కం:ఇంతిరొ వరూధినీ నా కింతయు మతి లేదటంచు ఎకసక్కెము గా వింతువొ!విధికిన్ జిక్కితి నింతలు గనులుండి మార్గమే కననైతిన్” ("ఇంతలు కన్నులుండ" అని నన్ను ఎక్కిరిస్తున్నావా?నేను విధికి చిక్కాను.ఇంతింత కళ్లు ఉన్నా దారి తెలియటం లేదు.)
ఉ:ఇంతి వరూధినీ!నను క్షమింపుము ఛాందస నిష్ఠ తోడ నే పంతము బూని నీ వలపు బాసితి నాడొక మూర్ఖ విప్రునై ఇంతలు గన్నులుండి తెరువే కననైతిని మందభాగ్యుఁడన్” చింతయె పోయె స్వర్గమును జేరెద నీ సుఖ మిచ్చు కౌగిలిన్ (మాయాప్రవరుడు అన్నాడు-ఆ నాదు నేను మూర్ఖం గా నిన్ను వదిలేసాను.క్షమించు.నువ్వు చెప్పినట్టు యజ్ఞయాగాలు మీ కౌగిళ్లలో సుఖించటానికే కదా! ఇప్పుడు నీ కౌగిలి లో స్వర్గం పొందుతాను.)
గురువు గారు! పై సమస్య లో "గనులు" అంటే "గనులు" అనే అర్థం లో,"గన్నులు" అంటే "తుపాకులు" అనే అర్థం లో చమత్కారానికి పూరించాను.పరిశీలించ వలసినది.
(1)కం:స్వంతపు గ్రానైట్ గనులే వింతగ నష్టమ్ము దెచ్చె,వేడగ ఋణ మా వంతయు బ్యాంకులు వినవే? ఇంతలు గనులుండి మార్గమే కననైతిన్” (నా బ్యాంకు ఉద్యోగం లో అనుభవం.)
(2)ఉ:హంతకు లౌచు విప్లవము లంచు నశాంతిని బెంచు నాగడ మ్మంతము జేయగా ప్రభుత యాజ్ఞ నొసంగెను కాని రాత్రిలో నింతటి కాన లో తిరుగ నెవ్వడు కంటికి కాన రాడుగా ఇంతలు గన్నులుండి తెరువే కననైతిని మందభాగ్యుఁడన్” (అడవి లో నక్సలైట్ల తో రాత్రి పోరు లో ఒక పోలీస్ ఉద్యోగి ఆందోళన.ఇంతటి తుపాకు లున్నా కష్ట మౌతోందని.)
వేశ్యకు ధనమిచ్చివచ్చి ధర్మపత్ని దగ్గర నాటకాలాడు తిరుగుబోతు....
రిప్లయితొలగించండికందం
ఇంతియె టక్కరిదనియున్
సుంతయు లొంగననుకొనియు, చోద్యమదేమో?
యంతయు దోచెన్ దానికి
నింతలు గనులుండి, మార్గమే కననైతిన్!
ఉత్పలమాల
ఇంతియె చూపుచున్ వగలు నేమర దోచెడు టక్కరంచనన్
సుంతయు లొంగకూడదని చోద్యమదేమొ? వశంబునౌచు నే
నంతయు సొమ్ము బాసితిని, నంగన వీడనె! నంగనాచికిం
తింతలు గన్నులుండి తెరువే కననైతిని మందభాగ్యుఁడన్!
పంతముగ పయనమైతిని
రిప్లయితొలగించండికొంతైనను వెలుగు లేని కోపున నేనా
పొంతకు చేరుటకొరకై
యింతలు గనులుండి మార్గమే కననైతిన్
ఇంతి పసిండిలేడిఁ గని యిమ్మునఁ దెమ్మని కోరనేమి? సీ
రిప్లయితొలగించండిమంతిని లక్ష్మణున్ గటువుమాటల నాడియె పంపనేమి? యా
సాంతము కానఁజూచినను జానకి జాడనెఱుంగనైతి, హా!
యింతలు గన్నులుండి తెరువే కననైతిని మందభాగ్యుఁడన్
రిప్లయితొలగించండిఎంతగ ముసిరెనో యీ
ధ్వాంతారాతి హిమఝంటి పాతంబీ హే
మంతపు వేకువ ఝామున
నింతలు గనులుండి మార్గమే కననైతిన్.
