31, జనవరి 2025, శుక్రవారం

సమస్య - 5020

1-2-2015 (శనివారం)
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“గ్రామసింహ మగుచుఁ గదలుటొప్పు"
(లేదా...)
“గ్రామపు సింహమై కదలఁగాఁ దగుఁ గీర్తి గడింపఁ గోరినన్”

(కంబాల రాజేశ్వర రావు గారికి ధన్యవాదాలతో...)

32 కామెంట్‌లు:

  1. పురమునందు జనుల మోదమునొందగ
    నొకటె తగిన మార్గముండె నదియె
    పగతుని పసిగట్టి ప్రభుత కెరుకపర్చు
    గ్రామసింహ మగుచుఁ గదలుటొప్పు

    రిప్లయితొలగించండి
  2. వేడుకొనుచుప్రజల వేనకువేలుగా
    సాగిమ్రొక్కివారిసరసజేరి
    నాయకత్వమెంచినయమునుజూపగా
    గ్రామసింహమగుచు కదలుటొప్పు

    రిప్లయితొలగించండి
  3. రిప్లయిలు
    1. కురుక్షేత్ర సంగ్రామములో కృష్ణుడు అర్జునునితో:

      ఆటవెలది
      కోరి యుద్ధమెంచి కురువంశ శూరుడా!
      నీరసముగ విల్లు జార వైచి
      మోహమందుఁ జిక్కి ముడుచు కొందువొకొ? సం
      గ్రామసింహ మగుచుఁ గదలుటొప్పు!


      ఉత్పలమాల
      నీ మది కోరినట్లు నను నీ రథసారథి జేసికొంటివే
      యేమరి మోహివై కదనమేమగునోయని చింతఁ జేయుదే
      నీమమనంగ త్యాగమది నిల్పుచు కర్మఫలాన సాగి సం
      గ్రామపు సింహమై కదలఁగాఁ దగుఁ గీర్తి గడింపఁ గోరినన్!

      తొలగించండి
    2. మీ పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
  4. మొగ్గరమునకరుగ బెగ్గలించుటకన్న
    సంపరాయమన్న జంకులేక
    దీమసమ్ముతోడ తెగువతో పోరు సం
    గ్రామ సింహ మగుచుఁ గదలు టొప్పు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నీమముఁ దప్పిశత్రువులు నివ్వెరపాటున దాడి సల్పగా
      సోమరివై నిశాంతమున సొక్కుట భావ్యము కాదు మిత్రమా
      గ్రామము వీడుచున్ గదన రంగము నందున పెచ్చగిల్లి సం
      గ్రామపు సింహమై కదలఁగాఁ దగుఁ గీర్తి గడింపఁ గోరినన్

      తొలగించండి
    2. మీ పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి
  5. శత్రు యూధ ములను సాహస యోధుడై
    యదురు బెదురు లేక నాహవమున
    ముందు కురుకు ధీర పోరాట శౌర్య సం
    గ్రామ సింహ మగుచు గదలు టా ప్పు

    రిప్లయితొలగించండి
  6. క్రొత్త మనుజు లొచ్చి గొడవలు సృష్టించ
    పల్లెలందు యుండు భటులు నంత
    దారికాచి పట్టి దండన జేయుంచు
    గ్రామసింహ మగుచుఁ గదలుటొప్పు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      'వచ్చి'ని 'ఒచ్చి' అనరాదు. 'పల్లెలందు + ఉండు' అన్నపుడు సంధి నిత్యం, యడాగమం రాదు.

      తొలగించండి

  7. శాంతి చర్చలవియె సఫలము కాకుండె
    చివ్వతప్పదయ్యె సిద్ధపడుడు
    భండనమ్మునందు పగతుర ద్రుంచ సం
    గ్రామసింహ మగుచుఁ గదలుటొప్పు.


    భీమబలుండ్రమంచు ఘన వీరులమంచు దలంచి వారలే
    క్షేమము గూర్చు శాంతికయి చేసిన యత్నము పాడుజేయ ను
    ద్వేగము వీడి సిద్ధపడు విగ్రహమున్ విజయమ్ము గోరి సం
    గ్రామపు సింహమై కదలఁగాఁ దగుఁ గీర్తి గడింపఁ గోరినన్.

    రిప్లయితొలగించండి
  8. బాహుబలి చలన చిత్రము:-

    "క్షేమముఁ గూర్చుమా శివుడ!కేతు తతుల్ మము జంప వచ్చిరే"!
    భామల మధ్యలో నిలిచి ప్రార్థన జేయ కుమారవర్మయే
    ధీమతి పల్కె బాహుబలి "ధీరుడవయ్యెడి కాలమిద్ది సం
    గ్రామపు సింహమై కదలఁగాఁ దగుఁ గీర్తి గడింపఁ గోరినన్"!!

