18, జనవరి 2025, శనివారం

సమస్య - 5007

19-1-2025 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“వేడిన నిష్ఫలము గాదె వేంకటపతినిన్”
(లేదా...)
“వేడుకొనంగ నిష్ఫలము వేంకటనాథుని భక్తితో జనుల్”

7 కామెంట్‌లు:

  1. వాడుక రీతిగ భార్యను
    వేడిన నిష్ఫలము గాదె ; వేంకటపతినిన్
    నేడే కయిముకుళించుచు
    తోడుగ నుండమని కోర తులుచన జరుగున్

    రిప్లయితొలగించండి
  2. కందం
    ఆడి గెలిచె రాముడు మును
    గూడుచు సఖ్యంపు భక్తి గోవిందునితో!
    బేడీలొసంగునవి కుతి
    వేడిన నిష్ఫలము గాదె వేంకటపతినిన్!!

    ఉత్పలమాల
    ఆడెను భక్తితోడ సఖుడై హరి తోడనె హాథిరాముఁడున్
    గూడెను జూదమున్ గెలిచి గొప్పనగల్ తుది నమ్మ సర్వులున్
    బేడిజమెంచి సంకెలల వేదన జెందెడు రీతి సంపదల్
    వేడుకొనంగ నిష్ఫలము వేంకటనాథుని భక్తితో జనుల్!

    రిప్లయితొలగించండి
  3. మూఢుండేపని చేయక
    మేడలు మిద్దెలను గోరి మిత్రులతోడన్
    వేడుకగా భజియించుచు
    వేడిన నిష్ఫలము గాదె వేంకటపతినిన్.


    వీడుచు ధర్మమార్గమును విత్తము పొందుటె ముఖ్యకృత్యమై
    తోడు చరించువారి సిరి దోచుకు దాచెడి స్వార్థచిత్తులే
    వీడును కల్మషమ్ములని పెద్దలు చెప్పిరటంచు నిత్యమున్
    వేడుకొనంగ నిష్ఫలము వేంకటనాథుని భక్తితో జనుల్.

    రిప్లయితొలగించండి
  4. కీడుయు నాడున జేసియు
    నేడున మానవుల పైన నేర్పుగ బాసల్
    పాడెడు నాయకులందరు
    వేడిన నిష్ఫలము గాదె వేంకటపతినిన్

    రిప్లయితొలగించండి
  5. కీడొనరించెడు వారిని
    వేడిన నిష్ఫలము గాదె; వేంకటపతినిన్
    వేడిన వారికి కోరిక
    లీడేరు రయమున స్వామి లీలామహిమన్

    వేడికొనంగ మేలనుచు విజ్ఞతతో తగ నిర్ణయించినన్
    గీడొనరించు వారలను కీచకులన్ నెరనమ్మి రక్షకై
    వేడుకొనంగ నిష్ఫలము; వేంకటనాథుని భక్తితో జనుల్
    వేడిన జెచ్చెరన్ దొలగు వేదన యంచువచింత్రు భక్తులే

    రిప్లయితొలగించండి
  6. పాడక కీర్తనలు సతము
    నాడుచు జూదము సలుపు దు రాచార ము లా
    మూడు డు భక్తి వి హీ నుడు
    వేడిన ని ష్పలము గాదె వేంక ట పతి నిన్

    రిప్లయితొలగించండి