30, జనవరి 2025, గురువారం

సమస్య - 5019

31-1-2015 (శుక్రవారం)
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“గంజాయిని సాగుచేయగా వలె రైతుల్”
(లేదా...)
“గంజాయిన్ దగ సాగు చేయవలె సౌఖ్యంబబ్బు రైతన్నకున్”

22 కామెంట్‌లు:

  1. సంజలవిడువుము త్రాగుట
    గంజాయి ని, సాగుచేయగావలెరైతుల్
    గంజినిత్రాగుటకొఱకై
    గుంజీతీయుచుబ్రదుకునకోరగ సుఖమున్

    రిప్లయితొలగించండి
  2. మంజీరానదియొడ్డునన్ తగదు గాని మాకొద్దు వారింపుడీ
    గంజాయిన్, దగసాగుచేయవలె సౌఖ్యంబబ్హురైతన్నకున్
    గంజిన్త్రాగగవీలుగావరినివేగంబందిపండించుకై
    పెంజీకట్లవివీడుగాభువినియీపెంపేదలున్లేనిచో

    రిప్లయితొలగించండి
  3. కందం
    రంజిలు రాబడినెంచిన
    గుంజును గద చెర! బ్రతుకునఁ గోల్పడ శాంతిన్!
    వ్యంజనమన వరి, వీడుచు
    గంజాయిని ,సాగుచేయగా వలె రైతుల్

    శార్దూలవిక్రీడితము
    రంజిల్లన్ సిరులన్ రహస్యమనగన్ రాణింపఁగానెంచినన్
    గుంజున్ గార కుటుంబమెల్ల వెతలన్ గోల్పోవగన్ శాంతి యే
    భంజించున్ గద గౌరవమ్ము జనులన్ వాణిజ్య పంటల్, విడన్
    గంజాయిన్, దగ సాగు చేయవలె సౌఖ్యంబబ్బు రైతన్నకున్

    రిప్లయితొలగించండి
  4. జంజాటమేల నిలుపుము
    గంజాయిని ; సాగుచేయగా వలె రైతుల్
    పంజరముకు మేలొసగుచు
    పింజమునిడు ధాన్యములను పెంపుగ నెపుడున్

    రిప్లయితొలగించండి

  5. కుంజరములు మెచ్చితినెడి
    బంజరు భూమిని చెఱుకును పండింపంగన్
    సంజయ! వలదని చెప్పుము
    గంజాయిని , సాగుచేయగా వలె రైతుల్.


    రంజిల్లున్ మది గాదె పచ్చని పొలాలన్ గాంచినన్ మెండుగా
    సంజీవా వలదంటి దుర్జనులతో సావాసమున్, బ్రీతితో
    బంజారాలను స్వాగతించి వరినే పండింపగా, మాను మా
    గంజాయిన్ , దగ సాగు చేయవలె సౌఖ్యంబబ్బు రైతన్నకున్.

    రిప్లయితొలగించండి
  6. రంజిలు దాన్యపు పంటలు
    బంజరు లేకుండ పొలము పైరు ల పచ్చ ల్
    క్రొంజిగురు లుండ వీడియు
    గంజాయి ని సాగు సేయ గా వలె రైతుల్

    రిప్లయితొలగించండి

  7. -


    పింజారి వెధవలారా!
    రంజన చెడిరొ హలికుల్? పరంపర వీడన్
    భంజాదేవీ భక్తులు,
    గంజాయిని సాగుచేయగా వలె, రైతుల్?


    రిప్లయితొలగించండి
  8. జంజాటములు తొలుగ నస
    మంజసమౌ పంటలేల మంచిగ బ్రతుకుల్
    రంజింపగ రూపార్చుచు
    గంజాయిని సాగుచేయగా వలె రైతుల్

    జంజాటమ్ములు తొల్గిపోవు రయితుల్ జాగ్రత్తతోమెల్గినన్
    గింజల్ మేలిరకమ్ములైన విధిగా కేరింతలన్ గొట్టరా
    రంజిల్లున్ గద జీవితంబు లిలలో, లంఘించి రూపార్చుచున్
    గంజాయిన్, దగ సాగు చేయవలె సౌఖ్యంబబ్బు రైతన్నకున్

    రిప్లయితొలగించండి
  9. పుంజులిడికోడి పందెము
    సంజన్నకు కోటి ఇచ్చె సంపద వచ్చెన్
    పింజారికి బంజరులో
    గంజాయినిసాగుచేయ
    గావలె రైతుల్”

    డా.గాదిరాజు మధుసూదనరాజు

    ( రైతులు కావలి యే..
    అంటె కాపలాగా మాత్రమే మిగిలారు పొలాలకు ,పశువులకు పాపం)

