19, జనవరి 2025, ఆదివారం

సమస్య - 5008

20-1-2025 (సోమవారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“రాదు రాదది రమ్మనన్ రానెరాదు”
(లేదా...)
“రాదది రానెరాదు గన రాదిక రమ్మన రాదు రాదికన్”
(శిష్ట్లా లక్ష్మీ వేంకట నరసింహ శర్మ గారికి ధన్యవాదాలతో...)

53 కామెంట్‌లు:

  1. అరయగ నెపుడైనను గూడ నర్థమెరిగి
    శ్రద్ధ జూపించి పిరముగ జదువ కున్న
    గురువు జెప్పిన పాఠము గొంచె మైన
    రాదు రాదది రమ్మనన్ రానెరాదు

    రిప్లయితొలగించండి


  2. ఏదిట శాశ్వతమ్ము? మన
    మీ విధి జీవనమంద నిత్యమున్
    వేదికయైన దీ జగతి,
    ప్రీతికరంబయి కాలయానమున్,
    నీదయి నిల్చు నెద్ది యిట?
    నిక్కముగాదె వచింప, గోరినన్
    రాదది రానెరాదు గన
    రాదిక రమ్మన రాదు రాదికన్!

    రిప్లయితొలగించండి
  3. బేషరతుబ్రదు కునుగోరెపిచ్చికవియు
    రాదురాదదిరమ్మనన్రానెరాదు
    కలియునడిపించుకాలాన కర్మమిదియ
    అభ్యుదయమెట్లుసమకూరునయ్యవినుడి

    రిప్లయితొలగించండి
  4. భేషరతుబ్రదుకుకోసంశోషిల్లెనుమామకాత్మ
    శ్రీశ్రీ

    రిప్లయితొలగించండి
  5. కఠిన మైనట్టి యంశమ్ము కష్ట పడియు
    పట్టు బట్టియు జదివినన్ పంతు లెదుట
    రాదు రాదది రమ్మనన్ రానె రాదు
    గురువు ద o డి o ప నేడ్చితి కుమిలి కుమిలి

    రిప్లయితొలగించండి

  6. ముందుకు మునుముందుకు సాగి పోవు కాల
    మది నిలువదు వెనుతిరుగ దంద్రు గాదె
    జారి పోయిన కాలమున్ జేర బిలువ
    రాదు రాదది రమ్మనన్ రానెరాదు



    పేదలు భాగ్యవంతులను భేదమెఱుంగక జీవితమ్మనన్
    హ్లాదమటంచు నెంచెడి విలాసపు మోదము గూర్చు బాల్యమే
    వాదన సేయబోకు మిది వాస్తవ మంటిని జారిపోయినన్
    రాదది రానెరాదు గన రాదిక రమ్మన రాదు రాదికన్.

    రిప్లయితొలగించండి
  7. నాది నాదను కున్నది నాదికాదు
    రాదు రాదది రమ్మనన్ రానెరాదు
    కాదు కాదది కమ్మగన్ కానెకాదు
    రాయి యన్నది నొకనాడు రత్నమగును
    భావపదముదెలుపువీ సుభాషితాలు

    రిప్లయితొలగించండి
  8. నాదవినోద! నూట పదునాలుగు సాలుల కొక్కమారుగా
    మేదినిపైఁ బ్రయాగను నమేయముగా జను లా త్రివేణిలో
    కాదనకుండ స్నానము లగణ్యముగా నొనరింత్రు దానికై
    సాదరమొప్ప నేగవలె నద్దియె తప్పిన నింక జన్మలో
    రాదది రానెరాదు గన రాదిక రమ్మన రాదు రాదికన్!

