖ్యం బొసఁగున్”*

    రిప్లయితొలగించండి