22-1-2025 (బుధవారం)కవిమిత్రులారా,ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...“ఆగెఁ గాలమ్ము భాస్కరుఁ డాఁగకున్న”(లేదా...)“ఆగెను కాలచక్ర మది యబ్జసఖుం డపు డాఁగకుండినన్”(శిష్ట్లా లక్ష్మీ వేంకట నరసింహ శర్మ గారికి ధన్యవాదాలతో...)
మంచు దుప్పటిపరువగా మానితముగజనులుమైకమ్ము నందునజారుకొనిరిప్రొద్దు పొడిచిన తెలియదా రుచులులేవెఆగెఁగాలమ్ము భాస్కరు డాగకున్న
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
జోగెనుప్రాణికోటియట జోరుహిమాంశువుఁజూపనయ్యెడన్ఆగెనుకాలచక్రమది యబ్జసఖుండపుడాగకుండినన్వేగముమందగించెగద పెద్దలుపిన్నలుపవ్వళింపగాసాగవు జీవయాత్రలవి సందడిలేకను రేపునందునన్
రేపు ప్రొద్దున
తేటగీతిఅక్కురుక్షేత్ర సంగ్రామమందుఁ జెలఁగికృష్ణునానతి పార్థుండు గెలుపునెంచిహతుని జేయఁ గర్ణుని, సూర్య సుతుని గుండెయాగెఁ! గాలమ్ము, భాస్కరుఁడాగకున్న!!ఉత్పలమాలసాగెడు యుద్ధరంగమున సఖ్యడు సారధి కృష్ణమూర్తియే,రాగ విహీనుడై చెలఁగు రాధకుమారుని సూర్యపుత్రునిన్వేగమె సంహరింపుమన వేయగ బాణము క్రీడి, శ్వాసయేయాగెను! కాల చక్రమది, యబ్జసఖుం డపు డాఁగకుండినన్! !
మీ పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
జనకుడడిగిన వేమియు జరుపకుండిసమయ మేమాత్ర మైనను చాలదనెడుదుష్టుడయిన యాకొమరుడు తొండుడగుటనాగెఁ గాలమ్ము భాస్కరుఁ డాఁగకున్న
కారుమబ్బులు నింగిలో గ్రమ్ముకొనఁగనంధకారము పుడమిపై నలముకొనెనురాత్రివలె దోచి పగలు ధరిత్రి యందునాగెఁ గాలమ్ము భాస్కరుఁ డాఁగకున్న
కోవిడను వ్యాధి వ్యాపించి క్షోణి నెల్లగడగడ వణికించెడు వేళ కాననమునజనులు బంధితులయినట్టి సమయమందునాగెఁ గాలమ్ము భాస్కరుఁ డాఁగకున్న.వేగము నత్తమిల్లి కడు భీకర రూపము దాల్చు కోవిడీసాగను చేరినట్టి తరి శాశ్వతి యెల్ల యచేత నమ్ముగా లోగిలి బందిగీడులయి లోకులు దద్దఱు చెందు పాళమందాగెను కాలచక్ర మది యబ్జసఖుం డపు డాఁగకుండినన్.
తెలిసి సైంధ వు వరమును దెలి వి గాను చక్ర మును బంపె కృష్ణుడు చతురు డగుచు నాగె కాలమ్ము భాస్కరు డాగ కున్న చంపె విజయుడు సైంధ వు సమర మందు
సాగును చేతనావృతిని సాగును జీవన మీ ధరిత్రిపై ౘాగు ప్రభాతసాంధ్యలయి సాగును సాగిలుచుండు నిత్యమున్సాగెడికాలమే ముగియసాగుచు బోవలె శ్వాసవీడుచున్!ఆగెను కాలచక్ర మది....!యబ్జసఖుం డపు డాఁగకుండినన్!పుట్టి గిట్టుట నైజంబు పుడమిపైననెట్టివారలకైనను నిట్టి దశనువదలిపెట్టంగ శక్యమే ప్రిదులుకొనక?ఆగె కాలమ్ము! భాస్కరుడాగకున్న!ప్రిదులు=రాలిపోవు
త్రాగగ రాహు కేతువులు రాక్షస మాయలతో సుధల్ సరిన్సాగగ నివ్వలేదనుచు సప్తతురంగ రథాఖ్య సూరిపైరేగిన కోపతాపమున మ్రింగగ సూర్యుని తీవ్ర తేజమే యాగెను! కాలచక్ర మది యబ్జసఖుం డపు డాఁగకుండినన్!!