    రిప్లయితొలగించండి
  9. దొరలిపోయిన కాలము మరలిరాదు
    ప్రాణమేశరీరమ్మును పరిహరించి
    పరమపథమున కరిగిన తిరిగి రాదు
    రాదు రాదది రమ్మనన్ రానెరాదు

    మోదము కానరానిదనుమోదితమైనది కాకపోయినన్
    ఖేదము నిచ్చినన్ బ్రతుకు కేవల మిచ్చట కొంత కాలమే
    చేదగు వాస్తవమ్ముగద జీవము దేహముఁ వీడిపోయినన్
    రాదది రానెరాదు గన రాదిక రమ్మన రాదు రాదికన్

    రిప్లయితొలగించండి
  10. తే.గీ:వర్తమానమే ఎన్నడు వాస్తవమ్ము
    మథుర మైనదో ,చేదుదో మరలి నట్టి
    క్షణము తిరిగి రాదయ్య యే కథయు తిరిగి
    రాదు రాదది రమ్మనన్ రానెరాదు”

    రిప్లయితొలగించండి
  11. తరలి పోయిన కాలంబు మరల రాదు
    తరిగి పోయిన ప్రాయము తిరిగిరాదు
    కన్ను మూసిన మనవెంట కదలి ధనము
    రాదు రాదది రమ్మనన్ రానెరాదు

    రిప్లయితొలగించండి
  12. ఉ:ఈదగ నే నదిన్ కెరట మేదియు శాశ్వత మౌనె,బుద్బుద
    మ్మేదియు నిల్చునే వడిగ నేగుచు నుండెడు నబ్ధి జేరగా
    యీదగ నొక్కటే నదిన నెన్నడ సాధ్యమె, వీడిపోయినన్
    రాదది రానెరాదు గన రాదిక రమ్మన రాదు రాదికన్”
    (ఒక నది లో ఎవడూ రెండు సార్లు స్నానం చెయ్య లేడనే సామెత ఆధారం గా.)

    రిప్లయితొలగించండి
  13. చేదుగ తోచె చేరకను చేడియ పొమ్మని కోపగించగన్
    మోదము లేని భోగములు మోహపు రాత్రులు శిక్ష తోచెనే
    కాదను ప్రేయసిన్ చెలిమికత్తెను జేరగ మార్గమేదొకో
    “రాదది రానెరాదు గన రాదిక రమ్మన రాదు రాదికన్”

    రిప్లయితొలగించండి
  14. వేదన చెంది పాండవులు వీడిరి రాజ్యము దాస్య వృత్తికై
    మోదము చెంది కీచకుడు మోహన మాలిని రమ్ము రమ్మనే
    బాధయు మీర కృష్ణయును బాసట నిల్వగ భీముకోరగన్
    వాదన లేక పాండుసుతు వానిని జంపగ, పోయె ప్రాణమే,
    “రాదది రానెరాదు గన రాదిక రమ్మన రాదు రాదికన్”

    రిప్లయితొలగించండి
  15. తే.గీ:"తమిళ తెరియమా?"యని యొక్క తమిళు డడుగ
    "రా"దనంటి నే, నతనికి రాదు తెలుగు
    అత డడుగనె మరొక్క మా రంటి "నది వ
    రాదు, రాదది రమ్మనన్ రానెరాదు”
    (తమిళం లో "వరాదు" అంటే "రాదు" అని అర్థం.వీడు "రాదు" అంటే వాడికి అర్థం కాలేదు కనుక "వరాదు" అనే ఒక ముక్క అని మళ్లీ రాదు అన్నాడు.)