    రిప్లయితొలగించండి
  9. జేరె హనుమ ముందు జెండాన యుగ్రుడై
    మురళి ధరుడు తేరు సారధవగ
    భండనముకు పంచ పాండవుల్ రౌద్ర సం
    గ్రామసింహ మగుచుఁ గదలుటొప్పు

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      *జెండాను నుగ్రుడై* అనండి. 'సారథి + అవగ' అన్నపుడు సంధి లేదు. 'భండనమునకు' అనడం సాధువు. *భండనమున పంచ..* అనవచ్చు.

      తొలగించండి
  10. నీమముతోడ దీక్షగొని నిక్కపు భక్తితొ వీరసైనికా
    క్షేమముఁగోరి నీ ప్రజలకెల్లరకున్ పటువిక్రమంబుతో
    దీమసమొప్పగా చెలఁగి ద్వేష్యుల పీచమడంచ బూనిసం
    గ్రామపు సింహమై కదలఁగాఁ దగుఁ గీర్తి గడింపఁ గోరినన్

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
      'భక్తితొ' అని తో విభక్తిని హ్రస్వంగా ప్రయోగించరాదు. *భక్తిని* అనవచ్చు.

      తొలగించండి
  11. ఆ.వె:గ్రామ మందు నేను కంఠీరవమ్మునే
    పార్లమెంటు కేల ప్రాకులాట
    సింహ మనెడు గుర్తు చెరిపి పోటీ మాని
    గ్రామసింహ మగుచుఁ గదలుటొప్పు"
    (వీడి ఊళ్లో వీడు సింహమే కానీ పార్లమెంట్ కి పోటీ చేసే సీన్ లేదు.పైగా సింహము గుర్తు తో పోటీ చేసాడు.ఇక ఆ గుర్తు చెరుపుకొని పోటీ నుంచి తప్పుకొని గ్రామసింహం గా మిగిలితే చాలు అనుకున్నాడు.)

    రిప్లయితొలగించండి
  12. ఉ:ఏమిది యుత్తరా!సమర మీ గతి వీడుట జూడ పేడినౌ
    నా మది కెంతొ సిగ్గగును,నాయకలక్షణ మౌ జనాళికిన్
    సేమము గుర్చుటే, తనదు సేమము నెంచుట కాదు, ఘోరసం
    గ్రామపు సింహమై కదలఁగాఁ దగుఁ గీర్తి గడింపఁ గోరినన్”
    (నీ పిరికి తనం చూస్తుంటే పేడి నైనా నీకు సారథి గా ఉన్న నాకే అవమానం గా ఉంది.యుద్ధం చెయ్యి అని బృహన్నల ఉత్తరుణ్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేసినట్టు.)

    రిప్లయితొలగించండి
  13. గ్రామము వీడి రమ్మనుచు గ్రమ్మర వీరజవాను కై టెలి
    గ్రామటు వచ్చె పుట్టెనన గా సుతు నిన్ తను జూడ వచ్చినన్
    క్షేమముగోరిదేశమున కీక్షణమేసరిహద్దు చేర సం
    గ్రామపు సింహమై కదలఁగాఁ దగుఁ గీర్తి గడింపఁ గోరినన్

    డా.గాదిరాజు మధుసూదన రాజు

    రిప్లయితొలగించండి
  14. సమస్య:
    “గ్రామపు సింహమై కదలఁగాఁ దగుఁ గీర్తి గడింపఁ గోరినన్”

    ప్రేమగ నేర్పినన్ ముదిత పేర్ముడి నేర్చును పెక్కువిద్యలన్
    భామను గొంపొయే హరియు బాధలువెట్టెడి సూను జంపగన్
    నీమపు విద్యలన్ మెరుగు నీయగ నిక్కము పొందె భామ, సం
    “గ్రామపు సింహమై కదలఁగాఁ దగుఁ గీర్తి గడింపఁ గోరినన్”

    రిప్లయితొలగించండి
  15. దేశభక్తి జూపి దీమసమొప్పఁగ
    యుద్ధరంగమందు నుద్యమించి
    పోరుసలిపి శత్రువీరులఁ జమర సం
    గ్రామసింహ మగుచుఁ గదలుటొప్పు

    రిప్లయితొలగించండి

  16. పిన్నక నాగేశ్వరరావు.
    హైదరాబాద్.

    యుద్ధరంగమందు యోధుడెవరు గాని
    జయము లక్ష్యమెంచి సాగుచుండి
    శత్రు సైనికులను సంహరించుటకు సం
    గ్రామ సింహమగుచుఁ గదలు టొప్పు.

    రిప్లయితొలగించండి
  17. బంధుజనులచంపు బవరమింక వలదు
    రణము చేయ లేను రథము త్రిప్పు
    మనగ పలికె నిట్టు లర్జునా లెమ్ము సం
    గ్రామ సింహమగుచు గదలుటొప్పు



    నీమము మర్చినట్టి బలు నీచుల కెల్లను శిక్షవేయకన్
    ధీమతితోడయోచనము తీరుగ చేయక వేగమీవికన్
    కోమల భావనల్ విడిచికూళుల పైకనపర్చి శౌర్యసం
    గ్రామపు సింహమై కదల గాదగు కీర్తి గడింప కోరినన్

    రిప్లయితొలగించండి