7, జనవరి 2025, మంగళవారం

సమస్య - 4996

8-1-2025 (బుధవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“స్వప్నంబునఁ గన్నదెల్ల సత్యంబయ్యెన్”
(లేదా...)
“స్వప్నంబందునఁ గాంచినట్టి దవురా సత్యంబుగా నిల్చెడిన్”

21 కామెంట్‌లు:

  1. స్వాప్నికమౌ శుభముగనెను
    స్వప్నంబందున త్రిజట యుద్ధము వైదేహికినిన్
    స్వప్నము రామునిఁజూపెను
    స్వప్నంబునఁగన్నదెల్లసత్యంబయ్యెన్

    రిప్లయితొలగించండి
  2. స్వప్నావస్థనునర్జునుండుగనెగా సాంతముగా విశ్వంబునే
    స్వప్నంబాయన భీష్మద్రోణులును భీభత్సంబుగాజచ్చిరే
    స్వప్నాన్ని నిజమాయెయుద్ధముననాపార్థుండు జేయుండెగా
    స్వప్నంబందునగాంచినట్టి దవురా! సత్యంబ చిత్రంబెగా

    రిప్లయితొలగించండి
  3. ఆ 'ప్న' ను ప్రాసాక్షరముగ
    స్వప్నము నందుననె నిడుట జరుగుననుకొనన్
    స్వాప్నికుడనైన వేళన
    స్వప్నంబునఁ గన్నదెల్ల సత్యంబయ్యెన్

    రిప్లయితొలగించండి

  4. స్వప్నా! భయమేలనె దు
    స్వప్నము గాంచితినని ప్రతిభావంతు లిలన్
    స్వప్నము నమ్మరెవని కిల
    స్వప్నంబునఁ గన్నదెల్ల సత్యంబయ్యెన్.?


    స్వప్నంబన్న సుషుప్తి లో కనెడు దృశ్యంబయ్యదే కాదుటే
    స్వప్నంబయ్యది నీటిడొంకవలెనశ్యంబౌను వెన్వెంటనే
    స్వప్నంబుల్ నిజమంచు నమ్ము ఖలుడే వాచించె నీరీతిగా
    స్వప్నంబందునఁ గాంచినట్టి దవురా సత్యంబయ్యెఁ జిత్రంబుగన్.

    రిప్లయితొలగించండి
  5. రావణ సతి మండోదరి నేపథ్యం గా:

    కందం
    తృప్నువుగ ననుగొనియు న
    స్వప్నుఁడనెడు రాము సతిని వదల శుభమనన్
    క్షిప్నువు పతిపై సతి దు
    స్వప్నంబునఁ గన్నదెల్ల సత్యంబయ్యెన్!

    శార్దూలవిక్రీడితము
    స్వప్నంబందున సీతపై భ్రమలతో సాగింప దౌష్ట్యమ్ము న
    స్వప్నుండౌ రఘరాము బాణ హతి నాశంబన్న మండోదరిన్
    క్షిప్నుండై వినలేక రావణుడనిన్ జేరంగ నా సాధ్వి దు
    స్వప్నంబందునఁ గాంచినట్టి దవురా సత్యంబయెన్ జిత్రమై!

    రిప్లయితొలగించండి
  6. స్వప్నము నందున గాంచిన
    స్వప్నను ప్రేమించనామె వలపును గెలువ న్
    స్వప్న యె సతి య య్యె ననుచు
    స్వప్న o బు న గన్న దెల్ల సత్యం బ య్యె న్

    రిప్లయితొలగించండి
  7. స్వప్నప్రభావ మహిమన్
    స్వప్నంబులను నెరవేర్చు సంకల్పముతో
    స్వాప్నికుడే చరియింపగ
    స్వప్నంబునఁ గన్నదెల్ల సత్యంబయ్యెన్

    స్వప్నంబన్నది నిద్రలోని దశగా భావింపగా యుక్తమౌ
    స్వప్నావిష్కృతమైన కార్యములనే శ్రద్ధన్ బరీక్షించుచున్
    స్వప్నాలే స్థిరనిశ్చయంబులనుచున్ సాధింప యత్నింపగా
    స్వప్నంబందునఁ గాంచినట్టి దవురా సత్యంబె చిత్రంబుగన్

    రిప్లయితొలగించండి
  8. స్వప్నంబుల్ మనుజాళి గాంచెదరు స్వాపమ్మందునన్ బొల్పుగన్
    స్వప్నంబన్నది యెన్నడేనియగునే సత్యంబు? నే గాంచితిన్
    స్వప్నంబందున బాల్యమిత్రుడరుదెంచన్ సంప్రముగ్ధమ్ముగా
    స్వప్నంబందునఁ గాంచినట్టి దవురా సత్యంబయెన్ జిత్రమే