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
కారణమె రాహు కేతువుల్ గ్రహణములకు?సూర్య చంద్ర గ్రహణములు చూచినాడ గ్రహణ మేతించి నప్పుడు కాంతిరేఖలాగెఁ గాలమ్ము భాస్కరుఁ డాఁగకున్నసాగుచునుండుకాలమిది సాధ్యము కాదయ దీనినాపగాతేగలనారగించుచును దీరుగ చూచిరి చిత్ర రాజమున్జేగురు రంగు సౌధమున చిత్ర ప్రదర్శనమే సమాప్తమైయాగెను కాలచక్ర మది యబ్జసఖుం డపు డాఁగకుండినన్['కాలచక్రం' అనే చలనచిత్రమును దృష్టిలోనుంచుకొని..]
ధన్యవాదాలు గురూజీ 🙏
సాగెను వారివాహములు సాంద్రముగా నభమందు నల్దెసల్వేగమె గ్రమ్మె జీకటులు వేవెలుఁగున్గబళింప మేఘముల్మాఁగగ భానుడంబుదము మాటున రేయిగ దోచె ఘస్రమేయాగెను కాలచక్ర మది యబ్జసఖుం డపు డాఁగకుండినన్
అందరికీ వందనములు !అందరి పూరణలూ అలరించు చున్నవి !దేవదాసు-పార్వతి , సలీమ్-అనార్కలి, రోమియో-జూలియెట్ !విధి ఒక విష వలయం - విషాద కథలకు అది నిలయంవిషాద కథలకు అది నిలయం01)_________________________________________వాదన జేయలేక, విడె - ప్రాణసమమ్మగు పార్వతిన్, మనోవేదన నోర్వలేక పసి - బేలగ మారిన దేవదాసు తాన్గాదనలేక క్షాంతువును - కాలిక పాల్బడి చంద్ర ఛాయలోన్రోదన హెచ్చి హెచ్చి క్షయ - రోగము పాలయి క్రుంగిపోయినన్ రాదది రానెరాదు గన - రాదిక రమ్మన రాదు రాదికన్ !_________________________________________క్షాంతువు = తండ్రికాలిక = మద్యముచంద్ర = చంద్రముఖిఛాయ = ఇల్లు
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
అందరికీ వందనములు !అందరి పూరణలూ అలరించు చున్నవి !ఒక సభలో పృచ్ఛకునితో అవధాని :01)_________________________________________ఆగునె కాలచక్రమది- యబ్జసఖుండదె యాగడెన్నడున్సాగును సాగుచుండు నిల - సత్యము ధర్మము సూర్యచంద్రులున్యేగతి పల్కెదీవు యిటు - లీగతి మూర్ఖత పెచ్చరిల్లగాఆగెను కాలచక్ర మది - యబ్జసఖుం డపు డాఁగకుండినన్_________________________________________
మీ పూరణ బాగున్నది. అభినందనలు. వాట్సప్ సమూహంలో నా సవరణ చూడండి.