    రిప్లయితొలగించండి
  10. కం:గుంజగ దేశపు సంపద
    గంజాయిని మాన్ పుచున్ పొగాకునె పండిం
    పన్ జేసి రాంగ్ల కపటులు
    గంజాయిని సాగుచేయగా వలె రైతుల్”
    (ఈ దేశం లో గంజాయిని నిషేధించ బడి పొగాకు నడవటానికి గల కారణం ప్రజాశ్రేయస్సు కాదు.ఇక్కడ గంజాయిని మాన్ పించి పొగాకు పండిస్తే అది పాశ్చాత్యుల సిగరెట్ వ్యాపారానికి పనికొస్తుంది.ఒక దేశభక్తుడు రైతులకి పొగాకు బదులు గంజాయిని పండించమని సలహా ఇస్తున్నట్టు.)

    రిప్లయితొలగించండి
  11. శా:గింజల్ స్వచ్ఛత లేనివే దొరకు,నా గింజల్ ఫలం బిచ్చునే
    రంజిల్లంగ మనమ్ము? పెట్టుబడియే రాదయ్యెనే!గిట్టు బా
    టున్ జూపింపరు నాయకుల్,వినుము లోటుల్ దీర తప్పైన నీ
    గంజాయిన్ దగ సాగు చేయవలె సౌఖ్యంబబ్బు రైతన్నకున్”
    (నాసి రకం విత్తనాలు,పంట లేక పోవటం,గిట్టుబాటు లేక పోవటం తో విసిగిన రైతు తప్పైతే ఐంది,గంజాయి పెంచటం నయం అన్నట్టు.)

    రిప్లయితొలగించండి
  12. భంజితమగు బ్రతుకు గొనఁగ
    గంజాయిని, సాగుచేయగా వలె రైతుల్
    రంజితముగ ధాన్యాదులు
    గంజాయిని సాగుచేయ కస్తియె మిగులున్

    రిప్లయితొలగించండి
  13. గంజియు కూడుయు దొరకక
    బంజరు భూముల వరియును పండుట లేకన్
    తంజాయూరు దొరాజ్ఞడె
    గంజాయిని సాగుచేయగా వలె రైతుల్

    రిప్లయితొలగించండి
  14. అంజలి సేయగవలె! నిల
    శింజితమై యెప్పుధాన్య శ్రీలం బడయన్
    పుంజాలంకృత కృషి సా
    గం జాయిని సాగుచేయగా వలె రైతుల్!


    జాయి=నేర్పు

    రిప్లయితొలగించండి
  15. భంజించున్ జనపాళి జీవనము సంపాతమ్మగున్ స్వాస్థ్యమే
    గంజాయిన్గొనఁ, నేల దుర్వ్యసనమున్ గాంక్షింతురో భూజనుల్,
    రంజిల్లన్ వరిధాన్యముల్, వదలి ఘోరంబైన హాహాలమౌ
    గంజాయిన్, దగ సాగు చేయవలె సౌఖ్యంబబ్బు రైతన్నకున్

    రిప్లయితొలగించండి
  16. మంజులముగా నిరంతర
    ముం జాగింప బ్రతుకు మనమునఁ దలఁపనిచో
    ముంజావును గోరినచో
    గంజాయిని సాగుచేయగా వలె రైతుల్


    గంజాయిం దలపంగనేల మఱి గింజాయిన్ మహా భేలపుం
    బంజా వంటిది యేల నయ్య మనకున్ భద్రమ్ము వీక్షింపవే
    కంజాక్షుం దగఁ గొల్చు చుండి మది వీఁకన్ వీడి దుష్టంపు టా
    గంజాయిన్ దగ సాగు చేయవలె సౌఖ్యం బబ్బు రైతన్నకున్

    రిప్లయితొలగించండి
  17. పెంజీకటాయె బ్రతుకులు
    గంజియె కరువాయె రైతు కలచెదిరెనుగా
    గింజలు దొరకక గాతికి
    గంజాయిని సాగుచేయగా వలె రైతుల్

    రిప్లయితొలగించండి
  18. బంజరు లాయెనుభూములు
    పింజముఁ బండింౘ విషము పిచికారించన్
    ఒంజిలి దీరగ నిప్పుడు
    గంజాయిని సాగుచేయగా వలె రైతుల్

    భావం : ప్రత్తి సాగుచే భూమి విషపూరితమై బంజరు భూమిగా మారగా, కష్టము తీరుటకు గంజాయిని సాగు....

    రిప్లయితొలగించండి
  19. గుంజాటన చేయక విడు
    గంజాయిని సాగు చేయగా వలె రైతుల్
    వ్యంజనము లనేకములను
    రంజుగ భుజియింతురు గద ప్రజలనయంబున్

    రిప్లయితొలగించండి