క్షాంతి ఘనాశ్రయమ్ములను కల్పుచు తెల్లని పిండలమ్ము హే
మంతపు కల్యవేళ నిగమమ్మును గ్రమ్మిన పాళమందు నా
యింతియె కొరెనంచు పురమేగదలంచి గృహంబు వీడగా
నింతలు గన్నులుండి తెరువే కననైతిని మందభాగ్యుఁడన్.
ఎంతయొ ధైర్యశాలినని యిష్టులతోడ నహంకరించి నే
రిప్లయితొలగించండిపంతముబూని యొంటరిగ ప్రాంతరమందున జొచ్చినాడ నా
కెంతకు గానరాదు దరి యెవ్విధి జేరుదు గీముకున్ కటా!
యింతలు గన్నులుండి తెరువే కననైతిని మందభాగ్యుఁడన్
ఎంతటి హతలక్షణుడను
రిప్లయితొలగించండిపంతము వహియించి ఘోర ప్రాంతరమందున్
వింతగ నే జిక్కితినే
యింతలు గనులుండి మార్గమే కననైతిన్
సుంతయు యోచన సేయక
రిప్లయితొలగించండివంతల పాలైతి నేను వసుధా స్థలిలో
కాంతు నొ విముక్తి లే దో
యింతలు కనులు o డి మార్గమే కన నైతి న్
కం॥ దొంతరులుగఁ గష్టములిల
రిప్లయితొలగించండివింతగఁ గ్రమ్మగ కనుఁగొన విద్య చెనటియే!
సుంతయు కనఁబడదె గమము
నింతలు గనులుండి మార్గమే కననైతిన్
ఉ॥ దొంతరులౌచుఁ గష్టములు దుర్భర బాధలుఁ జుట్టుముట్టఁగన్
సుంతయుఁ దీరెదుర్కొనఁగ సూక్షముఁ గాంచకఁ దల్లడిల్లితిన్
వింతగ వ్యర్థమయ్యెనొకొ విద్యయె నేత్రములన్న సూత్రమే
యింతలు గన్నులుండి తెరువే కననైతిని మందభాగ్యుఁడన్
చెనటి వ్యర్థము గమము దారి నిఘంటువు సహాయమండి
To put in succinctly in English when obstacles come in battalions, deftness and maneuvering power work, not the knowledge and education.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిచింతాకు కనుల కరియును
రిప్లయితొలగించండివింతగ గర్జన పఱపుచు విసురుచు కరమున్
చెంతకు విచ్చేయ, తొలగ
ఇంతలు గనులుండి మార్గమే కననైతిన్
సంతకు పోవనెంచి కడు చక్కగ సిద్ధము కాగ యింతలో
రిప్లయితొలగించండిగంతలు కట్టినట్లు పెను గాలి దుమారము రేగినంతటన్
చెంతకు చేరు వాహనమె చింతకు కారణమయ్యె దుమ్ములో
నింతలు గన్నులుండి తెరువే కననైతిని మందభాగ్యుఁడన్!!
కం:ఇంతిరొ వరూధినీ నా
రిప్లయితొలగించండికింతయు మతి లేదటంచు ఎకసక్కెము గా
వింతువొ!విధికిన్ జిక్కితి
నింతలు గనులుండి మార్గమే కననైతిన్”
("ఇంతలు కన్నులుండ" అని నన్ను ఎక్కిరిస్తున్నావా?నేను విధికి చిక్కాను.ఇంతింత కళ్లు ఉన్నా దారి తెలియటం లేదు.)
ఉ:ఇంతి వరూధినీ!నను క్షమింపుము ఛాందస నిష్ఠ తోడ నే
రిప్లయితొలగించండిపంతము బూని నీ వలపు బాసితి నాడొక మూర్ఖ విప్రునై
ఇంతలు గన్నులుండి తెరువే కననైతిని మందభాగ్యుఁడన్”
చింతయె పోయె స్వర్గమును జేరెద నీ సుఖ మిచ్చు కౌగిలిన్
(మాయాప్రవరుడు అన్నాడు-ఆ నాదు నేను మూర్ఖం గా నిన్ను వదిలేసాను.క్షమించు.నువ్వు చెప్పినట్టు యజ్ఞయాగాలు మీ కౌగిళ్లలో సుఖించటానికే కదా! ఇప్పుడు నీ కౌగిలి లో స్వర్గం పొందుతాను.)
