11-1-2025 (శనివారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“మరలందున్ గనె భ్రమరము మకరందమ్మున్”(లేదా...)“మరలందున్ మకరంద మున్నదని సంభావించె షట్పాదముల్”
కందంసురల కనుల, కరముల మరిచరణములన్ పోల్చఁ గవులు స్వచ్చము ననుచున్బరిమళమునకు మురిసి తామరలందున్ గనె భ్రమరము మకరందమ్మున్! మత్తేభవిక్రీడితముకరముల్ కన్నులు పాదముల్ సురల సింగారంపు దేహంబునన్సరిపోలన్ కవి పండితాళి పొగడన్ స్వారస్యమేపారఁగన్నిరతమ్మున్ విరులందు గ్రోలు కతనందెంతెంతొ నాశించి తామరలందున్ మకరంద మున్నదని సంభావించె షట్పాదముల్!
విరివిగ వానలు కురియగపురమున గల చిన్ని చెరువు భువనము తోడన్నెరవుగ నిండ న చటి తామరలందున్ గనె భ్రమరము మకరందమ్మున్
మరణంబే దిక్కని యోగిరమెచ్చట గానలేక ఖేదము తోడన్ తిరిగెడి తరి కొలనున తామర లందున్ గనె భ్రమరము మకరందమ్మున్.సిరి మల్లెల్ విరబూసినట్టి వనమున్ జేరన్ ఫలంబేమి యోగిరమచ్చోట లభింపదయ్యె ననుచున్ ఖేదమ్ము నేపొందెడిన్ దరి కాసారము గాంచి నందుగల సత్యంబందు శోభించు తామర లందున్ మకరంద మున్నదని సంభావించె షట్పాదముల్.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
చెరువులు నిండెను వానలవరుణుడు గరుణించ వెలసె వనజము లందున్ దరుణము దొరికె ననుచు దా మరల o దు న్ గనె భ్రమరము మక రందమ్మున్
స్థిరమై క్షామము పట్టి వీడని తఱిన్ తేనెల్ భుజింపంగనే తరులన్ పువ్వులు గానరావు వనముల్ దగ్ధంబులయ్యెన్ సరోవరమే యొక్కటి కానవచ్చెనట దైవంబే కృపంజూప దామరలందున్ మకరంద మున్నదని సంభావించె షట్పాదముల్!!
సరిపోల్తురు కవివర్యుల్తరుణీమణులఁ గమనీయ తామరలనుచున్బొరబడినన్ జివరకు తామరలందున్ గనె భ్రమరము మకరందమ్మున్విరిబోడుల్ సరిపోలుచుంద్రు కవులుత్ప్రేక్షించి వర్ణింప తామరపూలన్, గననౌను పద్మముఖులై మత్తిల్లగాజేయు సుందర రూపుల్ తమ మోములే విరులుగా తారాడ వీక్షించి తా మరలందున్ మకరంద మున్నదని సంభావించె షట్పాదముల్
వరపద్మాక్షిని సూర్యసన్నిభసురుగ్వక్త్రన్ మదోన్మత్తబంభరవేణిన్ గని నీటిలోన, శశిసంప్రాపించనౌ వేళ, ముంగురులన్ స్వీయకులాప్తసంచయముగాఁ, గ్రొంబూవులౌ గన్నుదామర లందున్ మకరంద మున్నదని సంభావించె షట్పాదముల్.
కం:తిరుగక తోటల యందునమర లందున శుద్ధి జేయ మకరందము నెవ్వరొ పారిశ్రామికు లామరలందున్ గనె భ్రమరము మకరందమ్మున్”(ఆ భ్రమరానికి కష్ట పడకండా మరలలో తేనె లభిస్తోంది.)
విరబూసిన సుమముల కై తరువులు వెదకంగ యుదయ,తారస పడెనే చెరువుల నందు చివర తా మరలందున్ గనె భ్రమరము మకరందమ్మున్
మ:తరుణుల్ స్వచ్ఛసుమమ్ములన్ గొనక యిన్తన్ తావి యేపాటి మాథురి నే యీయని బొమ్మ పూవులనె యెంతో మెచ్చి యా కొయ్య యల్మరలం దుంచగ తుమ్మెదల్ తిరిగె కాలమ్మివ్విధిన్ మారె,నల్మరలందున్ మకరంద మున్నదని సంభావించె షట్పాదముల్”(అల్మరా లో ఉన్న ప్లాస్టిక్ పూలని చూసి మకరందం ఉన్నదని తుమ్మెదలు భావించాయి.)
