16, జనవరి 2025, గురువారం

సమస్య - 5005

17-1-2025 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“పెండ్ల మర్ధాంగి వల్లభ ప్రేయసి సతి”
(లేదా...)
“పెండ్లము గేస్తురాలు సతి ప్రేయసి వల్లభ దార జాయయున్”

38 కామెంట్‌లు:

  1. జాయ గేహిని దేవేరి శాలిని వశ
    జాని పతివత్ని పరిగృహ్య జాయ దార
    పెండ్ల మర్ధాంగి వల్లభ ప్రేయసి సతి
    పత్ని వధువు చామయనగ భార్యయొప్పు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

      తొలగించండి
    2. ఇండ్లనగా నివాసములు నిక్కలు కొంపలు కాననంబులౌ
      కండ్లవలోకనమ్ములనఁ గన్నులు దృక్కులు దేహదీపముల్
      చండ్లనగా నురోజములు చాచులు చన్నులు గాదె చామయే
      పెండ్లము గేస్తురాలు సతి ప్రేయసి వల్లభ దార జాయయున్

      తొలగించండి
    3. మీ పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
  2. "పెండ్ల‌ , మర్ధాంగి , వల్లభ , ప్రేయసి , సతి"
    'వధువు' నకుగల పర్యాయ పదములవియ
    తెలుగున యిటువంటివి యుండ దేలికయ్యె
    పద్యములను వ్రాయుటకయి పండితులకు

    రిప్లయితొలగించండి
  3. తేటగీతి
    కలవు పర్యాయపదములు దెలియనెంచ
    యింటిదీపమై వెలిగెడునింతికౌర!
    యాలి నెరవేర్చు బాధ్యతలనుసరించి
    పెండ్ల మర్ధాంగి వల్లభ ప్రేయసి సతి

    ఉత్పలమాల
    ఇండ్లను దీపమై వెలిగి యింపుగ భర్తల కండదండగన్
    గండ్లను నింపి రాగమును గౌరవమన్నది పెంపు జేయ నూ
    రేండ్లగు బంధమంచు కడు ప్రీతిగ జేసెడు బాధ్యతాళితో
    పెండ్లము! గేస్తురాలు! .,సతి, ప్రేయసి! వల్లభ! దార! జాయయున్!

    రిప్లయితొలగించండి

  4. ప్రాణసమకింక పర్యాయ పదము లడగ
    తెలివి గలిగిన శిష్యుండు తెలిపె నిటుల
    చామ యొడయురాలువిద నిశాంత నారి
    పెండ్ల మర్ధాంగి వల్లభ ప్రేయసి సతి.


    ఏండ్లుగతింపనేమి కన నిమ్మహి లోగల సాంప్రదాయమున్
    పెండ్లియె మూలమంచు మన పెద్దల మాటలె వాస్తవమ్ము బా
    సండ్లను తోము, భర్తకుపచారము జేసెడి యింటి దీపమే
    పెండ్లము గేస్తురాలు, సతి ప్రేయసి వల్లభ దార జాయయున్.

    రిప్లయితొలగించండి
  5. భార్య కున్నట్టి పర్యాయ పద ముల న్ని
    తెలుపు మో శిష్య టక్కున తెలిసి నన్ని
    యనగ వాడిట్లు తెలిపె తా నపుడు కొన్ని
    " పెండ్ల మ ర్ధాంగి వల్లభ ప్రేయసి సతి "

    రిప్లయితొలగించండి
  6. తే.గీ:ఆండ్ల నెనమండుగురనేల పెండ్లి యాడె
    కన్న? డన వారి పాత్రలు భిన్న మిట్లు
    "పెండ్ల, మర్ధాంగి ,వల్లభ ప్రేయసి ,సతి,
    జాయయున్,దార,గేస్తురా లోయి సఖుడ"
    (ఎనమండుగుర్ని పెళ్లి దేనికి చేసుకున్నాడు? అంటే ఆ ఎనమండుగురి పాత్రలు వేరు.ఒకళ్లు పెళ్లాం.ఒకళ్లు అర్థాంగి.దేని భావం దానిదే.)