మకరరాశిన జేరిన మర్కుడపుడు దక్షిణాయణ కాలంబు తరలు వేళ ఉత్తరాయణ నేతెంచు పుణ్య క్షణమునాగెఁ గాలమ్ము;భాస్కరుఁ డాఁగకున్న
తే॥ కాలచక్రగతినిఁ గన నాప నెవరితరము హరిహరులకును సాధ్యమగునె నిజముఁ దెలుపఁగ వృద్ధులకుఁ గష్టములను తోఁచునాఁగె కాలమ్ము భాస్కరుఁ డాఁగకున్నఉ॥ ఆఁగదు కాలచక్రగతి యాపఁగఁ జాలఁడు విష్ణువైననున్సాగగ జీవితమ్ము సుఖ శాంతులఁ గాలము పర్వు తీయఁగామూఁగఁగఁ గష్టనష్టములు పొత్తున మాత్రమె తోఁచు మిత్రమా!ఆఁగెను కాలచక్ర మది యబ్జసఖుండపు డాఁగకుండినన్పొత్తు ముసలితనము (పండు ముదుసలి అని నాభావమండి) ముంపు అంటే కూడ ముదుసలి అనుకున్నానండి. నిఘంటువులో కనపడనందున మార్చానండిపెనుకొండ రామబ్రహ్మం బెంగుళూరు
అందరికీ వందనములు !అందరి పూరణలూ అలరించు చున్నవి !ఏనుగు పైన నవాబు - గాడిద పైన గరీబునడిచే దారుల గమ్య మొక్కటే - నడిపే వాడికి అందరొక్కటేఇంతేరా యీ జీవితం - తిరిగే రంగుల రాట్నము :01)_________________________________________వేదన నోపెనే గజము - వేయికి పైబడి వత్సరంబులున్బాధల మెచ్చెనే క్షమను - భక్తశిఖామణి రామదాసదేశోధన జేయగా నిలను - శోకము నిచ్చును నీశ్వరుండదేమోద మహానుభోగమున - ముఖ్యమునైనది దుఃఖమే కదా_________________________________________
ఆగిరివాసు దర్శనము నందరికన్నను ముందు చేయఁగానా గిరి మ్రోల టోకెనుల కవ్వరుసన్ జనఁ ద్రోపులాటలోమ్రోగెను మృత్యుఘంటికలు మూడినదయ్యయొ నీకు నీకటం“చాగెను కాలచక్ర మది యబ్జసఖుం డపు డాఁగకుండినన్”
మంచు దుప్పటిపరువగా మానితముగ
రిప్లయితొలగించండిజనులుమైకమ్ము నందునజారుకొనిరి
ప్రొద్దు పొడిచిన తెలియదా రుచులులేవె
ఆగెఁగాలమ్ము భాస్కరు డాగకున్న
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిజోగెనుప్రాణికోటియట జోరుహిమాంశువుఁజూపనయ్యెడన్
రిప్లయితొలగించండిఆగెనుకాలచక్రమది యబ్జసఖుండపుడాగకుండినన్
వేగముమందగించెగద పెద్దలుపిన్నలుపవ్వళింపగా
సాగవు జీవయాత్రలవి సందడిలేకను రేపునందునన్
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండిరేపు ప్రొద్దున
రిప్లయితొలగించండితేటగీతి
రిప్లయితొలగించండిఅక్కురుక్షేత్ర సంగ్రామమందుఁ జెలఁగి
కృష్ణునానతి పార్థుండు గెలుపునెంచి
హతుని జేయఁ గర్ణుని, సూర్య సుతుని గుండె
యాగెఁ! గాలమ్ము, భాస్కరుఁడాగకున్న!!
ఉత్పలమాల
సాగెడు యుద్ధరంగమున సఖ్యడు సారధి కృష్ణమూర్తియే,
రాగ విహీనుడై చెలఁగు రాధకుమారుని సూర్యపుత్రునిన్
వేగమె సంహరింపుమన వేయగ బాణము క్రీడి, శ్వాసయే
యాగెను! కాల చక్రమది, యబ్జసఖుం డపు డాఁగకుండినన్! !
మీ పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిజనకుడడిగిన వేమియు జరుపకుండి
సమయ మేమాత్ర మైనను చాలదనెడు
దుష్టుడయిన యాకొమరుడు తొండుడగుట
నాగెఁ గాలమ్ము భాస్కరుఁ డాఁగకున్న
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండికారుమబ్బులు నింగిలో గ్రమ్ముకొనఁగ
రిప్లయితొలగించండినంధకారము పుడమిపై నలముకొనెను
రాత్రివలె దోచి పగలు ధరిత్రి యందు
నాగెఁ గాలమ్ము భాస్కరుఁ డాఁగకున్న
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండికోవిడను వ్యాధి వ్యాపించి క్షోణి నెల్ల
గడగడ వణికించెడు వేళ కాననమున
జనులు బంధితులయినట్టి సమయమందు
నాగెఁ గాలమ్ము భాస్కరుఁ డాఁగకున్న.
