30-1-2015 (గురువారం)ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“హారము కొఱ కుద్యమం బహర్నిశలయ్యెన్”(లేదా...)“హారము కోసమై జను లహర్నిశలుం గృషి సేయఁగావలెన్”
కందంతీరిచి బహుకృత వేషముపోరాడుదురనఁగ నుదర పోషణ కొరకాధారము భుక్తి యనఁగ నాహారము కొఱ కుద్యమం బహర్నిశలయ్యెన్
ఉత్పలమాలపోరుట తప్పునే యుదరపోషణమెంచియు నెన్నొ వేషముల్గూరిచి భుక్తియే బ్రతుకు గొప్పగనుండగ జేయనంచనన్ధారుణి స్పర్ధలే జనులుపాధిని పొందెడునిత్యకృత్య మాహారము కోసమై జను లహర్నిశలుం గృషి సేయఁగావలెన్!
మీ పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
కోరిన నగ కావలెననివారము దివసము ల నుండి ప్రాధే యపడన్పోరచి యయిన కరణమునహారము కొఱ కుద్యమం బహర్నిశలయ్యెన్”
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
ధారుణిలో బ్రతుకగ కేదారమున ఫలించునట్టి ధాన్యంబదియేచేరగ లేదుచితము నాహారము కొఱ కుద్యమం బహర్నిశలయ్యెన్.ధారుణి జీవకోటికి ప్రధానము వాజజమొక్కటేను సత్కారమదెట్లు ప్రాప్తమగు కర్సనమన్నది లేనినాడు కేదారమునన్ సతమ్ము హలధారి శ్రమింప ఫలించు నట్టి యాహారము కోసమై జను లహర్నిశలుం గృషి సేయఁగావలెన్.
పోరాడెడి శాంతిదళము వారలు నొకటిగ, బ్రిటీషు వారిని తరలున్ భారత పౌరుల మానవ హారము కొఱ కుద్యమం బహర్నిశలయ్యెన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.'వారిని తరుమన్' అని ఉండాలనుకుంటాను.
మీ పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు. 'సంచయంబు + ఆహారము' అన్నపుడు యడాగమం రాదు.
సవరణతో...తీరము నందున తరచుగపైరులు పంటలును గాలివానలపాలౌకారణమున జనులకునాహారము కొఱ కుద్యమం బహర్నిశలయ్యెన్తీరపు భూములే పొలయు తీవ్రతతో పలు గాలివానలేదారుణమైన దెప్పరముఁ ధ్వంసము చేయగ పంటనాశమైబోరున క్రుందుచున్ సమసి పోదురు కర్షక సంచయంబు లాహారము కోసమై జను లహర్నిశలుం గృషి సేయఁగావలెన్
కోరికలెట్లు తీరు మరి కోట్లవి వచ్చునె మాకు! మీరికన్తీరిక జేసి యాలు ముఖ తీరును జూడ ఫలంబు గల్గునే!వారమునందు నిద్రకును వాలక తొంబది గంటలందు నాహారము కోసమై జను లహర్నిశలుం గృషి సేయఁగావలెన్!!
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
వారిజ నేత్రి యొ కర్తు క పోరాటము సల్పు చుండె పుత్తడి కొఱ కై కోరిక తీర్చని పతితో హారము కొఱ కు ద్య మం బ హ ర్ని శ ల య్యె న్
కం:భారత సేనకు,ప్రభుతకు,చారులకున్ మాతృదేశ శత్రువులౌ నీమారక సంఘమ్ముల సంహారము కొఱ కుద్యమం బహర్నిశలయ్యెన్”
నీరముఁబోసి కర్షకులు నెమ్మిగ భూముల దున్ని స్వేదపుంధారలు గార్చుచున్ మనకు దండిగ నిత్తురు తిండిగింజలన్సారమునిచ్చి జీవులకు శక్తినొసంగెడు జీవగర్ర యాహారము కోసమై జను లహర్నిశలుం గృషి సేయఁగావలెన్
ఉ:నేరక యీ రసాయనము నిండిన పంటలు సొమ్ము రంథి తోచేరగ నంగడుల్ గొనుచు చేరుచు నుండిరి వైద్య శాలలన్భారము కాక యీ బతుకు బండిని లాగగ స్వచ్ఛ పౌష్టికాహారము కోసమై జను లహర్నిశలుం గృషి సేయఁగావలెన్”
చోరుల భయములు నుండగచారులుగ వరుస తిరుగట చక్కగ నిశ జా గారముతో దాన్యపు నాహారము కొఱ కుద్యమం బహర్నిశలయ్యెన్
నీరముఁ ద్రావుచు నాకలిదీరక నారాటబడెడు తీరును గనగన్ఘోరకలిని బాపఁగ నాహారము కొఱ కుద్యమం బహర్నిశలయ్యెన్
ధారుణి నంచితముగ దైత్యారి రమా ధవునిచే లయము కా ధరణీభారమ్ము దుష్ట జన సంహారము కొఱ కుద్యమం బహర్నిశ లయ్యెన్ పోరులు గల్గెఁ బెక్కు లిల మున్ను నిరంతర మెన్నఁ దిండికై దారులు గెల్వఁ గొల్లలు పదంపడి యాఁకలిఁ దీర్ప నెంచినన్ వారక భూతలమ్మునను బన్నుగ నెల్లరు సాలినంత యాహారము కోసమై జను లహర్నిశలుం గృషి సేయఁ గావలెన్
కందం
రిప్లయితొలగించండితీరిచి బహుకృత వేషము
పోరాడుదురనఁగ నుదర పోషణ కొరకా
ధారము భుక్తి యనఁగ నా
హారము కొఱ కుద్యమం బహర్నిశలయ్యెన్
తొలగించండిఉత్పలమాల
పోరుట తప్పునే యుదరపోషణమెంచియు నెన్నొ వేషముల్
గూరిచి భుక్తియే బ్రతుకు గొప్పగనుండగ జేయనంచనన్
ధారుణి స్పర్ధలే జనులుపాధిని పొందెడునిత్యకృత్య మా
హారము కోసమై జను లహర్నిశలుం గృషి సేయఁగావలెన్!