    రిప్లయితొలగించండి
  7. శక్తి రూపిణి సహధర్మ చారిణగుట
    భర్త భరియించు వాడని పలుకుచుండ
    భార్య పర్యాయ పదములబలముహెచ్చు
    పెండ్ల మర్ధాంగి వల్లభ ప్రేయసి సతి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'చారిణి + అగుట' అన్నపుడు సంధి లేదు.

      తొలగించండి
  8. ముండ్లు శతాధికంబుగను బొల్చిన మార్గము నర్థరాత్రమున్
    కండ్లను మూసిపెట్టి చను కైవడి కొందఱుఁ; గొందఱెన్న పూ
    చెండ్లగమంబుఁ బోవునటు జీవితమున్ గను హేతువొక్కటౌ
    పెండ్లము గేస్తురాలు సతి ప్రేయసి వల్లభ దార జాయయున్.

    రిప్లయితొలగించండి
  9. కలిమి లేముల యందున కలిసి మెలిసి
    మగడు మెచ్చెడు రీతిగా మసలుకొనుచు
    యింటినే స్వర్గమును జేయు యింతి గాదె
    పెండ్ల మర్ధాంగి వల్లభ ప్రేయసి సతి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'మసలుకొనుచు నింటినే... జేయు నింతి..' అనండి.

      తొలగించండి
  10. ఇండ్లను స్వర్గతుల్యముగ నేర్పడ జేయుచునెల్ల వేళలన్
    కండ్లకు వత్తులుంచుకొని గాఁచెడిదెవ్వరు? కాపురంబునన్
    యేండ్లునుపూండ్లు కష్టమనియెంచక చాకిరిచేయు నెవ్వరో?
    పెండ్లము గేస్తురాలు సతి ప్రేయసి వల్లభ దార జాయయున్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'కాపురంబునన్ + ఏండ్లును...' అన్నపుడు యడాగమం రాదు.

      తొలగించండి
    2. సవరిస్తాను గురువుగారూ 🙏 (కాపురంబునందేండ్లును...)

      తొలగించండి
  11. (2)ఉ:"పెండ్లి యదేల గృష్ణునకు పెక్కురి తోడ" ననంగ! మిత్రమా
    పెండ్ల మటన్న జాలు నొకొ పెండ్లము పాత్రలు పెక్కు "భార్యయున్
    పెండ్లము గేస్తురాలు సతి ప్రేయసి వల్లభ దార జాయయున్”
    పెండ్ల మదొక్కతే యయిన వేదన చెందదె యిన్ని పాత్రలన్?
    (ఒక్కతే భార్య ఇన్ని పాత్రలు పోషించటానికి బాధ పడుతుంది అనే సానుభూతి తో ఆయన ఎనమండుగుర్ని చేసుకున్నాడు.)

    రిప్లయితొలగించండి
  12. భర్త భార్యల పర్యాయ పదముగలవి
    వ్రాయమనగురు,, వ్రాసెనే పాఠశాలి
    పతి, మగడు,ఱేడు,కాంతుడు, వల్లభుండు
    పెండ్ల మర్ధాంగి వల్లభ ప్రేయసి సతి

    రిప్లయితొలగించండి
  13. తే॥ రామభద్రునకు నొకతే రమణి భవిని
    నిరత మామనే యెడఁదను నిలిపె నతఁడు
    పెండ్ల మర్ధాంగి వల్లభ ప్రేయసి సతి
    వాడఁ బర్యాయ పదములు వేడుక గద

    ఉ॥ పెండ్లము నొక్కటే ముదము ప్రేరణఁ బొందుచు రామభద్రునే
    యిండ్లను కొల్చి నెయ్యమున నింతిని గొప్పగఁ జూడఁగన్ దగున్
    గండ్లకుఁ బెక్కు రూపములఁ గన్పడు మార్దవ మున్నఁ జానయే!
    పెండ్లము గేస్తురాలు సతి ప్రేయసి వల్లభ దార జాయయున్

    మార్దవము ఉండుట అతి ముఖ్యమండి

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. భువిని పొరపాటున భవిని అని వ్రాసానండి.

