25, జనవరి 2025, శనివారం

సమస్య - 5014

26-1-2025 (ఆదివారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“శంకరుండు వలదు శాంతి వలయు”
(లేదా...)
“శంకరుండు వద్దు మాకు శాంతి గావలెన్ సదా”

36 కామెంట్‌లు:

  1. రిప్లయిలు
    1. ఆటవెలది
      అంటకాగి 'వాని' హద్దులేనన్నిగ
      నాగడములఁ జేసి యలసినాను
      యోడి నట్టి 'వాడు' నూతమెట్లగును? నా
      శంకరుండు వలదు శాంతి వలయు

      ఉత్సాహము/సుగంధి
      కింకరుండనౌచు 'వాని' కృత్యమాల పాపినై
      సంకటాలు సుట్టి ముట్ట సాగనాను! నేడు వా
      డింక నోడినంత సాయమేమి చేయనొప్పు? నా
      శంకరుండు వద్దు మాకు శాంతి గావలెన్ సదా!

      తొలగించండి
    2. మీ పూరణలు ప్రశస్తంగా ఉన్నవి. అభినందనలు.

      తొలగించండి

  2. ఇరుగు పొరుగు వారు పరుషపు మాటలన్
    బలుకు చుండ్రి గాదె వారితోడ
    కయ్యమాడమన్న కలికి తోడను చెప్పె
    శంకరుండు , వలదు శాంతి వలయు.


    పెంకివాడతండు నిన్ను బెదర గొట్టుచుండె నీ
    వింక మౌనమేల దాల్చ నెదురు నిల్వ నెంచి పొ
    మ్మింక పోరు సల్పు మన్న యింతి తోడ జెప్పె నా
    శంకరుండు , వద్దు మాకు శాంతి గావలెన్ సదా.

    రిప్లయితొలగించండి
  3. ప్రళయ కాలమందు బాణ మెక్కును బెట్టు
    శంకరుడు, వలదుశాంతివలయు
    ననగధర్మమందునడచుట మానక
    మానవుండుతెలిసిమసల వలయు

    రిప్లయితొలగించండి
  4. రంకు బొంకులందు మిగుల రాగమూనుచుండి తాన్
    వంకలెన్ని యున్న కాని వన్నెకాడుననుచు వే
    దాంకితమగు జనుల పైకి నలుగు దూయుచుండు నా
    శంకరుండు వద్దు మాకు శాంతి గావలెన్ సదా!!

    రిప్లయితొలగించండి
  5. పోరుసలిపి సుఖము పొందించు వాడగు
    శంకరుండు వలదు ; శాంతి వలయు
    వీడునందు జనులు వెర లేకుండగ
    నెల్ల వేళలందు నెలమి నొంద

    రిప్లయితొలగించండి
  6. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  7. సగము దేహమన్న శాంతి శంకరునకు
    శాంతిలేక బ్రతుకు సంకటపడు
    కడకు నిస్సరణము కైవల్యమందించు
    శంకరుండు వలదు శాంతి వలయు

    శంకరుండు కానవచ్చు శాంతి తోడసర్వదా
    శంకలేదు వాడె యిచ్చు చావుతోడ ముక్తినే
    శంకలేని కోర్కె మాది జన్మమంత సౌఖ్యమే
    శంకరుండు వద్దు మాకు శాంతి గావలెన్ సదా

    [శాంతి = పార్వతి; శాంతి = సుఖము]

    రిప్లయితొలగించండి
  8. -
    ఆదిభిక్షువైన వాడేల వలదోయి
    శంకరుండు, వలదు శాంతి, వలయు
    నిత్యమైన సత్యనిష్ఠ, సన్మార్గము
    బ్రహ్మవిద్య యేను బతుకు బాట



    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీ పూరణ బాగున్నది. అభినందనలు.
      మొదటి పాదంలో యతి తప్పింది. *ఆదిభిక్షువైనయట్టివా డేలనో* అందామా?

      తొలగించండి
  9. భవుని వంటి వాడు ప్రళయమ్ము సృష్టించు
    శంక రుండు వలదు :: శాంతి వలయు
    బాధ లన్ని తొలగి భక్తి భావము తోడ
    జీవ యాత్ర సలుప చింత వీడి

    రిప్లయితొలగించండి
  10. అందరికీ వందనములు !
    అందరి పూరణలూ అలరించు చున్నవి !

    సమస్య - 5014
    26-1-2025 (ఆదివారం)

    శంకరార్యులకు క్షమాపణలతో :

    01)
    _________________________________________

    పెంకె వాడు గాదతండు - పేద గాడు విఙ్ఞతన్
    బింకమైన చిత్రమైన - వింత క్రొత్త శొధనన్
    వంక బెట్ట లేని వివిధ - పద్యభాగ మిడెడి యా
    శంకరుండు వద్దు మాకు - శాంతి గావలెన్ సదా !
    శంక దీర్చి మేలుగొల్పు - సత్కృతుండు కావలెన్
    ________________________________________
    సత్కృతుండు = శంకరుడు

    రిప్లయితొలగించండి
  11. తాత పేరు శంకరయ్య, నానమ్మ పేరు శాంతి. మా మనుమరాలు దీపిక మాటలు...

