22, జనవరి 2025, బుధవారం

సమస్య - 5011

23-1-2025 (గురువారం)
కవిమిత్రులారా,
ఈరోజు పూరింపవలసిన సమస్య ఇది...
“సుగ్రీవాగ్రజుని కాలు శునకము గఱచెన్”
(లేదా...)
“సుగ్రీవాగ్రజు పాదమున్ శునక మచ్చోఁ గాటువేసెన్ వడిన్”
(ప్రసిద్ధమైన పాత సమస్య. 'సుగ్రీవుని యెడమకాలు' వృత్తంకోసం - 'సుగ్రీవాగ్రజుని కాలు' అయింది)

9 కామెంట్‌లు:

  1. నిగ్రహముజూపెగధర్మజు
    డగ్రజుడై యుండివినయమందునమెఱుపై మందున ఘనుడై
    ఉగ్రత యోధనుడుండెను
    సుగ్రీవాగ్రజునికాలు శునకముగఱచెన్

    రిప్లయితొలగించండి
  2. కందం
    ఆగ్రహము పండునని జి
    హ్వాగ్రము సురఁ గోరఁగ నటుఁడాస్వాదనఁ దా
    నుగ్రతఁ జూపఁగ గదతో
    సుగ్రీవాగ్రజుని కాలు శునకము గఱచెన్!

    శార్దూలవిక్రీడితము
    వ్యగ్రుండై సురఁ గ్రోల దర్శకునితో నాహార్యమందొప్పఁగా
    నుగ్రత్వమ్మును జూప సాధ్యమని తా నుత్సాహియై త్రాగి పా
    దాగ్రమ్మందున తూగి మైకమెగయన్దా త్రొక్కగన్ వాలమున్
    సుగ్రీవాగ్రజు పాదమున్ శునక మచ్చోఁ గాటువేసెన్ వడిన్!

    రిప్లయితొలగించండి
  3. సుగ్రాహంబునధర్మజుండుగనగా శోషిల్లెనాయోధనుం
    డుగ్రుండై నియమంబువీడిసిరికై యున్మాదియయ్యెన్గదా
    అగ్రుండేవిధినంచుప్రశ్నగనియాహంకారి దూషించెగా
    సుగ్రీవాగ్రజు పాదమున్శునకమచ్చోకాటువేసెన్వడిన్

    రిప్లయితొలగించండి
  4. సుగ్రీవుని యన్న యతడు
    స్వగ్రామమ్మేగు వేళ శ్వానపు తోకన్
    నిగ్రహము వీడి త్రొక్కగ
    సుగ్రీవాగ్రజుని కాలు శునకము గఱచెన్.

    రిప్లయితొలగించండి
  5. సుగ్రీవుండనువాని యన్న ధనమున్ జూదంబులో నొడ్డికన్
    స్వగ్రామంబును వీడి కాయకముకై పైనమ్మునే జేసి తా
    నాగ్రాజేరుచు త్రొక్క దక్కఱున జిహ్వాపంపు లాంగూలమున్
    సుగ్రీవాగ్రజు పాదమున్ శునక మచ్చోఁ గాటువేసెన్ వడిన్.

    రిప్లయితొలగించండి
  6. సుగ్రీవ నామధేయుం
    డగ్రజుతోగూడి యూరి కరుగుచు నుండన్
    ఉగ్రమ్ముగ పరుగులిడుచు
    సుగ్రీవాగ్రజుని కాలు శునకము గఱచెన్

    సుగ్రీవుండనునాతఁ డగ్రజునితో చూడంగ పర్వంబునన్
    స్వగ్రామంబునకేగె నత్తరినిదా శ్వానంబునుం దన్నగన్
    ఉగ్రోదంచితయై పరుంగులిడుచున్ హుంకారముం జేయుచున్
    సుగ్రీవాగ్రజు పాదమున్ శునక మచ్చోఁ గాటువేసెన్ వడిన్

    రిప్లయితొలగించండి
  7. నిగ్రహము లేని వాలియు
    ఆగ్రహమందున ననుజుని భార్యను పట్టెన్
    ఉగ్రముతో జేరి నచట
    సుగ్రీవాగ్రజుని కాలు శునకము గఱచెన్

    రిప్లయితొలగించండి
  8. సుగ్రీవుడు నాటకమును
    కుగ్రామమునందు పన్న గుక్కలు చేరెన్
    ఆగ్రహమొంది తరుమగా
    సుగ్రీవాగ్రజుని కాలు శునకము గఱచెన్

    రిప్లయితొలగించండి