      తొలగించండి
    2. వ్యంగ్య పూరణ అండి

      పెండ్లము తప్పులెన్నుచును బ్రీతినిఁ గాంచక దెప్పుచుండఁగా
      నిండ్లను నిత్యమా విధిగ నెంతటి భాగ్యము భర్తకబ్బునో
      కండ్లకు దేవుఁడే పతికిఁ గన్పడుఁ బల్కును మోదమంది నా
      ”పెండ్లము గేస్తురాలు సతి ప్రేయసి వల్లభ దార జాయయున్”

      తొలగించండి
  14. రాముడంతవాడెఱిఁగెను రమ్య సతిని
    విలువనెంచి ధర్మార్ధపు విహితమరసి
    కలను గూడ పరసతిని గాంచలేదు
    పెండ్ల మర్ధాంగి వల్లభ ప్రేయసి సతి
    మహిని వెలుగొంద సాధ్యము మాన్యతెరుగ

    రిప్లయితొలగించండి
  15. ద్రౌపదీ సతి పాంచాలి ధర్మముగను
    ధర్మజునకు భీమునకు నింద్ర తనయునకు
    నకులునకును నా సహదేవునకుఁ గ్రమముగఁ
    బెండ్ల మర్ధాంగి వల్లభ ప్రేయసి సతి


    పండ్లగు నెన్న ముత్యములు పద్మ నిభమ్ములు కన్ను లెన్న లేఁ
    దూండ్లగు బాహు యుగ్మములు దొండ ఫలం బధరమ్ము చూపులే
    ముండ్లగు ధాత్రి భార్యలకుఁ బోల్ప ముఖం బగుఁ జంద్ర బింబమే
    యిండ్ల వసింత్రు దారలు మృగేక్షణ లింపుగ దార కర్థమే
    పెండ్లము గేస్తురాలు సతి ప్రేయసి వల్లభ దార జాయయున్

    రిప్లయితొలగించండి
  16. పెండ్ల,మర్ధాంగి, వల్లభ,ప్రేయసి,సతి,
    బుజ్జి! బందరులడ్డంచు! పులకలెత్తి
    తనసతిని, ప్రేమపిలువంగ! తనువునిచ్చి
    పతిని,మురిపించు, సత్సతి రతినిదేల్చి!

    రిప్లయితొలగించండి
  17. పెండ్లిని యాడి మెట్టినిలు ప్రేమను పంచగ వేల కోర్కెలన్
    ఇండ్లను గూడు భామినుల కింతయు జారని గుట్టుమట్టులన్
    ఏండ్లును సాగినన్ బ్రతుకు నేర్పడు కష్టపు భీతి లేనిదౌ
    పెండ్లము గేస్తురాలు, సతి ప్రేయసి, వల్లభ దార, జాయయున్

    రిప్లయితొలగించండి
  18. భార్యకు గలవుపర్యాయ పదము లెన్నొ
    నారు రీతులుగా భర్త ననుసరించు
    జాయయే గద పరికింప జగతి యందు
    *“పెండ్ల మర్ధాంగి వల్లభ ప్రేయసి సతి”*

    ఏండ్లవి ఎన్నిమారినను నించుకయైననుమారకుండనూ
    రేండ్లునుబాయకే మసలు నింతియెనిల్పుచుసంప్రదాయమున్
    కండ్లనుబెట్టిజూచుకొనుకాంతయెభర్తకుతానుసర్వమౌ
    *“పెండ్లము గేస్తురాలు సతి ప్రేయసి వల్లభ దార జాయయున్”*

    రిప్లయితొలగించండి