    అంకమందు లాపుటాపు నయ్యొ వీడడెప్డు మా
    వంకఁ జూడఁ డొక్కమాటఁ బల్కఁడయ్యెఁ దాత; నన్
    జంకనెత్తి ముద్దు సేయు సంతసాన నవ్వయే
    శంకరుండు వద్దు మాకు శాంతి కావలెన్ సదా

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

      తొలగించండి
    2. శంకరార్య ! మీ మనుమరాలు దీపిక మాటలు అద్భుతం
      అప్పుడప్పుడైనా యెత్తుకొని ముద్దు చెయ్యండి స్వామీ

      తొలగించండి
  12. ప్రగతి పథమునందు పయనింప జేయుచు
    స్వార్థ బుద్ధి వీడి సకల జనుల
    యభ్యుదయము గోరు నతఁడె గావలయు నా
    శంకరుండు వలదు శాంతి వలయు

    రిప్లయితొలగించండి
  13. శంకలెన్నొ మదినిఁ గలఁచ శాంతి దూరమాయెనే
    పెంకె మనసు మాట వినదు పెంచుచుండె నంకిలిన్
    శంకబాపి సేదదీర్చు శంకరుండె దిక్కు నా
    శంకరుండు వద్దు మాకు శాంతి గావలెన్ సదా

    రిప్లయితొలగించండి
  14. తే.గీ:ఈ వయస్సు లోన నెట్టి రంధియు లేక
    గృష్ణ,రామ యనుట క్షేమము గద!
    ఏదొ ఒక సమస్య నే దిన మ్మిడు కంది
    శంకరుండు వలదు శాంతి వలయు”

    రిప్లయితొలగించండి
  15. ఆ॥ చింతలేని బ్రదుకు శ్రేయము తలఁపఁగ
    వంకలెన్నొ పెట్ట బాధ కలుగుఁ
    గొండ పైన నిన్ను కూర్చొనఁ జేసినా
    శంకరుండు వలదు శాంతి వలయు

    సుగంధి
    వంకలెన్నొ పెట్టుచుండు వారలెట్లు చూసినన్
    సంకటమ్ము లుండుఁ గాని శాంతి యెట్లు కల్గునో
    వంకలెంచ కుండఁ జూడ బంధమొప్పెడిన్ సఖా
    శంకరుండు వద్దు మాకు శాంతి గావలెన్ సదా

    శంకరుడు సుఖముకలుగజేయు వాడు
    వంకలు పెట్టి గొప్పగా చూసేదాని కన్నా వంకలెంచకుండా సాధారణంగా చూసినా చాలని భావమండి

    పెనుకొండ రామబ్రహ్మం బెంగుళూరు

    రిప్లయితొలగించండి
  16. ఉత్సాహము.
    'కంకులు తిను పులుగు జతగఁ గాలనాగుఁ' జేయుచున్,
    'జింకపిల్లఁ జేరదీసి చెలిమిఁ జేయుఁ బులి' యనున్!
    ఇంకఁజూడఁ జిక్కు విప్ప నిలకుఁదాత రావలెన్!
    *శంకరుండు వద్దు మాకు శాంతి గావలెన్ సదా*

    రిప్లయితొలగించండి
  17. 2)సుగంధి
    శంక లెన్నొ వచ్చుచుండు జ్ఞానమార్గ మెంచినన్
    శంకరుం డహమ్ము బెంచు సత్వబుద్ధి నిచ్చునే?
    వంక లేని భక్తి యన్న వైష్ణవమ్మె కావునన్
    శంకరుండు వద్దు మాకు శాంతి గావలెన్ సదా”
    (శంకరుని జ్ఞానమార్గము ,అద్వైతము సరైనవి కావని, అవ్వి అహాన్ని పెంచుతాయని,వైష్ణవభక్తే గొప్ప దని కొందరు వైష్ణవు లన్నట్లు.)

    రిప్లయితొలగించండి
  18. పటము తెచ్చినిమ్మ!పార్వతిపూజకున్
    పసుపు, తమలపాకు,పళ్ళతోటి.
    పలికె పెళ్లి సమయ బ్రాహ్మణ శ్రేష్టియున్
    శంకరుండు వలదు, శాంతి వలయు

    రిప్లయితొలగించండి
  19. ఆఁడు వారు సేయు నట్టి కర్మములకుఁ
    బురుషుల నియమించు టరుదు సుమ్ము
    ముచ్చట కొలుపంగ ముగ్గులు వేయంగ
    శంకరుండు వలదు శాంతి వలయు

    అంకము లవి యేల మనకు హర్షములకు నవియె యా
    టంకము లగు నెల్ల వంగడములు గూలుఁ బుడమిలో
    శంక సుంత లేని వాఁడు క్షయ మొనర్ప శాంతి నా
    శంకరుండు వద్దు మాకు శాంతి గావలెన్ సదా

    రిప్లయితొలగించండి

  20. పిన్నక నాగేశ్వరరావు.
    హైదరాబాద్.

    శంకరు డనువాడు సతిని సంతానమున్
    కొట్టి తిట్టి బాధ పెట్టుచుండ
    నిట్టు లనిరి వార లేవగించుకొనుచు
    శంకరుండు వలదు శాంతి వలయు.

    రిప్లయితొలగించండి