వేగము నత్తమిల్లి కడు భీకర రూపము దాల్చు కోవిడీ
సాగను చేరినట్టి తరి శాశ్వతి యెల్ల యచేత నమ్ముగా
లోగిలి బందిగీడులయి లోకులు దద్దఱు చెందు పాళమం
దాగెను కాలచక్ర మది యబ్జసఖుం డపు డాఁగకుండినన్.
మీ పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండితెలిసి సైంధ వు వరమును దెలి వి గాను
రిప్లయితొలగించండిచక్ర మును బంపె కృష్ణుడు చతురు డగుచు
నాగె కాలమ్ము భాస్కరు డాగ కున్న
చంపె విజయుడు సైంధ వు సమర మందు
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండి
రిప్లయితొలగించండిసాగును చేతనావృతిని
సాగును జీవన మీ ధరిత్రిపై
ౘాగు ప్రభాతసాంధ్యలయి
సాగును సాగిలుచుండు నిత్యమున్
సాగెడికాలమే ముగియ
సాగుచు బోవలె శ్వాసవీడుచున్!
ఆగెను కాలచక్ర మది....!
యబ్జసఖుం డపు డాఁగకుండినన్!
పుట్టి గిట్టుట నైజంబు పుడమిపైన
నెట్టివారలకైనను నిట్టి దశను
వదలిపెట్టంగ శక్యమే ప్రిదులుకొనక?
ఆగె కాలమ్ము! భాస్కరుడాగకున్న!
ప్రిదులు=రాలిపోవు
మీ పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండిత్రాగగ రాహు కేతువులు రాక్షస మాయలతో సుధల్ సరిన్
రిప్లయితొలగించండిసాగగ నివ్వలేదనుచు సప్తతురంగ రథాఖ్య సూరిపై
రేగిన కోపతాపమున మ్రింగగ సూర్యుని తీవ్ర తేజమే
యాగెను! కాలచక్ర మది యబ్జసఖుం డపు డాఁగకుండినన్!!
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండికారణమె రాహు కేతువుల్ గ్రహణములకు?
రిప్లయితొలగించండిసూర్య చంద్ర గ్రహణములు చూచినాడ
గ్రహణ మేతించి నప్పుడు కాంతిరేఖ
లాగెఁ గాలమ్ము భాస్కరుఁ డాఁగకున్న
సాగుచునుండుకాలమిది సాధ్యము కాదయ దీనినాపగా
తేగలనారగించుచును దీరుగ చూచిరి చిత్ర రాజమున్
జేగురు రంగు సౌధమున చిత్ర ప్రదర్శనమే సమాప్తమై
యాగెను కాలచక్ర మది యబ్జసఖుం డపు డాఁగకుండినన్
['కాలచక్రం' అనే చలనచిత్రమును దృష్టిలోనుంచుకొని..]
మీ పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.
తొలగించండిధన్యవాదాలు గురూజీ 🙏
తొలగించండిసాగెను వారివాహములు సాంద్రముగా నభమందు నల్దెసల్
రిప్లయితొలగించండివేగమె గ్రమ్మె జీకటులు వేవెలుఁగున్గబళింప మేఘముల్
మాఁగగ భానుడంబుదము మాటున రేయిగ దోచె ఘస్రమే
యాగెను కాలచక్ర మది యబ్జసఖుం డపు డాఁగకుండినన్
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిఅందరికీ వందనములు !
రిప్లయితొలగించండిఅందరి పూరణలూ అలరించు చున్నవి !
దేవదాసు-పార్వతి , సలీమ్-అనార్కలి, రోమియో-జూలియెట్ !
విధి ఒక విష వలయం - విషాద కథలకు అది నిలయం
విషాద కథలకు అది నిలయం
01)
_________________________________________
వాదన జేయలేక, విడె - ప్రాణసమమ్మగు పార్వతిన్, మనో
వేదన నోర్వలేక పసి - బేలగ మారిన దేవదాసు తాన్
గాదనలేక క్షాంతువును - కాలిక పాల్బడి చంద్ర ఛాయలోన్
రోదన హెచ్చి హెచ్చి క్షయ - రోగము పాలయి క్రుంగిపోయినన్
రాదది రానెరాదు గన - రాదిక రమ్మన రాదు రాదికన్ !