కందం
రిప్లయితొలగించండిసురల కనుల, కరముల మరి
చరణములన్ పోల్చఁ గవులు స్వచ్చము ననుచున్
బరిమళమునకు మురిసి తా
మరలందున్ గనె భ్రమరము మకరందమ్మున్!
మత్తేభవిక్రీడితము
కరముల్ కన్నులు పాదముల్ సురల సింగారంపు దేహంబునన్
సరిపోలన్ కవి పండితాళి పొగడన్ స్వారస్యమేపారఁగన్
నిరతమ్మున్ విరులందు గ్రోలు కతనందెంతెంతొ నాశించి తా
మరలందున్ మకరంద మున్నదని సంభావించె షట్పాదముల్!
విరివిగ వానలు కురియగ
రిప్లయితొలగించండిపురమున గల చిన్ని చెరువు భువనము తోడన్
నెరవుగ నిండ న చటి తా
మరలందున్ గనె భ్రమరము మకరందమ్మున్
రిప్లయితొలగించండిమరణంబే దిక్కని యో
గిరమెచ్చట గానలేక ఖేదము తోడన్
తిరిగెడి తరి కొలనున తా
మర లందున్ గనె భ్రమరము మకరందమ్మున్.
సిరి మల్లెల్ విరబూసినట్టి వనమున్ జేరన్ ఫలంబేమి యో
గిరమచ్చోట లభింపదయ్యె ననుచున్ ఖేదమ్ము నేపొందెడిన్
దరి కాసారము గాంచి నందుగల సత్యంబందు శోభించు తా
మర లందున్ మకరంద మున్నదని సంభావించె షట్పాదముల్.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తొలగించండిచెరువులు నిండెను వానల
రిప్లయితొలగించండివరుణుడు గరుణించ వెలసె వనజము లందున్
దరుణము దొరికె ననుచు దా
మరల o దు న్ గనె భ్రమరము మక రందమ్మున్
స్థిరమై క్షామము పట్టి వీడని తఱిన్ తేనెల్ భుజింపంగనే
రిప్లయితొలగించండితరులన్ పువ్వులు గానరావు వనముల్ దగ్ధంబులయ్యెన్ సరో
వరమే యొక్కటి కానవచ్చెనట దైవంబే కృపంజూప దా
మరలందున్ మకరంద మున్నదని సంభావించె షట్పాదముల్!!
సరిపోల్తురు కవివర్యుల్
రిప్లయితొలగించండితరుణీమణులఁ గమనీయ తామరలనుచున్
బొరబడినన్ జివరకు తా
మరలందున్ గనె భ్రమరము మకరందమ్మున్
విరిబోడుల్ సరిపోలుచుంద్రు కవులుత్ప్రేక్షించి వర్ణింప తా
మరపూలన్, గననౌను పద్మముఖులై మత్తిల్లగాజేయు సుం
దర రూపుల్ తమ మోములే విరులుగా తారాడ వీక్షించి తా
మరలందున్ మకరంద మున్నదని సంభావించె షట్పాదముల్
వరపద్మాక్షిని సూర్యసన్నిభసురుగ్వక్త్రన్ మదోన్మత్తబం
రిప్లయితొలగించండిభరవేణిన్ గని నీటిలోన, శశిసంప్రాపించనౌ వేళ, ముం
గురులన్ స్వీయకులాప్తసంచయముగాఁ, గ్రొంబూవులౌ గన్నుదా
మర లందున్ మకరంద మున్నదని సంభావించె షట్పాదముల్.
కం:తిరుగక తోటల యందున
రిప్లయితొలగించండిమర లందున శుద్ధి జేయ మకరందము నె
వ్వరొ పారిశ్రామికు లా
మరలందున్ గనె భ్రమరము మకరందమ్మున్”
(ఆ భ్రమరానికి కష్ట పడకండా మరలలో తేనె లభిస్తోంది.)
విరబూసిన సుమముల కై
రిప్లయితొలగించండితరువులు వెదకంగ యుదయ,తారస పడెనే
చెరువుల నందు చివర తా
మరలందున్ గనె భ్రమరము మకరందమ్మున్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిమ:తరుణుల్ స్వచ్ఛసుమమ్ములన్ గొనక యిన్తన్ తావి యేపాటి మా
రిప్లయితొలగించండిథురి నే యీయని బొమ్మ పూవులనె యెంతో మెచ్చి యా కొయ్య య
ల్మరలం దుంచగ తుమ్మెదల్ తిరిగె కాలమ్మివ్విధిన్ మారె,న
ల్మరలందున్ మకరంద మున్నదని సంభావించె షట్పాదముల్”
(అల్మరా లో ఉన్న ప్లాస్టిక్ పూలని చూసి మకరందం ఉన్నదని తుమ్మెదలు భావించాయి.)