    రిప్లయితొలగించండి
  16. తే॥ పోదు పోదది పొమ్మనన్ బోదు సఖుఁడ
    చక్కగఁ బడయ జ్ఞానము మిక్కిలిగను
    శ్రమముననది సాధ్యము సఖ శ్రమను వీడ
    రాదు రాదది రమ్మనన్ రానెరాదు

    ఉ॥ పోదది పోనె పోదు గద పొదది పొమ్మనఁ బోదు పోదికన్
    వేదన శోధనల్ గనుచుఁ బ్రీతిగ నేర్చిన జ్ఞానమేదియున్
    మోదముఁ గాంచి విద్యనిలఁ బొందఁగ సాధనఁ జేయవో సఖా
    రాదది రానెరాదు గన రాదిక రమ్మన రాదు రాదికన్

    రిప్లయితొలగించండి
  17. (4)ఉ:నీ దొక రాతి గుండె,జననీ యని పిల్చిన నిన్ను పాపమౌ
    లే దిట సీత మా వదిన,లేడిట నన్న యనంగ శోభయే
    లేదిక రాజ్య మందు,సిరి లేదిక నీ గృహమందు ,నేడ్చినన్
    రాదది రానెరాదు గన రాదిక రమ్మన రాదు రాదికన్”
    (బాధలో ఉన్న భరతుడు సిరి అంతా పోయింది అని రాదు అనే పదాన్ని అన్ని సార్లు అనుకున్నాడు.)

    రిప్లయితొలగించండి
  18. ఉ;ఏదియొ స్పర్థ యున్నదన్ని యీ కథ పంపితి నచ్చకుంటచే
    రాదది రానెరాదు గన రాదిక రమ్మన రాదు రాదికన్”
    నాదియె ముద్రణమ్మగును నా సఖు డేదియొ పంపె నచ్చులో
    రాదది రానె రాదు కన రాదిక రమ్మన రాదు రాదికన్.
    ( వీడు పోటీకి కథ పంపాడుట.వీడి కథ తిరిగి రాదు అని ఒక సంతోషం.వీడి స్నేహితుడు పంపింది అచ్చులో రాదని ఇంకో సంతోషం.ఈ రచయితది ఇంత పాడు బుద్ధి.)

    రిప్లయితొలగించండి
  19. లేదొకొ లేదు లేదు విను లేశము లెస్సదనంబు లేదిలన్
    నాదిది నాదె నాదను వినాశక భావనమందు, వేగమే
    వేదవిదాగ్రణిన్ మది నభేదముగా గనకున్న మోక్షమే
    రాదది రానెరాదు గన రాదిక రమ్మన రాదు రాదికన్

    రిప్లయితొలగించండి
  20. భువన మోహన రమ్య వపో విరాజ
    మాన పద్మలోచన వనజానన రఘు
    రామచంద్ర లగ్నాంతఃకరణము మరలి
    రాదు రా దది రమ్మనన్ రానె రాదు


    ఆది జనించి నట్టి వగు నయ్యలవాటులు వోవ నేర్చునే
    మేదిని నెట్టి వారికిని మృత్యు విలం గబళించు నంతకున్
    జూదరి కింక మూర్ఖునకు సుస్థిర బుద్ధి నొకింత గూర్పఁగా
    రా దది రానె రాదు గన రా దిఁక రమ్మన రాదు రా దిఁకన్

    రిప్లయితొలగించండి
  21. మోదము తోడ చిన్నతనమున్ జరియించుచు పెద్దవారి సం
    బోధనలన్ గ్రహించుచును మున్కలు వెట్టుచు నూరి చెర్వులో
    నీదుచు సంగడీలజత నింపుగ నుంటిమి యట్టి కాలమే
    రాదది రానెరాదు కన రాదిక రమ్మన రాదు రాదికన్

    రిప్లయితొలగించండి
  22. ఎంత చదివిన వ్యర్ధమే సుంత యైన
    రాదు రాదది రమ్మనన్ రానెరాదు
    కఠిన మైనట్టి పదములు గలుగు కతన
    నోరు తిరుగని కారణమౌర యదియ

    రిప్లయితొలగించండి
  23. 3. సాధన లేక కార్యములు సాధ్యము కాదుగ వాసికెక్కగన్
    ఖేదము మోదమున్ సహజ ఖేలన జీవిత మాయ లీలలన్
    సేదయు దీరకన్ గొలువ సేవిత దైవము గావ బాధయే
    “రాదది రానెరాదు గన రాదిక రమ్మన రాదు రాదికన్”