_________________________________________
క్షాంతువు = తండ్రి
కాలిక = మద్యము
చంద్ర = చంద్రముఖి
ఛాయ = ఇల్లు
మీ పూరణ ప్రశస్తంగా ఉన్నది. అభినందనలు.
తొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఅందరికీ వందనములు !
రిప్లయితొలగించండిఅందరి పూరణలూ అలరించు చున్నవి !
ఒక సభలో పృచ్ఛకునితో అవధాని :
01)
_________________________________________
ఆగునె కాలచక్రమది- యబ్జసఖుండదె యాగడెన్నడున్
సాగును సాగుచుండు నిల - సత్యము ధర్మము సూర్యచంద్రులున్
యేగతి పల్కెదీవు యిటు - లీగతి మూర్ఖత పెచ్చరిల్లగా
ఆగెను కాలచక్ర మది - యబ్జసఖుం డపు డాఁగకుండినన్
_________________________________________
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండివాట్సప్ సమూహంలో నా సవరణ చూడండి.
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిమకరరాశిన జేరిన మర్కుడపుడు
రిప్లయితొలగించండిదక్షిణాయణ కాలంబు తరలు వేళ
ఉత్తరాయణ నేతెంచు పుణ్య క్షణము
నాగెఁ గాలమ్ము;భాస్కరుఁ డాఁగకున్న
మీ పూరణ బాగున్నది. అభినందనలు.
తొలగించండితే॥ కాలచక్రగతినిఁ గన నాప నెవరి
రిప్లయితొలగించండితరము హరిహరులకును సాధ్యమగునె నిజ
ముఁ దెలుపఁగ వృద్ధులకుఁ గష్టములను తోఁచు
నాఁగె కాలమ్ము భాస్కరుఁ డాఁగకున్న
ఉ॥ ఆఁగదు కాలచక్రగతి యాపఁగఁ జాలఁడు విష్ణువైననున్
సాగగ జీవితమ్ము సుఖ శాంతులఁ గాలము పర్వు తీయఁగా
మూఁగఁగఁ గష్టనష్టములు పొత్తున మాత్రమె తోఁచు మిత్రమా!
ఆఁగెను కాలచక్ర మది యబ్జసఖుండపు డాఁగకుండినన్
పొత్తు ముసలితనము (పండు ముదుసలి అని నాభావమండి) ముంపు అంటే కూడ ముదుసలి అనుకున్నానండి. నిఘంటువులో కనపడనందున మార్చానండి
పెనుకొండ రామబ్రహ్మం బెంగుళూరు
ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.
రిప్లయితొలగించండిఅందరికీ వందనములు !
రిప్లయితొలగించండిఅందరి పూరణలూ అలరించు చున్నవి !
ఏనుగు పైన నవాబు - గాడిద పైన గరీబు
నడిచే దారుల గమ్య మొక్కటే - నడిపే వాడికి అందరొక్కటే
ఇంతేరా యీ జీవితం - తిరిగే రంగుల రాట్నము :
01)
_________________________________________
వేదన నోపెనే గజము - వేయికి పైబడి వత్సరంబులున్
బాధల మెచ్చెనే క్షమను - భక్తశిఖామణి రామదాసదే
శోధన జేయగా నిలను - శోకము నిచ్చును నీశ్వరుండదే
మోద మహానుభోగమున - ముఖ్యమునైనది దుఃఖమే కదా
_________________________________________
ఆగిరివాసు దర్శనము నందరికన్నను ముందు చేయఁగా
రిప్లయితొలగించండినా గిరి మ్రోల టోకెనుల కవ్వరుసన్ జనఁ ద్రోపులాటలో
మ్రోగెను మృత్యుఘంటికలు మూడినదయ్యయొ నీకు నీకటం
“చాగెను కాలచక్ర మది యబ్జసఖుం డపు డాఁగకుండినన్”