26, జనవరి 2025, ఆదివారం

సమస్య - 5015

27-1-2025 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“కలతో వైరమ్ము దప్పఁగలదే భ్రాతా”
(లేదా...)
“కలతో వైరము దప్పదా మనకు భాగ్యప్రాప్తికై సోదరా”

19 కామెంట్‌లు:

  1. ఇలలో నిరువురి మధ్యన
    కలహము పెంచి యలరారు కాలము లోనే
    సులువుగ మధ్యస్థుల రా
    కలతో వైరమ్ము దప్పఁగలదే భ్రాతా

    రిప్లయితొలగించండి
  2. కందం
    కలతల్ రేపిన దాయా
    దులతో సంధియె ఫలింపఁ దొలఁగునె యెగ్గుల్?
    కలఁగిన మనమ్ముల కలయి
    కలతో వైరమ్ము దప్పఁ గలదే భ్రాతా!

    మత్తేభవిక్రీడితము
    కలతల్ రేపిన కౌరవాళిఁ గలువన్ గారాల బావయ్యతో
    వెలయింపంగను సంధి కొప్పిరె? సభన్ వెన్నంటి దూషించిరే
    కలలో నైనను రాజ్యభాగమిడనన్ గర్వాంధు మూర్ఖంపు కే
    కలతో వైరము దప్పదా మనకు భాగ్యప్రాప్తికై సోదరా!

    రిప్లయితొలగించండి

  3. ( *నిద్రలేచి వచ్చిన కుంభకర్ణుడసహనముతో రావణునితో పలికిన మాటలుగ...* )

    లలనను వదలనటంచును
    బలిజమునే కోరితీవు బలులగు మనవా
    రలకని యా వానరమూ
    కలతో వైరమ్ము దప్పఁగలదే భ్రాతా.


    కులనాశమ్మును గోరితెచ్చితివి సంకోచమ్ము లేకుండనే
    లలనన్ బందిగ జేసినావనుచు శ్రీరామాఖ్యుడే సేనతో
    బలిజమ్మాడగ వచ్చె గాంచితివ? యాభ్రష్టుండ్రె యౌ కోతిమూ
    కలతో వైరము దప్పదా మనకు భాగ్యప్రాప్తికై సోదరా.

    రిప్లయితొలగించండి
  4. కలహప్రియులగు మూర్ఖులు
    చలింపకుందురు ప్రజలకు సౌఖ్యతనిడగా
    తలపరుగద కౌరవ మూ
    కలతో వైరమ్ము దప్పఁగలదే భ్రాతా

    కలహంబన్నను లెక్కసేయరుకదా గర్వాంధులౌ కౌరవుల్
    శలభన్యాయము గుర్తెరుంగరుకదా శాస్త్రానుసారంబు నా
    కలితంబౌ విధినాచరింపక ధనాకాంక్షన్ మిటారించు మూ
    కలతో వైరము దప్పదా మనకు భాగ్యప్రాప్తికై సోదరా

    రిప్లయితొలగించండి
  5. వలసిన ధనమును రుణ ము గ
    పొలమును దా కట్టు పెట్టి పొందితి గద కా
    వలెని ప్పు డు దీ ర్చ గ రూ
    కల తో వైరమ్ము దప్ప గల దే భ్రా తా!

    రిప్లయితొలగించండి
  6. కలహంబేల ఘటిల్లె నిర్వురకు సంకాశమ్ముగా నిచ్చలున్
    తలలో నాల్కగ మెల్గుచుంటిరి నితాంతంబైన నెయ్యమ్ముతో
    కలకాలంబిటు క్షోభముల్ నిలుచునే కాకున్న నీరీతి కే
    కలతో వైరము దప్పదా మనకు భాగ్యప్రాప్తికై సోదరా

    రిప్లయితొలగించండి
  7. కలహింపనేల నిర్వురు
    కలహంబుననన్ని పనులు కడముట్టునొకో
    కలకాలంబీవిధి కే
    కలతో వైరమ్ము దప్పఁగలదే భ్రాతా

    రిప్లయితొలగించండి
  8. నలుగురు కలసిన కొప్పుల
    తలపులుజూడగ నొకటిగ తలచుట తగునా
    పలుకులు గొప్పవిగను కే
    కలతో వైరమ్ము దప్పఁగలదే భ్రాతా

    రిప్లయితొలగించండి
  9. జలముకు బిందెల తోటియు
    గలగలమని నొక్కచోట కలసిన వేళన్
    చెలియలు సికపట్టుచు కే
    కలతో వైరమ్ము దప్పఁగలదే! భ్రాతా

    రిప్లయితొలగించండి
  10. కం॥ వలచుచు నగలను భార్యయె
    కలతలఁ బెట్టఁగ మగనికిఁ గలవర పాటే
    తలఁపుచు సంపాదన రూ
    కలతో వైరమ్ము దప్పఁగలదే భ్రాతా!