    రిప్లయితొలగించండి
  24. రిప్లయిలు
    1. 4. బోధన సేయుటెంత సులువో గద బాధ్యతలంత భారమే
      వాదన చేసిచేసి గెలువంగను సాధ్య మహంబు దీరులే
      సాధన సేయనెంచ నిల సాయము నీకిడు నాత్మ తృప్తియే
      “రాదది రానెరాదు గన రాదిక రమ్మన రాదు రాదికన్”

      తొలగించండి
  25. తరలిపోయిన కాలము తిరిగిరాదు
    మధుర స్వప్నము గతమునన్ బ్రిదిలికొనెను
    మరలిపోయిన ప్రియురాలు మరలరాదు
    రాదు రాదది రమ్మనన్ రానెరాదు

    రిప్లయితొలగించండి
  26. వేదన తీరిపోయినది వెన్నెల నిండెను జీవితమ్మునన్
    రాదిక దెప్పరమ్ము గనరాదిక యాతన యించుకేని సం
    పాదనతోడ తీరినవి బన్నములెల్లను యాస్రవమ్మికన్
    రాదది రానెరాదు గన రాదిక రమ్మన రాదు రాదికన్

    రిప్లయితొలగించండి
  27. నాదను భావముం గలిగి నల్గురి మ్రోలన విర్రవీగుచో
    నేదియుఁదక్కఁబోదిలను నెంతటి వారికైననున్
    మీదను నెంతగాఁబడిన మేదిని నిష్టము లేనిచోవెసన్
    రాదది రానెరాదు గన రాదిక రమ్మన రాదు రాదికన్

    రిప్లయితొలగించండి
  28. తేటగీతి
    నగర విస్తీర్ణతను బెంచ నదులఁ గప్పి
    వేడి పెరిగినంత వగచి విలవిలమని
    విసిగి ,వేసారి వానను ,వేడుకొన్న
    రాదు రాదది రమ్మనన్ రానెరాదు

    రిప్లయితొలగించండి
  29. చదువు సంధ్యలను విడిచి జగతి యందు
    పనులు చేయక తిరుగుచు వ్యర్థ పుచ్చ
    మరల గడచిన కాలము మనదరికది
    *"రాదు రాదది రమ్మనన్ రానెరాదు”*

    మోదముతోడబాల్యమునభూరిగనాడుచునాటపాటలన్
    వేదన లేవెరుంగకనువేడుక తోడచరించినట్టియా
    మాదిరికాలమింకపయిమచ్చుకునైననుకానిపించగా
    *“రాదది రానెరాదు గన రాదిక రమ్మన రాదు రాదికన్”*


    రిప్లయితొలగించండి

  30. పిన్నక నాగేశ్వరరావు.
    హైదరాబాద్.

    నల్గురికి కలిగించిన నమ్మకమును
    నిలుపుకొనెడు బాధ్యత కూడ నీదె యగును
    దాని పోగొట్టుకున్న పిదప నొక పరి
    రాదు రాదది రమ్మనన్ రానె రాదు.

    రిప్లయితొలగించండి
  31. శ్రీ గురుభ్యోనమః
    తే.గీ.
    భావముల కర్థమేలేని పదములేరి
    గణములను నింపి కూర్చినఁ గచ్చితముగ
    నట్టి పద్యములందున నన్వయమ్ము
    రాదు రాదది రమ్మనన్ రానెరాదు

    ఉ.మా.
    ఈ దినమబ్బెనంచుఁ బరమేశు స్మరించక తృప్తి లేమితో
    మోదము వీడి దీనముగ ముందరి సంగతులేవొ యెంచి యా
    వేదన చెంద నేమిటికి? వేచ గతించిన కాలమెన్నడున్
    రాదది రానెరాదు కన రాదిక రమ్మన రాదు రాదికన్

    రిప్లయితొలగించండి