    రిప్లయితొలగించండి
  9. స్వప్నంబొక్కటి గాంచితి
    స్వప్నంబున నాదుబాల్య సఖుడరుదెంచెన్
    స్వప్నము గని మేల్కొంటిని
    స్వప్నంబునఁ గన్నదెల్ల సత్యంబయ్యెన్

    రిప్లయితొలగించండి
  10. కం:స్వప్నమ్ము గాంచితి నను
    ష్ఠుప్నన్ శ్లోకమ్ము వ్రాసి చూప గురువు గప్
    చిప్నన్ మెచ్చని యట్టుల
    స్వప్నంబునఁ గన్నదెల్ల సత్యంబయ్యెన్”
    (గురువు మెచ్చుకుంటాడు కదా! అని శ్లోకం రాస్తే మెచ్చకండా గప్ చిప్ ఐనట్టు కల వచ్చింది.అదే నిజమైనది.)

    రిప్లయితొలగించండి
  11. రిప్లయిలు
    1. కం॥ సప్నములు మధుర మైనను
      స్వప్నము లెసకొలుప నతఁడు సరియగు రీతిన్
      క్షిప్నువు గాక శ్రమించఁగ
      స్వప్నంబునఁ గన్న దెల్ల సత్యంబయ్యెన్

      శా॥ క్షిప్నోద్దండుఁడు గాక నిబ్బరముతోఁ జేయంగ నిక్కమ్ము సు
      స్వప్నంబుల్ గనఁ గష్టమెంచకను సంభావించి సద్వర్తనన్
      స్వప్నంబందునఁ జూచినట్టి శుభముల్ సాధించ యత్నించఁగన్
      స్వప్నంబందున గాంచినట్టి దవురా సత్యంబయ్యెఁ జిత్రంబుగన్

      డా॥ అబ్దుల్ కలాం గారి ఉవాచ అండి

      క్షిప్ను క్షిప్నువు తిరస్కరించు వాడు
      ఎసకొలుపు ప్రేరేపించు నిఘంటువు సహాయమండి

      తొలగించండి
  12. శా:స్వప్న మ్మొక్కటి గంటి సంస్కృతమునే సాధించి యేదో యను
    ష్ఠుప్ నన్ శ్లోకము వ్రాసి మా గురువుకున్ జూపంగ నాతండు గ
    చిప్నే పూనెను స్వప్న మెల్ల నిజమే చేసెన్ సదా నా యెడన్
    స్వప్నంబందునఁ గాంచినట్టి దవురా సత్యంబుగా నిల్చెడిన్”
    (వీడికి కలలో ఏది వచ్చినా నిజమే అవుతుందిట.)

    రిప్లయితొలగించండి
  13. శా:స్వప్న మ్మొక్కటి గంటి సంస్కృతమునే సాధించి యేదో యను
    ష్ఠుప్ నన్ శ్లోకము వ్రాసి మా గురువుకున్ జూపంగ నాతండు గ
    చిప్నే పూనెను స్వప్న మెల్ల నిజమే చేసెన్ సదా నా యెడన్
    స్వప్నంబందునఁ గాంచినట్టి దవురా సత్యంబుగా నిల్చెడిన్”
    (వీడికి కలలో ఏది వచ్చినా నిజమే అవుతుందిట.)


    రిప్లయితొలగించండి
  14. అప్ను వరేణ్యము లౌ నీ
    స్వప్నంబు లని మది నెంచి పల్కితివి యిటుల్
    క్షిప్నువు కా నొల్ల కకట
    స్వప్నంబునఁ గన్న దెల్ల సత్యం బయ్యెన్

    [అప్నువు = సుఖ మిచ్చునది; క్షిప్నువు = తిరస్కరించు వాఁడు]


    స్వప్నౌఘమ్ముల కేల యిత్తు వకటా ప్రాధాన్య మిబ్భంగి నే
    క్షిప్నూగ్రుండను నిత్య మీ కలలహో చింతింపఁ గల్లల్ సుమీ
    స్వప్నమ్ముల్ మఱి గ్విప్నముల్ దలఁపఁగన్ సందేహముల్ నీ కెటుల్
    స్వప్నం బందునఁ గాంచి నట్టి దవురా సత్యంబుగా నిల్చెడిన్

    రిప్లయితొలగించండి

  15. పిన్నక నాగేశ్వరరావు.
    హైదరాబాద్.

    స్వప్నమున దేవతను గని
    స్వప్నమున వివాహమాడె సందియ పడకన్
    స్వప్నపు సుందరి సతియై
    స్వప్నంబునఁ గన్నదెల్ల సత్యంబయ్యెన్.

    రిప్లయితొలగించండి