23, జనవరి 2025, గురువారం

సమస్య - 5012

24-1-2025 (శుక్రవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కంటన్ గంకణమిడెఁ దిలకమును గరమునన్”
(లేదా...)
“కంటను గంకణమ్ము దిలకమ్ము గరమ్ము నలంకరించెడున్”
(ఆకాశవాణి సమస్య)

6 కామెంట్‌లు:


  1. తుంటరి పనులను చేసెడి
    చంటికి స్నానంబు బోసి చట్టు దొడగి వా
    ల్గంటియె పేర్మిని కాటుక
    కంటన్ , గంకణ, మిడెఁ దిలకమును గరమునన్.


    కొంటె కొమారి యల్లరిని కూరిమి తోడ భరించు నట్టి వా
    ల్గంటియె యోరిమిన్ విడక లాలన జేయుచు వేడినీటితో
    చంటికి బోసి గాహనము జక్కగ దిద్దెను పేర్మి గాటుకన్
    గంటను, గంకణమ్ము దిలకమ్ము గరమ్ము నలంకరించెడున్.

    రిప్లయితొలగించండి
  2. కందం
    వింటిని గొని, నీరొల్కగ
    కంటన్, గంకణమిడెఁ, దిలకమును గరమునం
    దంటుచు దిద్దె నుదుట వె
    న్నంటుచు నభిమన్యునకు వణకి యుత్తరయే!

    ఉత్పలమాల
    అంటగ నేగుచున్ రణము యాలికొసంగెను, నీరుఁ గాంచుచున్
    కంటను, గంకణమ్ము! 'దిలకమ్ము గరమ్ము నలంకరించెడున్'
    వింటినిబట్టి నిల్వ పతి వీరుని మోమున దిద్ద, 'నాలికిన్' !
    జంటను గాంచ నుత్తరయు శౌర్యుడునౌ యభిమన్యుఁడే కదా!

    రిప్లయితొలగించండి
  3. కంటికి శుక్లము వచ్చిన
    కొంటె తనపు కోమ లాంగి కోరిక మీరన్
    చంటి కలంకర ణ ము గా
    కంటన్ గంక ణ మిడె దిలక మును గర మునన్

    రిప్లయితొలగించండి
  4. వెంటనె సలుపక నుండిన
    తంటలు దప్పవనుకొనగ త్వరపడి నందున్
    నొంటిగ దడబడు చుండగ
    కంటన్ గంకణమిడెఁ దిలకమును గరమునన్

    రిప్లయితొలగించండి
  5. పంటలు పండిన తరుణము
    జంటను గట్టగ తొరపడు జాణయొకతె తా
    నొంటిని సవరించుచు మే
    ల్కంటన్ గంకణమిడెఁ దిలకమును గరమునన్

    పంటలు నూర్చికర్షకులు పండుగ సల్పిరి సంతసంబునన్
    జంటలు కట్టనెంచి నెఱజాణలు పల్వురు తొందరించగా
    కంటికి నిద్రరాని పలు కన్నెల చేష్టలు తెల్లమాయె మే
    ల్కంటను గంకణమ్ము దిలకమ్ము గరమ్ము నలంకరించెడున్

    [మేల్కంట = మేల్కొనుట]

    రిప్లయితొలగించండి
  6. వింటిని కవయిత యా వా
    ల్గంటికి యవధానమందు రత్నము తోన్, లే
    రంటి సరియనుచు కాటుక
    కంటన్, గంకణమిడెఁ దిలకమును గరమునన్

    రిప్లయితొలగించండి