14-1-2025 (మంగళవారం)కవిమిత్రులారా,సంక్రాంతి శుభాకాంక్షలు!ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“చాంద్రమానమున మకర సంక్రమణము”(లేదా...)“కనఁగా వచ్చును చాంద్రమానమున సంక్రాంతిన్ ముదంబందుచున్”
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
తేటగీతిసూర్య చంద్ర గమనముల చూచివంతకాలమానమా పేర్లను కలిగియుండెమనకు పర్వమగుచు పుష్యమాసయుక్తచాంద్రమానమున మకర సంక్రమణము
మత్తేభవిక్రీడితముమనకామోదము చాంద్రమానము గనన్ మాసమ్ములారీతి వచ్చును సాగున్ గద చైత్రమందు మొదలౌచున్ ఫాల్గుణమ్మందునన్వనముల్ గోల్పడ నాకులున్ ముగియుచున్ బంటల్ గొనన్ బుష్యమైకనఁగా వచ్చును చాంద్రమానమున సంక్రాంతిన్ ముదంబందుచున్
తనరన్ కాలము సౌరమానము గనన్ తారీకులన్ దప్పునేఘనమౌ మానము చంద్ర మానమధికంగంజేర్చి మాసంబులన్వెనువెంటన్ సరియౌను దానటతిథుల్ వేర్వేరు కాగా జనుల్కనఁగా వచ్చును చాంద్రమానమున సంక్రాంతిన్ ముదంబందుచున్!!
సూర్యమానమున గణించి చూచి నంతసాలునకొకమారు మకర సంక్రమణముప్రతినెల కొకమారు జరుగు వాసి గానుచాంద్రమానమున మకర సంక్రమణము.ధనురాశిన్ విడి పౌష్యమాసమున దీప్తాంశుండు తర్వాతి రాశినిజేరంగదలంచుచున్ మకరరాశిన్ జేరు నవ్వేళలోఘనమౌ పర్వము నుత్తరాయణమదే కల్పంబు బ్రారంభమౌ కనఁగా వచ్చును చాంద్రమానమున సంక్రాంతిన్ ముదంబందుచున్.
సూర్య చంద్రుల గమనము నార్యు లరసి కాల మానము లంచు ను గల్ప నముగదెలుప జరుగు చుండు ను గదా దేశ మందు చాంద్ర మానము న మకర సంక్రమణము
కాలగణనకు మూలము గౌరుని గతిచాంద్రమానమున ; మకర సంక్రమణముసూరి మకర రాశిని చొచ్చు సూచనయేనువరుణ, శశుల మానములందు వాసిమెండు
మును పాటించిరి కాలమానములు సోముండున్ దినేంద్రుండు భ్రామణముల్సేయుట లక్ష్యమౌచు, నయినన్ మాన్యంబులున్ బండఁ బ్రీ తిని క్షేత్రంకరులాచరించుటను వే దేశంబులన్ జేరుటన్ గనఁగా వచ్చును చాంద్రమానమున సంక్రాంతిన్ ముదంబందుచున్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండితేటగీతి
తొలగించండిసూర్య చంద్ర గమనముల చూచివంత
కాలమానమా పేర్లను కలిగియుండె
మనకు పర్వమగుచు పుష్యమాసయుక్త
చాంద్రమానమున మకర సంక్రమణము
మత్తేభవిక్రీడితము
తొలగించండిమనకామోదము చాంద్రమానము గనన్ మాసమ్ములారీతి వ
చ్చును సాగున్ గద చైత్రమందు మొదలౌచున్ ఫాల్గుణమ్మందునన్
వనముల్ గోల్పడ నాకులున్ ముగియుచున్ బంటల్ గొనన్ బుష్యమై
కనఁగా వచ్చును చాంద్రమానమున సంక్రాంతిన్ ముదంబందుచున్
తనరన్ కాలము సౌరమానము గనన్ తారీకులన్ దప్పునే
రిప్లయితొలగించండిఘనమౌ మానము చంద్ర మానమధికంగంజేర్చి మాసంబులన్
వెనువెంటన్ సరియౌను దానట
తిథుల్ వేర్వేరు కాగా జనుల్
కనఁగా వచ్చును చాంద్రమానమున సంక్రాంతిన్ ముదంబందుచున్!!
రిప్లయితొలగించండిసూర్యమానమున గణించి చూచి నంత
సాలునకొకమారు మకర సంక్రమణము
ప్రతినెల కొకమారు జరుగు వాసి గాను
చాంద్రమానమున మకర సంక్రమణము.
ధనురాశిన్ విడి పౌష్యమాసమున దీప్తాంశుండు తర్వాతి రా
శినిజేరంగదలంచుచున్ మకరరాశిన్ జేరు నవ్వేళలో
ఘనమౌ పర్వము నుత్తరాయణమదే కల్పంబు బ్రారంభమౌ
కనఁగా వచ్చును చాంద్రమానమున సంక్రాంతిన్ ముదంబందుచున్.
సూర్య చంద్రుల గమనము నార్యు లరసి
రిప్లయితొలగించండికాల మానము లంచు ను గల్ప నముగ
దెలుప జరుగు చుండు ను గదా దేశ మందు
చాంద్ర మానము న మకర సంక్రమణము
కాలగణనకు మూలము గౌరుని గతి
రిప్లయితొలగించండిచాంద్రమానమున ; మకర సంక్రమణము
సూరి మకర రాశిని చొచ్చు సూచనయేను
వరుణ, శశుల మానములందు వాసిమెండు
మును పాటించిరి కాలమానములు సోముండున్ దినేంద్రుండు భ్రా
రిప్లయితొలగించండిమణముల్సేయుట లక్ష్యమౌచు, నయినన్ మాన్యంబులున్ బండఁ బ్రీ
తిని క్షేత్రంకరులాచరించుటను వే దేశంబులన్ జేరుటన్
గనఁగా వచ్చును చాంద్రమానమున సంక్రాంతిన్ ముదంబందుచున్