    మ॥ కలలోఁ గాంచుట సాధ్యమే యతివ బంగారమ్ము వాంఛించఁగన్
    దలఁపన్ బేదలు నేవిధమ్ముగను సంధానింతురా రొక్కమున్
    గలతన్ బొందుచు సంగ్రహించుటయు సంగ్రామమ్ము తెల్పంగ రూ
    కలతో వైరము దప్పదా మనకు భాగ్యప్రాప్తికై సోదరా

    నేటి స్థితిగతులకు అన్వయించే ప్రయత్నమండి
    పగలు రాత్రి కష్టపడి పోరాడి కూర్చుకోవాలి కదండి

    రిప్లయితొలగించండి
  11. అలవోకఁగ వేసితి ప్రత్తిని
    బలముగ యాచేనులేచి పండెను గంటే!
    పొలమున వచ్చిన యారూ
    కలతో వైరమ్ము దప్పఁగలదే భ్రాతా

    రిప్లయితొలగించండి
  12. మ:ఇలలో గొప్ప విచిత్ర మేమి యనగా నీ దేశ మందున్న నీ
    చులె దేశమ్మున కుట్రలన్ జరుపుచున్ సొమ్మందుచున్ శత్రు సే
    నలకున్ సాయమొనర్చ జూచెదరు కన్నాలందు నున్నట్టి యె
    ల్కలతో వైరము దప్పదా మనకు భాగ్యప్రాప్తికై సోదరా”

    రిప్లయితొలగించండి
  13. అలఁతి దినముల నయిన నా
    స్తులకై చలము లణఁగారి తూర్ణము దాయా
    దులతో మితి మీఱిన కూఁ
    కలతో వైరమ్ము దప్పఁ గలదే భ్రాతా


    కలికాలమ్మున నెన్న శాంతి తగ భాగ్యంబౌ నశేషమ్ముగాఁ
    జెలరేఁగం జల మాత్మలం దనిశ మాక్షేపించుచున్ బిట్టు చూ
    పులఁ జిందంగ విషమ్ము రిత్తగఁ గడుం బోరాడు తీండ్రంపు మూఁ
    కలతో వైరము దప్పదా మనకు భాగ్యప్రాప్తికై సోదరా

    రిప్లయితొలగించండి
  14. కలహంబందున రావణాదులు నహంకారాక్కసంబూనగన్
    శలభచ్ఛాయలవోలె మారుటను భస్మంబౌట దర్శించితిన్
    కలితంబౌ విధినాపగల్గుట యశక్యంబౌను గోపుచ్ఛ మూ
    కలతో వైరము దప్పదా మనకు భాగ్యప్రాప్తికై సోదరా

    రిప్లయితొలగించండి




  15. ఖలుడపహరించె సీతను
    తలపోయగసమరమదియు తప్పదు మనకున్
    *లలన కొఱకు వైరుల మూ
    *. కలతో వైరమ్ము దప్పఁగలదే భ్రాతా”*


    కలికాలమ్మనగానిదేగనుమునింకన్ఘోరముల్ గాంతుమో
    కలతల్ హెచ్చుచునుండెనెల్లెడల సత్కార్యమ్ములాగెన్గదా
    సులువౌచెయ్దములెల్లకష్టమగుచున్ క్షోభించ వ్యర్థంపు కే
    *“కలతో వైరము దప్పదా మనకు భాగ్యప్రాప్తికై సోదరా”*


    రిప్లయితొలగించండి
  16. (1)కం:కల గంటివి చైనా తో
    కలివిడి కై వాడు యుద్ధకాంక్షాపరుడే
    కల లింక వదలవే? నీ
    కలతో వైరమ్ము దప్పఁగలదే భ్రాతా”
    (నీ కలలతో వైరం తప్పుతుందా? )

    రిప్లయితొలగించండి
  17. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !

    సమస్య - 5015
    27-1-2025 (సోమవారం)

    దశకంఠుడు కుంభకర్ణునితో

    01)
    _________________________________________

    తలలీరైదులు చేతులేమొ యిరవై - ధత్రాది లోకంబులన్
    ఇలలో గెల్చితి నాకు సాటి గలరే - యిభ్బూమియందెవ్వరున్
    వెలదిన్ సీతను దెచ్చి నంతటను సం - విత్తంటె; శ్రీరాము తో
    కలతో వైరము దప్పదా మనకు భా - గ్యప్రాప్తికై సోదరా
    _________________________________________
    ఈరైదు = పది
    ధత్ర = స్వర్గము
    సంవిత్తు = యుద్ధము
    శ్రీరాము తోకలతో = వానరసైన్యమని ఈసడింపు

    రిప్లయితొలగించండి