అంతయునంతట చీకటి
రిప్లయితొలగించండిఇంతలు గనులుండి మార్గమే కననైతిన్
గంతలు కట్టుకొనగ నే
నంతట నాటను వెదకగ నందరిని మరిన్
సంపద ఉన్నపుడు జల్సాగా తిరిగి, తరిగిననాడు ఎవరూ పట్టించుకోనప్పటి మనోగతం...
రిప్లయితొలగించండిఇంతలు గన్నులుండి తెరువే కననైతిని మందభాగ్యుఁడన్
కొంతయు దాచలేదు మరి కూరిమినుండిన కాలమందునన్
ఎంతయొ నెందరో నుడువ ఏమఱచేసితి సొమ్ము దాచకన్
ఇంతయు సాయమందదుగ ఎన్నడు చేసిన పాపమోగదా!
వింతఁగ ముక్కంటి దలఁచె
రిప్లయితొలగించండినంతఃకరణమ్ము నందు నసురుఁడు దలపై
నుంతుఁ కరం బనఁ గట్టా
యింతలు గను లుండి మార్గమే కన నైతిన్
దాంతుని భంగిఁ గన్పడు విధమ్ముగ నిత్యము సంచరింపఁగా
సుంతయు నేని కైతవము చూపఱ కేర్పడ నీని నీదు వే
దాంతపుఁ బల్కు లెల్ల విని యైతిని వెఱ్ఱిని నీ ముఖంపు నే
నింతలు గన్నులుండి తెరువే కన నైతిని మందభాగ్యుఁడన్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఅంతా మాయగ నుండెను
రిప్లయితొలగించండిసుంతయినను గానరాదు చోద్యముఁగంటే?
యెంతవి చిత్రమొ యీయది
యింతలు గనులుండి మార్గమే కననైతిన్
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిచెంతను నుండు నాగుఱుతు చిత్రము గా గన రాక పోయెనే
రిప్లయితొలగించండియింతలు గన్నులుండి తెరువే కననైతిని మందభాగ్యుఁడన్
సంతుని యింటికిన్ వెడలు చక్కని మార్గము గుర్తులేక,యీ
చెంతనె దిర్గుచుంటి నిక చేరుట యెట్లని కుందు చుండగా
చింతలు నిండగ మనమున
రిప్లయితొలగించండిచింతనమేదియునురాక చిత్తము నందును
వంతయు హెచ్చయ్యె గదా
*"ఇంతలు గనులుండి మార్గమే కననైతిన్”*
చింతలు హెచ్చచుండగను జీవితమందున నెల్ల శూన్యమం
చెంతయొ బాధనొందితిని నెల్లయుబాయునదెట్టులోనటం
చింతగనెంచితిన్ మదిని శ్రీహరిచిత్తమటంచునెంచకన్
*“ఇంతలు గన్నులుండి తెరువే కననైతిని మందభాగ్యుఁడన్”*
రిప్లయితొలగించండిపిన్నక నాగేశ్వరరావు.
హైదరాబాద్.
ఇంతుల వలలో బడితిని
అంతే లేకుండ దోచిరంతయు ధనమున్
అంతయు సైబరు మోసము
నింతలు గనులుండి మార్గమే కననైతిన్.
రిప్లయితొలగించండిగురువు గారు! పై సమస్య లో "గనులు" అంటే "గనులు" అనే అర్థం లో,"గన్నులు" అంటే "తుపాకులు" అనే అర్థం లో చమత్కారానికి పూరించాను.పరిశీలించ వలసినది.
(1)కం:స్వంతపు గ్రానైట్ గనులే
వింతగ నష్టమ్ము దెచ్చె,వేడగ ఋణ మా
వంతయు బ్యాంకులు వినవే?
ఇంతలు గనులుండి మార్గమే కననైతిన్”
(నా బ్యాంకు ఉద్యోగం లో అనుభవం.)
(2)ఉ:హంతకు లౌచు విప్లవము లంచు నశాంతిని బెంచు నాగడ
మ్మంతము జేయగా ప్రభుత యాజ్ఞ నొసంగెను కాని రాత్రిలో
నింతటి కాన లో తిరుగ నెవ్వడు కంటికి కాన రాడుగా
ఇంతలు గన్నులుండి తెరువే కననైతిని మందభాగ్యుఁడన్”
(అడవి లో నక్సలైట్ల తో రాత్రి పోరు లో ఒక పోలీస్ ఉద్యోగి ఆందోళన.ఇంతటి తుపాకు లున్నా కష్ట మౌతోందని.)