మీ పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండికోరిన నగ కావలెనని
రిప్లయితొలగించండివారము దివసము ల నుండి ప్రాధే యపడన్
పోరచి యయిన కరణమున
హారము కొఱ కుద్యమం బహర్నిశలయ్యెన్”
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిధారుణిలో బ్రతుకగ కే
దారమున ఫలించునట్టి ధాన్యంబదియే
చేరగ లేదుచితము నా
హారము కొఱ కుద్యమం బహర్నిశలయ్యెన్.
ధారుణి జీవకోటికి ప్రధానము వాజజమొక్కటేను స
త్కారమదెట్లు ప్రాప్తమగు కర్సనమన్నది లేనినాడు కే
దారమునన్ సతమ్ము హలధారి శ్రమింప ఫలించు నట్టి యా
హారము కోసమై జను లహర్నిశలుం గృషి సేయఁగావలెన్.
మీ పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండిపోరాడెడి శాంతిదళము
రిప్లయితొలగించండివారలు నొకటిగ, బ్రిటీషు వారిని తరలున్
భారత పౌరుల మానవ
హారము కొఱ కుద్యమం బహర్నిశలయ్యెన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి'వారిని తరుమన్' అని ఉండాలనుకుంటాను.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిమీ పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండి'సంచయంబు + ఆహారము' అన్నపుడు యడాగమం రాదు.
సవరణతో...
తొలగించండితీరము నందున తరచుగ
పైరులు పంటలును గాలివానలపాలౌ
కారణమున జనులకునా
హారము కొఱ కుద్యమం బహర్నిశలయ్యెన్
తీరపు భూములే పొలయు తీవ్రతతో పలు గాలివానలే
దారుణమైన దెప్పరముఁ ధ్వంసము చేయగ పంటనాశమై
బోరున క్రుందుచున్ సమసి పోదురు కర్షక సంచయంబు లా
హారము కోసమై జను లహర్నిశలుం గృషి సేయఁగావలెన్
కోరికలెట్లు తీరు మరి కోట్లవి వచ్చునె మాకు! మీరికన్
రిప్లయితొలగించండితీరిక జేసి యాలు ముఖ తీరును జూడ ఫలంబు గల్గునే!
వారమునందు నిద్రకును వాలక తొంబది గంటలందు నా
హారము కోసమై జను లహర్నిశలుం గృషి సేయఁగావలెన్!!
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండివారిజ నేత్రి యొ కర్తు క
రిప్లయితొలగించండిపోరాటము సల్పు చుండె పుత్తడి కొఱ కై
కోరిక తీర్చని పతితో
హారము కొఱ కు ద్య మం బ హ ర్ని శ ల య్యె న్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికం:భారత సేనకు,ప్రభుతకు,
రిప్లయితొలగించండిచారులకున్ మాతృదేశ శత్రువులౌ నీ
మారక సంఘమ్ముల సం
హారము కొఱ కుద్యమం బహర్నిశలయ్యెన్”
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండినీరముఁబోసి కర్షకులు నెమ్మిగ భూముల దున్ని స్వేదపుం
రిప్లయితొలగించండిధారలు గార్చుచున్ మనకు దండిగ నిత్తురు తిండిగింజలన్
సారమునిచ్చి జీవులకు శక్తినొసంగెడు జీవగర్ర యా
హారము కోసమై జను లహర్నిశలుం గృషి సేయఁగావలెన్
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిఉ:నేరక యీ రసాయనము నిండిన పంటలు సొమ్ము రంథి తో
రిప్లయితొలగించండిచేరగ నంగడుల్ గొనుచు చేరుచు నుండిరి వైద్య శాలలన్
భారము కాక యీ బతుకు బండిని లాగగ స్వచ్ఛ పౌష్టికా
హారము కోసమై జను లహర్నిశలుం గృషి సేయఁగావలెన్”
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిచోరుల భయములు నుండగ
రిప్లయితొలగించండిచారులుగ వరుస తిరుగట చక్కగ నిశ జా
గారముతో దాన్యపు నా
హారము కొఱ కుద్యమం బహర్నిశలయ్యెన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండినీరముఁ ద్రావుచు నాకలి
రిప్లయితొలగించండిదీరక నారాటబడెడు తీరును గనగన్
ఘోరకలిని బాపఁగ నా
హారము కొఱ కుద్యమం బహర్నిశలయ్యెన్
ధారుణి నంచితముగ దై
రిప్లయితొలగించండిత్యారి రమా ధవునిచే లయము కా ధరణీ
భారమ్ము దుష్ట జన సం
హారము కొఱ కుద్యమం బహర్నిశ లయ్యెన్
పోరులు గల్గెఁ బెక్కు లిల మున్ను నిరంతర మెన్నఁ దిండికై
దారులు గెల్వఁ గొల్లలు పదంపడి యాఁకలిఁ దీర్ప నెంచినన్
వారక భూతలమ్మునను బన్నుగ నెల్లరు సాలినంత యా
హారము కోసమై జను లహర్నిశలుం గృషి సేయఁ గావలెన్